12, జనవరి 2021, మంగళవారం

సమస్య - 3602

3-1-2021 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య

 "బోగి పండ్లు గురియ రోగమొదవె"

(లేదా…)

“కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో"

27 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కురియగ వానలే మిగుల కుండల పోతగ కాకినాడనున్
    చరియలు లోయలే మునగ శాస్త్రము వీడక చిన్నపిల్లనున్
    మురికివి నీరమందయయొ ముచ్చట మీరగ స్నానమీయగన్
    కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో...

    రిప్లయితొలగించండి

  2. మురియుచు ముద్దుబిడ్డలకు ముచ్చటమీరగ భోగిరోజునన్
    సరసపు రీతిలోన బలు చక్కని పండ్లను పళ్ళెరమ్మునన్
    వరుసగ ముద్దుగుమ్మలట వంతుల వారిగ శీర్షమందునన్
    గురియగ భోగిపండ్లొదవె ఘోరముగా నొకరోగ
    మయ్యయో
    సరియగు జాగరూకతల జాడయె లేక కరోన కాలమున్

    రిప్లయితొలగించండి
  3. ఇరుగు పొరుగు మహిళ లేతెంచి నియమాలు
    వదలి మెలగు చుండ వారి వలన
    వ్యాధి యగు కరో న వ్యాప్తి చెందగ తాకి
    భోగి పండ్లు గురియ రోగ మొదవె

    రిప్లయితొలగించండి
  4. విరిసెను సంతసమ్ము కనువిందుగ బిడ్డలు పాపలందరున్
    మురిపెము మీర జేర దరి ముచ్చటగా తమ తాత యింటిలో
    జరిపెను నాయనమ్మ బహు చక్కని వేడుక గాని యింతలో
    కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో

    రిప్లయితొలగించండి
  5. పెద్ద పండు గ యిది పిల్లవా నికి జరి
    పెదము ముద్దు తీర , వింత గ యని
    మంచు తొలుకు చోట నుంచి త లపయున
    బోగి పండ్లు గురియ రోగమొదవె

    రిప్లయితొలగించండి

  6. సమస్య :
    భోగిపండ్లు గురియ రోగ మొదవె

    బుజ్జితల్లి తల్లి ముచ్చటగ పిలిచె
    ముత్తయిదువల నతిమోద మలర ;
    మాస్కు లేక పోయె ; మందగా గుమిగూడి
    భోగిపండ్లు గురియ రోగ మొదవె .

    రిప్లయితొలగించండి


  7. వచ్చె నిదిగొ కొత్త వాక్సీను మేలుగ
    బోగి పండ్లు గురియ! రోగమొదవె
    జనులు నొకరికొకరు సాయ మందింపగా
    ముందు బడగ శ్రేష్టముగ జిలేబి!


    సంక్రాంతి శుభాకాంక్షలతో
    ౭ సంవత్సరాలుగా గిద్యాలతో
    శంకరాభరణంలో జిలేబీలు తిప్పి
    వేసుకుంటున్న టైంపాసు

    జిలేబి :)

    రిప్లయితొలగించండి


  8. వికటింపని వాక్సీను తు
    దకు కురి యఁగ బోగి పండ్లొదవె! ఘోరముగా
    నొక రోగ మయ్యయో మన
    ల కుదిపె నొకవత్సరమ్మిలనుగా సుదతీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మెరిసె కరోన మానవుల మేధకు నిల్చె సవాలు వైద్యులున్

    విరుగుడునౌషధమ్ములను వీధులకంపగ పోయె రోగమ

    న్చు రసము గాదెనుండగనె చూపుచు సంబర భోగి కాంతులన్

    కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    మూతి మాస్కులేక రీతి తప్పి జనులు

    వ్యాక్సినొచ్చెననుచు భయము వీడి

    వేసుకొనక మునుపె వేడుక జరుపగా

    బోగి పండ్లు గురియ రోగమొదవె"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. రోగ మొకటి వచ్చి సాగెను వత్సరం
    మాయ రోగ మునకు మందు లేక,
    రోగమొదవు కణము రోగంబు నకుబెట్టి
    బోగి పండ్లు గురియ రోగమొదవె

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  11. మూతి గుడ్డ లేక ముత్తైదువులు వచ్చి
    భోగి పండ్లు గురియ రోగ మొదవె
    ననుచు ముసలి మిగుల నావేదనను జెంది
    మనుమరాలి నతడు మంద లించె

    రిప్లయితొలగించండి
  12. రేగిపళ్ళు పంచె భోగిపండుగ నాడు
    ప్రక్క నింటి వారు పనికి రాని
    పుచ్చి బోయి, కుళ్ళి పురుగులు పట్టంగ
    బోగి పండ్లు గురియ రోగమొదవె

    రిప్లయితొలగించండి
  13. సంకురాత్రి వేళ సందేహము వదలి
    మెలకువగ మెలిగిన మేలుకలుగు
    తలచనేల నిరుటి దురవస్థలానాడు
    భోగిపండ్లుగురియ రోగమొదవె

    రిప్లయితొలగించండి
  14. చిన్నపాపకగును శ్రీరామ రక్షంచు
    భోగినాడుపోయ రేగుపండ్లు
    రోగిచేతినుండి రోగకణములతో
    బోగి పండ్లు గురియ రోగమొదవె

    రిప్లయితొలగించండి
  15. తరుణులు తెల్లవారగ ముదంబున రంగుల రంగ వల్లులన్
    వరలగ తీర్చిదిద్ది పసివారికి వేడుక గొబ్బిపువ్వులే
    *“కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో"*
    కరకు కరోన శేషమది కానరు పుర్వులు దాగి యుండుటన్

    రిప్లయితొలగించండి
  16. బోగినాఁడు కలసి పొలతు లెల్ల మురిసి
    రేఁగు పండ్లు తెచ్చి రెచ్చి యంత
    శుభము లెల్లఁ గల్గుచుండు బాలల కంచు
    బోగి పండ్లు గురియ రోగమొదవె!


    పరమ రహస్యమే యగును బన్నగ భూషణు చెయ్వు లెంచఁగా
    నరులకు నే విపత్తులు ఘనమ్ముగ నెప్పుడు కల్గు నెవ్విధిం
    గరము రయమ్ముగా విషము కంపముతో నికిలించు చుండియుం
    గురియఁగ బోగి పం డ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో

    [బోగి = భోగి = పాము]

    రిప్లయితొలగించండి
  17. చం:

    మురిపెము తోడ పిల్లలకు ముచ్చట దీర్పగ పొర్గు వారలన్
    పరుగుడి యామతించ నట పాల్గొనిరెల్లరు మాస్కు లేకయే
    యరమర మింత లేక, విధి యయ్యెను కారణ మీసడింపుగన్
    కురియగ భోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. జనులట గుమి గూడు సంతనుండియె తాను
    సరుకు లన్నియు కొని సంబరమున
    సానిటైజ రునిక చల్లుట మరువగ
    భొగిపండ్లుగురియ రోగ మొదవె.

    రిప్లయితొలగించండి
  19. ధరణిని తగ్గె కోవిడని తల్చి జనాళియె భీతివీడుచున్
    సరుకుల కోసమంచు పలు సంతల కేగిరి గాదె సానిటై
    జరనెడు మాటనే వదలి సంబర మందున పిల్లవాండ్రపై
    కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో

    రిప్లయితొలగించండి
  20. విరిసెనుకాంతియింట కడు వేడుకగానొక పర్వమందునన్
    పరవశమొందుచున్ బదరిపండ్లను వేయగ భోగి రోజునన్
    మరపుననొక్కరోగి శిరమందునపాపకు వేయునంతనే
    కురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో

    రిప్లయితొలగించండి
  21. కల్తిలేని దనుచు కడుపార భుజియించె
    మత్తులోన మునిగె మంద మతియె
    స్వచ్ఛతెచట గలదు స్వప్నమందేనాయె
    బోగి పండ్లు గురియ రోగమొదవె!!

    రిప్లయితొలగించండి
  22. ఆటవెలది
    కురిసె రేణి పండ్ల పరిమాణపు చినుకుల్
    రంగుమారె శనగ గంగ మునిగి
    వరుణ! పుష్యమందు పంతమె? పంటపై
    బోగి పండ్లు గురియ రోగమొదవె

    చంపకమాల
    మరిమరి రేణి పండ్ల పరిమాణపుఁ జిన్కులకాల వర్షమై
    దొరలుచు మున్గగన్ శనగ దుఃఖము పంటయె రంగుమారుటల్
    వరుణుడ! పుష్యమాసమున పంతమదేలర? కోయు పంటపై
    గురియఁగ బోగి పండ్లొదవె ఘోరముగా నొక రోగ మయ్యయో!

    రిప్లయితొలగించండి
  23. భోగిపండ్లుగురియఋరోగమొదవెనట
    యబ్బురంబుగాదెయార్యయదియ
    భోగిపండ్లుదెచ్చి బుడతలశిరముపై
    బోయవృద్ధియగునునాయువతని

    రిప్లయితొలగించండి
  24. సుంతతాకినంతసోకునట్టిరుజయు
    వచ్చి చేరె నేడు వసుధ యందు
    చంటిపాపకింట సంబరమందుచు
    బోగి పండ్లు గురియ రోగమొదవె"

    రిప్లయితొలగించండి