22-11-2020 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము”
(లేదా…)
“ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:ఆకలి కాగలేకయిక హ్లాదము నొందుచు నర్ధరాత్రినిన్పీకుచు కోడి మాంసమును బీరును గ్రోలిన మైకమందునన్ కూకటపల్లి వీధినిక గుట్టుగ వీరుడు పైకిచూడగా నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....
మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
🙏
ధర్మపరుడైనరాముఁడుధరణియందురాజ్యమేలంగప్రజలునురాగమందసూర్యవంశంబుశోభిల్లెసూనుఁజూచిఆకసమునందుఁదోచెశశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: మహిమ గలిగిన కార్తీక మాస మందు దీప్తి చెందెడి యాకాశ దివ్వె లన్ని అనగిపెనగి మనలకెల్ల నబ్బురముగ ఆకసమునందు దోచె శశాంక శతము.
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)వాకిటి బైటకున్ జనుచు ప్రక్కను గేహపు సుందరాంగినిన్ తేకువ మీర మెచ్చగను తీయుచు భామయె రోలులోననున్ రోకలి బుఱ్ఱమీదనిడ రోమియొ తూలుచు పైకిచూడగా నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....
🙏🙏
చెప్పుతో కొడితే చుక్కలు కనిపించేవి... పాపం! రోకలిబండ కదా... శశాంకశతమేం కర్మ! సహస్రమే కనిపిస్తుంది. హాస్యస్ఫోరకమైన పూరణ. అభినందనలు.
🙏😊
తాకనెమానవుండుతనదాపునచంద్రునివన్నెచిన్నెలన్రాకెటుపంపగానచటరాకకుపోకకుదారిచూచెగాప్రాకగమేధతోడుతనుప్రాభవమందెనుచల్లగానటన్ఆకసమందుఁదోచెనుశశాంకశతమ్మదినేత్రపర్వమై
మైలవరపు వారి పూరణ వేకువ జామునందు నృపవీథినినేగగ, విద్యుదుజ్జ్వలత్ప్రాకట దీపికాచయము రంజిలుచుండెను స్తంభపంక్తిపై,శ్రీకరమౌ శశాంకతతి చీకటి చీల్చుచునున్నరీతి., నాయాకసమందు దోచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై!! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది.
జాల్రా :)సఖి! కవీశ్వరులకిదేను సమయమాయె!రాత్రి తొమ్మిది! బ్లాగ్విహారమ్ము లలరయాకసమునందుఁ దోఁచె శశాంకశతముశంకరాభరణ మనెడు సైరిభమునజిలేబి
ప్రియసఖుడు జన్మ దినమంచు పిలిచె నంచు సంబరముతోడ నటకేగి సరదు మించి సుప్రతిభ గ్రోలి తూలుచున్ జూచినంత నాకసమునందుఁ దోఁచె శశాంకశతము
క్రొవ్విడి వెంకట రాజారావు: వీకను శంకరున్ గొలిచి పెంపుగ కార్తిక మాసమందునన్ జోకగ దేవళమ్మునను సొంపుగ దీపములుంచి నంతటన్ పైకని నిల్పుచున్ ద్యుతిని ప్రాకగజేయ నపూర్వమౌనటుల్ నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై.
సమస్య :ఆకసమందు దోచెను శ శాంకశతమ్మది నేత్రపర్వమై ( " ఆజాద్ హింద్ ఫౌజు " నిర్మించిన సుభాసుచంద్రుడు భారతీయులకు దాస్యాంధకారాన్ని బాపే నూర్గురు చంద్రులుగా కనిపించాడు )ఉత్పలమాల ------------చేకొని మాతృదేశమున చేరిన యాంగ్లుల పారద్రోలగా వాకొనలేని పౌరుషపుభారతసైన్యము " హిందుఫౌజు " నే యేకత చంద్రబోసు " జయ హిం " దని స్థాపన జేసి నిల్వగా నాకసమందు దోచెను శ శాంకశతమ్మది నేత్రపర్వమై .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వీకను గాధిరాజసుతు వెంట జరించుచు కానయందునన్తాకగ రామపాదమది ధన్యతనొందెను రాయినాతియైనాకము నుండుదేవతలు నాట్యము సల్పగ హర్షమొందుచున్ఆకసమందు దోచెను శశాంకశతమ్మ ది నేత్రపర్వమై
తేకువ ప్రేయసిన్ గలువ దీపములారిన వేళచాటుగాచేకొని నిచ్చెనొక్కటి విశేష ప్రయత్నముజేయనెంచగాదూకుచు జాగిలమ్మొకటి దొర్కగబట్టగపిక్క , భీతిచేనాకసమందు దోచెను శశాంశతమ్మదినేత్రపర్వమై
శ్రీకర రామనామమది చేరగ నింపుగకర్ణమందునన్ వేకువ ఝామువేళ బహువింతగచెట్టుకొమ్మలన్ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచిత్తాకసమునందు దోచె శశాంక శతమ్మది నేత్రపర్వమై
చిత్తాకసమందు దోచె
దోచెను
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.మూడవ పూరణ రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏
సవరించిన పూరణశ్రీకర రామనామమది చేరగ నింపుగకర్ణమందునన్ వేకువ ఝామువేళ బహువింతగ శింశుప వృక్షశాఖలన్ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచిత్తాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
అందరికీ నమస్సులు🙏దూకుడు చూపుచున్ మనసు దోచు టపాసులు కాల్చ దండిగన్చీకటి చీల్చు దీధితులు శీఘ్రము మారెను వెన్నముద్దలైవేకువ యోర్వలేనటుల వేడుక లంబరమంట నివ్విదిన్ *“ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”**వాణిశ్రీ నైనాల, విజయవాడ*
పండు వెన్నెల విరబూయ వారకాంతప్రియుడి కోసమై వేచెను రేయిబవలుతెరిపి లేకుండ వెదికెను తీక్షణముగఆకసమునందుఁ దోఁచె శశాంకశతము!!
అందరికీ నమస్సులు🙏*నా సరదా పూరణ యత్నం*(కేవలం ఊహించి మాత్రమే)😊*ఉ*చీకటి బోక ముందు పతి చేరెద నింటికి యంటు చెప్పగన్సోకులు జేసుకొన్న సతి చూపులు గుమ్మము ముందుబెట్టియున్రాకనె చెప్పు కాలమున రంకెలు వేయుచు భార్య కొట్టగా*“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”**కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "... నింటి కటంచు జెప్పగన్..." అనండి.
కె.వి.యస్. లక్ష్మి: మహిమ గలిగిన కార్తీక మాసమందు మహిని ఘనముగ శంభుని మందిరముల వెలుగు ఆకాశ దివ్వెల జిలుగులవియె ఆకసమునందు దోచె శశాంక శతము.
ప్రాకట మైన పర్వమని బాలురు వృద్ధులు కోడెకారులున్ చీకటి వేళజేరిరట చేతులనూపుచు నృత్యమాడుచున్ కౌకుబమంతగూడి యట గాల్చ మతాబులు భ్రాంతి కల్గెనే ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
తేటగీతిచీకటి మిగిల్చి సీత కశోక వనినిగోడు వెట్టిన రక్కసి కూలె ననఁగసీత మదివీణ మీటగ శ్రీరఘ పతియాకసమునందుఁ దోచె శశాంక శతముఉత్పలమాలకైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నాకైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్న సీతకైయాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్యఆకసమునందు దోచె శశాంక శతము (లేదా)ఆకసమునందుదోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమైనా పూరణ1) ఆ.వె.గంగ హారతి గనులార గాంచునపుడుదీప కళికా వినిర్గత దీప్తులమరపుణ్య కార్తీక పౌర్ణమి పులకరించెఆకసమునందు దోచె శశాంక శతము2) ఉత్పలమాలనాకము మించిపోవు భవనమ్ముల కాంతులు మిన్నునంటగన్వాకిటఁ విద్యుతుల్ మెఱయు వర్తుల దీప్తులు శోభఁగూర్చగాఁబ్రాకట వైభవమ్ముగను రాముకు సీతకుఁ బెండ్లియౌ తరిన్ఆకసమందుఁ దోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమై ఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'రామునకు' అనడం సాధువు.
దివ్వెలు వెలిగించెడి పర్వదినపు రేయిబాలురందరొ కేతూరి పయికివిసరజువ్వలు నెగసి విరియుట జూచి నంతనాకసమునందుఁ దోఁచె శశాంకశతము
పెళ్ళి సాక్షిగా గూడిరి ప్రేమజంటమల్లెపందిరిమాటున మంచమేసిమగువ కురులను పూలను మగడుజూడఆకసమునందుఁదోచెశశాంకశతము
శాస్త్ర వేత్తలు వదలిన శాట లైటు వెలుగులను జమ్ముచూ చేరి వింత గాగ నాకస ము నందు దోచె శశాంక శతము లనుచు జనతతి వీక్షించె హర్ష మొదవ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...జిమ్ముచును చేరి..." అనండి.
ఇన్నినాళ్ళకునుదయించెనింటియందునందనుడుభువివిరిసెనానందహేలదేవతలదీవెనలఫలంబీ వరమ్ముఆకసమునందుఁ దోఁచె శశాంకశతము
కొద్దిపాటి సవరణలతో...తేటగీతిచీకటి మిగిల్చి సీత కశోకవనినిగోడు వెట్టిన రక్కసి కూలె ననఁగహృదయవీణ మీట కుజకు నినకులుండుయాకసమునందుఁ దోచె శశాంక శతముఉత్పలమాలకైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నాకైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్నఁ గాంతకైయాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
పీకలుద్రెంచువాడునలివేణులవేడుకతార్పుకాడుదాపీకలదాకదాగికనిపించినమేకనుగావుపట్టెడా జీకటిశక్తిపోషకుడుసేనకుజిక్కగదండపెట్టుచో*“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*
సంజ సమయము లందున చక్కగానుహారతు లొసగ తులసికి నతివ లెల్లకాంతులీనుచు నత్తరి ఘనముగా నునాకసము నందు తోచె శశాంక శతము
ఉ: ఏకము జేసిరల్లరిగ యింటిని పిల్లలు గోల సేయుచున్పోకడ నెంచి వారలను పూనుచు జేగొన వేధశాలకున్చేకురువొందె చూడనటు చేరువ చుక్కలు, కాంతి పంజమున్నాకస మందు దోచెను శశాంక, శతమ్మది నేత్ర పర్వమైవై. చంద్రశేఖర్
పీకలవరకు ద్రాగినవెంకికపుడునాకసమునందుదోచెశశాంకశతముమత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టుచంద్రుడొక్కడేగదయుండు చదలునందు
గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ దారలు చెలంగ నింపగు తారల వలె వదనములు వెల్గఁ దోయజ వైరి భంగినాకసము నందుఁ దోఁచె శశాంక శతము దూఁకఁగ మత్స్యకోటు లవి తోఁచఁగఁ దారల పంక్తి భంగినిన్ వీకఁ జెలంగ నంత వినువీధిని నుర్ములు వాన కుర్య నా రాకకు నీటిబొట్టుల పరంపర వెల్గఁగ సందరమ్ము నానాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
అంతరిక్షానికేలనో నాయుధమ్ముతగని నాయకుడొచ్చిన దప్పుదెలియుపెద్ద ముప్పొచ్చు యుద్ధాన పెఠిలుమనుచునాకసమునందుఁదోచు శశాంకశతము
దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలోనాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమైనాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగాజీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్
చీకులు చింతలన్ మరచి సేయగ పండుగ దెచ్చిరందరున్కాకర వత్తులున్ పలురకంబుల వింత టపాసులన్నియున్చీకటి రాత్రి వేళ విరజిమ్ముచు కాంతుల వెల్గె నంతలోఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
నాకలలేఫలించెమదినాట్యముజేసెమయూరమై నమోవాకములర్పణంబిడెద పావనమూర్తికి పార్వతీశుకున్శోకముబాపిమానసము శోభిలజేసిన వేళ హేలగానాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
ఉత్పలమాల:++++++++++==భీకరమైన రోగమిది,భీతిలిపోయెను విశ్వమంతయున్!రేకలు వీడమేలగను,రేపును మాపును రోగతంత్రముల్వేకువలాగవచ్చినది,వేక్సిను వచ్చునటన్న వార్తతోనాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై.
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ఆకలి కాగలేకయిక హ్లాదము నొందుచు నర్ధరాత్రినిన్
పీకుచు కోడి మాంసమును బీరును గ్రోలిన మైకమందునన్
కూకటపల్లి వీధినిక గుట్టుగ వీరుడు పైకిచూడగా
నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....
మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిధర్మపరుడైనరాముఁడుధరణియందు
రిప్లయితొలగించండిరాజ్యమేలంగప్రజలునురాగమంద
సూర్యవంశంబుశోభిల్లెసూనుఁజూచి
ఆకసమునందుఁదోచెశశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమహిమ గలిగిన కార్తీక మాస మందు
దీప్తి చెందెడి యాకాశ దివ్వె లన్ని
అనగిపెనగి మనలకెల్ల నబ్బురముగ
ఆకసమునందు దోచె శశాంక శతము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వాకిటి బైటకున్ జనుచు ప్రక్కను గేహపు సుందరాంగినిన్
తేకువ మీర మెచ్చగను తీయుచు భామయె రోలులోననున్
రోకలి బుఱ్ఱమీదనిడ రోమియొ తూలుచు పైకిచూడగా
నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై....
🙏🙏
తొలగించండిచెప్పుతో కొడితే చుక్కలు కనిపించేవి... పాపం! రోకలిబండ కదా... శశాంకశతమేం కర్మ! సహస్రమే కనిపిస్తుంది. హాస్యస్ఫోరకమైన పూరణ. అభినందనలు.
తొలగించండి🙏😊
తొలగించండితాకనెమానవుండుతనదాపునచంద్రునివన్నెచిన్నెలన్
రిప్లయితొలగించండిరాకెటుపంపగానచటరాకకుపోకకుదారిచూచెగా
ప్రాకగమేధతోడుతనుప్రాభవమందెనుచల్లగానటన్
ఆకసమందుఁదోచెనుశశాంకశతమ్మదినేత్రపర్వమై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
వేకువ జామునందు నృపవీథినినేగగ, విద్యుదుజ్జ్వలత్
ప్రాకట దీపికాచయము రంజిలుచుండెను స్తంభపంక్తిపై,
శ్రీకరమౌ శశాంకతతి చీకటి చీల్చుచునున్నరీతి., నా
యాకసమందు దోచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది.
తొలగించండి
రిప్లయితొలగించండిజాల్రా :)
సఖి! కవీశ్వరులకిదేను సమయమాయె!
రాత్రి తొమ్మిది! బ్లాగ్విహారమ్ము లలర
యాకసమునందుఁ దోఁచె శశాంకశతము
శంకరాభరణ మనెడు సైరిభమున
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రియసఖుడు జన్మ దినమంచు పిలిచె నంచు
రిప్లయితొలగించండిసంబరముతోడ నటకేగి సరదు మించి
సుప్రతిభ గ్రోలి తూలుచున్ జూచినంత
నాకసమునందుఁ దోఁచె శశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివీకను శంకరున్ గొలిచి పెంపుగ కార్తిక మాసమందునన్
జోకగ దేవళమ్మునను సొంపుగ దీపములుంచి నంతటన్
పైకని నిల్పుచున్ ద్యుతిని ప్రాకగజేయ నపూర్వమౌనటుల్
నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిఆకసమందు దోచెను శ
శాంకశతమ్మది నేత్రపర్వమై
( " ఆజాద్ హింద్ ఫౌజు " నిర్మించిన సుభాసుచంద్రుడు భారతీయులకు దాస్యాంధకారాన్ని బాపే నూర్గురు చంద్రులుగా కనిపించాడు )
ఉత్పలమాల
------------
చేకొని మాతృదేశమున
చేరిన యాంగ్లుల పారద్రోలగా
వాకొనలేని పౌరుషపు
భారతసైన్యము " హిందుఫౌజు " నే
యేకత చంద్రబోసు " జయ
హిం " దని స్థాపన జేసి నిల్వగా
నాకసమందు దోచెను శ
శాంకశతమ్మది నేత్రపర్వమై .
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివీకను గాధిరాజసుతు వెంట జరించుచు కానయందునన్
రిప్లయితొలగించండితాకగ రామపాదమది ధన్యతనొందెను రాయినాతియై
నాకము నుండుదేవతలు నాట్యము సల్పగ హర్షమొందుచున్
ఆకసమందు దోచెను శశాంకశతమ్మ ది నేత్రపర్వమై
తేకువ ప్రేయసిన్ గలువ దీపములారిన వేళచాటుగా
తొలగించండిచేకొని నిచ్చెనొక్కటి విశేష ప్రయత్నము
జేయనెంచగా
దూకుచు జాగిలమ్మొకటి దొర్కగబట్టగ
పిక్క , భీతిచే
నాకసమందు దోచెను శశాంశతమ్మది
నేత్రపర్వమై
శ్రీకర రామనామమది చేరగ నింపుగ
తొలగించండికర్ణమందునన్
వేకువ ఝామువేళ బహువింతగ
చెట్టుకొమ్మలన్
ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచి
త్తాకసమునందు దోచె శశాంక శతమ్మది నేత్రపర్వమై
చిత్తాకసమందు దోచె
తొలగించండిదోచెను
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమూడవ పూరణ రెండవ పాదంలో గణభంగం. సవరించండి.
ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏
తొలగించండిసవరించిన పూరణ
తొలగించండిశ్రీకర రామనామమది చేరగ నింపుగ
కర్ణమందునన్
వేకువ ఝామువేళ బహువింతగ శింశుప వృక్షశాఖలన్
ప్రాకట రామగాథనట పాడగ పావని, సాధ్వి సీతచి
త్తాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
అందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండిదూకుడు చూపుచున్ మనసు దోచు టపాసులు కాల్చ దండిగన్
చీకటి చీల్చు దీధితులు శీఘ్రము మారెను వెన్నముద్దలై
వేకువ యోర్వలేనటుల వేడుక లంబరమంట నివ్విదిన్
*“ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*
*వాణిశ్రీ నైనాల, విజయవాడ*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపండు వెన్నెల విరబూయ వారకాంత
రిప్లయితొలగించండిప్రియుడి కోసమై వేచెను రేయిబవలు
తెరిపి లేకుండ వెదికెను తీక్షణముగ
ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు🙏
రిప్లయితొలగించండి*నా సరదా పూరణ యత్నం*
(కేవలం ఊహించి మాత్రమే)😊
*ఉ*
చీకటి బోక ముందు పతి చేరెద నింటికి యంటు చెప్పగన్
సోకులు జేసుకొన్న సతి చూపులు గుమ్మము ముందుబెట్టియున్
రాకనె చెప్పు కాలమున రంకెలు వేయుచు భార్య కొట్టగా
*“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*
*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"... నింటి కటంచు జెప్పగన్..." అనండి.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిమహిమ గలిగిన కార్తీక మాసమందు
మహిని ఘనముగ శంభుని మందిరముల
వెలుగు ఆకాశ దివ్వెల జిలుగులవియె
ఆకసమునందు దోచె శశాంక శతము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాకట మైన పర్వమని బాలురు వృద్ధులు కోడెకారులున్
రిప్లయితొలగించండిచీకటి వేళజేరిరట చేతులనూపుచు నృత్యమాడుచున్
కౌకుబమంతగూడి యట గాల్చ మతాబులు భ్రాంతి కల్గెనే
ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిచీకటి మిగిల్చి సీత కశోక వనిని
గోడు వెట్టిన రక్కసి కూలె ననఁగ
సీత మదివీణ మీటగ శ్రీరఘ పతి
యాకసమునందుఁ దోచె శశాంక శతము
ఉత్పలమాల
కైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్
జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నా
కైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్న సీతకై
యాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈనాటి శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండిఆకసమునందు దోచె శశాంక శతము
(లేదా)
ఆకసమునందుదోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమై
నా పూరణ
1) ఆ.వె.
గంగ హారతి గనులార గాంచునపుడు
దీప కళికా వినిర్గత దీప్తులమర
పుణ్య కార్తీక పౌర్ణమి పులకరించె
ఆకసమునందు దోచె శశాంక శతము
2) ఉత్పలమాల
నాకము మించిపోవు భవనమ్ముల కాంతులు మిన్నునంటగన్
వాకిటఁ విద్యుతుల్ మెఱయు వర్తుల దీప్తులు శోభఁగూర్చగాఁ
బ్రాకట వైభవమ్ముగను రాముకు సీతకుఁ బెండ్లియౌ తరిన్
ఆకసమందుఁ దోచెను శశాంక శతమ్మది నేత్ర పర్వమై
ఆదిభట్ల సత్యనారాయణ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'రామునకు' అనడం సాధువు.
దివ్వెలు వెలిగించెడి పర్వదినపు రేయి
రిప్లయితొలగించండిబాలురందరొ కేతూరి పయికివిసర
జువ్వలు నెగసి విరియుట జూచి నంత
నాకసమునందుఁ దోఁచె శశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపెళ్ళి సాక్షిగా గూడిరి ప్రేమజంట
రిప్లయితొలగించండిమల్లెపందిరిమాటున మంచమేసి
మగువ కురులను పూలను మగడుజూడ
ఆకసమునందుఁదోచెశశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాస్త్ర వేత్తలు వదలిన శాట లైటు
రిప్లయితొలగించండివెలుగులను జమ్ముచూ చేరి వింత గాగ
నాకస ము నందు దోచె శశాంక శతము
లనుచు జనతతి వీక్షించె హర్ష మొదవ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...జిమ్ముచును చేరి..." అనండి.
ఇన్నినాళ్ళకునుదయించెనింటియందు
రిప్లయితొలగించండినందనుడుభువివిరిసెనానందహేల
దేవతలదీవెనలఫలంబీ వరమ్ము
ఆకసమునందుఁ దోఁచె శశాంకశతము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొద్దిపాటి సవరణలతో...
రిప్లయితొలగించండితేటగీతి
చీకటి మిగిల్చి సీత కశోకవనిని
గోడు వెట్టిన రక్కసి కూలె ననఁగ
హృదయవీణ మీట కుజకు నినకులుండు
యాకసమునందుఁ దోచె శశాంక శతము
ఉత్పలమాల
కైక మనోభిలాష సుర కామనతో వనవాసమేర్పడన్
జీకటిఁ జేసి సీత మది చేకొని లంకకు క్షోభఁ బెట్ట నా
కైకసి సూనునిన్ దునిమె కాంతుడు రాముఁడటన్నఁ గాంతకై
యాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
పీకలుద్రెంచువాడునలివేణులవేడుకతార్పుకాడుదా
రిప్లయితొలగించండిపీకలదాకదాగికనిపించినమేకనుగావుపట్టెడా
జీకటిశక్తిపోషకుడుసేనకుజిక్కగదండపెట్టుచో
*“నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై”*
సంజ సమయము లందున చక్కగాను
రిప్లయితొలగించండిహారతు లొసగ తులసికి నతివ లెల్ల
కాంతులీనుచు నత్తరి ఘనముగా ను
నాకసము నందు తోచె శశాంక శతము
ఉ:
రిప్లయితొలగించండిఏకము జేసిరల్లరిగ యింటిని పిల్లలు గోల సేయుచున్
పోకడ నెంచి వారలను పూనుచు జేగొన వేధశాలకున్
చేకురువొందె చూడనటు చేరువ చుక్కలు, కాంతి పంజము
న్నాకస మందు దోచెను శశాంక, శతమ్మది నేత్ర పర్వమై
వై. చంద్రశేఖర్
పీకలవరకు ద్రాగినవెంకికపుడు
రిప్లయితొలగించండినాకసమునందుదోచెశశాంకశతము
మత్తుగలుగుట నట్లుగామభ్యపెట్టు
చంద్రుడొక్కడేగదయుండు చదలునందు
గాన వేదిక కాఁగ నాకాశ మచటఁ
రిప్లయితొలగించండిదారలు చెలంగ నింపగు తారల వలె
వదనములు వెల్గఁ దోయజ వైరి భంగి
నాకసము నందుఁ దోఁచె శశాంక శతము
దూఁకఁగ మత్స్యకోటు లవి తోఁచఁగఁ దారల పంక్తి భంగినిన్
వీకఁ జెలంగ నంత వినువీధిని నుర్ములు వాన కుర్య నా
రాకకు నీటిబొట్టుల పరంపర వెల్గఁగ సందరమ్ము నా
నాకసమందుఁ దోఁచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై
అంతరిక్షానికేలనో నాయుధమ్ము
రిప్లయితొలగించండితగని నాయకుడొచ్చిన దప్పుదెలియు
పెద్ద ముప్పొచ్చు యుద్ధాన పెఠిలుమనుచు
నాకసమునందుఁదోచు శశాంకశతము
దూకగజేపలొక్కుదుట తోరపునీటనురాత్రివేళలో
రిప్లయితొలగించండినాకసమందుదోచెను శశాంకశతమ్మదినేత్రపర్వమై
నాకపుచంద్రుడయ్యెడను నవ్వులమోముగ గానిపించగా
జీకటియంతయున్ దొలగిచిక్కెనుదెల్లటికాంతితోడుతన్
చీకులు చింతలన్ మరచి సేయగ పండుగ దెచ్చిరందరున్
రిప్లయితొలగించండికాకర వత్తులున్ పలురకంబుల వింత టపాసులన్నియున్
చీకటి రాత్రి వేళ విరజిమ్ముచు కాంతుల వెల్గె నంతలో
ఆకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
నాకలలేఫలించెమదినాట్యముజేసెమయూరమై నమో
రిప్లయితొలగించండివాకములర్పణంబిడెద పావనమూర్తికి పార్వతీశుకున్
శోకముబాపిమానసము శోభిలజేసిన వేళ హేలగా
నాకసమందుఁ దోఁచెను శశాంకశతమ్మది నేత్రపర్వమై
ఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++++==
భీకరమైన రోగమిది,భీతిలిపోయెను విశ్వమంతయున్!
రేకలు వీడమేలగను,రేపును మాపును రోగతంత్రముల్
వేకువలాగవచ్చినది,వేక్సిను వచ్చునటన్న వార్తతో
నాకసమందు దోచెను శశాంక శతమ్మది నేత్రపర్వమై.