14-3-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆకసమ్ము పిడికిలంత సుమ్ము”(లేదా...)“గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై"
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:రగులగ మానసమ్మునను రచ్చను జేసెడి విప్రలంభమేపగలును రాత్రియున్ గడిపి బాధను పొందుచు వార్త రాగనేనగవులు చూడ పాపడిది నందన మొందగ హృత్తునందునన్ గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏
చేతియందుసెల్లుజిలుగువెలుగుఁజూపులోకమందుగుట్టులోననుండుబ్రహ్మస్రుష్టిలోనిమర్మమేనిదియయ్యెఆకసమ్ముపిడికిలంతసుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూడవ పాదంలో యతి తప్పింది. "బ్రహ్మసృష్టిలోని పరమార్థమే యిది" అనండి.
తప్పుసరిదిద్దుకుంటాను
అన్నుల మది లోతు నెన్నగలుగునట్టివాడులేడు కనగ వసుధ యందుపొలతి మనసు తోడ పోల్చిచూసినవేళ నాకసమ్ము పిడికిలంత సుమ్ము. . . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీత గాంచి తనదు చేవను రూపింప సూక్ష్మ రూపు వీడి సులువు గాను విశ్వ రూప మంది వెలుగొందు హనుమకు నాకసమ్ము పిడికిలంత సుమ్ము
వీధి వీధి దొరుకు విశ్వమంత దొరుకుమందు తాగి జనులు పొందు మత్తుమందు గ్రోలు వేళ మందుడవ్వు మనిషిఆకసమ్ము పిడికిలంత సుమ్ము”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మందుడవ్వు, మనిషి' అన్నవి సాధురూపాలు కావు. "మందుడౌ నరునకు" అనండి.
ధన్యవాదములండీ వ్యాఖ్యను సరి చేసే విధానము తెలియదండీ
కొదువ లేదునిలను కోర్కెలు సరియైనవిద్యగరపునట్టి వినయమిదియెఆశలోన మంచి ఆశయముండినఆకసమ్ము పిడికిలంత సుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు."..లేదు భువిని.." అనండి.
పగలునుఱేయిభావనయుబాసిరిమానవులీజగత్చునన్ఖగపతి ద్రుష్టి సామ్యతనుకాంచిరిసెల్లునస్రుష్టినంతటిన్అగణితమేధతోనరులునందిరిమింటినిఁదేగచేతికిన్గగనముముష్టిమాత్రమునగమ్ములుదేలునుదూదిపింజలై
మీ పూరణ బాగున్నది. అభినందనలు."రేయి..జగత్తునన్...దృష్టి..సృష్టి..' టైపాట్లు.
ఆటవెలదిచూడమని పిడికిట సూర్యచంద్రుల జూపెఁజెలఁగుచు చరవాణి చిత్రములనుయాకతాయి యనియె" యనుకొంటినన నాకునాకసమ్ము పిడికిలంత సుమ్ము!"చంపకమాలమిగిలిరి సూర్య చంద్రులిదె మిన్నఁగ చుట్టఁగ చేతివేళ్ళతోనగణిత శక్తులున్ గలవటంచునుఁ దా చరవాణి జూపుచున్మొగమున నిండగర్వమదె ముచ్చటగాననె నాకతాయి "యాగగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.'చిత్రములను+ఆకతాయి' అన్నపుడు యడాగమం రాదు. "చిత్రములనె యాకతాయి" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :ఆటవెలదిచూడమని పిడికిట సూర్యచంద్రుల జూపెఁజెలఁగుచు చరవాణి చిత్రములనెయాకతాయి యనియె" యనుకొంటినన నాకునాకసమ్ము పిడికిలంత సుమ్ము!"
జగతిని మానవుండు పలు శాస్త్రములన్ బఠియించి దక్షుడైయగణిత మేధతో సరళ యంత్రములన్ సృజియించె నందులోనిగనిగలాడెడాండ్రయిడనే చరవాణియె యందు కాంచగన్ గగనము ముష్టిమాత్రము, నగమ్ములు దేలును దూదిపింజలై . . . . విరించి.
పగలును రేయినిన్ జదివి పట్టుగ నున్నతవిద్యనేర్వగాసగటు కుటుంబ జీవికిని చక్కనికొల్వది ఫ్రాన్సుదేశమున్తగినది దొర్కగా జనెడు తావున జెట్టు విమాన యానమున్గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
సమస్య :గగనము ముష్టిమాత్రము న గమ్ములు దేలును దూదిపింజలై ( అంతెత్తున అమెరికాదేశానికి ఆకాశయానం కావిస్తున్న సమయంలో కలిగిన అనుభవం )చంపకమాల ...................సొగసుల నీలి యాకసము చూపులలోపల దాగిపోవగా ;నిగనిగలాడు కొండలతి నేర్పుగ దెల్లగ సందడింపగా ;మొగముల నిండె మోదమది ముగ్ధవిమానపు యానమందునన్ గగనము ముష్టిమాత్రము ; న గమ్ములు దేలును దూదిపింజలై .
మనోహరమైన పూరణ. అభినందనలు.
పరుల యండగోరి పనులసలుపబోవచిన్నదయినగూడ మిన్ను కెదుగుస్వంతశక్తి నమ్మి సాగుసా ధకునికియాకసమ్ము పిడికిలంత సుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మిన్నున కెదుగు' అనడం సాధువు. అక్కడ "మింటి కెదుగు" అనవచ్చు.
🙏🏽యతి తప్పు తుందేమో, “మిన్ను నంటు” అనవచ్చా
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై తెగ తిరుగున్ నిజంబె విను తెల్పెదనయ్య నరుండు సృష్టి జేసె గతి నశించ బంధముల సేతువు త్రుంచగ సెల్లుఫోనున్పగగొని హస్తభూషగను భాసిల గూర్చెను విశ్వమందు నీజగతియె చేత నుండ మరి సాధ్యము కానిది లేదు లేదిలన్
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య"గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలైనా పూరణచంపకమాలఅగణిత శౌర్యవంతుడగు నత్యుతు డందరి ముందరన్ దాఁదగువిధిఁ విశ్వరూపమును దర్శన మీయగఁ దత్సభాస్థలిన్భగవదను గ్రహంబుగల వారలు జూచిరి దివ్యరూపమున్గగనము ముష్టి మాత్రము, నగమ్ములు దేలును దూది పింజలై ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో గణభంగం. '... నచ్యుతు..' టైపాటు.
వినుటకు వింతగా సఖియ,వీధులకెక్కెనుశోభలందుచున్కనుటకుచిక్కనైనదియు,కండ్లకుగట్టెనునప్సరేయనన్తనువది తీగగానికను, తన్మయ మొందగ జేయురీతిగాగగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై+++++++++++++++++రావెల పురుషోత్తమరావు
నగవులు జిందునాసఖియ,నాణ్యముగానెలవంకబోలులేపగతురుగూడమెచ్చుకొను,భారతనారిగనుండనోపులేనిగనిగలాడుయానడుము,నివ్వెరమందగజేయుచుండగాగగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై+++++++++++++++++రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."నిగనిగలాడు నా నడుము నివ్వెరగందగ.." అనండి.
భగభగమండునాకనులు,భర్తనుగూడనురెచ్చగొట్టులేరగులగజేయుగుండియలు,రంజిలజేయును దేహమంతటిన్సెగలనుజిమ్ముయూరుపులు,సేతువగాగనిపించునాసికేగగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై+++++++++++++++++రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు."...జిమ్ము నూరువులు..." అనండి.
వగలనుజూపదెన్నటికి,వాసినిగన్నటువంటి నాతిగాపగలును రాత్రియుంగలసి,పన్నిన పన్నగమామెయేయనన్చిగురులబోడిగానికను చిందులువేసెడు చిన్మయమ్ముతోగగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై+++++++++++++++++రావెల పురుషోత్తమరావు
అరయగాను లోకమందన్నియునరె సంక్లిష్ట మైనదేను! కేలు మోడ్చివిభుని కృపను పొంద విజ్ఞత చేరంగనాకసమ్ము పిడికిలంత సుమ్ము జిలేబి
అనఘా! విభునియనుభవమ్మున గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై తోయనిధి జిలేబి యరచేయి యర్ఘ్యంబుగుగా!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అర్ఘ్యం బగుగా' టైపాటు అనుకుంటాను.
అగణితభక్తివైభవము నంది నిరంతరమీధరాస్థలిన్ దగునని పేదవారలకు తన్మయతన్ సహకారియౌచు నా ఖగగుని వారిలోపలను గాంచెడివాని మహత్వ మెంచినన్ గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై"
**గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై*పగలునుఱేయిఱేయియునుపట్టపగల్గగనానతారకల్నగవులుజిందుచున్హరిమనంబునభీతియిదేమిమాయయోజగముసమస్తమర్జునుడుశౌరివిరాట్పురుషాంశగాగనెన్
అగణితవిశ్వరూపమదియచ్చెరువొందెకిరీటియాజిలోభగభగమండెడగ్గిదనవారలుశత్రువులెల్లవారలన్దగవడిజొచ్చిజచ్చుటయుధైర్యముస్రుక్కెధరాంశమాత్రమై**గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై*బగలునుఱేయిసంజెయునువైష్ణవమాయగనెన్భయంబునన్
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య"గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలైనా పూరణ(సరిచేసి)చంపకమాలఅగణిత శౌర్యవంతుడగు నచ్యుతు డందరు చూచుచుండగన్దగువిధిఁ విశ్వరూపమును దర్శన మీయగఁ దత్సభాస్థలిన్భగవదను గ్రహంబుగల వారలు జూచిరి దివ్యరూపమున్గగనము ముష్టి మాత్రము, నగమ్ములు దేలును దూది పింజలై ఆదిభట్ల సత్యనారాయణ
ఆటవెలదిహనుమ యెరుగడంచు తనశక్తి తానెప్డుసీత వెదుక పంప చేరవచ్చిజాంబవంతుఁడనియె" సంకల్పమున నీకునాకసమ్ము పిడికిలంత సుమ్ము"చంపకమాలవగపునుఁ బాప రామునకుఁ బంపగ మారుతి సీతజాడకైయగణిత శక్తిశౌర్యములనందియు సత్యముఁ దానెరుంగడంచెగయఁగ జాంబవంతుడనె "నెంచఁగ నీదుమనోబలమ్మునన్గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై"
వ్యాపారాభివృద్ధి లక్ష్యము గా నా ప్రయత్నము : చం: దిగులును చెందకుండగను ధీటగు కృత్యము లాచరించుచున్మిగులగు రీతి లెక్కలను మించిన లాభము లంద నొప్పెడిన్ సుగుణము లెంచి సాధనగ చొచ్చిలు నప్పుడు నెల్ల భాగ్యమై గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలైవై. చంద్రశేఖర్
మనుజు మేధముందు మహిలోన నల్పముతళుకుమనుచు మెరయు తారలైనచందమామ యందు విందువినోదముల్ ఆకసమ్ము పిడికిలంత సుమ్ము
అగణిత శక్తి నీదనుచు నందరు మెచ్చగ రామదూత దానిగుడుచు నిల్చె నద్రి దృఢనిశ్చయుడై దరియింప వార్నిధిన్నెగడుచు బెంచె దేహమును నింగిని దాకు ననంతరూపమున్గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ప్రేరణంబు గలుగ భీతియు లేనట్టియాంజనేయు డుదధి నడ్డువచ్చు వారినధిగ మించి చేరలంక నతనికాకసమ్ము పిడికిలంత సుమ్ము
అగణిత తేజవంతులకు నద్భుతరీతిని నౌను దప్పకన్ గగనము ముష్టిమాత్రము ,నగమ్ములు దేలును దూదిపింజలైభగభగమండు మంటలును వారల దేజపుధాటి కత్తఱిన్ నెగడుచు నుండిచల్లనయి నీలుగుగోల్పడి యుండునేసుమా
ఆవ యంతయును మనో వేగము నెఱుఁగు జనులు కలరె పుడమిఁ జక చక చను నంతరంగ మందు నాలోచనల కెంచ నాకసమ్ము పిడికి లంత సుమ్ము విగత దురాశ నిత్య హృ దపేత మదాగ్రహ దుర్గుణావళిం ద్రిగుణ విహీన భక్తజన దీన జనావన కల్పవృక్ష పన్నగ శయ నాశ్రి తాంచిత జన ప్రవరాళికి నక్కజమ్ముగన్ గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ఆ.వె౹౹ మనిషి జన్మ లోని మర్మముల నెఱిఁగిచేయ వలయు కృషిని చేవ తోడశక్తి యుక్తి గలిపి సాధన సలిపినఆకసమ్ము పిడికిలంత సుమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
దీక్ష తోన వ్రాయు తీయని పద్యంబులోకులందరు రసలోలురవ్వఁమంచి భావములను మాన్యుడా ! వ్రాయంగఆకసమ్ము పిడికిలంత సుమ్ము.
ఈరోజు రెండు ఆన్ లైన్ అవధానాలు, పని ఒత్తిడి కారణంగా మీ పూరణలను చదివే అవకాశం దొరకలేదు. రేపు ఉదయం సమీక్షిస్తాను. మన్నించండి.
శాస్త్రములనొకండు శాసించ బూనగజగమునేలవచ్చె జంగమయ్యకవితలెల్ల వ్రాయు కవియొకండు బలికెఆకసమ్ము పిడికిలంత సుమ్ము!!
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
రగులగ మానసమ్మునను రచ్చను జేసెడి విప్రలంభమే
పగలును రాత్రియున్ గడిపి బాధను పొందుచు వార్త రాగనే
నగవులు చూడ పాపడిది నందన మొందగ హృత్తునందునన్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిచేతియందుసెల్లుజిలుగువెలుగుఁజూపు
రిప్లయితొలగించండిలోకమందుగుట్టులోననుండు
బ్రహ్మస్రుష్టిలోనిమర్మమేనిదియయ్యె
ఆకసమ్ముపిడికిలంతసుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో యతి తప్పింది. "బ్రహ్మసృష్టిలోని పరమార్థమే యిది" అనండి.
తప్పుసరిదిద్దుకుంటాను
తొలగించండిఅన్నుల మది లోతు నెన్నగలుగునట్టి
రిప్లయితొలగించండివాడులేడు కనగ వసుధ యందు
పొలతి మనసు తోడ పోల్చిచూసినవేళ
నాకసమ్ము పిడికిలంత సుమ్ము.
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీత గాంచి తనదు చేవను రూపింప
రిప్లయితొలగించండిసూక్ష్మ రూపు వీడి సులువు గాను
విశ్వ రూప మంది వెలుగొందు హనుమకు
నాకసమ్ము పిడికిలంత సుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీధి వీధి దొరుకు విశ్వమంత దొరుకు
రిప్లయితొలగించండిమందు తాగి జనులు పొందు మత్తు
మందు గ్రోలు వేళ మందుడవ్వు మనిషి
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మందుడవ్వు, మనిషి' అన్నవి సాధురూపాలు కావు. "మందుడౌ నరునకు" అనండి.
ధన్యవాదములండీ
తొలగించండివ్యాఖ్యను సరి చేసే విధానము తెలియదండీ
కొదువ లేదునిలను కోర్కెలు సరియైన
రిప్లయితొలగించండివిద్యగరపునట్టి వినయమిదియె
ఆశలోన మంచి ఆశయముండిన
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"..లేదు భువిని.." అనండి.
పగలునుఱేయిభావనయుబాసిరిమానవులీజగత్చునన్
రిప్లయితొలగించండిఖగపతి ద్రుష్టి సామ్యతనుకాంచిరిసెల్లునస్రుష్టినంతటిన్
అగణితమేధతోనరులునందిరిమింటినిఁదేగచేతికిన్
గగనముముష్టిమాత్రమునగమ్ములుదేలునుదూదిపింజలై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రేయి..జగత్తునన్...దృష్టి..సృష్టి..' టైపాట్లు.
ఆటవెలది
రిప్లయితొలగించండిచూడమని పిడికిట సూర్యచంద్రుల జూపెఁ
జెలఁగుచు చరవాణి చిత్రములను
యాకతాయి యనియె" యనుకొంటినన నాకు
నాకసమ్ము పిడికిలంత సుమ్ము!"
చంపకమాల
మిగిలిరి సూర్య చంద్రులిదె మిన్నఁగ చుట్టఁగ చేతివేళ్ళతో
నగణిత శక్తులున్ గలవటంచునుఁ దా చరవాణి జూపుచున్
మొగమున నిండగర్వమదె ముచ్చటగాననె నాకతాయి "యా
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై!"
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'చిత్రములను+ఆకతాయి' అన్నపుడు యడాగమం రాదు. "చిత్రములనె యాకతాయి" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండిఆటవెలది
చూడమని పిడికిట సూర్యచంద్రుల జూపెఁ
జెలఁగుచు చరవాణి చిత్రములనె
యాకతాయి యనియె" యనుకొంటినన నాకు
నాకసమ్ము పిడికిలంత సుమ్ము!"
జగతిని మానవుండు పలు శాస్త్రములన్ బఠియించి దక్షుడై
రిప్లయితొలగించండియగణిత మేధతో సరళ యంత్రములన్ సృజియించె నందులో
నిగనిగలాడెడాండ్రయిడనే చరవాణియె యందు కాంచగన్
గగనము ముష్టిమాత్రము, నగమ్ములు దేలును దూదిపింజలై .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపగలును రేయినిన్ జదివి పట్టుగ నున్నతవిద్య
రిప్లయితొలగించండినేర్వగా
సగటు కుటుంబ జీవికిని చక్కనికొల్వది ఫ్రాన్సు
దేశమున్
తగినది దొర్కగా జనెడు తావున జెట్టు విమాన యానమున్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిగగనము ముష్టిమాత్రము న
గమ్ములు దేలును దూదిపింజలై
( అంతెత్తున అమెరికాదేశానికి ఆకాశయానం కావిస్తున్న సమయంలో కలిగిన అనుభవం )
చంపకమాల
...................
సొగసుల నీలి యాకసము
చూపులలోపల దాగిపోవగా ;
నిగనిగలాడు కొండలతి
నేర్పుగ దెల్లగ సందడింపగా ;
మొగముల నిండె మోదమది
ముగ్ధవిమానపు యానమందునన్
గగనము ముష్టిమాత్రము ; న
గమ్ములు దేలును దూదిపింజలై .
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిపరుల యండగోరి పనులసలుపబోవ
రిప్లయితొలగించండిచిన్నదయినగూడ మిన్ను కెదుగు
స్వంతశక్తి నమ్మి సాగుసా ధకునికి
యాకసమ్ము పిడికిలంత సుమ్ము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మిన్నున కెదుగు' అనడం సాధువు. అక్కడ "మింటి కెదుగు" అనవచ్చు.
🙏🏽
తొలగించండియతి తప్పు తుందేమో, “మిన్ను నంటు” అనవచ్చా
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
రిప్లయితొలగించండితెగ తిరుగున్ నిజంబె విను తెల్పెదనయ్య నరుండు సృష్టి జే
సె గతి నశించ బంధముల సేతువు త్రుంచగ సెల్లుఫోనున్
పగగొని హస్తభూషగను భాసిల గూర్చెను విశ్వమందు నీ
జగతియె చేత నుండ మరి సాధ్యము కానిది లేదు లేదిలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి"గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలై
నా పూరణ
చంపకమాల
అగణిత శౌర్యవంతుడగు నత్యుతు డందరి ముందరన్ దాఁ
దగువిధిఁ విశ్వరూపమును దర్శన మీయగఁ దత్సభాస్థలిన్
భగవదను గ్రహంబుగల వారలు జూచిరి దివ్యరూపమున్
గగనము ముష్టి మాత్రము, నగమ్ములు దేలును దూది పింజలై
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో గణభంగం. '... నచ్యుతు..' టైపాటు.
వినుటకు వింతగా సఖియ,వీధులకెక్కెనుశోభలందుచున్
రిప్లయితొలగించండికనుటకుచిక్కనైనదియు,కండ్లకుగట్టెనునప్సరేయనన్
తనువది తీగగానికను, తన్మయ మొందగ జేయురీతిగా
గగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినగవులు జిందునాసఖియ,నాణ్యముగానెలవంకబోలులే
రిప్లయితొలగించండిపగతురుగూడమెచ్చుకొను,భారతనారిగనుండనోపులే
నిగనిగలాడుయానడుము,నివ్వెరమందగజేయుచుండగా
గగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"నిగనిగలాడు నా నడుము నివ్వెరగందగ.." అనండి.
భగభగమండునాకనులు,భర్తనుగూడనురెచ్చగొట్టులే
రిప్లయితొలగించండిరగులగజేయుగుండియలు,రంజిలజేయును దేహమంతటిన్
సెగలనుజిమ్ముయూరుపులు,సేతువగాగనిపించునాసికే
గగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...జిమ్ము నూరువులు..." అనండి.
వగలనుజూపదెన్నటికి,వాసినిగన్నటువంటి నాతిగా
రిప్లయితొలగించండిపగలును రాత్రియుంగలసి,పన్నిన పన్నగమామెయేయనన్
చిగురులబోడిగానికను చిందులువేసెడు చిన్మయమ్ముతో
గగనము ముష్టిమాత్రము,నగమ్ములుదేలునుదూదిపింజలై
+++++++++++++++++
రావెల పురుషోత్తమరావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయగాను లోకమందన్నియునరె సం
క్లిష్ట మైనదేను! కేలు మోడ్చి
విభుని కృపను పొంద విజ్ఞత చేరంగ
నాకసమ్ము పిడికిలంత సుమ్ము
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅనఘా! విభునియనుభవ
మ్మున గగనము ముష్టిమాత్రము నగమ్ములు దే
లును దూదిపింజలై తో
యనిధి జిలేబి యరచేయి యర్ఘ్యంబుగుగా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అర్ఘ్యం బగుగా' టైపాటు అనుకుంటాను.
అగణితభక్తివైభవము నంది నిరంతరమీధరాస్థలిన్
రిప్లయితొలగించండిదగునని పేదవారలకు తన్మయతన్ సహకారియౌచు నా
ఖగగుని వారిలోపలను గాంచెడివాని మహత్వ మెంచినన్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి**గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై*
రిప్లయితొలగించండిపగలునుఱేయిఱేయియునుపట్టపగల్గగనానతారకల్
నగవులుజిందుచున్హరిమనంబునభీతియిదేమిమాయయో
జగముసమస్తమర్జునుడుశౌరివిరాట్పురుషాంశగాగనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅగణితవిశ్వరూపమదియచ్చెరువొందెకిరీటియాజిలో
రిప్లయితొలగించండిభగభగమండెడగ్గిదనవారలుశత్రువులెల్లవారలన్
దగవడిజొచ్చిజచ్చుటయుధైర్యముస్రుక్కెధరాంశమాత్రమై
**గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై*
బగలునుఱేయిసంజెయునువైష్ణవమాయగనెన్భయంబునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి"గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలై
నా పూరణ(సరిచేసి)
చంపకమాల
అగణిత శౌర్యవంతుడగు నచ్యుతు డందరు చూచుచుండగన్
దగువిధిఁ విశ్వరూపమును దర్శన మీయగఁ దత్సభాస్థలిన్
భగవదను గ్రహంబుగల వారలు జూచిరి దివ్యరూపమున్
గగనము ముష్టి మాత్రము, నగమ్ములు దేలును దూది పింజలై
ఆదిభట్ల సత్యనారాయణ
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి"గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలై
నా పూరణ(సరిచేసి)
చంపకమాల
అగణిత శౌర్యవంతుడగు నచ్యుతు డందరు చూచుచుండగన్
దగువిధిఁ విశ్వరూపమును దర్శన మీయగఁ దత్సభాస్థలిన్
భగవదను గ్రహంబుగల వారలు జూచిరి దివ్యరూపమున్
గగనము ముష్టి మాత్రము, నగమ్ములు దేలును దూది పింజలై
ఆదిభట్ల సత్యనారాయణ
ఆటవెలది
రిప్లయితొలగించండిహనుమ యెరుగడంచు తనశక్తి తానెప్డు
సీత వెదుక పంప చేరవచ్చి
జాంబవంతుఁడనియె" సంకల్పమున నీకు
నాకసమ్ము పిడికిలంత సుమ్ము"
చంపకమాల
వగపునుఁ బాప రామునకుఁ బంపగ మారుతి సీతజాడకై
యగణిత శక్తిశౌర్యములనందియు సత్యముఁ దానెరుంగడం
చెగయఁగ జాంబవంతుడనె "నెంచఁగ నీదుమనోబలమ్మునన్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై"
వ్యాపారాభివృద్ధి లక్ష్యము గా నా ప్రయత్నము :
రిప్లయితొలగించండిచం:
దిగులును చెందకుండగను ధీటగు కృత్యము లాచరించుచున్
మిగులగు రీతి లెక్కలను మించిన లాభము లంద నొప్పెడిన్
సుగుణము లెంచి సాధనగ చొచ్చిలు నప్పుడు నెల్ల భాగ్యమై
గగనము ముష్టి మాత్రము నగమ్ములు దేలును దూది పింజలై
వై. చంద్రశేఖర్
మనుజు మేధముందు మహిలోన నల్పము
రిప్లయితొలగించండితళుకుమనుచు మెరయు తారలైన
చందమామ యందు విందువినోదముల్
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము
అగణిత శక్తి నీదనుచు నందరు మెచ్చగ రామదూత దా
రిప్లయితొలగించండినిగుడుచు నిల్చె నద్రి దృఢనిశ్చయుడై దరియింప వార్నిధిన్
నెగడుచు బెంచె దేహమును నింగిని దాకు ననంతరూపమున్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ప్రేరణంబు గలుగ భీతియు లేనట్టి
రిప్లయితొలగించండియాంజనేయు డుదధి నడ్డువచ్చు
వారినధిగ మించి చేరలంక నతని
కాకసమ్ము పిడికిలంత సుమ్ము
అగణిత తేజవంతులకు నద్భుతరీతిని నౌను దప్పకన్
రిప్లయితొలగించండిగగనము ముష్టిమాత్రము ,నగమ్ములు దేలును దూదిపింజలై
భగభగమండు మంటలును వారల దేజపుధాటి కత్తఱిన్
నెగడుచు నుండిచల్లనయి నీలుగుగోల్పడి యుండునేసుమా
ఆవ యంతయును మనో వేగము నెఱుఁగు
రిప్లయితొలగించండిజనులు కలరె పుడమిఁ జక చక చను
నంతరంగ మందు నాలోచనల కెంచ
నాకసమ్ము పిడికి లంత సుమ్ము
విగత దురాశ నిత్య హృ దపేత మదాగ్రహ దుర్గుణావళిం
ద్రిగుణ విహీన భక్తజన దీన జనావన కల్పవృక్ష ప
న్నగ శయ నాశ్రి తాంచిత జన ప్రవరాళికి నక్కజమ్ముగన్
గగనము ముష్టిమాత్రము నగమ్ములు దేలును దూదిపింజలై
ఆ.వె౹౹
రిప్లయితొలగించండిమనిషి జన్మ లోని మర్మముల నెఱిఁగి
చేయ వలయు కృషిని చేవ తోడ
శక్తి యుక్తి గలిపి సాధన సలిపిన
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదీక్ష తోన వ్రాయు తీయని పద్యంబు
రిప్లయితొలగించండిలోకులందరు రసలోలురవ్వఁ
మంచి భావములను మాన్యుడా ! వ్రాయంగ
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము.
ఈరోజు రెండు ఆన్ లైన్ అవధానాలు, పని ఒత్తిడి కారణంగా మీ పూరణలను చదివే అవకాశం దొరకలేదు. రేపు ఉదయం సమీక్షిస్తాను. మన్నించండి.
రిప్లయితొలగించండిశాస్త్రములనొకండు శాసించ బూనగ
రిప్లయితొలగించండిజగమునేలవచ్చె జంగమయ్య
కవితలెల్ల వ్రాయు కవియొకండు బలికె
ఆకసమ్ము పిడికిలంత సుమ్ము!!