17-3-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పంచవటిలో వసించిరి పాండుసుతులు”(లేదా...)“లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:మేకుల బోలు ముక్కులను మేయుచు నక్షయపాత్రలన్నమున్పీకుచు దోసె ముక్కలను ప్రీతిని చేరుచు చెట్లమీదనున్కాకులు రచ్చజేయగను కానన మందున నాటకమ్మునన్ లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
రాముడున్ సీత తోగూడి రమ్య మైనపంచవటిలో వసించిరి, పాండు సుతులుతల్లి కుంతితో కూడి సంతసముగ నివసించె నేకచక్ర పురిలో చెలిమి బడసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నివసించి రేకచక్రపురిలో...' అనండి.
మాతకుంతికియిచ్చినమాటనరసితగవులేకనుధర్మంపుతరుణినీడమనసుపండంగమరియాదమరులువిరియపంచవటిలోవసించిరిపాండుసుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కుంతికి నిచ్చిన' అనండి.
తండ్రి మాట కొరకు కాననుండిరయ్యలక్ష్మణాగ్రజుండును సీత లక్షణముగపంచవటిలో ; వసించిరి పాండుసుతులుమత్స్య నగరున పందెపు మాట మేర...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మొదటి పాదంలో యతి తప్పింది. 'కాననుండ్రి గాదె/సుమ్ము' అనండి.
ధన్యవాదములండీ
వాకిటసూర్యుడుండుగదవాసిగచంద్రునివంతువచ్చుగాతాకగమేనినంతటినిదాపుననుండునుపంచభూతముల్ఆకలిఁదీర్పగాఫలములారునుదక్కునుదేవభూమిలోలోకులుమెచ్చపంచవటిలోనవసించిరిపాండునందనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాకులు భిన్నమైన నిల సత్యము ధర్మము నాదరించగా,తేకువ జూపుచున్ మునుల దీక్షనుసాగిరి రామలక్ష్మణుల్లోకులు మెచ్చ పంచవటిలోన ;వసించిరి పాండునందనుల్ కాకులు దూరలేనివగు కానలలోనను కష్టమెంచకన్
క్రమాలంకారం లో ----వాస మెచట రాముని కయ్యె వనము నందు? జూదము న నోడి యెవ్వరు శోభ తరిగి బాధ లందిరి వనమున వసుధ యందు? పంచ వటి లో వసించిరి : పాండు సుతులు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నియమనిష్టలరాముడునిలన తనకుసీతతోడుగనివసించిచిక్కునపడెపంచవటిలో, వసించిరి పాండుసుతులుమత్శ్యదేశమునఙ్ఞాతమై,విధివిపరీతముగ,తెలియుటనెవరితరమగును?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నిష్ఠల శ్రీరాము డిలను.. మత్స్యభూమి నజ్ఞాతమై..' అనండి.
పాండవులు వనవాస సమయం లో సరస్వతీ నదీ తీరాన , పంచవటి ని వోలు ప్రదేశంలో ఉన్నారని తెలిసి లోకులు / కృష్ణుడు మెచ్చారనే భావన ఆధారంగా నా ప్రయత్నము : ఉ: భీకర మైన కాననము వెన్నెల కారు ఝరీ సరస్వతీ సైకత మెంచి తామరల సౌరభ మంతయు గ్రోలు చుండగన్పీకల దాక మెక్కుచును పేరిమి సిద్ధుల పెంపు గోరుచున్లోకులు మెచ్చ పంచవటి లోన వసించిరి పాండు నందనుల్వై. చంద్రశేఖర్
ధన్యవాదములు
రామగాథలో గనదగు రమ్యరీతిభారతకథలో వినిపించు భావదీప్తిచెవులబడినను మందుడు జెప్పెనిటులపంచవటిలో వసించిరి పాండుసుతులు
సమస్య :లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి పాండునందనుల్ ( అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు - అజ్ఞాతవాసంలో ద్రౌపదీధర్మజభీమార్జుననకులసహదేవులు )ఉత్పలమాల ....................శ్రీకమనీయమూర్తి యగు సీతమ , లక్ష్మణు లిర్వురుండగా నా కమలాయతాక్షుడగు నచ్యుతరూపుడు రాముడుండెలే లోకులు మెచ్చ బంచవటిలోన ; వసించిరి పాండునందనుల్ దేకువ ద్రౌపదిన్ గొనుచు దిన్నగ మత్స్యపురంబునందునన్ .( తేకువ- సాహసము ; మత్స్యపురము - విరాటనగరము )
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
శ్రీకరమై యరణ్య మిట క్షేమము గూర్చును భారతంబునన్ జేకొని దీక్ష నాయెడల సీతయు, రాముడు, లక్ష్మణుండు నీలోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్ప్రాకటమైనరీతి వనవాసము చేసిరి సంతసమ్మునన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
( పంచవటి ప్రాశస్త్యము )లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్వేకువ జామునస్మరణ వీడక కొల్చెడు, రామ చంద్రుడున్శోకుల ముక్కు చెవ్వులను శూర్ఫణకిచ్చటె కోలు పోయెనేన్నాకపు లోక వైరియట నాతిని సీతను పట్టె మోసమున్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జామునన్ స్మరణ...చంద్రుడున్ సోకుల ముక్కు కర్ణముల (చెవ్వుల అనడం సాధువు కాదు)..పోయెనే నాకపు..' అనండి.
దాశరథియు మా సీతమ్మ తల్లి యకటపంచవటిలో వసించిరి; పాండుసుతులుకష్ట పడిరకట జిలేబి కాననమున ! తాత తలరాత యెవరికిన్ తప్పదాయె!జిలేబి
ధవుని యాజ్ఞను తలదాల్చ తరలివెళ్ళిరామ లక్ష్మణ సీతలరణ్య మందుపంచవటిలో వసించిరి ; పాండుసుతులుజూదమున శిక్షగ వనము జొచ్చిరిగద
అరె! సీతారాములు దేవర! లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్ దాచిరి తలలను కాననమున చింతయు తొలగన్జిలేబి
ప్రశంసనీయమైన పూరణ. అభినందనలు.
తేటగీతికాలవశమునఁ గానల పాల వడుచునట నివాస యోగ్యమ్మగు నంకమందనలసి యొకరేయి విశ్రాంతి నలరనెంచిపంచవటిలో వసించిరి పాండుసుతులుపంచవటి = ఐదు మఱ్ఱిచెట్లుగల ప్రదేశముచీకటి గ్రమ్మి జీవితము చిక్కులపాలయి కాననమ్ములన్శ్రీకరమైన రామకథఁ జెప్పఁగ మౌనులు నాలకించుచున్ప్రాకటమైన రీతి వనవాసము జేయుచు స్వప్నమందునన్లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తే.గీ//రామ,లక్ష్మణాదులు,సీత రాజ్యమొదలిపంచవటిలో వసించిరి, పాండుసుతులు lకౌశలముగ దీక్షవహించి కౌరవులనుమట్టుబెట్టియు దుఃఖ్ఖించె గుట్టుగాను ll
పంచ తీర్థములందు సద్భక్తి మునిగిసంచితంబుల పాప సంక్షయముఁగాగపంచఁజేరిరి విరటు;సౌభాగ్యమనుచుపంచవటిలో వసించిరి పాండు సుతులు.
కైకవరానరాఘవుడుకానలకేగెనుసీతలక్ష్మణుల్భీకరమైనదండకమువెచ్చనిపచ్చనిపర్ణశాలలో**లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి;; పాండునందనుల్”*దేకువజూదమందుననుదేజముగోల్పడిజేరిరాటవిన్
తరుణి కైకేయి కోరగా దాశరథియెజానకీలక్ష్మ ణులతోడ కాన కుజనిపంచవటిలో వసించిరి, పాండుసుతులు పలువిధమ్ముల కష్టముల్ బడసిరైరి . . . . విరించి.
కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తానా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుంజేకొని దండకాటవిని జేరి యటన్ శిఫ గౌతమీ తటిన్ లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్ ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.
కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తానా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుల్ లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్ ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.
పాండవులు వట వృక్షమ్ము వంటి వారెకదర! యేవురు కలరంచు నదియె పంచవటిగ దలపోయ నది పొరపాటు కాదు పంచ వటిలో వసించిరి పాండుసుతులు . . . . విరించి.
ధర్మ పరిరక్షణార్థము దావమందురామచంద్రుడు జానకి లక్ష్మణుండుపంచవటిలో వసించిరి, పాండుసుతులుకానలంబడి బొందిరి కష్టములను
రామ లక్ష్మణులును సీత రమ్యమలరపంచవటిలో వసించిరి,పాండుసుతులుమీదుమిక్కిలి తేజస్సు నొదవి భువినిపాలనంబును జేసిరి బాహుబలిని
పంచియల్ గట్టి యెల్లరు నంచితముగ నంచె లంచెలుగా సంచరించు చొక్క మంచి దినమెంచి కొంచెము మంచు ముంచఁ బంచవటిలో వసించిరి పాండుసుతులు నా కనిపించె నివ్విధి వనమ్ముల వారలు తిర్గు నప్పుడే వీఁకఁ జరించుచుం బుడమి విస్తృత కానన పంక్తి నింపుగా నేక దినంబ యా రఘు వరేంద్రునిఁ దల్చుచు సంతసమ్మునన్ లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
చీకును జింతయున్ వదలి సిగ్గును గల్గగ బల్కుచుంటె?యేలోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?లోకులు గాకులందురిల లోకులమాటలు గడ్డిపోచలేయీకలి పూరుషున్ మహిమ లేయివి వీటిని నమ్మబోకుడీ
లోకమునందు ధర్మమును లోగొని రక్షణ జేయు దీక్షతోశ్రీకరుడైన రాముడును సీతయు తమ్ముడు లక్ష్మణుండునున్లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్జేకొని ద్రౌపదిన్ వనముజేరిరి ధర్మనిబద్ధులై భువిన్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
మేకుల బోలు ముక్కులను మేయుచు నక్షయపాత్రలన్నమున్
పీకుచు దోసె ముక్కలను ప్రీతిని చేరుచు చెట్లమీదనున్
కాకులు రచ్చజేయగను కానన మందున నాటకమ్మునన్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిరాముడున్ సీత తోగూడి రమ్య మైన
రిప్లయితొలగించండిపంచవటిలో వసించిరి, పాండు సుతులు
తల్లి కుంతితో కూడి సంతసముగ నివ
సించె నేకచక్ర పురిలో చెలిమి బడసి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నివసించి రేకచక్రపురిలో...' అనండి.
మాతకుంతికియిచ్చినమాటనరసి
రిప్లయితొలగించండితగవులేకనుధర్మంపుతరుణినీడ
మనసుపండంగమరియాదమరులువిరియ
పంచవటిలోవసించిరిపాండుసుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కుంతికి నిచ్చిన' అనండి.
తండ్రి మాట కొరకు కాననుండిరయ్య
రిప్లయితొలగించండిలక్ష్మణాగ్రజుండును సీత లక్షణముగ
పంచవటిలో ; వసించిరి పాండుసుతులు
మత్స్య నగరున పందెపు మాట మేర
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పాదంలో యతి తప్పింది. 'కాననుండ్రి గాదె/సుమ్ము' అనండి.
ధన్యవాదములండీ
తొలగించండివాకిటసూర్యుడుండుగదవాసిగచంద్రునివంతువచ్చుగా
రిప్లయితొలగించండితాకగమేనినంతటినిదాపుననుండునుపంచభూతముల్
ఆకలిఁదీర్పగాఫలములారునుదక్కునుదేవభూమిలో
లోకులుమెచ్చపంచవటిలోనవసించిరిపాండునందనుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసాకులు భిన్నమైన నిల సత్యము ధర్మము నాదరించగా,
రిప్లయితొలగించండితేకువ జూపుచున్ మునుల దీక్షనుసాగిరి రామలక్ష్మణుల్
లోకులు మెచ్చ పంచవటిలోన ;వసించిరి పాండునందనుల్
కాకులు దూరలేనివగు కానలలోనను కష్టమెంచకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రమాలంకారం లో ----
రిప్లయితొలగించండివాస మెచట రాముని కయ్యె వనము నందు?
జూదము న నోడి యెవ్వరు శోభ తరిగి
బాధ లందిరి వనమున వసుధ యందు?
పంచ వటి లో వసించిరి : పాండు సుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినియమనిష్టలరాముడునిలన తనకు
రిప్లయితొలగించండిసీతతోడుగనివసించిచిక్కునపడె
పంచవటిలో, వసించిరి పాండుసుతులు
మత్శ్యదేశమునఙ్ఞాతమై,విధివిప
రీతముగ,తెలియుటనెవరితరమగును?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిష్ఠల శ్రీరాము డిలను.. మత్స్యభూమి నజ్ఞాతమై..' అనండి.
పాండవులు వనవాస సమయం లో సరస్వతీ నదీ తీరాన , పంచవటి ని వోలు ప్రదేశంలో ఉన్నారని తెలిసి లోకులు / కృష్ణుడు మెచ్చారనే భావన ఆధారంగా నా ప్రయత్నము :
రిప్లయితొలగించండిఉ:
భీకర మైన కాననము వెన్నెల కారు ఝరీ సరస్వతీ
సైకత మెంచి తామరల సౌరభ మంతయు గ్రోలు చుండగన్
పీకల దాక మెక్కుచును పేరిమి సిద్ధుల పెంపు గోరుచున్
లోకులు మెచ్చ పంచవటి లోన వసించిరి పాండు నందనుల్
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిరామగాథలో గనదగు రమ్యరీతి
రిప్లయితొలగించండిభారతకథలో వినిపించు భావదీప్తి
చెవులబడినను మందుడు జెప్పెనిటుల
పంచవటిలో వసించిరి పాండుసుతులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిలోకులు మెచ్చ బంచవటి
లోన వసించిరి పాండునందనుల్
( అరణ్యవాసంలో సీతారామలక్ష్మణులు - అజ్ఞాతవాసంలో ద్రౌపదీధర్మజభీమార్జుననకులసహదేవులు )
ఉత్పలమాల
....................
శ్రీకమనీయమూర్తి యగు
సీతమ , లక్ష్మణు లిర్వురుండగా
నా కమలాయతాక్షుడగు
నచ్యుతరూపుడు రాముడుండెలే
లోకులు మెచ్చ బంచవటి
లోన ; వసించిరి పాండునందనుల్
దేకువ ద్రౌపదిన్ గొనుచు
దిన్నగ మత్స్యపురంబునందునన్ .
( తేకువ- సాహసము ; మత్స్యపురము - విరాటనగరము )
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశ్రీకరమై యరణ్య మిట క్షేమము గూర్చును భారతంబునన్
రిప్లయితొలగించండిజేకొని దీక్ష నాయెడల సీతయు, రాముడు, లక్ష్మణుండు నీ
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్
ప్రాకటమైనరీతి వనవాసము చేసిరి సంతసమ్మునన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి( పంచవటి ప్రాశస్త్యము )
రిప్లయితొలగించండిలోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందను
ల్వేకువ జామునస్మరణ వీడక కొల్చెడు, రామ చంద్రుడు
న్శోకుల ముక్కు చెవ్వులను శూర్ఫణకిచ్చటె కోలు పోయెనే
న్నాకపు లోక వైరియట నాతిని సీతను పట్టె మోసమున్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జామునన్ స్మరణ...చంద్రుడున్ సోకుల ముక్కు కర్ణముల (చెవ్వుల అనడం సాధువు కాదు)..పోయెనే నాకపు..' అనండి.
ధన్యవాదములండీ
తొలగించండి
రిప్లయితొలగించండిదాశరథియు మా సీతమ్మ తల్లి యకట
పంచవటిలో వసించిరి; పాండుసుతులు
కష్ట పడిరకట జిలేబి కాననమున !
తాత తలరాత యెవరికిన్ తప్పదాయె!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధవుని యాజ్ఞను తలదాల్చ తరలివెళ్ళి
రిప్లయితొలగించండిరామ లక్ష్మణ సీతలరణ్య మందు
పంచవటిలో వసించిరి ; పాండుసుతులు
జూదమున శిక్షగ వనము జొచ్చిరిగద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅరె! సీతారాములు దే
వర! లోకులు మెచ్చఁ బంచవటిలోన వసిం
చిరి, పాండునందనుల్ దా
చిరి తలలను కాననమున చింతయు తొలగన్
జిలేబి
ప్రశంసనీయమైన పూరణ. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండికాలవశమునఁ గానల పాల వడుచు
నట నివాస యోగ్యమ్మగు నంకమంద
నలసి యొకరేయి విశ్రాంతి నలరనెంచి
పంచవటిలో వసించిరి పాండుసుతులు
పంచవటి = ఐదు మఱ్ఱిచెట్లుగల ప్రదేశము
చీకటి గ్రమ్మి జీవితము చిక్కులపాలయి కాననమ్ములన్
శ్రీకరమైన రామకథఁ జెప్పఁగ మౌనులు నాలకించుచున్
ప్రాకటమైన రీతి వనవాసము జేయుచు స్వప్నమందునన్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండితే.గీ//
రిప్లయితొలగించండిరామ,లక్ష్మణాదులు,సీత రాజ్యమొదలి
పంచవటిలో వసించిరి, పాండుసుతులు l
కౌశలముగ దీక్షవహించి కౌరవులను
మట్టుబెట్టియు దుఃఖ్ఖించె గుట్టుగాను ll
పంచ తీర్థములందు సద్భక్తి మునిగి
రిప్లయితొలగించండిసంచితంబుల పాప సంక్షయముఁగాగ
పంచఁజేరిరి విరటు;సౌభాగ్యమనుచు
పంచవటిలో వసించిరి పాండు సుతులు.
కైకవరానరాఘవుడుకానలకేగెనుసీతలక్ష్మణుల్
రిప్లయితొలగించండిభీకరమైనదండకమువెచ్చనిపచ్చనిపర్ణశాలలో
**లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి;; పాండునందనుల్”*
దేకువజూదమందుననుదేజముగోల్పడిజేరిరాటవిన్
తరుణి కైకేయి కోరగా దాశరథియె
రిప్లయితొలగించండిజానకీలక్ష్మ ణులతోడ కాన కుజని
పంచవటిలో వసించిరి, పాండుసుతులు
పలువిధమ్ముల కష్టముల్ బడసిరైరి .
. . . విరించి.
కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తా
రిప్లయితొలగించండినా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుం
జేకొని దండకాటవిని జేరి యటన్ శిఫ గౌతమీ తటిన్
లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్
ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.
కైకయె కోరినంతట సుగాత్రుడు రాముడయోధ్యవీడి తా
రిప్లయితొలగించండినా కనకాంగి సీతయు ప్రియానుజు డైన సుమిత్రనందనుల్
లోకులు మెచ్చ బంచవటిలోన వసించిరి, పాండు నందనుల్
ధూకరు డై సుయోధనుని దుశ్చరితమ్ముల గాంచి రోసిరే . విరించి.
పాండవులు వట వృక్షమ్ము వంటి వారె
రిప్లయితొలగించండికదర! యేవురు కలరంచు నదియె పంచ
వటిగ దలపోయ నది పొరపాటు కాదు
పంచ వటిలో వసించిరి పాండుసుతులు .
. . . విరించి.
ధర్మ పరిరక్షణార్థము దావమందు
రిప్లయితొలగించండిరామచంద్రుడు జానకి లక్ష్మణుండు
పంచవటిలో వసించిరి, పాండుసుతులు
కానలంబడి బొందిరి కష్టములను
రామ లక్ష్మణులును సీత రమ్యమలర
రిప్లయితొలగించండిపంచవటిలో వసించిరి,పాండుసుతులు
మీదుమిక్కిలి తేజస్సు నొదవి భువిని
పాలనంబును జేసిరి బాహుబలిని
పంచియల్ గట్టి యెల్లరు నంచితముగ
రిప్లయితొలగించండినంచె లంచెలుగా సంచరించు చొక్క
మంచి దినమెంచి కొంచెము మంచు ముంచఁ
బంచవటిలో వసించిరి పాండుసుతులు
నా కనిపించె నివ్విధి వనమ్ముల వారలు తిర్గు నప్పుడే
వీఁకఁ జరించుచుం బుడమి విస్తృత కానన పంక్తి నింపుగా
నేక దినంబ యా రఘు వరేంద్రునిఁ దల్చుచు సంతసమ్మునన్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి పాండునందనుల్
చీకును జింతయున్ వదలి సిగ్గును గల్గగ బల్కుచుంటె?యే
రిప్లయితొలగించండిలోకులు మెచ్చ పంచవటిలోన వసించిరి పాండునందనుల్?
లోకులు గాకులందురిల లోకులమాటలు గడ్డిపోచలే
యీకలి పూరుషున్ మహిమ లేయివి వీటిని నమ్మబోకుడీ
లోకమునందు ధర్మమును లోగొని రక్షణ జేయు దీక్షతో
రిప్లయితొలగించండిశ్రీకరుడైన రాముడును సీతయు తమ్ముడు లక్ష్మణుండునున్
లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి, పాండునందనుల్
జేకొని ద్రౌపదిన్ వనముజేరిరి ధర్మనిబద్ధులై భువిన్