25, నవంబర్ 2020, బుధవారం

సమస్య - 3555

26-11-2020 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్”

(లేదా…)

“పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్"

80 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  వాస్తవ రీతి తెల్పెదను వంకర బుద్ధుల శాస్త్రివర్యుడా!
  విస్తరి ముందునన్ మరియు వేడుక వీడుచు శయ్యనందునన్
  మస్తుగ రోజురోజు చని మందిర మందున బ్యాన్కు పాసువౌ
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్...

  రిప్లయితొలగించండి
 2. మస్తిష్కముపరుగుఁదీసెను
  నిస్తులసంపదగురువుగనెట్టేయుండెన్
  దుస్తరమానవమేధకు
  పుస్తకవపఠనమ్మపాపమునుగల్గించున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. "మస్తిష్కము దీసె పరుగు" అనండి.

   తొలగించండి
  2. చూసుకోలేదుక్షమించండిసవరణచేసుకుంటాను

   తొలగించండి
 3. అందరికీ నమస్సులు

  చాలామందికి అసలు వారి పాపాలు వరికి దెలియవు. మనం అపరపుణ్యాత్ములం అనుకుంటాము గానీ మంచి పుస్తకాలు జదివినచో ఆ పాపలు ఎరుకలోకి వస్తాయి వాస్తవానికి. పరీవసానం చేసుకునే అవకాశం కల్పిస్తాయి


  ఉ||
  మస్తకవాసి వాడు జనమాత్రుల కర్మల చిత్రగుప్తుడున్
  న్యస్తము జేయు శిక్షలను నందములన్ జనులెల్లరున్ గనన్
  వాస్తమెల్ల శాస్త్రముల బట్టనెరుంగగ జేయు స
  ద్పుస్తకముల్ పఠించినను బొందెదరెల్లరు పాపభారమున్

  ఆదిపూడి రోహిత్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాస్తవమెల్ల' టైపాటు. మూడవ పాదంలో గణభంగం. "...జేయునట్టి స।త్పుస్తకముల్..." అంటే సరి!

   తొలగించండి

 4. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వాస్తవ రీతి తెల్పెదను వంకర బుద్ధుల శిష్యవర్యుడా!
  మస్తుగ లాస్టు బెంచినను మౌనపు రీతిని జాగ్రఫీదియౌ
  పుస్తక మందునన్ ముడిచి ముగ్ధుడ వౌచును కామశాస్త్రపున్
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   కామశాస్త్రపు పుస్తకాలు కావు కానీ చిన్నపుడు పాఠ్యపుస్తకాలలో డిటెక్టివ్ నవలలు పెట్టి చదివిన అనుభవం ఉంది. ఒకసారి సైన్స్ క్లాసులో పుస్తకంలో కొమ్మూరి సాంబశివరావు నవల పెట్టి చదువుతూ సారుకు పట్టుబడి దెబ్బలు తిన్న అనుభవం ఉంది.

   తొలగించండి
 5. కందం
  విస్తృత జ్ఞానము విజ్ఞత
  మస్తిష్కమునకు నొసంగు మంచివి చదువన్
  బుస్తెలఁ దెంపుట నేర్పెడుఁ
  బుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  ఉత్పలమాల
  విస్తృత జ్ఞానసంపదను విజ్ఞతఁ గూర్చును గ్రంధరాజముల్
  మస్తకమందు నిష్టఁ గొని ప్రాజ్ఞులు వ్రాయఁగఁ గీర్తిఁ గన్నవై
  పుస్తెలు దెంచు రీతులను బోధనఁ జేసెడు నుగ్రవాదపున్
  బుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'విస్తృత జ్ఞాన' మన్నపుడు 'త' గురువై గణభంగం. 'నిష్ఠ' టైపాటు. సవరించండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు పరిశీలించ ప్రార్థన.

   కందం
   విస్తృత వివేక సంపద
   మస్తిష్కమునకు నొసంగు మంచివి చదువన్
   బుస్తెలఁ దెంపుట నేర్పెడుఁ
   బుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

   ఉత్పలమాల
   విస్తృతమైన జ్ఞానమును విజ్ఞతఁ గూర్చును గ్రంధరాజముల్
   మస్తకమందు నిష్ఠఁ గొని ప్రాజ్ఞులు వ్రాయఁగఁ గీర్తిఁ గన్నవై
   పుస్తెలు దెంచు రీతులను బోధనఁ జేసెడు నుగ్రవాదపున్
   బుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్


   తొలగించండి
 6. మస్తకమందున పదములు
  మస్తిష్కముకెక్కని పదమాధుర్యమ్ముల్
  వాస్తవ రీతులెరుంగని
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్!!

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. మస్తిష్క కేది నిచ్చును

   స్వస్తిని, పరకాంత తోడ సంగమ కాంక్షల్


   మస్తకము చేర నేమగు,

   పుస్తక పఠనమ్ము, పాపమును కలిగించున్,

   తొలగించండి
  3. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మస్తిష్కమున కెది యిడును" అనండి.

   తొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మస్తుగ మోసగుణమ్ములు
  విస్తారించుచు జనతను పెఱగాయలుగా
  న్యస్తబఱచెడి ననర్థపు
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్.

  రిప్లయితొలగించండి
 9. వాస్తవ సంగతి విడి కల
  శస్తనినవమాన పరచి సంపత్తనుచున్
  విస్తృత కలంకములు గల
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్.

  రిప్లయితొలగించండి
 10. శిస్తులుగట్టరెప్పుడును శీలముకెప్పుడు విల్వనివ్వరే
  నాస్తికు లైనగారు విడ నాడరు పూజలు జేయకుండరే
  వాస్తవమేమెరుంగకయె భక్తినితెల్పెడు వెన్నియైన యా
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్!!

  రిప్లయితొలగించండి
 11. నాస్తిక వాదమంచును సనాతన ధర్మము మూర్ఖమంచు నీ
  యాస్తిక వాదులెల్ల ఖలులంచుపరాత్పరు డన్న మిథ్యగా
  విస్తృత రీతిగా పసరు వెంగళివిత్తుల గాథలున్న నా
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  రిప్లయితొలగించండి
 12. పుస్తెను గట్టిన భార్యకు
  విస్తుగ సంతోషమీక వివరించి కథల్
  మస్తుగ జల్సా చేయగ
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  రిప్లయితొలగించండి
 13. ఆస్తుల బొందురీతి తమపాపల దూరము బెట్టి, వారు నం
  తస్తుల మేడగట్టి పలుతాపములన్ బెనుపారి, బాధచే
  బస్తుల నుండు నాధునిక వర్గము పిల్లల గూర్చి దెల్పు న
  ప్పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  పాప = శిశువు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. గురువర్యులకు నమస్కారం 🙏

   ఆ - పా కి యతి సరిపోతుంది కదా

   తొలగించండి
 14. ఉ:

  విస్తును గొల్పు సంగతులు వేదము లాదిగ వీధి వాక్కులున్
  హస్తము సోకినంత దర హాసము చిందగ లిప్త కాలమున్
  వాస్తవ మెల్ల కంప్యుటరు పైననె దెల్వగ సౌఖ్యమందగన్
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మస్తుగ మోసభావములు మస్తకమందున కందళించగన్
  వాస్తవ ధర్మముల్ నడచి పౌరుల మధ్యను కొంటెతత్త్వముల్
  విస్తరణమ్మొనర్చుచు వివేకమె త్రంచెడి కీడునిచ్చునౌ
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్.

  రిప్లయితొలగించండి
 16. విస్తారంబగు జ్ఞానము
  పుస్తకపఠనమ్ము పాప! మును కల్గించున్
  నిస్తేజమ్మును బాపుచు
  మస్తకమును పదునుబెట్టు మార్గము జూపున్

  ఆస్తి నమోదుజేయు బహు యర్రల యందున దస్తవేజులన్
  శిస్తువసూలు జేయు పలుసీమల బిల్లుల నిర్ణయించెడిన్
  మస్తుగ పన్నులడ్డుకొను మార్గము లెంచుచు మోసబుచ్చెడిన్
  పుస్తకముల్ పఠించిననె పొందెద
  రెల్లరు పాపభారమున్

  అర్ర = గది ( తెలంగాణ మాండలికము) Office

  రిప్లయితొలగించండి
 17. దోస్తుల తోడుగ మెలగుచు
  మస్తుగ గడిపిన దినములు మరువనివేగా
  వాస్తవమేనది తప్పుడు
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చస్తిన్రో నేనమ్మన్
   మస్తుగ చదివిన కితాబు మర్వగ జాలన్
   వాస్తవముగ నేరీతిన్
   పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్ ?

   తొలగించండి
  2. 🙏సవరించిన మొదటి పాదం:

   చస్తిన్రో ! నేన్నమ్మన్

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. అందరికీ నమస్సులు🙏

  నా పూరణ ప్రయత్నం..

  *కం||*

  నాస్తికతను గల్గి జనులు
  మస్తకమున మంచి తనము మచ్చుకు లేకన్
  మస్తుగ తప్పులు జేయుచు
  *“పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్”*!!

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
 19. సమస్య :
  పుస్తకముల్ పఠించిననె
  పొందెద రెల్లరు పాపభారమున్

  ( సద్గ్రంథపఠనం పుణ్యదాయకం - దుర్గ్రంథపఠనం పాపదాయకం )
  ఉత్పలమాల
  -----------

  వస్తువు లెన్నియుండినను
  వంద్యము పుస్తకపాఠ్యరీతియే !
  మస్తక మెన్నియో విధుల
  మంజులసాంత్వన బొందుచుండెడిన్ ;
  విస్తరిలున్ ద్వదీయమగు
  విజ్ఞత ; నీచపుగార్యహేతులౌ
  పుస్తకముల్ పఠించిననె
  పొందెద రెల్లరు పాపభారమున్.

  రిప్లయితొలగించండి


 20. మస్తిష్కము పొదలించును
  పుస్తక పఠనమ్ము, పాపమును గల్గించున్,
  విస్తారముగ తలంపులు,
  మస్తిష్కమ్మును తొలుచగ మరిమరి సుదతీ!  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. అరకొర యర్థము లేక త
  నరు పుస్తకముల్ పఠించిననె పొందెద రె
  ల్లరు పాపభారమున్ చి
  ల్లరమల్లర తలపులెల్ల లావై బోవన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. జాస్తిగ పురాణ గాథల
  పుస్తక పఠనము నిజముగ పుణ్యము నొసగున్
  పుస్తునిడు బండబూతుల
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  పుస్తు = దుర్గంధము

  రిప్లయితొలగించండి
 23. మస్తకమును చెడ గొట్టెడు
  వస్తువు తో రాజిల్లు నట్టి వ్రాతల తోడన్
  ముస్తాబై వెలసిన నా
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. "వస్తువు రాజిల్లునట్టి..." అనండి.

   తొలగించండి
 24. మస్తకమునకువికాసము
  పుస్తకపఠనమ్మువలనపొసగునుధరలో
  నాస్తికవాదమునుదెలుపు
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  రిప్లయితొలగించండి
 25. పుస్తకమన్న జ్ఞానమునుపొందగజేసెడు సాధనమ్మిలన్
  మస్తకమందుపుస్తకము మంచినిపెంచగ మేలు జేకురున్
  నాస్తికవాదమున్నెరపునట్టివిధంబుగనున్న దౌష్ట్యమౌ
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  రిప్లయితొలగించండి
 26. హస్తవిభూషణమ్మదియు నార్జితపుణ్యవిశేషదాయి యా
  పుస్తకమౌను భక్తివరబోధనఁ జేసిన, తద్విరుద్ధమై
  మస్తకభారధీమతివినాశకశీలవిగర్హితమ్ములౌ
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 27. వాస్తవము విస్మరించుచు
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్
  మస్తకమునకనసరియే
  పుస్తకము వలనజనులకుబుద్ధియు హెచ్చున్.

  రిప్లయితొలగించండి
 28. కె.వి.యస్. లక్ష్మి:

  విస్తృత చేతన మొసగును
  పుస్తక పఠనమ్ము; పాపము గల్గించున్
  అస్తవ్యస్తపు వ్రాతలు
  మస్తిష్కమ్ములు చెఱచుచు మనుజుల కెపుడున్.

  రిప్లయితొలగించండి
 29. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

  మస్తక శుధ్ధికి వలయును

  పుస్తకపఠనమ్ము ; పాపము కల్గించున్

  పుస్తకము శారద యనుచు

  ప్రసుతి సేయక విడచెడు వారికి నెపుడున్.

  మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

  రిప్లయితొలగించండి
 30. శ్రీమాత్యేనమః/శ్రీగురుభ్యోనమః

  పుస్తకమన్న నేడు ముఖపుస్తకమేగద జ్ఞానభాండ మే

  హస్తమునందుజూచినను నందర కన్నియు
  నద్దియే యనన్

  పుస్తకసర్వమైన,నట మోసపు మాటలు
  నేర్పునట్టిదౌ

  పుస్తక మున్ పఠిం చిననె పొందెద రెల్లరు పాపభారమున్.

  మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

  రిప్లయితొలగించండి
 31. మస్తకమునకిడు తేజము
  బుస్తక పఠనమ్ము! పాపమును గల్గించున్
  సంస్తుతి సేయక క్షేత్రిని
  ప్రస్తుతి గొల్పుచు కుటిలుని ప్రాపున జేరన్!

  రిప్లయితొలగించండి
 32. మస్తకమునకిడు తేజము
  బుస్తక పఠనమ్ము! పాపమును గల్గించున్
  సంస్తుతి సేయక క్షేత్రిని
  ప్రస్తుతి గొల్పుచు కుటిలుని ప్రాపున జేరన్!

  రిప్లయితొలగించండి
 33. వాస్తవదూరమాస్తికతవర్జ్యమెధ్యేయముపాపచింతనన్
  నాస్తికతార్థవృద్ధియెజనాళికిమోదముగూర్చటంచువి
  శ్వస్తప్రశస్తశాస్తలప్రశాసనమున్విడమర్చినించునా
  *“పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్”*

  రిప్లయితొలగించండి
 34. దుస్తర జన్మ పరంపర
  విస్తరము చెలఁగమి గతులు విశదము లిందున్
  హస్త బలమ్మున నాపిన
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్


  ప్రస్తర భంగి చిత్తములు వారక మారిన నిశ్చయమ్ముగన్
  దుస్తర మైన భావములు దుష్కృత కారక చింతనాళియున్
  మస్తము నందు దుష్ట తర మార్గము లుద్భవ మంద ఘోర దు
  ష్పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  రిప్లయితొలగించండి
 35. అస్తవ్యస్తపు వ్రాత ల
  వాస్తవముల సంగ్రహములు వంచకములునౌ
  మస్తిష్కంబును చెఱపెడి
  పుస్తక పఠనమ్ము పాపమును గల్గించున్

  రిప్లయితొలగించండి
 36. స్వస్తి ఘటిల్లజేయుకడు చక్కని కైతల చిత్తశుద్ధితో
  మస్తకమందు నిల్పగను మక్కువతోడ పఠింప మేలగున్
  వస్తపు జీవనమ్ముల నవస్థలఁ ద్రోసెడి కైతలున్నవౌ
  పుస్తకముల్ పఠించిననె పొందెద రెల్లరు పాపభారమున్

  రిప్లయితొలగించండి
 37. మస్తముబదునుగజేయును
  పుస్తకపఠనమ్ము,పాపమునుగల్గించున్
  పుస్తకములనపహరణము
  పుస్తకమునుదెలియుడార్య!ముఖవాసినిగా

  రిప్లయితొలగించండి
 38. మస్తకమందునన్ మిగుల మాన్యతనొందెడుసంతసంబులన్
  పుస్తకముల్ పఠించిననెపొందెదరెల్లరు,పాపభారమున్
  న్యస్తముజేయుదుష్టులకునాశ్రయమిచ్చిన సత్యమేగదా
  పుస్తకపాఠనంబుననెమూర్ఖుడుసైతముసజ్జనుండు నౌ

  రిప్లయితొలగించండి
 39. ఈకాలం L KG నుంచి IIT కోచింగే
  🙏🙏🙏

  నేస్తుల గూడియాడుకొను నీడున వేయగ పాఠశాలలన్
  విస్తృత జ్ఞానసంపదను వేగమెనేర్చెద
  మంచు పెద్దవౌ
  పుస్తకముల్ పఠించిననె పొందుదు రెల్లరు పాప! భారమున్
  మస్తుగ నాటపాటలను మంచిని బెంచెడు గాథలేదగున్

  అఖండయతికి మన్నించండి

  రిప్లయితొలగించండి