20, నవంబర్ 2020, శుక్రవారం

సమస్య - 3550

21-11-2020 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్”

(లేదా…)

“వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్”

84 కామెంట్‌లు:

 1. విష్ణుమూర్తి తన కోడలు సరస్వతికి ఈ విషయం చెప్తున్నట్టుగా సన్నివేశం

  శా||
  వాగ్దానంబిదె బ్రహ్మపూజనిడినన్ ప్రాప్తంబగున్ శక్తులున్
  దుగ్ధంబంటిది నీదు సత్కృప విశుద్ధోద్ధారణల్ గల్గెడిన్
  దగ్ధంబైగనునేదరిద్రమయినన్ దామోదరోఢన్ మదిన్
  వాగ్దేవీ! పదపూజజేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   దుగ్ధంబంటి... 'వంటి'ని 'అంటి' అనరాదు.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలి. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  వాగ్దేవిన్ గని భీతినొందుచునయో వ్రాయంగనున్ జాలకే
  దిగ్దంతుల్ గల శంకరాభరణమున్ దేదీప్య మానంబుగన్
  దుగ్దల్ వీడగ మానసమ్ముననికన్ తోరంపు మోదమ్మునన్
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్...

  దుగ్ద : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) 1986
  ఆందోళన, బాధ

  రిప్లయితొలగించండి
 3. వాగ్దేహంబాప్రణవమె
  ప్రాగ్దేహంబామెరూపెభ్రాంతియదేలా
  వాగ్ధాటియెసభకుసిరిగ
  వాగ్దేవీపూజసేయవర్ధిల్లుసిరుల్

  రిప్లయితొలగించండి
 4. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్నిగ్ధమునిడు చదువబ్బును
  వాగ్దేవీ పూజసేయ; వర్థిల్లు సిరుల్
  దుగ్ధల తోడుగ లేమిని
  దగ్ధము జేసెడి జలధిజ ధ్యానము తోడన్.

  రిప్లయితొలగించండి
 5. *వాగ్దేవికి ఆమె గురువు చెబుతున్న మాటలు*
  ....... ........ ......... ........ .......
  దిగ్దిశలనేలు తల్లుల
  వాగ్దోషంబుల విడుచుచు భక్తి విడక నా
  వాగ్దేవి, పార్వతి, రమను
  వాగ్దేవీ! పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్

  రిప్లయితొలగించండి
 6. వాగ్దానంబును జేసెను
  వాగ్దేవిచ్చిన వరముల వారధితోనే
  వాగ్దార ధనము నివ్వగ
  వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాగ్దేవి+ఇచ్చిన' అన్నపుడు సంధి లేదు. "వాగ్దేవి యిడిన వరముల.." అనండి. 'వాగ్ధార' టైపాటు.

   తొలగించండి
 7. వాగ్ధార గలుగు జనులకు
  వాగ్దేవీ పూజవలన, వర్ధిల్లు సిరుల్
  దుగ్ధాంబుధి సుతను గొలువ
  దగ్ధంబగు దురితమెల్ల దాక్షాయణిచే

  వాగ్దానంబిడె వేదముల్ జనులకున్
  ప్రాప్తించ వాగ్ధారలన్
  వాగ్దేవీ పదపూజ జేసినపుడే, వర్ధిల్లుగా సంపదల్
  దుగ్ధాంబోధి తనూజ గొల్వ మదిలో తోషంబు చెల్వొందగా
  దగ్ధంబౌనుగ పాపసంచయ మహో
  దాక్షాయణీ ప్రాపునన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముగ్ధుండౌ కవికాళిదాసు దనరెన్ పూజ్యుండుగా ధారుణిన్
   స్నిగ్ధంబౌ కడుభక్తిభావమున నాచింతామణిన్ గొల్వగా
   వాగ్దోషంబులు దొల్గి కావ్యములనే
   వ్రాయంగ నేర్చెన్ గదా
   వాగ్దేవీ పదపూజ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

   ముగ్ధుడు = మూర్ఖుడు ( ఆం.భా.)

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలి. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! క్రొత్త విషయాన్ని తెలియజేశారు! 🙏🙏🙏

   తొలగించండి
 8. కె.వి.యస్. లక్ష్మి:

  వాగ్దోషమ్ములె గలుగవు
  వాగ్దేవీ పూజజేయ; వర్థిల్లు సిరుల్
  దుగ్ధాబ్ది తనయ గొల్వగ
  దగ్ధంబగు పేదరికపు తాపములెల్లన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలి. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు. తెలియని కొత్త నిబంధనను తెలుసుకున్నాను. ధన్యవాదములు.

   తొలగించండి
 9. *వాగ్దేవికి ఆమె గురువు చెబుతున్న మాటలుగా* ....... ........ ......... ........ .......
  దుగ్దన్ వీడుము ఖేదనమ్మది యికన్ దూరమ్మగున్ నిత్యమున్
  వాగ్దోషంబుల వీడి స్వచ్ఛమగు నీ వాగ్ధాటితో మాతలౌ
  వాగ్దేవిన్ జలికొండకూతురు మహీప్రాచీర నందంతికిన్
  వాగ్దేవీ! పదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

  రిప్లయితొలగించండి
 10. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్నిగ్ధమ్మున్నెనయించు విద్యలవి హెచ్చిల్లున్ విశేషమ్ముగా
  వాగ్దేవీ పదపూజ జేసినపుడే; వర్థిల్లుగా సంపదల్
  దుగ్ధల్ వీడగజేసి లేమితనమున్ తూలించి క్లేశమ్ములన్
  దగ్ధమ్మున్నొనరించు సింధుజకు స్తోత్రమ్ముల్ సమర్పించగా!

  రిప్లయితొలగించండి
 11. దుగ్దపడకు చదువబ్బును
  వాగ్దేవీ పూజఁ జేయ ; వర్ధిల్లు సిరుల్
  వాగ్దేవి యత్తను గొలువగ
  వాగ్దానము జేసెదనివి పక్వపుపలుకుల్

  రిప్లయితొలగించండి
 12. ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య

  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగాసంపదల్

  నా పూరణ

  శార్దూలము

  స్నిగ్ధప్రజ్ఞలఁజూపుచున్ కవనముల్ భాసిల్లఁ జెప్పంగ తా

  వాగ్దివ్యత్వముఁబొందగా వలయు నిత్యాభ్యాస యోగంబుచే

  వాగ్దోషంబులులేనినిత్య రచనా ప్రాభావ్య సంప్రాప్తి కై

  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్.

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 13. సమస్య :
  వాగ్దేవీపదపూజ జేసినపుడే
  వర్ధిల్లుగా సంపదల్

  ( పోతనమహాకవి శ్రీనాథకవిసార్వభౌమునితో)

  దిగ్దంతుండవు! బావగారివి ! మహా
  దేవార్చనాశీలివే !
  వాగ్ధాటిన్ భవదీయశేముషికి సం
  భగ్నుల్ గదా డిండిముల్ !
  ముగ్ధంబైన మదీయభావ మెపుడున్
  ముమ్మాటికిన్ మార ; దా
  వాగ్దేవీపదపూజ జేసినపుడే
  వర్ధిల్లుగా సంపదల్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలి. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి
 14. స్నిగ్ధత రాజిలు జననీ
  వాగ్దేవీ పూజసేయ, వర్ధిల్లుసిరుల్
  దగ్ధంబౌ పరితాపము
  వాగ్ధారల దయగనివ్వు వాణీ ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 15. వాగ్ధాటి విద్య పెరుగును
  వాగ్దేవీ పూజ సేయ :: వర్ధిల్లు సిరుల్
  దుగ్ధ కడలి జన్మించిన
  స్నిగ్దపు దేవేరి కొలువ చిత్తంబల రన్

  రిప్లయితొలగించండి


 16. దిగ్దంతివై వెలిగెదవు
  వాగ్దేవీ పూజఁ జేయ, వర్ధిల్లు సిరుల్
  వాగ్దేవి యత్త సాయము
  వాగ్దేవిని విడువకోయి పడతి జిలేబీ !  జిలేబి

  రిప్లయితొలగించండి

 17. ఒకే ఫేమలీ ఆల్ ఇన్‌ ఆల్ కంట్రోల్ :)

  వాగ్దేవీపతి రాత కర్మఫలమై పాండిత్యమెంతేని యా
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా, సంపదల్
  వాగ్దేవీపతి తల్లి లక్ష్మి కృపగా వర్ధిల్లుగా శ్రేయముల్
  వాగ్దేవీపతి తండ్రి శ్రీకరుని సావాసమ్ముతో గూడుగా!  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. ప్రాగ్దిక్కున స్థిరముగ శ్రీ
  వాగ్దేవినినిలిపిమదిని పరమనిరతితో
  దుగ్ధపునభిషేకముతో
  వాగ్దేవీ పూజఁ జేయవర్ధిల్లు సిరుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "క్షీరాభిషేకములతో" అంటే బాగుంటుంది కదా?

   తొలగించండి
 19. వాగ్దోషము లెల్ల తొలగు
  వాగ్దేవీ పూజ చేయ వర్ధిల్లు సిరుల్
  వాగ్దేవి కరుణ నంది న
  వాగ్ధారలు పొంగి పొరలు వడిగా మనకున్

  రిప్లయితొలగించండి
 20. వాగ్దేవీదయవేదవాఙ్మయమువిశ్వస్రష్టసృష్టించెనా
  వాగ్దేవిన్హరిపద్మసంభవభవుల్ప్రార్ధించరేభక్తియా
  వాగ్దేవీవచియించకావ్యజగమీవైభోగభోగమ్ములా
  *వాగ్దేవీపదపూజఁజేసినపుడేవర్ధిల్లుగాసంపదల్*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "భక్తి నా..." అనండి. మూడవ పాదం ప్రారంభంలో 'వాగ్దేవీ' అని దీర్ఘాంతం అక్కడ అన్వయించదు.

   తొలగించండి
 21. వాగ్దేవీయుశనాకవీశుకిడెనాపారాశరీశంకరుల్
  వాగ్దానంబునకాళిదాసప్రభృతుల్వాగ్భావవిశ్వంబునన్
  వాగ్ధాటిన్బ్రవచించరేకృతులుశశ్వత్కీర్తిభాసిల్లదే
  *“వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్”*

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో 'వాగ్దేవీ' అని దీర్ఘాంతం అక్కడ అన్వయించదు. "సద్భావంబులన్నింటనున్" అని ఉండాలి.

   తొలగించండి
 23. తగ్దీరు తన్నుకొచ్చును
  వాగ్దేవీ పూజఁజేయ; వర్ధిల్లు సిరుల్
  దిగ్దేశమేగ బోయిన,
  వాగ్దండము పాటినుండ ప్రాభవమొప్పున్.

  తగ్దీరు-అదృష్టము
  దిగ్దేశము-దూరదేశము
  వాగ్దండము-మాటల సంయమనము.
  (ఆంధ్రభారతి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   తక్దీరు అనే అన్యదేశ్యాన్ని ప్రయోగించినా 'తన్నుకొచ్చును'లో ఒచ్చును అన్నది సరికాదు.

   తొలగించండి
 24. గురువు గారికి నమస్కారం ప్రయత్నం మాత్రమే

  వాగ్దేవిని ప్రార్థించిన
  దగ్ధము జేయును మనుజుల తప్పులనెల్లన్
  వాగ్దానమిచ్చెను గురుడు
  వాగ్దేవీ పూజ చేయు వర్ధిల్లు సిరుల్

  రిప్లయితొలగించండి
 25. గురువు గారికి నమస్కారం ప్రయత్నం మాత్రమే

  వాగ్దేవిని ప్రార్థించిన
  దగ్ధము జేయును మనుజుల తప్పులనెల్లన్
  వాగ్దానమిచ్చెను గురుడు
  వాగ్దేవీ పూజ చేయు వర్ధిల్లు సిరుల్

  రిప్లయితొలగించండి
 26. వాగ్దేవియనగశారద
  వాగ్దేవీపూజజేయవర్ధిలుసిరుల్
  వాగ్దత్తమునెరవేర్చును
  వాగ్దేవియెయిచ్చుమనకువాక్సంపదలన్

  రిప్లయితొలగించండి
 27. ప్రాగ్దేశంబగుభారతావనినిసంవర్ధిల్లుసత్సంస్కృతీ
  స్నిగ్ధత్వంబుననెల్లవారలకు నాశ్రీదేవి శ్రీగౌరియున్
  వాగ్దేవిన్ భజియింపకామితములేపారున్ సదా సత్కవుల్
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

  రిప్లయితొలగించండి
 28. కందం
  దిగ్దంతమ్ములు వొగడన్
  వాగ్ధారాదిగ సమస్త పాటవములిలన్
  దుగ్ధన్ దీర్చు సిరులనన్
  వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్

  శార్దూలవిక్రీడితము
  దిగ్దంతమ్ములు భేషు భేషనఁగ కీర్తిన్ గాంచు నైపుణ్యముల్
  వాగ్ధారాది సమస్త విద్యలవి సంప్రాప్తమ్మునై యోగ్యతన్
  దుగ్ధన్ దీర్చెడు మేటి సంపదలనన్ దొందొల్త సన్నిష్టతో
  వాగ్దేవీ పదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలని పండితులు చెప్పారు. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు:

   కందం
   దిగ్దంతమ్ములు వొగడన్
   వాగ్దివ్యాభరణమాది పాటవములిలన్
   దుగ్ధన్ దీర్చు సిరులనన్
   వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్

   శార్దూలవిక్రీడితము
   దిగ్దంతమ్ములు భేషు భేషనఁగ కీర్తిన్ గాంచు నైపుణ్యముల్
   వాగ్దివ్యాభరణాది విద్యలవి సంప్రాప్తమ్మునై యోగ్యతన్
   దుగ్ధన్ దీర్చెడు మేటి సంపదలనన్ దొందొల్త సన్నిష్టతో
   వాగ్దేవీ పదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

   తొలగించండి
 29. వాగ్ధారామ్రుతసేచనన్హ్రుదయసంప్రాప్తంగున్స్నిగ్ధతన్
  ప్రాగ్దేవీరసరమ్యనాట్యమదిగోభావాంబురంబున్గనన్
  వాగ్దాహంబునపండితుల్సరససేవాతత్పరుల్గాగనా
  వాగ్దేవీపదపూజఁజేసినపుడేవర్ధిల్లుగాసంపదల్

  రిప్లయితొలగించండి
 30. ధిగ్దేహమ్ము మది దినా
  న్వగ్దిన వర్ధనము గాఁ దనరవలె నన్నం
  బ్రాగ్దిఙ్ముఖుండ వయి తగ
  వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్


  రుగ్దేహమ్ము తలంచ కుత్తమ మనన్ రోగమ్ము నిక్కంబ యీ
  దృగ్దర్పమ్మును వీడి చిత్తమున భక్తిన్ నిల్పి పూజింపుమా
  దిగ్దేవాళి సదార పూజలు రమాదేవీ సమీపంపు టా
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్

  రిప్లయితొలగించండి
 31. వాగ్దేవీపదపూజ జేసినపుడే వర్ధిల్లుగాసంపదల్
  వాగ్ధారంబునుగల్గునిక్కముగ దాబ్రాపున్సమీక్షించుచో
  వాగ్దేవీపదమాశ్రయించినగడున్ బ్రాప్తించునైశ్వర్యముల్
  వాగ్దేవీ!ననుగావుమా దయనుసాఫల్యంబునొందంగగా

  రిప్లయితొలగించండి
 32. ప్రాగ్దిశఁ బ్రాతఃకాలము
  వాగ్దేవీ పూజఁ జేయ వర్ధిల్లు సిరుల్
  వాగ్దోషంబులు దొలగును
  దిగ్దంతుల శిష్యరికము తీరుగనబ్బున్

  రిప్లయితొలగించండి
 33. వాగ్ధారగ్గలమౌను పండితులకున్, భాషించుచున్ నిత్యమున్
  వాగ్దోషమ్ముల నెంచి దిద్దుకొన నభ్యాసించు పాఠ్యమ్ములన్
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే, వర్ధిల్లుగా సంపదల్
  దుగ్దాంభోధిని పుట్టినట్టి కమలన్ తోషమ్ముతోఁ గొల్చినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాగ్ధార+అగ్గలమౌను... అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
   మీరు రెండు పాదాలలో 'ద', రెండు పాదాలలో 'ధ' ప్రాసగా వేసారు. స్వవర్గజప్రాసలో 3:1 లేదా 1:3 నిష్పత్తిలో వర్గాక్షరాలను వేయాలి. అంటే మూడు పాదాలలో ద ఉంటే ఒకపాదంలోనే ధ ఉండాలి లేదా మూడు పాదాలలో ధ ఉంటే ఒకపాదంలో ద ఉండాలి.

   తొలగించండి
 34. శా:

  దగ్ధంబెన్నగరాదు నీదు కరుణన్ తథ్యంబు మాటాడుటన్
  వాగ్దాటిన్ ప్రవచింత్రు గొప్పతనమున్ పట్టింపు గా బల్దియన్
  దుగ్దల్ వీడగ యెన్నికన్ గెలుచుటన్ దూరంపు నాలోచనల్
  వాగ్దేవీ పద పూజ జేసినపుడే వర్ధిల్లు గా సంపదల్

  బల్దియ=కార్పొరేషన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 35. దిగ్దీపాలయమున్ వసించి యిలలో దేదీప్యమానంబుగా
  స్నిగ్ధాలంకృతరావ మంజుల ఝరీ
  చేతోద్ధతీ విస్తృతిన్
  వాగ్ధారామృత తోయధీ జనితమౌ
  భావాకృతిన్ వెల్గుచున్
  వాగ్దేవీ పద పూజ జేసినపుడే
  వర్ధిల్లుగా సంపదల్!

  రిప్లయితొలగించండి
 36. మైలవరపు వారి పూరణ

  కొంచెం (జ్వరం) అనారోగ్యముచే ఆలస్యమైనది.. మన్నించండి 🙏🙏

  దిగ్దేశంబుల నిండియున్నకరుణార్ద్రీభూతచిన్మూర్తులై
  ద్రాగ్దారిద్ర్యము బాపువారు జననీస్థానార్హులౌ దేవతల్
  ఋగ్దామంబులవారి సేవ శుభమౌ, శ్రీ శైలజాతారమా
  వాగ్ధేవీ పదపూజ చేసినపుడే వర్థిల్లుగా సంపదల్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి 37. వాగ్దేవిన్ మనసార కొల్వ మదిలో వాగ్ధార పొంగన్సదా
  వాగ్దేవీపదపూజఁ జేసినపుడే వర్ధిల్లుగా సంపదల్”*
  వాగ్దేవీ కరుణామృతమ్ము బడయన్ వాలాయ మున్నందగా
  వాగ్దోషంబులు బాయ కల్గునిక సద్భావమ్ములన్నింటనన్

  రిప్లయితొలగించండి