31, మార్చి 2021, బుధవారం

సమస్య - 3679

1-4-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామ యనిన బూతురా యనకుము”
(లేదా...)
“బూతగు రామచంద్ర యనఁబోకు సుహృజ్జనులున్న తావులన్”

30, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3678

31-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె”
(లేదా...)
“వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్”
(ఈ సమస్యను పంపిన ఉపాధ్యాయుల గౌరీశంకర రావు గారికి ధన్యవాదాలు)

29, మార్చి 2021, సోమవారం

సమస్య - 3677

30-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రామమున ఘటోత్కచుండు గ్రౌర్యముఁ జూపెన్”
(లేదా...)
“గ్రామమునన్ ఘటోత్కచుఁడు గ్రౌర్యముఁ జూపె దయావిహీనుఁడై”

28, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3676

29-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్మును భక్తిఁ గొలువ శుభములు గల్గున్”
(లేదా...)
“శునకమ్ముం గడు భక్తిఁ గొల్చిన లభించుం బో శుభమ్ముల్ గడున్”

27, మార్చి 2021, శనివారం

సమస్య - 3675

28-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నమయ్యె సున్నము ముదమంది తినిరి”
(లేదా...)
“అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్”

26, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3674

27-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాసన లేనట్టి పువ్వు వాసినిఁ గాంచెన్”
(లేదా...)
“వాసన లేని పువ్వు బుధవర్గము మెప్పును బొందె వింతగన్”

25, మార్చి 2021, గురువారం

సమస్య - 3673

26-3-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగవానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”
(లేదా...)
“పగవానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మేలగున్"

24, మార్చి 2021, బుధవారం

దత్తపది - 175

25-3-2021 (గురువారం)
బండి - రథము - ఓడ - విమానము
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఒక అదృష్టహీనుని దీనావస్థను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పండి.

23, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3672

24-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోదీ నిన్ గాంచినంత మోహించునొకో”
(లేదా...)
“మోదీ నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో”

22, మార్చి 2021, సోమవారం

సమస్య - 3671

23-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాయకుల్ నీతి మాలిన నష్టమగున”
(లేదా...)
“నష్టము లేదు లేదు మన నాయకు లెల్లరు నీతి మాలినన్”

21, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3670

22-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోఁతినని ధనంజయుండు గొండల నెక్కెన్”
(లేదా...)
“కోఁతి నటంచు నర్జునుఁడు గొండల నెక్కుచు వేసె గంతులన్”

ఆహ్వానం!

 


20, మార్చి 2021, శనివారం

సమస్య - 3669

21-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున”
(లేదా...)
“కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్”
(వరంగల్ 'పద్యప్రభంజన పరిచయ సభ' సందర్భంగా...)

19, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3668

20-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్”
(లేదా...)
“ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్”

18, మార్చి 2021, గురువారం

సమస్య - 3667

19-3-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు”
(లేదా...)
“వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్”

17, మార్చి 2021, బుధవారం

సమస్య - 3666

18-3-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్”
(లేదా...)
“పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్”

16, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3665

17-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంచవటిలో వసించిరి పాండుసుతులు”
(లేదా...)
“లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్”

15, మార్చి 2021, సోమవారం

సమస్య - 3664

16-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ”
(లేదా...)
“పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే”

14, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3663

15-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్”
(లేదా...)
“కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా”
(తడకమళ్ళ రామచంద్ర రావు గారికి ధన్యవాదాలతో...)

13, మార్చి 2021, శనివారం

సమస్య - 3662

14-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆకసమ్ము పిడికిలంత సుమ్ము”
(లేదా...)
“గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై" 

12, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3661

13-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ”
(లేదా...)
“హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్”

11, మార్చి 2021, గురువారం

సమస్య - 3660

12-3-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రుపదతనయకు మ్రొక్కె దుర్యోధనుండు”
(లేదా...)
“కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్”

10, మార్చి 2021, బుధవారం

సమస్య - 3659

11-3-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే”
(లేదా...)
“విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే”

9, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3658

10-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కల సహింపవలయుఁ గాపురమున”
(లేదా...)
“కలను సహింపగా వలయుఁ గాపురమం దభివృద్ధిఁ గోరినన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

8, మార్చి 2021, సోమవారం

సమస్య - 3657

9-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు”
(లేదా...)
“కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ”

7, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3656

8-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అవధాని పరాజయమున నందె బహుమతిన్"
(లేదా...)
"ఓటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్"
(సోమవారం వరంగల్లులో ఆముదాల మురళి గారి అష్టావధానం సందర్భంగా...)

6, మార్చి 2021, శనివారం

సమస్య - 3655

7-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సిద్దిపేట కేగవద్దు కవులు"
(లేదా...)
"వద్దుర సిద్దిపేటఁ జనవద్దు కవుల్ గనరారు సజ్జనుల్"
(సిద్దిపేటలో జరుగనున్న 4 అవధానాలకు నేను వెళ్తున్న సందర్భంగా...)

5, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3654

6-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భధ్ర మిడుమని రాముఁడు వాలి నడిగె”
(లేదా...)
“భద్రము నాకొసంగుమని వాలిని వేడెను రాముఁ డయ్యెడన్”

4, మార్చి 2021, గురువారం

సమస్య - 3653

5-3-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే”
(లేదా...)
“శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే”

3, మార్చి 2021, బుధవారం

సమస్య - 3652

4-3-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్”
(లేదా...)
“కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”

2, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3651

 3-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇది యది కానట్టి దేదొ యిడు మోదమ్మున్”
(లేదా...)
“ఇది యది కానిదేదియొ యదే యిడుచుండును మోద మెప్పుడున్”

1, మార్చి 2021, సోమవారం

సమస్య - 3650

2-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చేర్చుఁ బరలోకమునకు నీచేతి మాత్ర”
(లేదా...)
“చేర్చును పరలోకముఁ దమ చేతి మాత్ర యయ్యయో”