16, నవంబర్ 2020, సోమవారం

సమస్య - 3546

 17-11-2020 (మంగళవారం)

కవిమిత్రులారా,

[యమద్వితీయ (భగినీహస్త భోజనం) పర్వదిన శుభాకాంక్షలు!]

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అన్నా యను పిలుపును విని యడలితి నయ్యో”

(లేదా…)

“అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్”

89 కామెంట్‌లు:

 1. అందరికీ నమస్సులు🙏🙏
  నా పూరణ ప్రయత్నం..

  *కం*

  నిన్నను మొన్నను ప్రేమను
  చిన్నగ నే దెల్పుటకని సిద్ధము కాగా
  వెన్నున వణుకును బెట్టెడి
  *“యన్నా యను పిలుపును విని యడలితి నయ్యో”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏🙏

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  పన్నుగ శంకరాభరణ ప్రాంగణ మందున మెప్పులొందుచున్
  మిన్నగ పద్యముల్ పరచి మెండుగ వ్రాయుచు గ్రంథరాజముల్
  మన్నన చేతురమ్మనుచు మంగళ హారతు లిచ్చి నేడు తా
  నన్న! యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్...

  😊

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్లేటు ఫిరాయించితిరా ఆర్యా!
   దీదీ యేమాయెనో పాపం.
   😊
   🙏🏻🙏🏻

   తొలగించండి

  2. కొంత ఆసరా :)


   మిన్నగ పెంచితి గడ్డము
   నన్నెవరిక గుర్తుగాన నవఘళ మగునం
   చెన్నంగా దీది నరేం
   ద్రన్నా యను పిలుపును విని యడలితి నయ్యో


   జిలేబి

   తొలగించండి
  3. శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
   ****
   జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 3. మరో పూరణ యత్నం🙏

  *కం||*

  అన్నులు మిన్నులు గానక
  నున్నవి నా సొమ్ములనుచు నూడ్చిన భగినీ,
  చిన్నది, నా తోడ బలుకు
  *“నన్నా యను పిలుపును విని యడలితి నయ్యో”*

  *కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
  🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భగినీ అని దీర్ఘాంతంగా సంబోధనలోనో, సమాస పూర్వపదం గానో ప్రయోగించాలి. మీరిక్కడ ప్రథమార్థంలో ప్రయోగించారు. "... నూడ్చె భగిని యా చిన్నది..." అనండి.

   తొలగించండి
 4. శ్రీ ప్రభాకరశాస్త్రి గారు మన్నింతురు గాక! 🙏😊

  ఎన్నొ సమస్యలన్ ముదమునేర్పడ పూరణలింపు జేసి, మా
  మన్నన పొందినారు! కవిమాన్య! ప్రభాకరశాస్త్రి! యింకపై
  పన్నుగ చేయగాగలరు భవ్యవధానము రండు రండు రం..
  డన్న! యటంచు బిల్వగనె యయ్యొ! భయంబును బొంది పారితిన్!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి

 5. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పన్నుగ నావి కూలగను పండ్లవి ముప్పది రెండు పూర్తిగన్
  కన్నులు మూసి యాదటను గారబు రీతిని భోజనానికిన్
  చెన్నుగ కాల్చి గారెలను చేరువ నీయక ముద్గరమ్ము తా
  నన్న! యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్...

  రిప్లయితొలగించండి
 6. కనగనునీచుఁడుతరుమగ
  కనలుచుకాంతయుపిలువగకావగతననే
  వినగనినాపదనరసితి
  అన్నాయనుపిలుపునువినియడలితినయ్యో

  రిప్లయితొలగించండి
 7. ఎన్నడు బిలువని చెల్లెలు
  మిన్నగ కట్నమ్ము గోరి మెదుకుకు తానే
  కన్నుల యాశలు నిండగ
  నన్నా యను పిలుపువిని యడలితి నయ్యో.

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అన్నయనగ భయముండిన
  చిన్నన్నను నేను చెల్లి చెంతకు చనుచున్
  చిన్నగ గొడవ చలుపు వడి
  నన్నా యను పిలుపువిని యడలితి నయ్యో!

  రిప్లయితొలగించండి
 9. కన్నియ యందచందముల గాంచిన తోడనె యంతరంగమే
  తిన్నగ ప్రేమరాగములు తీయుచు నుండగ భీతివీడి నే
  నన్నుల మిన్న జేరి యట హార్దము చెప్పెడు వేళ నామెయే
  యన్నయటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్.

  రిప్లయితొలగించండి
 10. ఎన్నడు బిలువని భగినియు
  అన్నా యను పిలుపును విని- యడలితి నయ్యో
  "చిన్నా" యనిబిల్చెడి నా
  కన్నులు చెమరించె చెల్లి కష్టము జూడన్

  రిప్లయితొలగించండి
 11. ౧.
  వెన్నున వణుకుయె బుట్టెను
  అన్నా యను పిలుపును విని యడలితి నయ్యో
  మిన్నగ నుండుటరాదే
  కన్నులమిరుమిట్లు గొలుపు కట్నములేదే!!

  ౨.
  పన్నగభూషణా వినుము పామరులెప్పుడు ప్రేమబంచుచున్
  అన్నలుతమ్ములున్ కలిసి యాడరె చెల్లియనంగనాడిటన్
  యెన్నగ వేనవేలుగను యెంతయు నాస్తులు లేనివాడనై
  అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్!!

  ౩.
  ఎన్నని వ్రాయపద్యముల నెంచగ ప్రేమ కవిత్వమున్ సదా
  పెన్నును బట్టితిన్ పనుల వీడుచు వెన్కకు దిర్గిచూడకన్
  యెన్నగ లేకనుంటినయ యేమనిజెప్పుదు కన్నెలందరున్
  అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   చేయకూడని చోట యడాగమం చేస్తున్నారు. 'వణుకు+ఎ, ఇటన్+ఎన్నగ, చూడకన్+ఎన్నగ' అన్నచోట్ల యడాగమం రాదు.

   తొలగించండి
  2. న కారు,య కారముల వద్దే నాసంధిగ్ధమంతా....

   ఇకముందిలాంటివి జరుగకుండా ఉండే ప్రయత్నం చేస్తాను.
   మీ ఓపిక కు మిక్కిలి ధన్యవాదములు!

   తొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అన్న యనంగ భీతిలెడి నాలుడి గల్గిన నేనసూయతో
  చిన్నదియైన సోదరిని చిన్నగ గిల్లుచు దు:ఖపెట్టుచున్
  తెన్నుగగాని నల్లరిని త్రిమ్మరుచుండగ చెల్లెలేడ్చుచున్
  అన్నయటంచు బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భీతిలెడి నాలుడి'?

   తొలగించండి
  2. గురువుగారికి నమస్సులు. ఆలుడి= స్వభావము అన్న అర్థంలో గ్రహించి 'భయమందెడి స్వభావగల ' అనే భావంతో వ్రాసాను. తప్పయితే మారుస్తాను.

   తొలగించండి
 13. కన్నులకింపగు కన్నెను
  వెన్నంటి చనుచు సలుపగ వెకిలిక్రియలన్
  చిన్నది బిల్వగ పోలీ
  సన్నాయను పిలుపునువిని యడలితి
  నయ్యో

  పెద్దన్న మోదీగారి ఉవాచ

  పన్నుగ గట్టెదన్ గనుడు పట్టణమొక్కటి స్వర్గధామమే
  చెన్నుగ భూములీయనిక జేసెద వృద్ధిని పెక్కురెట్లుగన్
  తిన్నగ మూడుచోటులను దీరుగ గట్టెద రాజధానులన్
  సన్నుతిజేయగా ప్రజలు చక్కగ పంచెద వృద్ధిలాభమున్
  భిన్నపు వాదనల్వినుచు పెద్దరికంబున తీర్పరించుమో
  యన్న! యటంచుబిల్వగనె యయ్యె భయంబునుబొంది పారితిన్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి వూరణలో
   చిన్నది పిల్చిన పోలీసన్నా గా చదువ ప్రార్ధన!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'వెకిలి పనులనే' అనండి.

   తొలగించండి
  3. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను! 🙏🙏🙏

   తొలగించండి
  4. కన్నులకింపగు కన్నెను
   వెన్నంటి చనుచు సలుపగ వెకిలి పనులనే
   చిన్నది బిల్చిన పోలీ
   సన్నాయను పిలుపునువిని యడలితి
   నయ్యో

   తొలగించండి
 14. ఎన్ని దినములు గడిచెనో
  యన్నా యను పిలుపును విని ; యడలితి నయ్యో
  యన్నము తినమన నాపై
  కన్నెఱ్ఱగ జేసి జూడ కలవరపడుచున్

  రిప్లయితొలగించండి
 15. కన్నుల కాంతి పుంజములు గ్రాలెడి జవ్వని కానుపింపగా
  యెన్నియొ కష్టనష్టముల కేను కృశింపక ప్రేమ పెంచితిన్
  వన్నెలు చిన్నెలున్ చిలికి వంచనఁజేసె లతాంగి!హా విధీ!
  అన్న యటంచుఁబిల్వగనె యయ్యొ భయంబునుఁబొంది పాఱితిన్.

  రిప్లయితొలగించండి

 16. నా పూరణ. ఉ..మా.
  **** *** ***

  అన్నులమిన్నయౌ లలన యబ్బుర వన్నెల గాంచ...హృత్తునన్

  బన్నిన ప్రేమ హర్షమున...వారిజనేత్రికిఁ దెల్పు నంతలోన్...

  గన్నియ యేగి మా యిలుకిఁ గట్టగ రక్షణ బంధమే తగన్...

  "యన్న" యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్”

  ( పన్నిన..కలిగిన. రక్షణ బంధము...రాఖీ )


  -- ఆకుల శాంతి భూషణ్
  వనపర్తి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అబ్బురపు వన్నెల' అని ఉండాలి.

   తొలగించండి


 17. మొన్నటి విందరగకమును
  పన్నా యను పిలుపును విని యడలితి నయ్యో
  చెన్నుగ యమద్వితీయపు
  టన్నమునకు బిలిచె భగిని టంచనుగ కదా!  జిలేబి

  రిప్లయితొలగించండి


 18. ఏమి వడ్డిమచునో ఈ‌మారు !


  మునుపటి యేడువలెను గ్ర
  క్కన " అన్న" యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయం
  బును బొంది పాఱితిన్ క్షణ
  మున హస్తపుటన్నపు స్మరము గుఱుతు రాగా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. చెన్నై బావమఱది పెద
  నాన్నకు వదిన పినతల్లి నందన పతికిన్
  అన్నయ కూతురు తను నను
  యన్నా యను పిలుపును విని యడలితి నయ్యో౹౹

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నను(న్)+అన్నా=నను నన్నా" అవుతుంది. యడాగమం రాదు.

   తొలగించండి
 20. సమస్య :
  అన్న యటంచు బిల్వగనె
  యయ్యొ భయంబును బొంది పారితిన్

  ( " హరిజన్ " పత్రిక నడిపి చింత
  దీర్చి చేరదీసిన గాంధీజీ ప్రేమకు
  పరవశించిన హరిజనుడు )
  ఉత్పలమాల
  ..................

  తిన్నగ రామకీర్తనను
  తీరుగ బాడెడి గాంధితాతయే !
  నన్నును జేరదీసి మరి
  నా కయి పత్రిక నచ్చువేసెనే !
  యెన్నగ గీర్తిశాలి ; జగ
  మెంతయొ చుట్టిన శాంతమూర్తి ; న
  " న్నన్న " యటంచు బిల్వగనె
  యయ్యొ ! భయంబును బొంది పారితిన్ .

  రిప్లయితొలగించండి
 21. రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విజేత+ఐ' అన్నపుడు యడాగమం వస్తుంది. అయినా అటువంటి సోదరి అన్నా అని పిలిస్తే భయమెందుకు?

   తొలగించండి
 22. 1.ఒక అభాగ్యుడి ఆవేదన..

  కందం
  మొన్ననె మువ్వురి సారెలు
  నిన్ననె చినచెల్లి నృత్య నీరాజనమై
  తన్నుకు చచ్చెడు దిగులున
  నన్నా! యని పిలుపును విని యడలితి నయ్మో!

  2.ఒక ఇల్లాలి విలాపం....

  ఉత్పలమాల
  మొన్ననె యాడబిడ్డలకు ముగ్గురి కిచ్చెను చీరసారెలన్
  నిన్ననె చిన్న దానికని నృత్యము నేర్పఁగ ధారవోసెఁ దా
  నెన్నడు సంతుకై మగఁడు నేమి మిగల్చని చింత నింతలో
  నన్న! యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్

  రిప్లయితొలగించండి
 23. నిన్ననె చీరలు సారెలు
  మొన్ననె పండుగ మొదలవ మొక్కుచు కాన్కల్
  దన్నుకు పోయిన చెల్లిలి
  అన్నా యను పిలుపును విని యడలితి నయ్యో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🙏🏻 సవరించి
   కం.
   ఎన్నో చీరలు సారెలు
   మొన్ననె పండుగ మొదలవ మొక్కుచు కాన్కల్
   తన్నుకు పోయిన చెల్లెలి
   అన్నా యను పిలుపును విని యడలితి నయ్యో

   తొలగించండి
 24. ✍️ మల్లి సిరిపురం శ్రీశైలం.
  కం//
  పన్నులు గట్టక దిరుగుచు
  చిన్నగ దాగుండగ, నొక చింపిరి కిపుడే !
  కన్నుల కగుపించగ, వెం
  కన్నా యను పిలుపును విని యడలితి నయ్యో !!

  రిప్లయితొలగించండి
 25. కన్నులు గానకుండ సరి కావరమున్ ముసరంగ వేగమే
  మిన్నులు తాక వాహనము మీటరు దాటగ పోలిసుల్లదే
  చెన్నుగ నిల్పి తన్నగను చేరువలో నొక బంధువుండ తా
  నన్న యటంచు బిల్వగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయక్లిష్టత ఉన్నది.

   తొలగించండి
 26. మైలవరపు వారి పూరణ

  *అన్నయ్య*....

  ఎన్నని చెప్పనమ్మ! పొరుగిండ్లను దూరుచు మ్రుచ్చిలించి పా..
  ల్వెన్నల., దాను మెక్కి తినిపించును సంగటికాండ్రకున్ దమిన్.,
  మన్నును నిప్పుడే తినెను, మాకును బెట్టగ రమ్ము రమ్ము ర..
  మ్మన్న! యటంచు బిల్వగనె యయ్యొ! భయంబును బొంది పారితిన్!!

  *కన్నయ్య*

  నన్నొక దొంగగా మలచి., నాపయి కోపమునెచ్చ నీకు నే
  మన్నును దింటినంచు పలుమాటలు చెప్పెను! నమ్మకమ్మ! నీ..
  కన్ని యసత్యముల్ నుడివె! నల్లరి జేయగ నేను రాను రా...
  న్నన్న! యటంచు., బిల్వగనె యయ్యొ! భయంబును బొంది పారితిన్!!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 27. కన్నయచిన్నవాడుపొరుగన్నదెఱుంగడమాయికుండున
  న్నెన్నడువీడడంగనలనెన్నడుగానడుముద్దుముద్దుగా
  తిన్నగమాటలాడుసుదతీనవనీతముమ్రుచ్చిలంగనా
  చిన్ననికేమితక్కువవచించుటబాడియెచో‌రుడంచుజూ
  *“డన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్”*
  మన్నునుమెక్కలేదుయదుమాతకువిశ్వముజూపెవాడెపో
  క్రన్నననిచ్చెవస్త్రములుకౌరవనాధుడువల్వలూడ్చనా
  పన్నకుచేలుజేర్చెయొడిభక్తులబాధలనూడ్చెనార్తితో
  *“నన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్”*

  రిప్లయితొలగించండి
 28. ఎన్నియొ రోజులయ్యెనని యిప్పుడు చెల్లెలి యింటికేగగన్
  అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్
  నెన్నియొ పిండివంటలతి యిమ్ముగ సిద్ధము జేసియుండగా
  నన్నిటినిం భుజింపుమని యారడి పెట్టుట నెంచగా మదిన్

  రిప్లయితొలగించండి
 29. నాన్నా పదవిని కోరిన

  చిన్నారి గుహుడు గొడవను చేయుచు కినుకన్


  మన్ననతో నీకిడలే

  నన్నా యను పిలుపును విని యడలితి నయ్యో


  గణములకు ఆధిపత్యం కోరి‌ కుమార స్వామి కోపముతో నీవు మరుగుజ్జు వాడివి మందగమనుడవు పెద్దవాడివి అయినా నీవు అనర్హుడవి నీకు ఈ పదవి ఇవ్వడానికి నేను సిద్ద ము కాదు అని వినాయకుని తో అన్నాడు అని శివుని తో మొర పెట్టుకున్న సందర్భంలో

  రిప్లయితొలగించండి
 30. ఎన్నాళ్ళాయెను చెల్లీ
  అన్నా యను పిలుపును విని; యడలితి నయ్యో
  నిన్నా కరోన బట్టగ,
  మిన్నాగది తొలఁగ నేడు మీరెను ముదమే

  రిప్లయితొలగించండి
 31. నిన్నున్ మనసారగ నే 
  మన్నన్ ప్రేమించితిగద యది తలచకనే  
  నన్నున్ పిలచుట తగునా?
  “అన్నా యను పిలుపును విని యడలితి నయ్యో” 

  రిప్లయితొలగించండి
 32. కం.
  పన్నుల భారమునోపక
  కన్నా యనివేడ వినగ కరివరదుడు నే
  నున్నానని రాడే నా
  యన్నా యను పిలుపును విని యడలిననేమో !!

  (పన్నుల బాధ పైవాడు కూడా తీర్చలేడని భావం)

  రిప్లయితొలగించండి
 33. రిప్లయిలు
  1. ఉ:

   పిన్నగు నాటి నుండి కనిపెంచిన తల్లిని మించి నెమ్మదిన్
   మన్నన జేయుచున్ భగిని మంచికి మారగు రూప మెంచగన్
   ఖిన్నత నొంద కుండగను కిన్క వహించుట తాళలేక తా
   నన్న యటంచు బిల్వగనె యయ్యె భయంబును బొంది బారితిన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 34. అన్నుల మిన్న దాననుచు నామెను వీడక వెంట దిర్గుచున్
  చిన్నగ జేరువై దనకు జెప్పగ జూచితి ప్రేమ పాఠముల్
  తిన్నగ నుండకున్న నిక దిక్కను దీర్చును రక్షకుండు మా
  అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్ 🙂

  రిప్లయితొలగించండి
 35. ఎన్నకహృదయము భ్రమతను
  చిన్నగనేజేరిదరికి చిలిపిగదనకున్
  మిన్నగుబ్రేమనుదెలుపగ
  అన్నాయనుపిలుపునువినియడలితినయ్యో

  రిప్లయితొలగించండి
 36. ఎన్నోమారులువానికి
  నెన్నెన్నోవేలరూకలిచ్చితిఋణమున్
  నన్నాతడు ప్రియమారగ
  నన్నా యను పిలుపును విని యడలితి నయ్యో

  రిప్లయితొలగించండి
 37. ఎన్నెన్ని లేవు కొంపలె
  యెన్ని మన గృహమును వేసి యింటికి నయ్యో
  కన్నము దొంగలు వచ్చిరి
  యన్నా యను పిలుపును విని యడలితి నయ్యో


  మిన్నును దాఁకెఁ గాంచనము మేడల నమ్మినఁ గాని నేఁడిలం
  గొన్న విధమ్ము గాంచ మయొ గొంతెమ కోరిక నిట్లు కోరఁగాఁ
  జెన్నుగ స్వర్ణ మేఖలను శీఘ్రమ కొంచును రాఁ గదన్న యీ
  యన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్

  రిప్లయితొలగించండి
 38. ఎన్ని విధంబు ల సాయము
  గ్రన్నన జేసినను గాని కావలె ననుచున్
  తన్ను వెదుకుచు ను వఛ్చియు
  యన్నా
  యని పిలువగను విని యడ లితి నయ్యో

  రిప్లయితొలగించండి
 39. చిన్నతనంబునందునొకచిన్నదినామదికొల్లగొట్టి నా
  కన్నులలోననిండినది కామునియారడి కందళించ నా
  యన్నులమిన్నచెంగలికినార్తిగజేరగ నామె బిట్టుగా
  అన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్

  రిప్లయితొలగించండి
 40. అన్నం యెలాగూ నచ్చదు కనీసం కవి
  తాన్నమైనా రుచిస్తుందేమో ననుకున్నా .... గానీ 😩😩😆😆

  అన్నము గాదీదినమున
  చెన్నుగ (దినిపింతు) వినిపింతు
  గవిత చెవికింపుగ నే
  సన్నుతి జేయగ రాగదె
  యన్నాయని పిలుపునువిని యడలితినయ్యో!

  రిప్లయితొలగించండి
 41. మిన్నగనిష్టమౌ సఖికిమెండగుబ్రేమనుభూరిదెల్పగా
  నన్నయటంచుబిల్వగనెయయ్యొభయంబునుబొందిపాఱితిన్
  ఎన్నడునిట్లుగాదలప యిష్టములేదనిచెప్పగాననెన్
  బన్నముజెందబోకుమ,వివాహముజర్గునునాకుమాపునన్

  రిప్లయితొలగించండి
 42. ఎన్నగ నన్నితావులకు నేగి కరోన శ్రమమ్ము గూర్చెడిన్
  చిన్నగ దగ్గినన్ గృహము చేరగ నీయరు భీతితోడుతన్
  వెన్నుని పూజలన్ సలిపి ప్రీతిగఁ జెల్లెలు తిండిఁ గ్రోల ర
  మ్మన్న యటంచుఁ బిల్వఁగనె యయ్యొ భయంబును బొంది పాఱితిన్

  రిప్లయితొలగించండి