24, జనవరి 2021, ఆదివారం

సమస్య - 3614

25-1-2021 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”

(లేదా…)

“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”

75 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    చకచక వానలే పడగ చక్కగ నవ్వుచు ముత్తుకూరునన్
    వికటపు టట్టహాసమున వీనుల విందుగ పాటపాడగన్
    నికటపు గ్రద్దనున్ గనుచు నీలిగి జంకున కేకలేయుచున్
    బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్...

    రిప్లయితొలగించండి

  2. సవరించిన సమస్యలు:

    *25-1-2021 (సోమవారం)*
    *సమస్య – 3614*
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
    *“కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”*
    (లేదా…)
    *“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*

    రిప్లయితొలగించండి
  3. తప్పులుఁజేసినప్రభుతను
    తిప్పలుతోడుతజనతయుతీరుకుదెచ్చెన్
    ఇప్పటికిదిసరికాదను
    కప్పలబెకబెకలువినినకాళమునదరెన్

    రిప్లయితొలగించండి
  4. బొప్పడు కర్ణకఠోరపు
    చప్పుడు చేసె సకినమ్ము జక్కగ జేసెన్
    పప్పి పలికింప రబ్బరు
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    రిప్లయితొలగించండి
  5. సకలముదేవుడేయనుచుశాంతినియత్నముమానగాతుదిన్
    వికలమునయ్యెపామునకువింతగమారెనుజీవయాత్రయున్
    పకపకలాడుచున్జనులుపాఁపనుత్రాడుగఁజేసియాడిరే
    బెకబెకలాడమండుకముభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  6. తేట గీతి::

    కొంటెగాడు వాట్సపునందు కొత్త వింత

    “లండను నగరిలో కప్పల బెకబెకలు

    వినిన పాము భయపడెన్” , భువిన కనుడన

    భళియనుచు లైకు చెప్పిరి వారి తీర్చి

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( వారి= అప్పు)

    రిప్లయితొలగించండి
  7. కందం
    తుప్పలు విడి గదిఁ దూరుచు
    చప్పున, ధ్వన్యనుకరణపు సాధన లోనన్
    దిప్పల శ్రుతిఁ దప్పిన వెం
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    రిప్లయితొలగించండి
  8. వికసిత సుందరాంగియగు వేడుక కత్తియె పిల్చినంత కా
    ముకుడగు సామవాయికుడు భోగపు వాడలు జేరినంత ర
    క్షకభటులేగు దెంచిన యగాదు వినంగనె పారిపోయెనే
    బెకబెకలాడ మండుకము భీతిలి పాఱెను పాము గ్రక్కునన్.

    రిప్లయితొలగించండి
  9. చప్పుడుకు నిలయము చెరువు
    కప్పల బెకబెక లకు : నహి కడు భీతిల్లె న్
    కుప్పలు కావగ వచ్చి న
    తిప్పన్న కరమున కఱ్ఱ తీవ్రపు స డి కిన్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గొప్పగ కయ్యను దాటగ
    చప్పున నీదుచు వెడలెడి సమయము నందున్
    చప్పుడు చేయుచు వెన్కొను
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒప్పుగ కయ్యను దాటగ
      చప్పున నీదుచు వెడలెడి సమయము నందున్
      చప్పుడు చేయుచు వెన్కొను
      కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

      తొలగించండి
  11. చప్పున చేరెను కొలనుకు
    కప్పల బెకబెకలకు నహి, భీతిల్లెన్
    కుప్పించు గృధ్రమును గని
    తప్పించు కొనగ సరియగు దారిని వెదకెన్

    చకచక పావులన్ గదిపి జాణతనంబున స్ధానికెన్నికల్
    తికమక బెట్టుచున్ బ్రజల ధీటుగచక్కగ నిర్వహించెడిన్
    ప్రకటననీయ రమేశుడు భంగపడంగ ప్రధానపక్షమే
    బెకబెకలాడ మండుకము భీతిలిపారెను పాముగ్రక్కునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల మూడవ పాదమున
      ప్రకటన వెల్వరించగని భంగపడంగ ప్రధానపక్షమే గా చదువ ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'స్థానిక+ఎన్నికల్' అన్నపుడు సంధి లేదు. పైగా దుష్టసమాసం. 'స్థానికపు టెన్నికలు' అనాలి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! పౌర యెన్నికల్ అనవచ్చునా?
      🙏🙏🙏🙏

      తొలగించండి
  12. తెప్పలు వేసుకు వచ్చిరి
    కుప్పలుగ మనుజులు వినుము, కొలను కదలికన్
    చప్పుడులు వేటకాయను
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    రిప్లయితొలగించండి
  13. కె.వి.యస్. లక్ష్మి:

    చప్పున జేరెను కలుగును
    కప్పల బెకబెకలకు నహి; కడు భీతిల్లెన్
    తప్పదు మృత్యువె తనకని
    తుప్పలలో బకమును గని త్రోవ పడయకున్.

    రిప్లయితొలగించండి
  14. చెప్పకుమెవ్వడు భయపడు
    కప్పల బెకబెకలకు; నహి కడు భీతిల్లెన్
    ముప్పని ముంగిస నట గని
    చప్పున బుస గొట్టె జాతి శత్రుత్వమునన్

    రిప్లయితొలగించండి
  15. కం.
    చప్పున యెన్నికలొచ్చెను
    చెప్పకనిచ్చిన గురుతులు చేతనలైనన్
    కుప్పలుగ వోటు దక్కిన
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    రిప్లయితొలగించండి
  16. చప్పుడు వినలేదు నగము
    “కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”
    తప్పుడు కతయిది , నాగువు
    లెప్పుడు కంపనము మాత్రమెరుగును గదరా

    రిప్లయితొలగించండి
  17. నప్ప యొకడు కొంటెగ తన
    యప్ప నడిగె నమ్మలేని యంశము జెప్పన్
    చప్పున వాచించె నిటుల
    “కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”

    నప్ప = బాలుడు

    రిప్లయితొలగించండి
  18. సమస్య :
    బెకబెకలాడ గప్పలవె
    భీతిలి పారెను పాము గ్రక్కునన్

    ( అహంకరించిన నిజాం నవాబు - అణగగొట్టిన తెలుగు ప్రజలు )

    చంపకమాల
    ...................

    పకపక నవ్వుచున్ " పిరికి
    పందలు రాజును గెల్వనేర్తురే ?
    వికటపు నాదు ఠీవికిని
    వీరలు తొత్తు" లనెన్ నిజాముడే ;
    తికమకలౌచు నోటువడ ;
    దెల్గు ప్రజల్ తెగ సంతసించిరే !
    బెకబెకలాడు గప్పలవె ;
    భీతిలి పారెను పాము గ్రక్కునన్ .

    రిప్లయితొలగించండి


  19. అప్పా! వచ్చెను గృధ్రము
    కప్పల బెకబెకలకు, నహి కడు భీతిల్లెన్,
    చప్పున జరజర ప్రాకుచు
    గప్పున నొకపుట్ట దూరి కాచుకొనె సుమీ



    జిలేబి

    రిప్లయితొలగించండి


  20. వినువీధిని వరుగొకటి కె
    లను! బెకబెకలాడఁ గప్పలవె, భీతిలి పా
    ఱెను పాము గ్రక్కునన్ పు
    ట్టను దూరెనొక క్షణమందు టక్కున సుమ్మీ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. క్రమముగ వైనతేయుడు ప్రకామరయమ్మున వేల్పుఁ ద్రోవ సం
    భ్రమమున మాతృదాస్యవినివర్తనఁ జేయగ వచ్చు వేళ సం
    యమనముఁ గోలు పోయి విటపావళి కూకటి త్రెళ్ళి వెంట రాఁ
    ప్రమదముఁ గూర్చ వచ్చెను ప్రభంజన మెల్లెడ వీచి తీవ్రమై.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  22. జనులను రెచ్చగొట్టెడి ప్రసంగములున్, నెరవేర్చరాని పొం
    తన యిసుమంత లేని వితథమ్మగు హామి నొసంగుటల్, దగన్
    ధనమును వస్తుమద్యములుదారత నిచ్చుట, నేతలందునన్
    కనకపు గద్దె నెక్కుటకు గాడిద కేక లవన్ని యర్హతల్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. కప్పుచు గరళపు డాగును

    మెప్పుగ పరమేశు మెడన మెదలుచు ప్రీతిన్

    కొప్పున గంగను దుమికిన

    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి

  24. ◆ శంకరాభరణం ◆

    తేది 25-౦1-2021 ....సోమవారం

    సమస్య -
    ***** ****

    బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”

    నా పూరణ. చం.మా.
    **** *** **

    తికమక పాలనన్ సలిపి తిప్పలుఁ బెట్టగ భారతీయులన్..,

    ప్రకటిత యుద్యమాలు కడు ప్రాకటమొప్పగ జేయగన్..భరిం

    చక యిక ఆంగ్ల పాలకులు జంకుచు పాఱిరి ప్రాణ భీతి.., సూ

    బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”



    ★★ ఆకుల శాంతి భూషణ్ ★★
    ★ వనపర్తి ★

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రకటిత+ఉద్యమాలు=ప్రకటితోద్యమాలు' అవుతుంది.

      తొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. సప్పము సవ్వడి కనుగొని
    ముప్పును తప్పించుకొనగ పూనిక తోడన్
    గొప్పగ గొంతులు బెంచిన
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్!!!

    రిప్లయితొలగించండి
  27. నిప్పౌ సీతను బట్టిన
    తప్పుకు నారావణుగని దండెత్తి కపుల్
    గుప్పించిన తీరు నరయ
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్.

    రిప్లయితొలగించండి
  28. ముప్పనసాంబునిమడుగున
    గప్పలభక్ష్షించుకొఱకుకర్కటిరాగన్
    చప్పునముప్పునుగనునా
    కప్పలబెకబెకలకునహికడుభీతిల్లెన్

    రిప్లయితొలగించండి
  29. తప్పదు ముప్పని జేసిన
    కప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్
    చప్పుడువిని యాకసమున
    చప్పుననొక గ్రద్దయటకు చయ్యన జేరన్

    రిప్లయితొలగించండి
  30. ఎప్పటి వలె వర్షమ్మునఁ
    దెప్పలుగఁ జెలంగి కూయ దిక్కు లదరఁగా
    నప్పుడు సరోజములతోఁ
    గప్పల బెకబెకలకు నహి కడు భీతిల్లెన్

    [అహి =జలము]


    ఒకటికి నొక్కటిం బెనఁగ నొప్పును గుంభికి గడ్డిపోఁచలే
    ప్రకటితమే లయమ్ము కదరా చలిచీమల చేత భోగికిం
    జకచక నైకమత్యమునఁ జాగఁగఁ గాన మసాధ్య మెద్దియున్
    బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను బాము గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  31. చకచక బ్రాఁకుచున్ ఫణము జాచుచు జెచ్చెర నేగుదెంచు నా
    చకితముగూర్చు పన్నగము చయ్యననాగెను గాంచి గృధ్రమున్
    వికచము మానసంబులను పెంపొనరింపగ సంతసంబునన్
    బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  32. తప్పు లెరుగకుండ తరుచు
    మెప్పుబడయనెంచి గొప్ప మేల్ తలపెట్టన్
    చప్పున డబ్బును జూడగ
    కప్పల బెకబెకలు వినిన పాము భయపడెన్!

    రిప్లయితొలగించండి
  33. చెకుముకిఱాయివోలెను నచేతనరీతినినుంటివేమిరా?
    ప్రకటముజేయుమీప్పుడిటపామదిచూడుమయేమిచేయునో?
    నకనకలాడుసర్పమువనాంతరసీమకునేగనయ్యెడన్
    బెకబెకలాడకప్పలవెభీతిలిపాఱెనుపాముగ్రక్కునన్

    రిప్లయితొలగించండి
  34. వికసిత వృక్షరాజముల వెల్గు నిశీధిని మేఘమాలికల్
    ప్రకటిత శైలముల్ నదులు బావులు క్షేత్రము లెన్ని యెన్నియో
    సకలము గాంచుచుంటి నొక స్ధావర మందు విచిత్ర దృశ్యమున్
    *“బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్”*

    రిప్లయితొలగించండి
  35. చంపకమాల
    సకలముఁ దెల్సి యా భటులు సర్పముఁ బోలెడు వాడు వచ్చుటల్
    బ్రకటముఁ గాగ ముంగిసల వంతున వ్యక్తులు రాజుఁ జుట్టిరన్
    రకమున మాటలాడ విని రయ్యున బాణెను వచ్చువాడహో!
    బెకబెకలాడఁ గప్పలవె భీతిలి పాఱెను పాము గ్రక్కునన్!!

    రిప్లయితొలగించండి