14-11-2020 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నరకునిం జంపె సీత వానరులు గనఁగ”
(లేదా…)
“నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:మురియుచు మన్మరాలిగని ముద్దుల నిచ్చుచు హైద్రబాదునన్వరుసగ లడ్డులన్ తినుచు పండుగ పూటను వైభవంబుగానరకొర మాటలన్ పలికి హాయిని గూర్చెద నివ్విధంబుగన్: “నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”
"నరకుని"
తాత మనుమరాలితో సరదాగా చెప్పిన మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాలల దినోత్సవం సందర్భంగా మనుమరాలితో సరదా ముచ్చట్లు! బాగుంది.
🙏🙏
బాధలనువిన్నవించగామాధవుండుసత్యతోకూడిరణభూమిజనియెనాజినరకునింజంపె,సీతవానరులుగనఁగనగ్నిజొచ్చెనుసత్యునినానతివిని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్య కూడి గిరిధరుడు సమర మందు నేమి జేసె,రాముడడుగ నెవరు దూకెలంకలో నగ్ని లోనికి జంకు లేకనరకుని జంపె,సీత వానరులు గనగ
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)తిరుగుచు వంగభూమినహ త్రిప్పలు సైచుచు మీనులందునన్మరచుచు చిన్ననాటి కథ మైకము నొందుచు పద్య విద్యనున్గురువులు చెప్పగా వినుచు కొండొక శిష్యుడు నమ్మెనిట్టులన్: “నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”
నరక చతుర్థి బోనస్: కంది గురువుల కంకితం:సరసపు మాటలాడుచును సత్యయె చేరగ తేరునందునన్మురియుచు కృష్ణుడే చనుచు ముచ్చట మీరగ యుద్ధమందునన్కురుపుచు బాణవర్షముల, కూరిమి నొందగ మూడు లోకముల్,నరకునిఁ జంపె,... సీత, సురనాథుఁడు, దైత్యులు, వానరుల్ గనన్
శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారు ఉవాచ: "నరకుని చంపినది కృష్ణుడే, సత్యభామ కాదు"
కామేశ్వర రావు పోచిరాజుఅక్టోబర్ 29, 2016 10:02 PMశ్రీమదాంధ్ర మహా భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.
మరి సీత??సార్..
సీత స్వర్గమునుండి చూచుచుండగా...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. బోనస్ పూరణలో కృష్ణుడు చంపినట్లే ఉన్నది కదా?'కురియుచు బాణవర్షమును...' అనండి.
రెండవ పూరణకు ముందు 'ఒక తాత తన మనుమరాలు సీతతో చెప్తున్నాడు....'అని వ్రాసి.. సమస్యలోని సీత శబ్దాన్ని సంబోధన(సీత!)గా సూచిస్తే అద్భుతంగా ఉంటుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
"నరక చతుర్దశి"
సత్యరూపంబుసీతయెసాధనమునజ్ఞానివానరుడాయమజాడతెలిసెరామరూపంబురావణురాగమణచినరకునింజంపెసీతవానరులుగనగ
నరక శబ్దానికి నీచస్థానం, దుర్గతి, కష్టకారణం అనే అర్థాలున్నాయి. రావణుడు నరక శబ్దవాచ్యుడే (సీత నపహరించి నీచస్థానం పొందినవాడు, సాధుజనులకు కష్టకారణమైనవాడు)కనుక మీ పూరణ సమర్థనీయమే. బాగుంది. అభినందనలు.
ధన్యవాదాలండిగురువుగారు
పల్కె తలతిక్క గానరె "పతిని, మీదునరకునిం జంపె సీత వానరులు గనఁగ”చేత కాని మొగుడరరె చెప్ప గానువినడు, కొట్టగానిక వెక్కి వెక్కి యేడ్చు!జిలేబి
తరుణులసాధుపుంగవులదాచివధింపగగిన్కసత్యతోసరగుననేగియచ్యుతుడుసంగరమందునదుష్టదైత్యుడౌ*“నరుకునిఁ జంపె ;సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”*ధరుణముజొచ్చియీలువునుధాత్రినుతించగజాటెజానయై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: శైలధరుడు సత్యనుగూడి సమరమందు జనులనిల హింసపెట్టెడి దనుజ ఖలుడు నరకునిం జంపె; సీత వానరులు గనగ పవనపుత్రుని నెంతయు ప్రస్తుతించె.
సత్య తోడుత శ్రీహరి చంపె నెవని?చితిన దూకెనే నాతి దా పతిని జేర?తెలియ జెప్పుము శీఘ్రమె తెలుగు బాల!నరకునిం జంపె; సీత వానరులు గనఁగ.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. 'చితిని' అనండి.
సత్యతో గూడి కృష్ణుండు సమర మందు చంపె నెవని? జనకుని వశ యెవరంటి? పవన తనయుడెప్పుడు తాను వనధి దాటె? నరకునిం జంపె, సీత, వానరులు గనఁగ
పలికె తలతిక్కగ "నపాంసుల నర కునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్" విదురులు చేసిరి బడితపూజ రోసి జిలేబిన్!జిలేబి
కరకగు రాక్షసాధముడు, కాంతుని తోడుత సత్యభామయేసరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమధాటిజూపుచున్నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదాన్ని "కరకగు రాక్షసున్ దునుమగా హరి తోడుగ సత్యభామయే..." అనండి. అన్వయం చక్కగా కుదురుతుంది.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏
సవరణతో 🙏🙏🙏కరకగు రాక్షసున్ దునుమగా హరితోడుత సత్యభామయేసరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమధాటిజూపుచున్నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !
క్రొవ్విడి వెంకట రాజారావు: ధరణి జనాళినిన్ తనదు దానవ చేష్టల కష్టబెట్టుచున్ తిరిగిన రాక్షసాధముని దేవకిపుత్రుడు సత్యతోడుతన్ నరకునిజంపె; సీత నరనాధుడు దైత్యులు వానరుల్ గనన్ ధరణమునందు దూకి తను దగ్ధముగాక పునీత యయ్యెగా!
నరుల బాధలు బాపగ నాతి సత్య వెంట జనుదేర కృష్ణుడు వీరు డగుచు నరకునిన్ జంపె : సీత వానరులు గనగ ఋజువు జేసెను తన శక్తి రూఢి గాగ
తరుణియు కృష్ణుడున్ గలిసి దందడిఁ జంపెనెవండనో? హరుని ధనుస్సునే విరువ యా రఘు రాముని బెండ్లియాడె నె వ్వరు? ఘన రాముడా యనిని వైరిని జంపిన తీరు తెల్పుమా? నరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. "తరుణిని కృష్ణుడే కలిసి దందడితో జని యేమి చేసెనో" అనండి ... అన్వయం కుదురుతుంది.
సురవర పూజితుండుహరి చూడగ యుద్ధభూమిలోత్వరపడి సత్యభామ రణ తత్పరతన్ పతితోడ నేగియానరకునిఁజంపె , సీత సురనాధుడు దైత్యులు వానరుల్ గనన్చొరగొని యగ్ని దూకె నిలఁజూపగ తాను పవిత్ర మూర్తిగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణభంగం. "చూడగ నందరు... పతితోడ నేగగా..." అనండి. నరుకుని కృష్ణుడే చంపిన అర్థం వస్తుంది.
ధవుని యెదుటనె భూదేవి తన తనయుడునరకునిం జంపె ; సీత వానరులు గనఁగధవుని యెదుటనె నిప్పున దాటె ననుచుపోతన భాగవతమునందు బొందుబరచె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "ధవుడు కృష్ణుడు భూదేవి తనయుడైన..." అనండి.
భాగవతం లో నరకుని చంపినది కృష్ణుడేనట మరిదార యెదుటనె కృష్ణుడు తన తనయుడునరకునిం జంపె ; సీత వానరులు గనఁగధవుని యెదుటనె నిప్పున దాటె ననుచుపోతన భాగవతమునందు బొందుబరచె
సవరించిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🏽
సత్యతోగూడి శ్రీ కృష్ణు సంగరముననరకునిం జంపె, సీత వానరులు గనఁగకొలిచి భూమాత నొడిలోకి కూర్మిజేరితనువుచాలించె తరుణియె దనరుభక్తి!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "శ్రీహరి సంగరమున... భూమాత యొడిలోన.." అనండి.
🙏! సవరిస్తానార్యా!
సమస్య :నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్ (శిష్యులకు చిలకమర్తివారి గణపతి చెప్తున్న పాఠం - తల్లి సింగమ్మ మందలింపు )చంపకమాల -----------" నరకుని జంపె సీత సుర నాథుడు దైత్యులు వానరుల్ గనన్ . "" అరరరె ! గణ్పతీ ! యటుల నంటివి యేమిర? బుద్ధి లేదురా?నరకుడు ద్వాపరంబునను నర్మిలి సీతమ త్రేతనున్ గదా !అరవకు నవ్విపోదురెవరైనను విన్నను చాలుచాలురా !"( ఒక్కమాటు బందావారి సమర్పణలో విజయవాడ ఆకాశవాణిలో వచ్చిన 'గణపతి 'నాటకంలో నండూరి సుబ్బారావు గారిని , సీతారత్తమ్మ గారిని గుర్తుచేసుకోగలరు .)
మీపూరణ అద్భుతం!గతంలో చదివినగణపతి నవలను గుర్తుచేసిన మీకు ధన్యవాదములు!
ఇటువంటి పూరణలకు పెక్కురు శకారునో, ఉన్మాదినో, త్రాగుబోతునో ఆశ్రయిస్తారు. చిలకమర్తి వారి గణపతి (మందబుద్ధి) మాటగా మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు, సమూహ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు.గురువులు కంది వారు సమకూర్చి యొసంగ సమస్య నిట్టులన్ "నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్"సరిసరి యంచు పండితులు చక్కని పూరణ లంద జేయగా నరుసము నిండ శంకరులు హాయిగ పంచిరి స్వస్తి వాక్కులన్!
ఇదీ సమస్యాపూరణలో ఒక పద్ధతియే... తప్పించుకొని వెక్కిరించడం!ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
(మమతాను బంధాలను ఖండనము చేయువాడను భావము తో) తేటగీతిభిక్షువై వచ్చి లంకకు వెంటగొనియుశోకమందున నుంచ యశోక వనినిపూని రామమూర్తిన్, మమతాను బంధనరకునిం జంపె సీత వానరులు గనఁగచంపకమాలదరుమముఁ దప్పి బిక్షవుగ తారకరాముని కన్నుగప్పుచున్ధరణిజ లంకజేర్చ పరదారను బొందెడు నూహ, రావణున్సురపతి స్యందనమ్మునని జొచ్చిన రామునిఁ బూని మోహపున్నరకునిఁ జంపె సీత సురనాధుఁడు దైత్యులు వానరుల్ గనన్(మోహము తో నీచుడైన వాని అను భావము తో)
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
దురమున భర్త దోడ జని దుష్టుని నెవ్వరిఁ సత్య గూల్చెనోఅరిగెను భర్త దోడ వనమందున నెవ్వరు తోడు నీడగాపర సతి నాహరించి గొనె వంశ వినాశము సాక్షులెవ్వరో"నరకునిఁ జంపె" "సీత" "సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్"
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు. "..గొనె వంశవినాశము రావణుం డెటుల్" అంటే అన్వయం బాగుంటుంది.
సతియు తోడుగ కృష్ణుడు సమరమునను "నరకునిం జంపె, వానరులు గనఁగ”జనక సుత అగ్గిలో పడె జడుపు లేకభర్తకును తన పవిత్రత బయలుపఱుప
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సమస్యలోని 'సీత'ను వదలి వేసారు.
సాయుధయయయికోపానసత్యభామనరకునిజంపె,సీతవానరులుగనగజేరెహస్తిపురికివెనుకనరాముసేనరాగసుఖమయంబాయెరామునిసుచరితంబు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సాయుధ యయి... నరకునిం జంపె..' టైపాట్లు.మూడవ పాదంలో గణభంగం. అయినా సీత చేరింది అయోధ్యకు... హస్తిపురికి కాదు.
చం: వరుసలు గల్పి ప్రేమయను వంకన నిత్యము గోలసేయచున్పరుషపు మాటలున్ కడకు ప్రాణము తీయగ నెంచ నాతృతన్మొరకుడి బారి నుండి భయమొందగ సత్యను బోలు సామ్యమున్నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్వై. చంద్రశేఖర్
సీత సామాన్య స్త్రీ మిగతా వెక్కిరింపు పేర్లు గా గ్రహించగలరు
ధన్యవాదములు
మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
అన్నదమ్ము లిద్దఱు గూడి యాడుచుండఁదత్క్షణము పల్కు ఘోరానృతమ్ము ననుచు నన్న యడుగఁ జెప్పె నిటులఁ జిన్నవాఁడు నరకునిం జంపె సీత వానరులు గనఁగ పరులు తలంతు రివ్విధిని భామయె నిల్చి వధించి నట్టులం బరఁగఁగ నేల సందియము పద్మ సులోచన! చిత్త మందు నావరసతి సత్యభామ తన ప్రక్కన నుండఁగ వాసుదేవుఁడే నరకునిఁ జంపె సీత! సురనాథుఁడు దైత్యులు వా నరుల్ గనన్ [వా నరులు = నో రున్న (తెఱచిన) నరులు]
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
మైలవరపు వారి పూరణ హరి రఘురామమూర్తి సిరి యాతని పత్ని విదేహపుత్రిగావరకపివర్గమైరి సురవాసులు రామకథావసానమం..దరిగిరి స్వీయదేశములకప్పుడు ద్వాపరమందు సత్య యానరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్!మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
ద్వాపరమునందుసత్యయెవ్వానిజంపె?త్రేతయందున శ్రీలక్ష్మి దేవియెవరు?రాముడెవ్వరితోగూడి లంకకరిగె?నరకునిం జంపె సీత వానరులు గనఁగ
హరి పరిమార్చె నెవ్వరిని యంబురుహాక్షి రధమ్ము త్రోలగా?ధరణిజ యన్నయవ్వరిల? దైత్యుల కున్ రిపు వెవ్వరెంచగా?దురమున జంపె రాఘవుడు దుష్టుడు రావణు దోర్బలమ్ముతోనరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు, దైత్యులు వానరుల్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "... నెవ్వరిని నంబురుహాక్షి... యన్న నెవ్వరిల..." అనండి.
అరకొరతెల్వియుండియునునాద్యుడువోలెనుసంచరించునావిరసునిమాటలిట్లుగనువెర్రిదనంబునుజూపుజూడుడీనరకునిజంపెసీతసురనాధుడుదైత్యులువానరుల్ గనన్ నరకునిజంపెసత్యయనినమ్ముడుగాదనిసీతయెప్పుడున్
సరగునరామచంద్రవిభుసన్నిధిజేరగ నగ్గలించునా సరసిజనేత్ర సీత యొక స్వప్నముగాంచెను మానసంబునన్ పరమదయాళుడౌపతితపావనరాముడు రావణాసురున్ నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్
సమర రంగము నందున సత్యభామ*నరకునిం జంపె, సీత వానరులు గనగ*చేసె నగ్ని ప్రవేశము శ్రీరఘువరుడాన తీయ మారాడక నప్పు డచట
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
మురియుచు మన్మరాలిగని ముద్దుల నిచ్చుచు హైద్రబాదునన్
వరుసగ లడ్డులన్ తినుచు పండుగ పూటను వైభవంబుగా
నరకొర మాటలన్ పలికి హాయిని గూర్చెద నివ్విధంబుగన్:
“నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”
తొలగించండి"నరకుని"
తాత మనుమరాలితో సరదాగా చెప్పిన మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాలల దినోత్సవం సందర్భంగా మనుమరాలితో సరదా ముచ్చట్లు! బాగుంది.
తొలగించండి🙏🙏
తొలగించండిబాధలనువిన్నవించగామాధవుండు
రిప్లయితొలగించండిసత్యతోకూడిరణభూమిజనియెనాజి
నరకునింజంపె,సీతవానరులుగనఁగ
నగ్నిజొచ్చెనుసత్యునినానతివిని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్య కూడి గిరిధరుడు సమర మందు
రిప్లయితొలగించండినేమి జేసె,రాముడడుగ నెవరు దూకె
లంకలో నగ్ని లోనికి జంకు లేక
నరకుని జంపె,సీత వానరులు గనగ
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
తిరుగుచు వంగభూమినహ త్రిప్పలు సైచుచు మీనులందునన్
మరచుచు చిన్ననాటి కథ మైకము నొందుచు పద్య విద్యనున్
గురువులు చెప్పగా వినుచు కొండొక శిష్యుడు నమ్మెనిట్టులన్:
“నరుకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”
తొలగించండి"నరకుని"
తొలగించండినరక చతుర్థి బోనస్:
కంది గురువుల కంకితం:
సరసపు మాటలాడుచును సత్యయె చేరగ తేరునందునన్
మురియుచు కృష్ణుడే చనుచు ముచ్చట మీరగ యుద్ధమందునన్
కురుపుచు బాణవర్షముల, కూరిమి నొందగ మూడు లోకముల్,
నరకునిఁ జంపె,... సీత, సురనాథుఁడు, దైత్యులు, వానరుల్ గనన్
తొలగించండిశ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారు ఉవాచ:
"నరకుని చంపినది కృష్ణుడే, సత్యభామ కాదు"
తొలగించండికామేశ్వర రావు పోచిరాజుఅక్టోబర్ 29, 2016 10:02 PM
శ్రీమదాంధ్ర మహా భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.
మరి సీత??సార్..
తొలగించండి
తొలగించండిసీత స్వర్గమునుండి చూచుచుండగా...
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిబోనస్ పూరణలో కృష్ణుడు చంపినట్లే ఉన్నది కదా?
'కురియుచు బాణవర్షమును...' అనండి.
రెండవ పూరణకు ముందు 'ఒక తాత తన మనుమరాలు సీతతో చెప్తున్నాడు....'
తొలగించండిఅని వ్రాసి.. సమస్యలోని సీత శబ్దాన్ని సంబోధన(సీత!)గా సూచిస్తే అద్భుతంగా ఉంటుంది.
🙏🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
తొలగించండి"నరక చతుర్దశి"
సత్యరూపంబుసీతయెసాధనమున
రిప్లయితొలగించండిజ్ఞానివానరుడాయమజాడతెలిసె
రామరూపంబురావణురాగమణచి
నరకునింజంపెసీతవానరులుగనగ
నరక శబ్దానికి నీచస్థానం, దుర్గతి, కష్టకారణం అనే అర్థాలున్నాయి. రావణుడు నరక శబ్దవాచ్యుడే (సీత నపహరించి నీచస్థానం పొందినవాడు, సాధుజనులకు కష్టకారణమైనవాడు)
తొలగించండికనుక మీ పూరణ సమర్థనీయమే. బాగుంది. అభినందనలు.
ధన్యవాదాలండిగురువుగారు
తొలగించండి
రిప్లయితొలగించండిపల్కె తలతిక్క గానరె "పతిని, మీదు
నరకునిం జంపె సీత వానరులు గనఁగ”
చేత కాని మొగుడరరె చెప్ప గాను
వినడు, కొట్టగానిక వెక్కి వెక్కి యేడ్చు!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణులసాధుపుంగవులదాచివధింపగగిన్కసత్యతో
రిప్లయితొలగించండిసరగుననేగియచ్యుతుడుసంగరమందునదుష్టదైత్యుడౌ
*“నరుకునిఁ జంపె ;సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్”*
ధరుణముజొచ్చియీలువునుధాత్రినుతించగజాటెజానయై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిశైలధరుడు సత్యనుగూడి సమరమందు
జనులనిల హింసపెట్టెడి దనుజ ఖలుడు
నరకునిం జంపె; సీత వానరులు గనగ
పవనపుత్రుని నెంతయు ప్రస్తుతించె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసత్య తోడుత శ్రీహరి చంపె నెవని?
రిప్లయితొలగించండిచితిన దూకెనే నాతి దా పతిని జేర?
తెలియ జెప్పుము శీఘ్రమె తెలుగు బాల!
నరకునిం జంపె; సీత వానరులు గనఁగ.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చితిని' అనండి.
సత్యతో గూడి కృష్ణుండు సమర మందు
రిప్లయితొలగించండిచంపె నెవని? జనకుని వశ యెవరంటి?
పవన తనయుడెప్పుడు తాను వనధి దాటె?
నరకునిం జంపె, సీత, వానరులు గనఁగ
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపలికె తలతిక్కగ "నపాం
సుల నర కునిఁ జంపె సీత సురనాథుఁడు దై
త్యులు వానరుల్ గనన్" విదు
రులు చేసిరి బడితపూజ రోసి జిలేబిన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరకగు రాక్షసాధముడు, కాంతుని తోడుత సత్యభామయే
రిప్లయితొలగించండిసరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమ
ధాటిజూపుచున్
నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్
నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదాన్ని "కరకగు రాక్షసున్ దునుమగా హరి తోడుగ సత్యభామయే..." అనండి. అన్వయం చక్కగా కుదురుతుంది.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏
తొలగించండిసవరణతో 🙏🙏🙏
తొలగించండికరకగు రాక్షసున్ దునుమగా హరితోడుత సత్యభామయే
సరసపు క్రీడగావెడలి శస్త్రపరాక్రమ
ధాటిజూపుచున్
నరకుని జంపె; సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్
నిరుపమ రీతిజొచ్చెనుగ నిప్పున గోరగ రామచంద్రుడే !
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిధరణి జనాళినిన్ తనదు దానవ చేష్టల కష్టబెట్టుచున్
తిరిగిన రాక్షసాధముని దేవకిపుత్రుడు సత్యతోడుతన్
నరకునిజంపె; సీత నరనాధుడు దైత్యులు వానరుల్ గనన్
ధరణమునందు దూకి తను దగ్ధముగాక పునీత యయ్యెగా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినరుల బాధలు బాపగ నాతి సత్య
రిప్లయితొలగించండివెంట జనుదేర కృష్ణుడు వీరు డగుచు
నరకునిన్ జంపె : సీత వానరులు గనగ
ఋజువు జేసెను తన శక్తి రూఢి గాగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితరుణియు కృష్ణుడున్ గలిసి దందడిఁ జంపెనెవండనో?
రిప్లయితొలగించండిహరుని ధనుస్సునే విరువ యా రఘు రాముని బెండ్లియాడె నె
వ్వరు? ఘన రాముడా యనిని వైరిని జంపిన తీరు తెల్పుమా?
నరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "తరుణిని కృష్ణుడే కలిసి దందడితో జని యేమి చేసెనో" అనండి ... అన్వయం కుదురుతుంది.
సురవర పూజితుండుహరి చూడగ యుద్ధభూమిలో
రిప్లయితొలగించండిత్వరపడి సత్యభామ రణ తత్పరతన్ పతితోడ నేగియా
నరకునిఁజంపె , సీత సురనాధుడు దైత్యులు వానరుల్ గనన్
చొరగొని యగ్ని దూకె నిలఁజూపగ తాను పవిత్ర మూర్తిగాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. "చూడగ నందరు... పతితోడ నేగగా..." అనండి. నరుకుని కృష్ణుడే చంపిన అర్థం వస్తుంది.
ధవుని యెదుటనె భూదేవి తన తనయుడు
రిప్లయితొలగించండినరకునిం జంపె ; సీత వానరులు గనఁగ
ధవుని యెదుటనె నిప్పున దాటె ననుచు
పోతన భాగవతమునందు బొందుబరచె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ధవుడు కృష్ణుడు భూదేవి తనయుడైన..." అనండి.
భాగవతం లో నరకుని చంపినది కృష్ణుడేనట మరి
రిప్లయితొలగించండిదార యెదుటనె కృష్ణుడు తన తనయుడు
నరకునిం జంపె ; సీత వానరులు గనఁగ
ధవుని యెదుటనె నిప్పున దాటె ననుచు
పోతన భాగవతమునందు బొందుబరచె
సవరించిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏🏽
తొలగించండిసత్యతోగూడి శ్రీ కృష్ణు సంగరమున
రిప్లయితొలగించండినరకునిం జంపె, సీత వానరులు గనఁగ
కొలిచి భూమాత నొడిలోకి కూర్మిజేరి
తనువుచాలించె తరుణియె దనరుభక్తి!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"శ్రీహరి సంగరమున... భూమాత యొడిలోన.." అనండి.
🙏! సవరిస్తానార్యా!
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండినరకుని జంపె సీత సుర
నాథుడు దైత్యులు వానరుల్ గనన్
(శిష్యులకు చిలకమర్తివారి గణపతి చెప్తున్న పాఠం - తల్లి సింగమ్మ మందలింపు )
చంపకమాల
-----------
" నరకుని జంపె సీత సుర
నాథుడు దైత్యులు వానరుల్ గనన్ . "
" అరరరె ! గణ్పతీ ! యటుల
నంటివి యేమిర? బుద్ధి లేదురా?
నరకుడు ద్వాపరంబునను
నర్మిలి సీతమ త్రేతనున్ గదా !
అరవకు నవ్విపోదురెవ
రైనను విన్నను చాలుచాలురా !"
( ఒక్కమాటు బందావారి సమర్పణలో విజయవాడ ఆకాశవాణిలో వచ్చిన 'గణపతి '
నాటకంలో నండూరి సుబ్బారావు గారిని , సీతారత్తమ్మ గారిని గుర్తుచేసుకోగలరు .)
మీపూరణ అద్భుతం!గతంలో చదివినగణపతి నవలను గుర్తుచేసిన మీకు ధన్యవాదములు!
తొలగించండిఇటువంటి పూరణలకు పెక్కురు శకారునో, ఉన్మాదినో, త్రాగుబోతునో ఆశ్రయిస్తారు. చిలకమర్తి వారి గణపతి (మందబుద్ధి) మాటగా మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు, సమూహ సభ్యులందరికి దీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిగురువులు కంది వారు సమకూర్చి యొసంగ సమస్య నిట్టులన్
"నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్"
సరిసరి యంచు పండితులు చక్కని పూరణ లంద జేయగా
నరుసము నిండ శంకరులు హాయిగ పంచిరి స్వస్తి వాక్కులన్!
ఇదీ సమస్యాపూరణలో ఒక పద్ధతియే... తప్పించుకొని వెక్కిరించడం!
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండి(మమతాను బంధాలను ఖండనము చేయువాడను భావము తో)
రిప్లయితొలగించండితేటగీతి
భిక్షువై వచ్చి లంకకు వెంటగొనియు
శోకమందున నుంచ యశోక వనిని
పూని రామమూర్తిన్, మమతాను బంధ
నరకునిం జంపె సీత వానరులు గనఁగ
చంపకమాల
దరుమముఁ దప్పి బిక్షవుగ తారకరాముని కన్నుగప్పుచున్
ధరణిజ లంకజేర్చ పరదారను బొందెడు నూహ, రావణున్
సురపతి స్యందనమ్మునని జొచ్చిన రామునిఁ బూని మోహపు
న్నరకునిఁ జంపె సీత సురనాధుఁడు దైత్యులు వానరుల్ గనన్
(మోహము తో నీచుడైన వాని అను భావము తో)
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిదురమున భర్త దోడ జని దుష్టుని నెవ్వరిఁ సత్య గూల్చెనో
రిప్లయితొలగించండిఅరిగెను భర్త దోడ వనమందున నెవ్వరు తోడు నీడగా
పర సతి నాహరించి గొనె వంశ వినాశము సాక్షులెవ్వరో
"నరకునిఁ జంపె" "సీత" "సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్"
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..గొనె వంశవినాశము రావణుం డెటుల్" అంటే అన్వయం బాగుంటుంది.
సతియు తోడుగ కృష్ణుడు సమరమునను
రిప్లయితొలగించండి"నరకునిం జంపె, వానరులు గనఁగ”
జనక సుత అగ్గిలో పడె జడుపు లేక
భర్తకును తన పవిత్రత బయలుపఱుప
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్యలోని 'సీత'ను వదలి వేసారు.
సాయుధయయయికోపానసత్యభామ
రిప్లయితొలగించండినరకునిజంపె,సీతవానరులుగనగ
జేరెహస్తిపురికివెనుకనరాముసేనరాగ
సుఖమయంబాయెరామునిసుచరితంబు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సాయుధ యయి... నరకునిం జంపె..' టైపాట్లు.
మూడవ పాదంలో గణభంగం. అయినా సీత చేరింది అయోధ్యకు... హస్తిపురికి కాదు.
చం:
రిప్లయితొలగించండివరుసలు గల్పి ప్రేమయను వంకన నిత్యము గోలసేయచున్
పరుషపు మాటలున్ కడకు ప్రాణము తీయగ నెంచ నాతృతన్
మొరకుడి బారి నుండి భయమొందగ సత్యను బోలు సామ్యమున్
నరకుని జంపె సీత సురనాథుడు దైత్యులు వానరుల్ గనన్
వై. చంద్రశేఖర్
సీత సామాన్య స్త్రీ మిగతా వెక్కిరింపు పేర్లు గా గ్రహించగలరు
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅన్నదమ్ము లిద్దఱు గూడి యాడుచుండఁ
తొలగించండిదత్క్షణము పల్కు ఘోరానృతమ్ము ననుచు
నన్న యడుగఁ జెప్పె నిటులఁ జిన్నవాఁడు
నరకునిం జంపె సీత వానరులు గనఁగ
పరులు తలంతు రివ్విధిని భామయె నిల్చి వధించి నట్టులం
బరఁగఁగ నేల సందియము పద్మ సులోచన! చిత్త మందు నా
వరసతి సత్యభామ తన ప్రక్కన నుండఁగ వాసుదేవుఁడే
నరకునిఁ జంపె సీత! సురనాథుఁడు దైత్యులు వా నరుల్ గనన్
[వా నరులు = నో రున్న (తెఱచిన) నరులు]
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిహరి రఘురామమూర్తి సిరి యాతని పత్ని విదేహపుత్రిగా
వరకపివర్గమైరి సురవాసులు రామకథావసానమం..
దరిగిరి స్వీయదేశములకప్పుడు ద్వాపరమందు సత్య యా
నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది.
తొలగించండిద్వాపరమునందుసత్యయెవ్వానిజంపె?
రిప్లయితొలగించండిత్రేతయందున శ్రీలక్ష్మి దేవియెవరు?
రాముడెవ్వరితోగూడి లంకకరిగె?
నరకునిం జంపె సీత వానరులు గనఁగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరి పరిమార్చె నెవ్వరిని యంబురుహాక్షి రధమ్ము త్రోలగా?
రిప్లయితొలగించండిధరణిజ యన్నయవ్వరిల? దైత్యుల కున్ రిపు వెవ్వరెంచగా?
దురమున జంపె రాఘవుడు దుష్టుడు రావణు దోర్బలమ్ముతో
నరకునిఁ జంపె, సీత, సురనాథుఁడు, దైత్యులు వానరుల్ గనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నెవ్వరిని నంబురుహాక్షి... యన్న నెవ్వరిల..." అనండి.
అరకొరతెల్వియుండియునునాద్యుడువోలెనుసంచరించునా
రిప్లయితొలగించండివిరసునిమాటలిట్లుగనువెర్రిదనంబునుజూపుజూడుడీ
నరకునిజంపెసీతసురనాధుడుదైత్యులువానరుల్ గనన్
నరకునిజంపెసత్యయనినమ్ముడుగాదనిసీతయెప్పుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరగునరామచంద్రవిభుసన్నిధిజేరగ నగ్గలించునా
రిప్లయితొలగించండిసరసిజనేత్ర సీత యొక స్వప్నముగాంచెను మానసంబునన్
పరమదయాళుడౌపతితపావనరాముడు రావణాసురున్
నరకునిఁ జంపె సీత సురనాథుఁడు దైత్యులు వానరుల్ గనన్
సమర రంగము నందున సత్యభామ
రిప్లయితొలగించండి*నరకునిం జంపె, సీత వానరులు గనగ*
చేసె నగ్ని ప్రవేశము శ్రీరఘువరు
డాన తీయ మారాడక నప్పు డచట