19, జనవరి 2021, మంగళవారం

సమస్య - 3609

20-1-2021 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా”

(లేదా…)

“పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”

70 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    సద్యశమంద గోరుచును శంకరు కొల్వును చేరి తీరుగన్
    హృద్యపు మాటలన్ నుడివి హేలగ నేర్చుచు తెల్గు ఛందమున్
    గద్యము వ్రాయజాలకయె గట్టిగ డప్పులు కొట్టి దోషపున్
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్...

    కృష్ణ శాస్త్రి = నల్లని (ప్రభాకర) శాస్త్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జీపీయెస్ వారికి

      KGP edition is quite excellent. Humorous at the same time thought provoking.

      Thank you for sending such wonderful compilation.


      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పుస్తకం జిలేబి గారి మెప్పు పొందినందుకు సంతోషం!

      తొలగించండి
    3. 🙏

      శంకరకృప జిలేబి గారు!

      మీ ఆజ్ఞ ప్రకారం విన్నకోట వారికి పంపితిని. వారి స్పందన:

      Good morning, Sir.
      So kind of you to send me a copy of your book of reminiscences. I like books of memoirs. Just now I have read a couple of articles in your book and found them hilarious. You have a Wodehousian style of narrating 🙂.

      Thank you very much for the book.

      - Vinnakota Narasimha Rao
      18-01-2021

      తొలగించండి
  2. హృద్యము గానట్టి వగుచు
    విద్యావంతులకు నవియు వెగటు గ నుండన్
    సద్యశమును గూర్చని వౌ
    పద్యములు వ్రాసితి నని పలుకగ నేలా?

    రిప్లయితొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హృద్యమ్మగు భావములను
    గద్యకవితలందు చాటి ఘనమగు కీర్తి
    న్నుద్యోతించిన శాస్త్రీ
    పద్యమ్మును వ్రాసితినని పలుకగనేలా?

    రిప్లయితొలగించండి


  4. చోద్యంబిదే జిలేబీ
    యాద్యంతమ్ములిటుకల భయానక పేర్పుల్
    గిద్యమ్ముల మరి వ్రాయుచు
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భయానక పేర్పుల్' దుష్టసమాసం.

      తొలగించండి
  5. విద్యల నిచ్చిన తల్లివి
    హృద్యము నీవాక్కు నెపుడు హృదయము నందున్
    గద్యము నెరుగని వాడినె
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా!!

    రిప్లయితొలగించండి
  6. ఆద్యుల ముద్దుల తనయుడు

    బాధ్యత భారతము వ్రాసె, పలుకది మునిదే,

    విద్యకునొజ్జగు దేవా

    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  7. ఆద్యుల ముద్దుల తనయుడు

    బాధ్యత భారతము వ్రాసె, పలుకది మునిదే,

    విద్యకునొజ్జగు దేవా

    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. ఉద్యోగము కొరకై జని
    విద్యార్హత జెప్పుమనగ విజ్ఞత విడి యా
    యుద్యోగితోడ నిట్టుల
    పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?

    రిప్లయితొలగించండి


  9. అనుమానమేల నేనౌ
    నను! పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొ
    ప్పునె కృష్ణ శాస్త్రికిన్? చ
    ప్పున వేస్తానొక్క వేటు పోదు బడాయీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. చోద్యము నందినాడ నిట చూడగ చిత్రమ దేమిటో యికన్
    విద్యల వేల్పునెప్పుడును వేడక యుండెను చిత్తమందునన్
    హృద్యమునొందునట్టి దొక హెచ్చగు మెప్పగు పల్కనేరడే
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్!!

    రిప్లయితొలగించండి
  11. హృద్యమ్ముగ పదసంధా
    నోద్యోగము లేని పద్యముచితం బౌనే?
    సద్యస్ఫురణము కఱువౌ
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?

    రిప్లయితొలగించండి
  12. కందం
    ఆద్యంతము వ్యాకరణము
    నధ్యయనముఁ జేసినట్టి యధిపుల పలుకుల్
    వద్యగ నొప్పినఁ జాలదె?
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?

    ఉత్పలమాల
    హృద్యకవిత్వ మాధురుల నింపుగ భావకవీంద్రుఁడౌచు నై
    వేద్యముఁ జేసి వాణి కృప విర్విగఁ పద్యములందు పాటలన్
    సద్యశమున్గొనన్, గుమతి చందవిహీనగతిన్ లిఖించుచున్
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె? కృష్ణ శాస్త్రికిన్!

    (శ్రీకృష్ణశాస్త్రి గారితో, కుమతి పద్యము వ్రాసి నాఁడనని పల్కవచ్చునా? అను భావంతో)


    రిప్లయితొలగించండి
  13. ఆద్యుడు పోతనార్యుడు మహాకవి వ్రాసిన కావ్యమందునన్
    వేద్యులు మెచ్చినట్టి పలు వీనుల విందగు పద్యరాజముల్
    హృద్యముగా రచించితిని యిందున నెవ్వని చేజనించనే
    పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రచించితిని+ఇందున' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  14. ఉద్యోగము కొరకై జని
    విద్యార్హత జెప్పుమనగ విజ్ఞత విడి యా
    యుద్యోగితోడ గొప్పగ
    పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు:

    హృద్యమునైన భావముల నింపుగ వెల్లడిజేయు రీతినిన్
    గద్యము నాశ్రయించి గమకమ్మగు పాటల గూర్చి కీర్తినిన్
    సద్యశమొంది భావకవి సత్కృతి తోడ తరించినట్టి తా
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్?

    రిప్లయితొలగించండి
  16. మిథ్యావాదీ! నీవిట
    మద్యమ్మును గ్రోలి తూలి మానినిపైనన్
    సద్యో జనితమ్మగు నొక
    పద్యమ్మును వ్రాసితినని పలుకగ నేలా?

    హృద్యపు కావ్యసంపుటిని హేలరచింపగ తెల్గువారలా
    మద్యపు మత్తులో మునిగి మంజుల భావపరంపర
    దేలియాడిరే
    చోద్యము గాదె నీవిటుల జుల్కన జేయుచు మాటలాడగా
    పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్?




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణ రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరించిన పూరణ

      హృద్యపు కావ్యసంపుటిని హేల రచింపగ తెల్గువారలా
      మద్యపు మత్తులో మునిగి మంజుల భావము
      దేలియాడగా
      చోద్యము గాదె నీవిటుల జుల్కన జేయుచు మాటలాడగా
      పద్యము వ్రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణశాస్త్రికిన్?

      తొలగించండి
  17. ఉద్యోగార్థము తప్పదు
    గద్యపు రీతుల చదువులు ఘనమను తలపుల్
    హృద్యంబౌ భాష మరువ
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించి 🙏

      ఉద్యోగార్థంబున దగు
      గద్యపు రీతుల చదువులు ఘనమను తలపుల్
      హృద్యంబౌ భాష మరువ
      పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా

      తొలగించండి
  18. ఉ:

    విద్య నిగూఢ గుప్తమని వేరొకరెవ్వరు సాటిరారనన్
    మద్యము గ్రోలు చందమున మట్టుకు దెచ్చిన తీరు బల్కగన్
    చోద్యము మీర ఛందముగ శుద్ధియె లేక ప్రచండ రీతినిన్
    పద్యము రాసినాడనని పల్కగ నొప్పునె కృష్ణ ! శాస్త్రికిన్!

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  19. కె.వి.యస్. లక్ష్మి:

    హృద్యమ్మగు భావమ్ముల
    సద్యశమొందగ తెలుపుచు సతతము నీవున్
    గద్యమె మేలని వ్రాసియు
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా?

    రిప్లయితొలగించండి
  20. హృద్యము గద కృష్ణుని కథ
    తధ్యంబుగ దరికి జేర్చు, తారణ మనకున్
    గద్యమె పద్యముగ నలరు
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా

    రిప్లయితొలగించండి

  21. ◆ శంకరాభరణం ◆

    తేది 20-1-2021 ......బుధవారం

    సమస్య -
    ***** ****

    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”

    నా పూరణ. ఉ.మా.
    **** *** **


    విద్యల నేర్చి ప్రాస,యతిఁ బేర్చి గణమ్ముల గూర్చి గాఢ వై

    విధ్య పదాలమర్చి మరి వేలుగ వ్రాసిన నీదు పద్యముల్

    చోద్యమె గాంచ నందునను సుంతయు లేక సుభావజాలముల్;

    హృద్యము గాని పద్యముల నిట్టుల నల్లుచు నీవు.., మేటిదై

    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”



    ★★ ఆకుల శాంతి భూషణ్ ★★
    ★ వనపర్తి ★

    రిప్లయితొలగించండి

  22. నా పూరణ. ఉ.మా.
    **** *** **


    విద్యల నేర్చి ప్రాస,యతిఁ బేర్చి గణమ్ముల గూర్చి గాఢ వై

    విధ్య పదాలమర్చి మరి వేలుగ వ్రాసిన నీదు పద్యముల్

    చోద్యమె గాంచ నందునను సుంతయు లేక సుభావజాలముల్;

    హృద్యము గాని పద్యముల నిట్టుల నల్లుచు నీవు.., మేటిదౌ

    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”



    ★★ ఆకుల శాంతి భూషణ్ ★★
    ★ వనపర్తి ★

    రిప్లయితొలగించండి
  23. మద్యము సేవించితివో
    చోద్యముగ గణనియమంబు జోడించకనే
    గద్యము కదియించి యిటుల
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా

    రిప్లయితొలగించండి
  24. సద్యస్స్ఫూర్తిగ పద్యము
    హృద్యముగావ్రాయలేక హృదయమునందున్
    సద్యశమునుకాంక్షించుచు
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా

    రిప్లయితొలగించండి
  25. వాద్యము చేత పూని సతి వాణియె, శ్రీ సుతు బ్రహ్మ రాణియె

    న్విద్యల దేవతా మణియె, నిక్కము వాక్కుల దేవ దేవియే,

    సద్యము మాట కూర్చగను , శారద గొప్పను చాటి చెప్పకన్

    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె ,కృష్ణ , శాస్త్రికిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  26. [1/20, 06:01] shankargdabbikar: పద్యము హృద్యమై ప్రజల భవ్య గళంబున నాట్య మాడుచున్
    గద్యమొ పద్యమో మృదుల గాన తరంగిణి నోలలాడు నై
    వేద్యమొ వీనువిందువొ నివేదనమో రసబంధురంబునో
    సాధ్యమొకో రచింపగ ప్రశస్త పదంబు ముదంబు గూర్చెనో
    మద్యమొకో మనంబునకు మత్తును చిత్తము నందు హ్లాదమౌ
    *“పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”*
    [1/20, 06:13] shankargdabbikar: గద్యము వేద్యమయ్యెను జగంబున పద్యము కష్టసాధ్యమై
    హృద్య మనింద్యమై కవుల హృత్గృహమందున సద్యశంబునై
    వేద్యమనంత ఛందముల విద్య విహంగము వాహినీగతిన్
    పద్య మృదంగ నిక్వణము పండిత పామర రంజకంబనన్
    *“పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్”*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వీనువిందువొ'?
      'హృద్గృహ' మనండి. 'అనంత+ఛందము=అనంతచ్ఛందము' అవుతుంది.

      తొలగించండి
  27. పద్యము హృద్యమై దనర బాయక నిల్చునదెల్ల కాలమున్
    సద్యశమంద జేయునది; సత్యవిదూరపు వర్ణనంబుతో
    పద్యము వ్రాసి తానిటుల బండిత శ్రేష్ఠుడనంచు బల్కుచున్
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్

    రిప్లయితొలగించండి
  28. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    'సద్యము' ? దాని తర్వాత అరసున్న ఎందుకు?

    రిప్లయితొలగించండి
  29. గద్యమువ్రాసినకవివర!
    పద్యమ్మును వ్రాసితినని పలుకగనేలా
    పద్యమ్ములకును నెఱుగుము
    హృద్యంబగు గ్రంధపఠన మెక్కువవలయున్

    రిప్లయితొలగించండి
  30. సద్యో విద్యా పారీ
    ణాద్య కవీంద్రర్షభ పరమామ్నాయ నభో
    హృద్యాంశు సన్నిభుండవు
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా


    విద్యలు రావు వంశ గత విద్వ దమేయ పరంపరన్ భువిం
    జోద్యముగా శ్రమించిననె చొప్పడు సద్గురు శిక్ష లుండఁగా
    గద్యము నొక్క తప్పయినఁ గానక యుండఁగ వ్రాయ నేరఁడే
    పద్యము వ్రాసినాఁడనని పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్

    రిప్లయితొలగించండి
  31. హృద్యంబగు ఛందస్సును
    అధ్యయనము జేయకుండ అతిశయ మతితో
    సద్యశమును పొందుటకై
    పద్యమ్మును వ్రాసితినని పలుకఁగ నేలా !!!

    రిప్లయితొలగించండి
  32. గద్యమువ్రాసిజూపియును గందరగోళపుమధ్యలోదనే
    పద్యమువ్రాసినాడనని పల్కగనొప్పునె కృష్ణశాస్త్రికిన్
    హృద్యముగారచించగనునింపుగఛందములాదిగానొగిన్
    విద్యలనెన్నియోచదివివిఙ్ఞతనొందుచువ్రాయగావలెన్

    రిప్లయితొలగించండి
  33. విద్య యొకింత లేని యవివేకియు బల్కు గదా ప్రగల్భముల్
    పద్యము వ్రాసినాఁడనని; పల్కఁగ నొప్పునె కృష్ణ శాస్త్రికిన్
    పద్యము వ్రాయలేననుట; వ్రాసెనతండు రసాత్మకంబులున్
    హృద్యములైన కావ్యములు హృత్కమలంబున నిల్పి భారతిన్

    రిప్లయితొలగించండి