10, మార్చి 2021, బుధవారం

సమస్య - 3659

11-3-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే”
(లేదా...)
“విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే”

70 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  వంగభూమిని:

  కరచుచు పార్టి మార్చుచును కన్నియ చేరగ మోడి చెంతనున్
  మురియగ భాజపా భటులు; ముద్దుగ జూచుచు దీదిభక్తులే
  సరసము లాడుచున్ మిగుల చంకలు కొట్టుచు పల్కిరిట్టులన్:
  “విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే”

  రిప్లయితొలగించండి
 2. ఎరుగరె చిత్రశాల గన నెక్కుడు వింతగు పెక్కు దృశ్యముల్
  కరములు మోడ్చి మ్రొక్కవలె కారణ జన్ములు చిత్రకారులే
  మురిసిరి ముద్దుగున్నదని ముచ్చటగొల్పెడి చిత్రమేయదిన్
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే!

  రిప్లయితొలగించండి
 3. కరమందగించువేదగ
  సిరిగలమోముననగవులుచిందులువేయన్
  విరిబాలయ్యెనులంకను
  విరిసినకమలమునఁబుట్టెవిషసర్పమ్మె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేదగ'? 'విరిబాల+అయ్యె' నన్నపుడు యడగమం వస్తుంది. అక్కడ "విరిబాల యయ్యె లంకను" అనండి.

   తొలగించండి
 4. తరుణీ మణియా మండో

  దరి సాధ్వీ రత్నమాయె ధారుణి లోనన్

  పరికించ మేఘ నాధుడు

  విరిసిన కమలమున పుట్డిన విష సర్పమ్మే

  రిప్లయితొలగించండి
 5. మురిపపు గంధము వెలువడి
  విరిసిన కమలమునపుట్టు : విష సర్పమ్మే
  జరజర ప్రాకుచు పడగను
  తిరముగ బుస కొట్టు చుండు తేకువ తోడన్

  రిప్లయితొలగించండి
 6. కందం
  గరళమెగఁబోయ మంధర
  ధరణిజ పతి పట్టమనఁగ దశరథ సతియై
  పరవశతఁ గైక మోమున
  విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే

  చంపకమాల
  గరళము నింపి మాటలనుఁ గక్కఁగ మంధరమత్సరమ్మునన్,
  మెరయుచు రామచంద్రుఁడిక మేదిని రాజుగఁ బట్టమందునన్
  బరవశమందు కైక మది నందముఁ జిందఁగఁ బూసి మోమునన్
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే

  రిప్లయితొలగించండి
 7. తరుణిని పేరోలగమున
  పరాభ వించెను స్వజనుల వంచన చేసెన్
  ధరణిని కురువంశమనెడు
  విరిసిన కమలమున బుట్టె విషసర్పమ్మే .
  . . . విరించి. (భీష్ముని అంతర్మదనం)

  రిప్లయితొలగించండి
 8. చం:

  మురిసిరి పుత్ర జన్మమని పుట్టుక పండిత మాని యంచనన్
  యిరుకున బెట్టె నా సుతుడె యింగిత జ్ఞానము లేనివాడుగన్
  పరజను లిట్లు తేల్చిరట పండిత పుత్రుని వజ్రశుంఠగన్
  విరిసిన పద్మ మందు గడు వింతగ బుట్టెను కాలనాగమే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అంచనన్+ఇరుకున' అన్నపుడు యడాగమం రాదు. 'వజ్రశుంఠ' ?

   తొలగించండి
  2. 🙏🙏గురువు గారి సమీక్ష కు అనుకూలంగా సవరించిన పూరణ:

   చం:

   మురిసిరి పుత్ర జన్మమని పుట్టుక పండిత మాని యంచనన్
   నిరుకున బెట్టె నా సుతుడు నింతయు జ్ఞానము లేనివాడుగన్
   పరజను లిట్లు తేల్చిరట పండిత పుత్రుని వజ్రశుంఠగన్
   విరిసిన పద్మ మందు గడు వింతగ బుట్టెను కాలనాగమే

   వజ్ర శుంఠ=మిక్కిలి శుంఠ, శుద్ధ వెధవ (ఆంధ్ర భారతి)

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 9. సమస్య :
  విరిసిన పద్మమందు గడు
  వింతగ బుట్టెను కాలనాగమే

  ( నూటొక్క పాత్రలలో భద్రపరచిన పిండభాగాలను పరిశీలిస్తున్న గాంధారీధృతరాష్ట్రులకు మొదటిపాత్రలోనే కనిపించిన పెద్దకొడుకు సుయోధనుడు )

  చంపకమాల
  ...................

  మురియుచు రాజదంపతులు
  " ముద్దులమూటలు నందనోత్తముల్
  గురుకులధర్మవర్తనులు
  గూరిమి పుత్రులు నూర్గురుందు " రం
  చరయగ పాత్రలోపలనె
  యాద్యుడు ధూర్తసుయోధనుండదే !
  విరిసిన పద్మమందు గడు
  వింతగ బుట్టెను కాలనాగమే !!

  రిప్లయితొలగించండి
 10. సరసిజ నాభుని పుత్రుడు

  విరిసిన కమలమునఁ బుట్టె :; విషసర్పమ్మే

  పరుపుగ పండిన వానికి

  సిరి పతికిన్ మాధవునకు చెప్పెద స్తుతులున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 11. (భీష్ముని అంతర్మదనము)
  అరయగ పాండుపుత్రు లభియాతులటంచు దలంచె కుట్రలన్
  విరివిగ పన్నెనా ఖలుడు, భీరువు వల్వల నూడ్చెగాదె యీ
  భరణిని పేరుగన్న కురు వంశము నందు సుయోధనున్ గనన్
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 12. హిరణ్యకశిపుని మనోవేదన

  అరయగ శత్రువేయిచట నౌరసుడౌవిధి జన్మమందెనో
  మరిమరి జెప్పినన్ వినడు మాధవనామము వీడుమంచు నే
  కఱకగు శిక్షలన్ భయము గానడు దానవ శిష్టవంశమన్
  విరిసిన పద్మమందు కడు వింతగ బుట్టెను కాలనాగమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సురలకు నిలయమ్మౌ హిమ
   గిరులా సురమూకలకును గేహమ్ములుగా
   దరిశన మీయగ నరయన్
   విరిసిన కమలమున బుట్టె విషసర్పమ్మే

   తొలగించండి
  2. మీ మొదటి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
   రెండవ పూరణ బాగున్నది. 'దరిసెన మీయగ' అనండి.

   తొలగించండి
 13. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గిరిధరునకు యత్తయునై
  దొరలిన సాధ్వి శ్రుతదేవి ద్రుహుడౌ శఠుడా
  బిరుసు శిశుపాలు నెంచన్
  విరిసినకమలమునఁబుట్టెవిషసర్పమ్మే!

  పరవశ మొనర్చు గంధమె
  విరిసిన కమలమున బుట్టె; విషసర్పమ్మే
  నిరతము భయమును గొల్పుచు
  తిరుగుచు నుండును యడవుల తేకువ తోడన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'గిరిధరునకు నత్తయునై' అనండి. 'ఉండును+అడవుల' అన్నపుడు యడాగమం రాదు. "నుండు నడవులను" అనండి.

   తొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గిరిధరుడైన కృష్ణునకు కీర్తిని గొల్పెడి యాత్మబంధువై
  తిరిగిన సాధ్వియైన శ్రుతదేవికి నందనుడైన మూర్ఖుడా
  పరిణితిలేని శుంఠ శిశుపాలుని గూర్చి వినంగ దోచునౌ
  విరిసిన పద్మమందు కడు వింతగ బుట్టెను కాలనాగమే!

  రిప్లయితొలగించండి
 15. కరువాయె యందములు
  విరిసిన కమలమునఁ , బుట్టె విషసర్పమ్మే
  పురమున కాలుష్యముగ, న
  గరముల దుస్తితిదినేడు కాసారమునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణభంగం. 'దుస్థితి' టైపాటు. సవరించండి.

   తొలగించండి
 16. పురుషాశి రావణునికడ
  విరిసిన కమలమునఁ బుట్టె ; విషసర్పమ్మే
  యిరవునకిది యనితెలుపగ
  తరిషమున దిగవిడువంగ ధరణిజయయ్యెన్

  రిప్లయితొలగించండి
 17. కుండలినీ శక్తి సర్పమై ముకుళంగా ఉండి సహస్రారము గమ్యముగాగలదైనప్పటికీ, ఆ సహస్రారము దివ్యలోకమేకదా, అక్కడ నుండేగా అన్నీ ఉద్భవించినవి..

  ఆ మహాశక్తి గురించి అజ్ఞానములో మాట్లాడినందుకు అమ్మవారు నన్ను మన్నించుగాక


  చం||
  అరయగ రాజయోగముననచ్చెరువైన విశేషముల్ గనన్
  గురియ సహస్రపద్మదళగుహ్యము మూలము సర్పమిట్లు సుం
  దరలహరిన్ జనించెను పదార్ధనియోగిగ లూకయాత్రకై
  విరిసిన పద్మమందు గడు వింతగబుట్టెను కాలనాగమే

  ఆదిపూడి రోహిత్🙏🏻

  రిప్లయితొలగించండి
 18. వరమున బుట్టె పుత్రుడని బంధుల నందరి బిల్చి పేరిడన్
  మురిసిరి దంపతుల్ బుధులు మూరతమందున తార తెల్పిరో
  తిరముగ తమ్మిచూలన ప్రతీకయె సర్పము గాగ వంశమున్
  విరిసిన పద్మమందు గడు వింతగ బుట్టెను కాలనాగమే

  మూరతము = ముహూర్తం
  తమ్మిచూలి = బ్రహ్మ (రోహిణీ నక్షత్రం )
  యోని = సర్పము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తమ్మిచూలి+అన' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.

   తొలగించండి
 19. శరణమనుచు నొకతరుణియు
  పరమాత్మను పూజచేసె భక్తిగ పతితో
  వరమిడె నెటులన పుత్రుని?
  విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే

  రిప్లయితొలగించండి
 20. మురిపము నాజ్ఞనివ్వగను మూడగు కన్నుల వాడు , బ్రహ్మయే

  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను, కాలనాగమే”

  మురిసెను సంతసమ్మునను మోదపు కోరలు చిమ్మె జ్వాలల

  న్నరయగనూహకందనిది నా కలకున్గలదే మహేశ్వరా

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 21. సిరియై వెలసెను లక్ష్మియె
  విరిసిన కమలమునఁ, బుట్టె విషసర్పమ్మే
  కరుకైన మనుజుని మదిని
  పరిణామము చెడు తలపుల వాడయ్యె గదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 22. మనుజుని మేలు కొరకు చల
  గన విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బు
  ట్టెను, కాలనాగమే బు
  ట్టెను నరుని మదిని జిలేబి టెక్కులు బోవన్


  రిప్లయితొలగించండి
 23. సురుచిరభావనాసహిత సుందరదేహ సుశీలయై నిరం
  తరముగ సత్కృతుల్ సలుపు ధన్యకు దుర్మతి యాత్మజాతుడౌ
  కరణికి లోకులిట్లనిరి కాంచిరె సాధుపరీమళంబులన్
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే.

  రిప్లయితొలగించండి
 24. శంకరాభరణం వారి సమస్యా పూరణం

  విరిసిన పద్మమందు కడు వింతగఁబుట్టెను గాలనాగమే


  నా పూరణ

  చంపకమాల

  వరకురు వంశమందునను పాటవ మొప్పగ కౌరవీశుడే
  తిరుగగలేని కానలకు తేకువఁ బంపెను పాండుపుత్త్రులన్
  కురువరులెంత జెప్పినను గోరె రణంబును రాజ్య కాంక్షచే
  విరిసిన పద్మమందు కడు వింతగఁబుట్టెను గాలనాగమే

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 25. ఎరుగరె చిత్రశాల గన నెక్కుడు వింతగు పెక్కు దృశ్యముల్
  కరములు మోడ్చి మ్రొక్కవలె కారణ జన్ములు చిత్రకారులే
  మురిసిరి ముద్దుగున్నదని ముచ్చటగొల్పెడి చిత్రమద్దియే
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను కాలనాగమే!

  ****సవరణతో...

  రిప్లయితొలగించండి
 26. వరగుణశోభితుండజుడు పావనుడా పరమాత్మ నాభినిన్
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను, కాలనాగమే
  వరదుని పానుపై యమర పాల్కడలిన్ బవళించి యుండగా
  పరమపదంబు శ్రీహరి నివాసము మానసమున్ దృశించుమా

  రిప్లయితొలగించండి
 27. కరిగెను కలలన్నియునిక
  కరకుదనంబే మిగిలెను గద ఆంధ్రులకున్
  విరజిమ్ముచు విషమెల్లెడ
  విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే

  రిప్లయితొలగించండి
 28. విరిసెనుబ్రహ్మగర్భమునవిష్ణునిశత్రువురావణుండునై
  మురియుచుసౌమ్యజానకినిమార్ఖుడుగాగనుదెచ్చెనీుఁడై
  కురిసినరాముబాణములుకూలెనువంశపువ్రుక్షరాజనమే
  విరిసినపద్మమందుఁగడువింతగఁబుట్టెనుకాలనాగమే

  రిప్లయితొలగించండి
 29. నరరూపమ్మున రక్కసి
  చెరచెను సుదతీలలామ శీలంబును నా
  సురదన గర్భము దాల్చగ
  విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే

  రిప్లయితొలగించండి
 30. బరు వేల మనకు వీరినిఁ
  ద్వరితమ్ముగ వృద్ధు లుండు వసతి కనుపుఁడీ
  గిర లన నిట్లు కమలముఖి
  విరిసిన కమలమునఁ బుట్టె విషసర్పమ్మే


  విరివి దళమ్ము లుండ సిత వృత్త సురూపము నూని వింతగా
  హరిత వరచ్ఛ దావృత మహాసన మందు మనోహరమ్ముగాఁ
  బరఁగెను నల్ల నాళ మది పద్మము నందుఁ జలింప గాలికే
  విరిసిన పద్మమందుఁ గడు వింతగఁ బుట్టెను గాలనాగమే

  [న+అగము = నాగము; అగము = పాము; నాగము = పాము కానిది; నాళ మను పాముగాఁ గూడ గ్రహింపఁ దగును.]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా శివ స్తుతి:

   ప్రేత భూ సంచారి రిక్తాంబరుండు త్రినేత్రుండు వరదుండు నిత్య శుభుఁడు
   భస్మ చందన దేహి ఫణివృత బాహుండు శీతాంశు జాహ్నవీ శేఖరుండు
   నలి జటాజూటుండు నమరారి బంధుండు నత నిర్జర గణుండు సిత తనుండు
   నట నానురాగుండు పటు విషగ్రీవుండు నాదిభిక్షుం డభయ ప్రదుండు

   ప్రమథ నిచయ భూతప్రేత పాలకుండు
   నస్థి మాలి కర కపాలసుస్థిరుండు
   నశుభ దృశ్య మాన నిరంతర శుభ దాయ
   కుండు నా విశ్వనాథుని రండు కొలువ


   ఫాలాంతర్గత నేత్ర కీర్ణ సుమహాజ్వాలా విధగ్ధాంగజా!
   నీలగ్రీవ విరాజమాన! విలసన్నృత్యప్రియై కాత్మ! లో
   కాలోకాలి వివర్ధితాంగ! రహితాద్యంతప్రభా వైభవా!
   వేలాక్రాంత దయారసార్ణవ! హరా! విశ్వేశ! రక్షింపుమా


   తొలగించండి
 31. సిరులను నిచ్చెడు లక్ష్మియె
  విరిసిన కమలమున బుట్టె,విషసర్పమ్మే
  నురగలుగక్కుచు చచ్చెను
  బరమాత్ముని గర్భగుడిని పరిత్రాణమునన్

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. సిరులను నీయు భామయును శీతల పర్వత రాజపుత్రికే
  విరిసిన పద్మమందు గడు వింతగ బుట్టెను,కాలనాగమే
  జరజరప్రాకి వేగముగ సంద్రములన్నిటి నీది చంపెగా
  గరువపు బ్రాణభీతియు ను గర్మము వెంటనురాగ ఱేనికిన్

  రిప్లయితొలగించండి
 34. 2వ ప్రయత్నము:

  చం:

  నిరతము కష్ట మెంచుచును నేర్పుగ జీవన యానమున్ భళా
  భరణమటంచు నేగితిని పట్నము నాశగ నంత, దైవమా
  తిరుగు టపాను యింటి కరు దెంచితి వింత కరోన వ్యాప్తిగన్
  విరిసిన పద్మ మందు గడు వింతగ బుట్టెను కాల నాగమే

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి