16-3-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ”(లేదా...)“పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:ప్రీతిన్ గూర్చుచు ప్రేక్షకాళికిలనున్ ప్రేమాయణాలందునన్భీతిన్ జెందక వేషమేయుచు కడున్ బీభత్సమున్ జేయుచున్నీతిన్ వీడుచు చిత్ర సీమలనయో నేరంబులన్ బొందుచున్ పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్టి సావిత్రియే :)
* పాపిష్ఠి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
ఓ తింగరిబుచ్చీ! నీపాతివ్రత్యముఁ జెఱచితివా! సావిత్రీమాత కథచదువ వే! తలరాతను మార్చుకొనవే తిరముగ జిలేబీ!జిలేబి
భీతి నెఱుంగక పతి తలరాతను మార్చెడు వరములు రాబట్టి యహో!హేతువు, కాలుని నియమముఁపాతివ్రత్యముఁ , జెరచితివా సావిత్రీ!
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
ఖ్యాతివహించెనుగద నీపాతివ్రత్యము, జెరచితివా సావిత్రీ నైతులసద్ముని విధి, పరి ణేతను బ్రతికించుకొనగ, నేర్పరి వీవే . . . . విరించి.
రీతిగ ప్రాణము తీయుట ఖ్యాతౌ నాకున్నరయగ , కాంతుని యుసురున్రాతను విడి పొందియు నాపాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ధన్యవాదములండీ
జాతికి మేలై వెలసియు మాతగ బూజలను గొన్న మహిళగ నుండన్ ఖ్యాతిని గూర్చ దిటు లనగ " పాతివ్రత్యము జెఱచితివా సావిత్రీ !"
( *యముని అంతర్మదనముగా* ) పాతిన్ గైకొని వచ్చువేళ సతి యా వాల్గంటి భంగించి తా నా తాపంబున నిల్వరించె గద యత్యంతాద్భుతమ్మామెదౌ పాతివ్రత్యము, మంటగల్పెను గదా పాపిష్టి సావిత్రియే నాతంత్రమ్మునె గాదుటే మగువ విన్నానమ్మునే జూపుచున్
రాతి మనసు కరిగించెనుపాతివ్రత్యముఁ, జెఱచితివా సావిత్రీనైతులసద్ముని వ్రతమునునాతతమగునీ తితిక్ష యవధులు మీరన్
నీతిగసరోగసీతోసతిగాకనగనుసుతులనుశమమునుబోందన్అతిగాతలపులునెందుకుపాతివ్రత్యముజెఱచితివాసావిత్రీ
శార్దూల విక్రీడితము:+++++++++++++++++++++ప్రీతింజెందగజేయుచున్ విభుడు తాపీయూషధారల్నిడున్ఖ్యాతింబొందిన ధీరయౌవనితకే కాయమ్ము శైధిల్యమైరాతిన్ గొట్టినబొమ్మగానయెనుగా,రాకాసిభర్తన్ గనన్పాతివ్రత్యము మంటగొల్పెనుగదా,పాపిష్టిసావిత్రియే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంచైతన్యంబగు నటనలఁబ్రీతిన్ నామగడు లొంగఁ బెళ్లాడితె? నాపాతిన్ నే తెగడఁగ నాపాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ! శార్దూలవిక్రీడితముచైతన్యంబున సాగుచున్ నటనలో సామర్థ్యమున్ జూపుచున్బ్రీతిన్గూర్చుచు లొంగఁదీసి 'జెమినిన్' బ్రేమంచుఁ బెళ్లాడి నాపాతిన్ నే తెగడంగ జేసెనది నప్రాచ్యుండుగా నేఁబల్కనాపాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠి సావిత్రియే✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.వృత్తం మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :శార్దూలవిక్రీడితముచైతన్యంబున సాగుచున్ నటనలో సామర్థ్యమున్ జూపుచున్బ్రీతిన్గూర్చుచు లొంగఁదీసి 'జెమినిన్' బ్రేమంచుఁ బెళ్లాడి నాపాతిన్ నే తెగడంగ జేసెనది నప్రాచ్యుండుగ న్బల్కనాపాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే
పాతికి రోగము సోకగనాతని మరచి పరమాత్ము నారా ధనపైకౌతుకముజూపు చుంటివిపాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ
"సావిత్రి" ఒక సామాన్య రంగస్థల నటి గా నా ప్రయత్నము: శా: ఏ తీరమ్మును దాటి వచ్చినదహో యేంచక్క రంగంబుగన్కూతల్ నోటికి వచ్చు రీతి నతిగన్ కూయంగ నిర్భీతిగన్భ్రాతా యన్నను మాత యన్న తగు గా భావించదే చోద్యమున్పాతివ్రత్యము మంట గల్పెను గదా పాపిష్టి సావిత్రియే వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఏంచక్క' అన్నది వ్యావహారికం.
ధన్యవాదములు;. ఎంచక్క ను యేతెంచి అని. మారుస్తాను
సమస్య :పాతివ్రత్యము మంట గల్పెను గదా పాపిష్ఠి సావిత్రియే ( మొదటిభార్య సావిత్రి తనను మోసగించి వెళ్లిపోగా సత్యవతి అనే మరొక అమ్మాయిని వివాహమాడదలచి ఆమెతో పలుకుతున్న ఆనందరావు )శార్దూలవిక్రీడితము -----------------నాతీ ! సత్యవతీ ! నినున్ సతతమున్ నా దేవిగా నెంచితిన్ ;జేతోమోదము సందడింపగను నీ చేయంది దాంపత్య సం గీతాలాపన జేయుదున్ ; మదముతో ఖేదంబు గల్గించుచున్ బాతివ్రత్యము మంట గల్పెను గదా !పాపిష్ఠి సావిత్రియే .( చేతోమోదము - మానసికసంతోషము చేయంది - పాణిగ్రహణం కావించి )
పాతాళమ్మె జిలేబి దాని గతి! యవ్వారమ్ము తీవ్రమ్మయెన్!పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్టి! సావిత్రి యేమో తన్వంగికి పేరు! జాణెతయె వామ్మో దాని తీరాయెగా!యీ తంత్రమ్ముల పూవుబోడి కెడ నీకేలన్బొ సాంగత్యముల్!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వామ్మో' అనడం వ్యావహారికం. 'నీకేలన్బొ'? "నీ కేలబ్బు"కు టైపాటా?
కం//జోతలు బెట్టెద తల్లీ !పాతివ్రత్యముఁ జెఱచితివా ! సావిత్రీ lతాతమ్మయు జేజమ్మయుబూతుల నెన్నడు బలుకరు,పూజ్యులె మాకున్ ll
నీతుల్జెప్పెనుదీసెగోతులనువర్ణింపంగవేదాంతమున్నాతీరత్నమటంచునెంచినుతినజ్ఞానంబునన్సల్పితిన్చేతోమోదముసారద్రావివిటునిన్జేరంగస్త్రీజాతిదౌ*పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే”*
కం//మాతవు శుభాంగి నీవేపాతివ్రత్యముఁ జెఱచితివా ! సావిత్రీ lమాతొలి దైవంబిలలోనీతిగ బల్కిన ముదముగ నినునే గొలుతున్ ll
పాతకమౌనిట్టులనుట"పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ"ప్రేతాధిపు నెదిరి నిలిచిపాతివ్రత్యమున నిల్పె పతి ప్రాణంబుల్
ఖ్యాతిం గాంచును శీలసంపద నిలన్ గల్యాణియైయంచు సంప్రీతిన్ సచ్ఛుభ నామధేయమిడి రవ్వేళన్ తనూజాత కాచేతశ్శుద్ధులు నీతి దప్ప నదియున్ చిత్తంబునం దెంచి రిట్లాపాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠి సావిత్రియే.
ఓతల్లీ యేమాయెనుపాతివ్రత్యముజెఱచితివా సావిత్రీ!నీతినిమాలిన యీపనికాతరమే లేద నీకు కాంతా!చెపుమా
చేతులు జోడించుచు నే రీతి నొసఁగ నతులు జాలుఁ బృథ్విని నీకున్ నాతీ యము నిష్ఠఁ, బఱపి పాతివ్రత్యముఁ, జెఱచితివా సావిత్రీ చూతుర్నిత్యము మన్మథా ర్తులు మహా చోద్యంబుగా ధూర్తులే శాతేద్ధోదరి నీతి నెన్న కకటా సావిత్రి పేరూనియున్ వీతాపత్రప భర్త నెంచక మదిన్ విద్రోహ చిత్తమ్మునం బాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే
పాతివ్రత్యము మంటగల్పెనుగదా పాపిష్ఠ సావిత్రియేపాతివ్యత్యము రక్ష సేయుటకునై భారంపు కార్యంబయౌప్రేతేశుం దగనొప్పుకోలుగను దాబ్రీతిన్ వి భుంబ్రాణిగాబంతంబొప్పగ జేసెనప్పుడు గదాప్రాణాల నర్ధించియే
కైతల్జెప్పుటమానుడీకవులుమీగోడున్వినండెవ్వడున్జేతల్గాగనుజాగ్రుతిన్జనులుజేగోట్టచానల్బలేభ్రాతల్మీరలుభామవెంటబడుచున్ప్రశ్నింపనీచంబగున్పాతివ్రత్యముమంటగల్పెనుగదాపాపిష్టిసావిత్తియే
పూతచరితనియెరింగియు"పాతివ్రత్యము చెరచితివా సావిత్రీనీతియు కాదిది" యనుటేరీతిగ సబబౌను చెపుమ రేయీపగలున్
నాతియడిగెమూడువరములేతీరుగనుపతియసువులేకరువైనన్రోతగయముడుదలచెనుగ"పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ"
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
ప్రీతిన్ గూర్చుచు ప్రేక్షకాళికిలనున్ ప్రేమాయణాలందునన్
భీతిన్ జెందక వేషమేయుచు కడున్ బీభత్సమున్ జేయుచున్
నీతిన్ వీడుచు చిత్ర సీమలనయో నేరంబులన్ బొందుచున్
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్టి సావిత్రియే :)
* పాపిష్ఠి
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండి
రిప్లయితొలగించండిఓ తింగరిబుచ్చీ! నీ
పాతివ్రత్యముఁ జెఱచితివా! సావిత్రీ
మాత కథచదువ వే! తల
రాతను మార్చుకొనవే తిరముగ జిలేబీ!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభీతి నెఱుంగక పతి తల
రిప్లయితొలగించండిరాతను మార్చెడు వరములు రాబట్టి యహో!
హేతువు, కాలుని నియమముఁ
పాతివ్రత్యముఁ , జెరచితివా సావిత్రీ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఖ్యాతివహించెనుగద నీ
రిప్లయితొలగించండిపాతివ్రత్యము, జెరచితివా సావిత్రీ
నైతులసద్ముని విధి, పరి
ణేతను బ్రతికించుకొనగ, నేర్పరి వీవే .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరీతిగ ప్రాణము తీయుట
రిప్లయితొలగించండిఖ్యాతౌ నాకున్నరయగ , కాంతుని యుసురున్
రాతను విడి పొందియు నా
పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిజాతికి మేలై వెలసియు
రిప్లయితొలగించండిమాతగ బూజలను గొన్న మహిళగ నుండన్
ఖ్యాతిని గూర్చ దిటు లనగ
" పాతివ్రత్యము జెఱచితివా సావిత్రీ !"
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( *యముని అంతర్మదనముగా* )
రిప్లయితొలగించండిపాతిన్ గైకొని వచ్చువేళ సతి యా వాల్గంటి భంగించి తా
నా తాపంబున నిల్వరించె గద యత్యంతాద్భుతమ్మామెదౌ
పాతివ్రత్యము, మంటగల్పెను గదా పాపిష్టి సావిత్రియే
నాతంత్రమ్మునె గాదుటే మగువ విన్నానమ్మునే జూపుచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరాతి మనసు కరిగించెను
రిప్లయితొలగించండిపాతివ్రత్యముఁ, జెఱచితివా సావిత్రీ
నైతులసద్ముని వ్రతమును
నాతతమగునీ తితిక్ష యవధులు మీరన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతిగసరోగసీతో
రిప్లయితొలగించండిసతిగాకనగనుసుతులనుశమమునుబోందన్
అతిగాతలపులునెందుకు
పాతివ్రత్యముజెఱచితివాసావిత్రీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశార్దూల విక్రీడితము:
రిప్లయితొలగించండి+++++++++++++++++++++
ప్రీతింజెందగజేయుచున్ విభుడు తాపీయూషధారల్నిడున్
ఖ్యాతింబొందిన ధీరయౌవనితకే కాయమ్ము శైధిల్యమై
రాతిన్ గొట్టినబొమ్మగానయెనుగా,రాకాసిభర్తన్ గనన్
పాతివ్రత్యము మంటగొల్పెనుగదా,పాపిష్టిసావిత్రియే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిచైతన్యంబగు నటనలఁ
బ్రీతిన్ నామగడు లొంగఁ బెళ్లాడితె? నా
పాతిన్ నే తెగడఁగ నా
పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ!
శార్దూలవిక్రీడితము
చైతన్యంబున సాగుచున్ నటనలో సామర్థ్యమున్ జూపుచున్
బ్రీతిన్గూర్చుచు లొంగఁదీసి 'జెమినిన్' బ్రేమంచుఁ బెళ్లాడి నా
పాతిన్ నే తెగడంగ జేసెనది నప్రాచ్యుండుగా నేఁబల్కనా
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠి సావిత్రియే
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండివృత్తం మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండిశార్దూలవిక్రీడితము
చైతన్యంబున సాగుచున్ నటనలో సామర్థ్యమున్ జూపుచున్
బ్రీతిన్గూర్చుచు లొంగఁదీసి 'జెమినిన్' బ్రేమంచుఁ బెళ్లాడి నా
పాతిన్ నే తెగడంగ జేసెనది నప్రాచ్యుండుగ న్బల్కనా
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే
పాతికి రోగము సోకగ
రిప్లయితొలగించండినాతని మరచి పరమాత్ము నారా ధనపై
కౌతుకముజూపు చుంటివి
పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"సావిత్రి" ఒక సామాన్య రంగస్థల నటి గా నా ప్రయత్నము:
రిప్లయితొలగించండిశా:
ఏ తీరమ్మును దాటి వచ్చినదహో యేంచక్క రంగంబుగన్
కూతల్ నోటికి వచ్చు రీతి నతిగన్ కూయంగ నిర్భీతిగన్
భ్రాతా యన్నను మాత యన్న తగు గా భావించదే చోద్యమున్
పాతివ్రత్యము మంట గల్పెను గదా పాపిష్టి సావిత్రియే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఏంచక్క' అన్నది వ్యావహారికం.
ధన్యవాదములు;. ఎంచక్క ను యేతెంచి అని. మారుస్తాను
తొలగించండిసమస్య :
రిప్లయితొలగించండిపాతివ్రత్యము మంట గల్పెను గదా
పాపిష్ఠి సావిత్రియే
( మొదటిభార్య సావిత్రి తనను మోసగించి వెళ్లిపోగా సత్యవతి అనే మరొక అమ్మాయిని వివాహమాడదలచి ఆమెతో పలుకుతున్న ఆనందరావు )
శార్దూలవిక్రీడితము
-----------------
నాతీ ! సత్యవతీ ! నినున్ సతతమున్
నా దేవిగా నెంచితిన్ ;
జేతోమోదము సందడింపగను నీ
చేయంది దాంపత్య సం
గీతాలాపన జేయుదున్ ; మదముతో
ఖేదంబు గల్గించుచున్
బాతివ్రత్యము మంట గల్పెను గదా !
పాపిష్ఠి సావిత్రియే .
( చేతోమోదము - మానసికసంతోషము చేయంది - పాణిగ్రహణం కావించి )
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపాతాళమ్మె జిలేబి దాని గతి! యవ్వారమ్ము తీవ్రమ్మయెన్!
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్టి! సావిత్రి యే
మో తన్వంగికి పేరు! జాణెతయె వామ్మో దాని తీరాయెగా!
యీ తంత్రమ్ముల పూవుబోడి కెడ నీకేలన్బొ సాంగత్యముల్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వామ్మో' అనడం వ్యావహారికం. 'నీకేలన్బొ'? "నీ కేలబ్బు"కు టైపాటా?
కం//
రిప్లయితొలగించండిజోతలు బెట్టెద తల్లీ !
పాతివ్రత్యముఁ జెఱచితివా ! సావిత్రీ l
తాతమ్మయు జేజమ్మయు
బూతుల నెన్నడు బలుకరు,పూజ్యులె మాకున్ ll
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతుల్జెప్పెనుదీసెగోతులనువర్ణింపంగవేదాంతమున్
రిప్లయితొలగించండినాతీరత్నమటంచునెంచినుతినజ్ఞానంబునన్సల్పితిన్
చేతోమోదముసారద్రావివిటునిన్జేరంగస్త్రీజాతిదౌ
*పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే”*
కం//
రిప్లయితొలగించండిమాతవు శుభాంగి నీవే
పాతివ్రత్యముఁ జెఱచితివా ! సావిత్రీ l
మాతొలి దైవంబిలలో
నీతిగ బల్కిన ముదముగ నినునే గొలుతున్ ll
పాతకమౌనిట్టులనుట
రిప్లయితొలగించండి"పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ"
ప్రేతాధిపు నెదిరి నిలిచి
పాతివ్రత్యమున నిల్పె పతి ప్రాణంబుల్
ఖ్యాతిం గాంచును శీలసంపద నిలన్ గల్యాణియైయంచు సం
రిప్లయితొలగించండిప్రీతిన్ సచ్ఛుభ నామధేయమిడి రవ్వేళన్ తనూజాత కా
చేతశ్శుద్ధులు నీతి దప్ప నదియున్ చిత్తంబునం దెంచి రిట్లా
పాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠి సావిత్రియే.
ఓతల్లీ యేమాయెను
రిప్లయితొలగించండిపాతివ్రత్యముజెఱచితివా సావిత్రీ!
నీతినిమాలిన యీపని
కాతరమే లేద నీకు కాంతా!చెపుమా
చేతులు జోడించుచు నే
రిప్లయితొలగించండిరీతి నొసఁగ నతులు జాలుఁ బృథ్విని నీకున్
నాతీ యము నిష్ఠఁ, బఱపి
పాతివ్రత్యముఁ, జెఱచితివా సావిత్రీ
చూతుర్నిత్యము మన్మథా ర్తులు మహా చోద్యంబుగా ధూర్తులే
శాతేద్ధోదరి నీతి నెన్న కకటా సావిత్రి పేరూనియున్
వీతాపత్రప భర్త నెంచక మదిన్ విద్రోహ చిత్తమ్మునం
బాతివ్రత్యము మంటఁ గల్పెను గదా పాపిష్ఠ సావిత్రియే
పాతివ్రత్యము మంటగల్పెనుగదా పాపిష్ఠ సావిత్రియే
రిప్లయితొలగించండిపాతివ్యత్యము రక్ష సేయుటకునై భారంపు కార్యంబయౌ
ప్రేతేశుం దగనొప్పుకోలుగను దాబ్రీతిన్ వి భుంబ్రాణిగా
బంతంబొప్పగ జేసెనప్పుడు గదాప్రాణాల నర్ధించియే
కైతల్జెప్పుటమానుడీకవులుమీగోడున్వినండెవ్వడున్
రిప్లయితొలగించండిజేతల్గాగనుజాగ్రుతిన్జనులుజేగోట్టచానల్బలే
భ్రాతల్మీరలుభామవెంటబడుచున్ప్రశ్నింపనీచంబగున్
పాతివ్రత్యముమంటగల్పెనుగదాపాపిష్టిసావిత్తియే
పూతచరితనియెరింగియు
రిప్లయితొలగించండి"పాతివ్రత్యము చెరచితివా సావిత్రీ
నీతియు కాదిది" యనుటే
రీతిగ సబబౌను చెపుమ రేయీపగలున్
నాతియడిగెమూడువరము
రిప్లయితొలగించండిలేతీరుగనుపతియసువులేకరువైనన్
రోతగయముడుదలచెనుగ
"పాతివ్రత్యముఁ జెఱచితివా సావిత్రీ"