29, నవంబర్ 2020, ఆదివారం

సమస్య - 3559

30-11-2020 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్”

(లేదా…)

“తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్”

87 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  దినమున్ రాతిరి కోరగా మురియుచున్ దేవుండ్లనున్ ప్రీతినిన్
  మనముప్పొంగగ కూతుకున్ ప్రియముగా;...మాసమ్ములే నిండగా
  కనుమా శంకర! చిన్న పాపఁగనగన్ గారాబుగా తల్లి తాన్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్...

  రిప్లయితొలగించండి
 2. కనవచ్చు "అన్నదమ్ముల
  అనుబంధము" చిత్రమందు యన్టీయార్ త
  మ్మునిగాను బాలకృష్ణను
  తనయుఁడె తన తమ్ముడయ్యె తప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 3. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మనమున దలచెను గణపతి
  మనసిజుడై వఱలు చుండు మన్మధ మరుడే
  తన పెదనాయన హరికిన్
  తనయుడె తన తమ్ముడయ్యె దప్పెట్టులగున్?

  రిప్లయితొలగించండి
 4. కందం
  ఇనవంశోత్తమ రాముఁడు
  వనవాసమ్మేగు వేళ పట్టము గొనమం
  చును భరతుడు, పినతల్లికి
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్?

  మత్తేభవిక్రీడితము
  ఇనవంశోత్తమ రామచంద్రుఁడట తానింతేని శోకించఁడై
  వనవాసమ్మున కేగుదెంచసతితో పట్టమ్ముఁ జేపట్టనెన్
  దనతల్లిన్ బలు నిందలన్ భరతుడున్ దండించి, పిన్నమ్మకున్
  దనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన? యొప్పే యగున్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హస్తినలో శ్రీకృష్ణభగవానుని సమర్థించే పెద్దల అంతరంగం....

   మత్తేభవిక్రీడితము
   పెనఁగుల్ వద్దని నందనందనుడుఁ దా ప్రేమారఁగన్ బల్కినన్
   వినడేమాత్రము నంబికేయుఁడహొహో! విజ్ఞానమేమయ్యొనో?
   పనుచన్ న్యాయము పాండునందనులకున్! వ్యాసాత్ముఁడంబాలికా
   తనయుండే తన తమ్ముఁడయ్యెఁ ననఁగాఁ దప్పౌన? యొప్పే యగున్!

   తొలగించండి
  2. కొద్దిపాటి సవరణతో కందం

   ఇనవంశోత్తమ రాముఁడు
   వనవాసమ్మేగు వేళ పట్టము గొనమం
   చనె! భరతుడు, పినతల్లికి
   తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్?

   తొలగించండి
  3. మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 5. కనగాభూమికిపుత్రుఁడు
  అనయముతమ్ముఁడుజనకజకవనికిసుతగా
  వినయకువిష్ణువుపతియగు
  తనయుడెతనతమ్ముడయ్యెతప్పెటులగున్

  రిప్లయితొలగించండి

 6. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వినకే లోకుల మాటలన్ విరివిగా భీతొందకే సౌతికిన్
  కనుమా భర్తయె వీలునామ నిడుచున్ కాసింతయౌ దుడ్డునున్
  ఘనమౌ రీతిని పంచగా తనకునున్ గారాబు సూనుండకున్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్...

  రిప్లయితొలగించండి
 7. అనయము సేవలు జేయగ
  వినయముగా రాముఁవెంట విటపికి నేగెన్
  యనుజుడు ధరణిఁ సుమిత్రా
  తనయుడు , తన తమ్ముడయ్యె దప్పెట్టులగున్

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఏగెన్+అనుజుడు' అన్నపుడు యడాగమం రాదు. "విటపికి జనె నా యనుజుడు..." అనండి.

   తొలగించండి
 8. ఘనమగు కుటుంబ నియమము
  మన సామ్రాజ్యంబునందు మలయుచు నుండన్
  జననీ జనకుల కడపటి
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  మనమున్ దల్చె గణాధిపుండచట కామమ్మున్ దువాళింపగన్
  తన బాణమ్ములతోడ పైకొను లతాంతాస్త్రుండునౌ కంతుడే
  జనకున్ కంటెను పెద్దయై వెలుగు పర్జన్యుండగున్ శౌరికిన్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన? యొప్పే యగున్.

  రిప్లయితొలగించండి
 10. అనుజుడు చిన్నతనంబున
  మనుజులలో నుండకుండ మతిచెడి వెళ్ళెన్
  తనకును కొత్తగ బుట్టిన
  తనయుఁడె, తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వెళ్ళెన్' అన్నది వ్యావహారికం. "మతిచెడి యేగెన్" అనండి.

   తొలగించండి
 11. జనకుని సోదరు డాతడు
  తన వనితయు సుతునితోడ తరలియె వచ్చెన్
  వినుమంటి యతని ముద్దుల
  తనయుఁడె తన తమ్ముఁ డయ్యెఁ దప్పెటులగున్

  రిప్లయితొలగించండి
 12. వినయంబందున ధర్మరాజపుడు సంప్రీతిన్ వచించెన్ కదా
  మునియిచ్చెన్ వరమొక్కటిన్ జననికిన్ మోదంబుతో నామెయే
  ఘనుడౌ యింద్రుని కోరిబిల్వ కలిగెన్ గాండీవి, పాకారికిన్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్

  రిప్లయితొలగించండి
 13. అనయం బెడబాయక దా
  వనమునకుం జనిన శేషవాహన మతడే
  ఇనకుల భవుడు సుమిత్రా
  తనయుడు తనతమ్ముడయ్యె తప్పెట్టులగున్

  అనయంబున్ హరి వాహనమ్ముగను
  నిత్యానంద మొందేటి యా
  ఘనశేషుం డవనిన్ సువర్ణ మనుజాకారంబు దాల్చెన్ గదా
  ఘననీలాంగుడు రామచంద్రునికి
  బాగైనట్టి పిన్నమ్మకున్
  దనయుండే దనతమ్ముడయ్యె ననగా
  దప్పౌన యొప్పేయగున్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'ఒందేటి' అనడం సాధువు కాదు. "నిత్యానందమున్ బొందు నా ఘనశేషుం..." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!
   🙏🙏🙏🙏

   తొలగించండి
  3. సవరణతో 🙏🙏🙏

   అనయంబున్ హరి వాహనమ్ముగను
   నిత్యానందమున్ బొందు నా
   ఘనశేషుం డవనిన్ సువర్ణ మనుజాకారంబు దాల్చెన్ గదా
   ఘననీలాంగుడు రామచంద్రునికి
   బాగైనట్టి పిన్నమ్మకున్
   దనయుండే దనతమ్ముడయ్యె ననగా
   దప్పౌన యొప్పేయగున్

   తొలగించండి
 14. కని విని యెరుగని రీతిగ
  తన తండ్రికి మరియు నొక్క తరుణికి మనువై
  జని యించి నట్టి పిన్నికి
  తనయుడె తన తమ్ము డయ్యె తప్పె ట్టు లగున్

  రిప్లయితొలగించండి
 15. తనకెటుల తమ్ముడౌనను
  తనయుని ప్రశ్నకు బదులిడె తల్లియె యిటులన్
  తన తండ్రి సహోదరునికి
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 16. ఘన వాయువు సుతునిగ తా

  జననము నొంది రఘుపతికి సాయము చేసెన్,

  హనుమకు భీముడు వాయువు

  తనయుడె, తనతమ్ముడయ్యె, తప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 17. సమస్య :
  తనయుండే తన తమ్ముడయ్యె ననగా
  దప్పౌన యొప్పే యగున్

  (అదితికశ్యపుల తనయుడు వామనుడు తనకంటె ఆ దంపతులకు ముందు పుట్టిన యింద్రునికి తమ్ముడేగా )
  మత్తేభవిక్రీడితము
  -----------------
  ఘనుడౌ వామనమూర్తి విష్ణువయినన్ గారుణ్యభావంబుతో
  దనుజుండౌ బలి స్వర్గపాలనము నం
  తం బొందజేయన్ మహా
  వినతిన్ వజ్రి యొనర్పగా నదితికిన్
  వే పుట్టెనే ! యిప్పుడా
  తనయుండే తన తమ్ముడయ్యె ననగా
  దప్పౌన ? యొప్పే యగున్ .
  ( వజ్రి - ఇంద్రుడు )

  రిప్లయితొలగించండి


 18. వినినంతనె వేగుపడుచు
  గునగున తప్పనవలదయ గురువుల మాటా!
  అనఘా! గన తన తండ్రికి
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్  జిలేబి

  రిప్లయితొలగించండి


 19. మునిమాపాయెను కెవ్వు కెవ్వు మని యా మూలన్ కుటీరమ్ములో
  వినిపించెన్ పసిపాప కేక!అదిగో పిన్నమ్మకున్ తండ్రికిన్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన ?యొప్పే యగున్
  తనివారంగను ముద్దులాడ వెడలెన్ దాసీకుమారున్ గనన్!  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగుంది, పిన్నమ్మ కుమారుడని, ఆ తర్వాత దాసీ కుమారునిన్ అన్నారు. అంధుడైన ధృతరాష్ట్రుడు దాసికి జనించిన విదురుని చూడడానికి వెళ్లినట్లంటారా?

   తొలగించండి
  2. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ****
   సహదేవుడు గారూ,
   అలా అనుకోవచ్చు. లేదా "వెడలెన్ తమ్మున్ జూచె మోదమ్మునన్" అని సవరించుకుంటే సరి!

   తొలగించండి


  3. సహదేవుడు గారు లా చిక్కు తెచ్చేరు :)

   కెడన్ అంటే సరి పోతుందాండి ?


   తనివారంగను ముద్దులాడ వెడలెన్ దాసీకుమారున్ కెడన్.


   జిలేబి   తొలగించండి
 20. ఘనుడాభీమబలుండువాయుసుతుడాగంధర్వలోకంబులో
  ననసౌగంధికమైవడిన్జనుచుదానచ్చోటగోపుచ్ఛమున్
  గనిలాంగూలమునడ్డుపెట్టితివినిష్కర్షించనన్గాడ్పుకున్
  *“తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్”*

  రిప్లయితొలగించండి
 21. వినుమా! సత్కవి! దత్తవాక్యముఁ గనన్ వింతేమి గన్పట్టునో!
  కనుడో యంచు నొసంగి తీవు సరియే కానిమ్ము తానీ విధిన్
  తనయుండై పిన తండ్రికట్లగుట సంతానమ్ము చిన్నమ్మకౌ
  తనయుండే, తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్

  నిన్నటి పూరణ

  శూలాఘాతకతీక్ష్ణసూర్యకరసంశోషాంగతప్తుండు తా
  నా లోకమ్మును వీడి పద్మజుడు శేషాదుల్ తుషారాద్రిపై
  వాలాయమ్ముగ సేద దీర, నచటన్ భాసిల్లిరీ రీతిలో
  కైలాసమ్మున శేషతల్పమున సౌఖ్యంబందె వాణీశుఁడే

  కంజర్ల రామాచార్య

  రిప్లయితొలగించండి
 22. కం.
  అనయము సౌశీల్యముతో
  తన యన్నను గోలచ్చునట్టి దహరుడు ధరలో
  నిన్నవంశజు దసరథ రా
  డ్తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   టైపాట్లున్నవి. "గొల్చునట్టి... నినవంశ్యుడు దశరథ రాట్తనయుడె..." అనండి.

   తొలగించండి
 23. అందరికీ నమస్సులు🙏
  కం"

  ఘనమై యొప్పను పుత్రుల
  జననము కుంతికి, తలచిన జయము కలుగన
  ర్జునుని గనెనన్న, యింద్రుని
  *తనయుడె తన తమ్ముడయ్యె దప్పెట్టులగున్*

  వాణిశ్రీ నైనాల, విజయవాడ

  రిప్లయితొలగించండి
 24. కనుడీ సూక్ష్మపువిషయము
  మనువాడకొడుకు,వరుసకుమఱదలుదనకున్
  వినసొంపుగనుండెనుగద
  తనయుడెతనతమ్ముడయ్యెదప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 25. కన వాయు సుతుండె  హనుమ 
  హనుమ వలెనె బీముడుసహ యతని పుత్రుడే 
  యనగా హనుమకు వాయువు 
  తనయుడె తన తమ్ముడయ్యె తప్పెట్టులగున్ 

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణభంగం. "భీముడు గన నతని సుతుండే..." అందామా?

   తొలగించండి
 26. కన వాయు సుతుండె  హనుమ 
  హనుమ వలెనె బీముడుసహ యతని పుత్రుడే 
  యనగా హనుమకు వాయువు 
  తనయుడె తన తమ్ముడయ్యె తప్పెట్టులగున్ 

  రిప్లయితొలగించండి
 27. తనుగర్భవతిగపుట్టిం
  టనుజేరినవేళతల్లితనయునిగనియెన్
  తనతల్లిగన్న చిన్నరి
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి


 28. జననియు వేర్వేరైనను
  వినుమా భరతుండుకూడ పిన్నమ సుతుడే
  జనకుండొకడన నాతని
  తనయుడు తనతమ్ముడయ్యె తప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 30. తనయుండేతనతమ్ముడయ్యెననగాదప్పౌనయొప్పేయగున్
  గనుడో మీరలుసూక్ష్శదర్శనముమీకైతెల్పనౌనిచ్చటన్
  తనయుండేతనతమ్ముడౌనునిటులే,దాజేయనుద్వాహమున్
  దనదౌభార్యకుచెల్లెలౌవరుసయాతారన్ ముదంబొప్పగా

  రిప్లయితొలగించండి
 31. ఘనుడౌ సూర్యుని కారణమ్ముగను తాగాంచంగ రాధేయునిన్
  ఇనుపుత్రుండు యముండు కుంతి కొసగెన్నింపైన యోపుత్రునిన్
  కనగా భర్తలు సూర్యుడున్ యముడు నాకాంతా మణౌ కుంతికిన్
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్

  రిప్లయితొలగించండి
 32. తనమాతామహిసోదరీతనయయౌతర్కింపగా తల్లికిన్
  తనుజాతాసమమాసహోదరిసుతుల్ తారెల్లనా తల్లికిన్
  తనపుత్రాదులటంచునెంచియతడాతల్లిన్ సమీపించియా
  తనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్

  రిప్లయితొలగించండి
 33. తనబలిమి చాల కింద్రుడు
  వనములపాలౌట జూచి వనమాలియెతాన్
  మునికిని, దితికిన్ బుట్టగ
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్?

  రిప్లయితొలగించండి
 34. వనమున వానర కులమున
  దునుమగ రాజును వెలసెను దొరయై రీతిన్
  తనివారసతులగూడిన
  తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులగున్

  రిప్లయితొలగించండి
 35. అన విని కనలి కరము ప
  ల్కె నిట్టు లామిత్రు తోడ లీలన్ హేలం
  దన కడపటి చిన్నాన్నకుఁ
  దనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టు లగున్


  అనుజుం డన్నఁ గరమ్ము దగ్గ రగు నాప్యాయమ్ముగా నీ కహో
  విను మీ చుట్టరికమ్ము నిట్లు తలఁచన్ వింతౌచు దూరమ్మగుం
  దన ముత్తాతకు జ్యేష్ఠ నందనుని సంతానమ్ములోఁ బెద్దకుం
  దనయుండే తన తమ్ముఁడయ్యె ననఁగాఁ దప్పౌన యొప్పే యగున్

  రిప్లయితొలగించండి
 36. మ:

  దినమున్ రేతిరి నిర్విరామముగ శోధింపన్ వివాహంబుకై
  తనయా మెచ్చక నడ్డగించగను కాతాళించ, తా దెల్పనై
  మనసా కోరిన వాని, సంతసము గా మారెంచ, పిన్నమ్మకున్
  తనయుండే తన తమ్ముడయ్యె ననగా దప్పౌనయొప్పే యగున్

  మారెంచు= ఎదురు ఊహించు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రేతిరి' అనడం గ్రామ్యం. "రాతిరి" అనండి.

   తొలగించండి
  2. ఆ.వె.
   తనయుఁడె తన తమ్ముఁడయ్యెఁ దప్పెట్టులౌ
   వానరులకునేల వావివరుస
   కులమునకొకరీతి కుటిలమెట్లౌజెప్పు
   వారిరీతులన్ని వారివైన

   తొలగించండి
 37. సంధి పొసగదనిన రారాజు గని శ్రీకృష్ణ పరమాత్మ అంతరంగం....

  కందం
  శోకించి గోవు, ధర్మము
  లోకమ్మునఁ బాపమడఁచ రూపించుమనన్
  జేకొన జన్మ, దురితులన
  నా కర్తవ్యమ్ము జన వినాశనమె కదా!

  శార్దూలవిక్రీడితము
  శోకంబందుచు పాపభారమునకున్ స్తోత్రించ గో ధర్మముల్
  సాకారంబుగ నైతి నంద సుతునై సాగించి దౌత్యమ్ములన్
  బోకార్చంగ నధర్మవర్తనులనేఁ బూనంగ కాలోస్మినౌ
  నా కర్తవ్య మెఱుంగఁ జెప్పెదఁ బ్రజా నాశమ్మె సంక్షోభమే!

  రిప్లయితొలగించండి