20, మార్చి 2021, శనివారం

సమస్య - 3669

21-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున”
(లేదా...)
“కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్”
(వరంగల్ 'పద్యప్రభంజన పరిచయ సభ' సందర్భంగా...)

38 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  వాడను వాడనున్ జనుచు బంగరు నిచ్చెడు నేతలెల్లరిన్
  మేడల లోననున్ గలిసి మెచ్చుచు వ్రాయక వంద పాటలన్
  తాడును పేడునున్ గనక తప్పులు మెండుగ నీవు జేయగా
  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్?

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కవనమన్న మక్కువతోడ కదలునట్టి
  కృష్ణరాయల వలెనుండు క్షితిపతులను
  ఆశ్రయించు వారికికాక నన్యులకిల
  కూడు పెట్టునా పద్యముల్ గూడు నిడునా?

  రిప్లయితొలగించండి
 3. అలకలను మానగ వలయు నబల,వినుము

  కూడు బెట్టు నా పద్యముల్, గూడు నిడున

  ని విసు వాసము నాకుండె , భువన మేలు

  రాజ్య సభలోన ఘనతను‌ రమ్య గతిని

  పొందె దనని పలికె కవి పొలతి తోడ

  రిప్లయితొలగించండి
 4. కూడు బెట్టునా పద్యముల్ గూడు నిడున
  అనుచు తెలిసి తెలియనట్టి యల్పు లండ్రు
  తెలివి గలవార లేనాడు దీని గూర్చి
  పలుక విందుమె యీ రీతి పైత్య మెపుడు?

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గురుభ్యోనమః

  ఆశావాద దృక్పథంతో..

  సరస కవితా రసముల నాస్వాదనమున
  పోషకులు మెండుగా రాజ్యములను జేయ
  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున
  యన్న భావ్యమా జదువరీ యరసిజూడ!

  రిప్లయితొలగించండి
 6. మద్యపు దుకాణమున వచ్చు , మరులు గొలుపు

  మానినుల మానపు దుకాణమందు కలుగు

  సాగరుని కొమరెత దయ సరసముగను

  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 7. వాడలవాడలన్ దిరిగి పద్యప్రబంధములెన్నియెన్నియో
  వాడిగవేడిగాప్రజలవాకిటనుంచిరసజ్ఞకోటికిన్
  వేడుకవిందొనర్చితినివృద్ధులబుద్ధులమారకున్నచో
  *గూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్”*

  రిప్లయితొలగించండి
 8. నేటికాలానదీటైననియతిలేక
  పద్యనిందనుఁజేసెనుపామరుండు
  కూడుబెట్టునాపద్యముల్గూడునిడున
  యనుచుపెద్దలుభావింపహానినిచ్చు

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  పోడిమిగూడు కైతలను పొందుగ గైకొని సంతసమ్ముతో
  బేడలనిచ్చి మెచ్చగల విట్పతి రాయల వంటి వారిచే
  గూడును గల్గు పండితులకున్ మరి వారును లేని వేళలన్
  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్?

  రిప్లయితొలగించండి


 10. లేని పోని సమస్యల లెస్స లెస్స
  యని ప్రతిదినము చింతించి యందరికి ప
  ని కలిపించి ఖుసిపడుట నిక్కమయ్య
  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున!  నారదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. పోడిమిమీరభారవికిభూరిగనిచ్చెనుకీర్తిపద్యమే
  ఆడెనుపద్యకన్యకయునాంధ్రుడురాయలప్రాంగణమ్మునన్
  వ్రీడనువీడివీధులనువేడుకవాదనభావ్యమెట్లగున్
  కూడునుబెట్టునాయిడునఁగూడునుపద్యములెన్నడేనియున్

  రిప్లయితొలగించండి
 12. పద్యముల వ్రాయ లేనట్టి పామరుండు
  పండితునిగ పేర్గాంచిన బాసటఁ గని
  ప్రత్యనీకమందుచుతాను పలికె నిటుల
  కూడు బెట్టునా పద్యముల్ గూడు నిడున .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 13. బోడిక వ్రాయు పద్యములు బుద్ధులనుండి ప్రశంసలందగన్
  సూడును బొంది పల్కెనట చుట్టపు చూపుగ వచ్చినట్టి యా
  మోడుల తోడ నివ్విధిని భోగ్యము నివ్వని కైతలెందుకో
  కూడును బెట్టునా, యిడున గూడును పద్యము లెన్నడేనియున్. ....... . ........ విరించి.

  రిప్లయితొలగించండి
 14. ఉ||
  రేడు కవిత్వభారతిని ప్రేమను భక్తినిజూపి గైకొనన్
  నాడు గలుంగ శక్యమగు నాణ్యకవిత్వము నేడు జూచినన్
  పాడు కవిత్వమంచు జనపాలురిలన్ మరి ముగ్గుజూపకన్
  కూడును బెట్టునా యిడున గూడును పద్యములెన్నడేనియున్?

  రోహిత్ శర్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  2వ పూరణ
  కుకవి నింద:

  ఉ||
  నేడు విశిష్ఠవైఖరుల నేర్చియు పద్యము, వ్రాయబూని సా
  లీడులు నేయు నేతల వలెన్ గణపంక్తులిడన్ కవిత్వమే?
  బూడిద గల్గు భావముల బొర్లుచు నిందలనేల జేతువో?
  కూడును బెట్టునా యిడున గూడును పద్యములెన్నడేనియున్?

  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  3వ పూరణ:
  కుకవి నింద

  తే.గీ||
  "అప్పికట్లకు బాపట్ల యారుమైళ్ళు"
  యన్న గణపంక్తి పద్యమేయగును గాని
  కవితగాదుగా! నాణ్యతన్ గనని పదులు
  కూడుబెట్టునా పద్యముల్ గూడునిడున?

  రోహిత్ 🙏🏻🙏🏻🙏🏻

  రిప్లయితొలగించండి
 15. కె.వి.యస్. లక్ష్మి:

  దేశ భాషలందు తెలుగు తేనెటంచు
  పూజలందిన కాలమ్మె పూజ్యమయ్యె
  కాలదోషము పట్టెగా కవులకింక
  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున?

  రిప్లయితొలగించండి
 16. సమస్య :
  కూడును బెట్టునా యిడున
  గూడును పద్యము లెన్నడేనియున్

  ( పద్యవైశిష్ట్యమెరుగని భార్యామణి పద్యవ్యసనుడైన నిరుద్యోగభర్తతో )

  ఉత్పలమాల
  -------------

  చేడియ లిర్వురున్ గలరు ;
  చెప్పిన పల్కులు మీకు నచ్చవే ?
  వాడుచునుండె జీవితము ;
  వ్రాసిన వ్రేళులు కాయగాచెనే ?
  పోడిమివృత్తి నారయుడు ;
  పొండిక కైతలమత్తు మానుడీ !
  కూడును బెట్టునా ? యిడున
  గూడును పద్యము లెన్నడేనియున్ ??

  (పోడిమివృత్తి - తగినపని )

  రిప్లయితొలగించండి


 17. ప్రముఖము గా కాన్పడు చూ
  డుము! కూడునుఁ బెట్టునా యిడున గూడును ప
  ద్యములెన్నఁడేనియున్? కవు
  లు మూఢులని తెలియవచ్చు క్లుప్తముగ సుమీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 18. కాలమంతయు కైతలగడిపి నంత
  నీదుకోరిక దీర్చును నిశ్చయముగ
  గాని బతుకును సాగించ గావలసిన
  గూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. ఉ:

   తోడగుటెంచ జీవనము తుంటరి ధ్యాసల నెంచబోక నే
   పాడగ పద్యముల్ కలము వ్రాయగ పొందిక మానసంబుగన్
   కీడును బార ద్రోలు, పరికింపగ పాటియె బల్క నివ్విధిన్
   కూడును బెట్టునా యిడున గూడును పద్యము లెన్న డేనియున్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 20. ఉత్పలమాల క్రమాలంకారంలో

  కాడిని మ్రోయు రైతుజన కష్ట ఫలంబిడు కూడు కూళుడున్ ;
  కూడును బెట్ట చింతిలెడు కుత్సిత పుత్రుడు తల్లిదండ్రికై ;
  నాడును నుద్ధరించి ప్రజ నాల్కల నిల్చెడి నీతి పద్యమే ;
  కూడును బెట్టునా ? యిడున గూడును ? పద్యము లెన్నఁడేనియున్ !

  నాడు = దేశము

  రిప్లయితొలగించండి
 21. కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్?
  బీడును కూడ దున్ని తను పెట్టును కూడును హాలికుండిలన్,
  గోడలుఁ గప్పు కట్టి తను గూడు నొసంగును మేస్త్రి, పద్యమే
  మేడల నిచ్చు? నాత్మకు నమేయముగా పరితుష్టినిచ్చునే౹౹

  రిప్లయితొలగించండి
 22. కవి గారి భార్య భర్తతో

  🌹తేట గీతి🌹

  మద్యపు దుకాణమున వచ్చు , మరులు గొలుపు

  మానినుల మానపు దుకాణమందు కలుగు

  సాగరుని కొమరెత దయ సరసముగను

  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  భార్యకు, కవి సమాధానము
  🌹ఉత్పల మాల🌹

  వాడిని నమ్మి వ్రాసితిని వారిజ నాభుని కీర్తి గాధలన్

  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్”

  చూడరు వాణి పుత్రులట సుందర కావ్యపు కర్తలెప్పుడున్

  వాడిన వేళ కోరుచును వల్లభు సన్నిధి వెల్గు జిల్గులున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 23. పగలు రేయన్క పసలేని పద్యములను
  పూరణంబులు జేతురు మీరలెపుఁడు
  యెందుకొచ్చిన తిప్పలు? యేమి ఫలము?
  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున?

  రిప్లయితొలగించండి
 24. వీడక నెల్లవేళలను వేకువ రాతిరి భేదమెంచకన్
  పోఁడిమి లేని పద్యములు పూరణ జేతురదేమి చోద్యమో
  వీడుడు చేతగాని పని వేసటచెందగనేల నీగతిన్
  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్

  రిప్లయితొలగించండి
 25. వాడు నిరంతరమ్ముగను వ్రాయుచునుండి కవిత్వపంక్తులన్
  జూడక లేమిచే సతియు సూనులు గుంద ధనార్జనార్థమై
  యేడను యత్నముల్ సలుప కింటనెయుండగ భార్య యిట్లనెన్
  గూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్”

  రిప్లయితొలగించండి


 26. కూడుఁ బెట్టు, నా పద్యముల్, గూడు నిడున
  యా తెలంగాణ రాష్ట్రమందయ్య ! ముఖ్య
  మంత్రి ప్రోత్సహించె కవుల మంచి గాను
  నిండు సభలోన మన్నిక నిడుచు నాడు!


  తెలుగు మహాసభలలో కవుల సన్మానము
  జిలేబి

  రిప్లయితొలగించండి
 27. భార్యాభర్తల సంవాదము

  భార్య:
  కూడును బెట్టునా యిడున గూడును పద్యము లెన్నడేనియున్?
  భర్త:
  కూడును గుడ్డనున్ గొనుటె కూర్చునె శోభను మానవాళికిన్?
  పోడిమి కైతకున్ విలువ పొందుగ స్పష్టము నల్వరాణికే
  నేడకు బోయినన్ ఘనము నేర్పడుగా మరియాదలే
  యిలన్

  విద్వాన్ సర్వత్ర పూజ్యతే

  రిప్లయితొలగించండి
 28. పాడయిపోయెజీవితముపద్యపు, పుస్తకమచ్చువేయుటన్
  వాడలవాడలందిరిగి,వాస్తవమేనను రీతినందరిన్
  గోడునజెప్పజూడగను,కొందరికోపముజూచిభీతిలన్
  కూడునుబెట్టునాయిడునగూడును,పద్యములెన్నడేనియున్
  ++++++++++++++++++++
  రావెల పురుషోత్తమరావు

  రిప్లయితొలగించండి
 29. కూడుబెట్టునా పద్యముల్ గూడునిడున
  సందియంబును వీడుము శర్మ!నీవు
  రెండునిచ్చును బద్యముల్ మెండుగాను
  శారదామాత దయనవి సంభవించు

  రిప్లయితొలగించండి
 30. కూడునుబెట్టునా యిడున గూడును పద్యము లెన్నడేనియున్
  వీడుడు సంశయంబునిక బేర్మిని నాయమ యిచ్చువాటినిన్
  నేడిద రామచంద్రకవి!యీభువనంబున దప్పకుండగన్
  బాడగనుండు దీయగను బద్యములెప్పుడు దేనెవోలెసూ

  రిప్లయితొలగించండి
 31. శ్రీనాథ మహాకవి పోతనామాత్యులతో...

  తేటగీతి
  వాణి కరుణ భాగవతము వాసిఁగొనఁగ
  నమరు సంపదల్ రాజునకంకితమిడ
  బావ! రామార్పితము సేయ వ్రాసుకొన్న
  కూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున?

  ఉత్పలమాల
  బీడుల దున్నఁగన్ గలుఁగు విత్తము చాలునటంచు, బావయా!
  బేడలకంకితమ్మడుఁగ వేడుక భాగవతమ్ము రాజులున్
  పోఁడిమిఁ గాదు ముఖ్యమని మూర్ఖత రామున కీయనెంచితే
  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్?

  రిప్లయితొలగించండి
 32. గౌరవం బిచ్చు ధాత్రి నపారముగను
  రాజు లక్షర లక్షల నోజ నిడ న
  నశ్వరపు ఖ్యాతిఁ గూర్చును విశ్వమందుఁ
  గూడుఁ బెట్టునా పద్యముల్ గూడు నిడున


  చూడుము వీడి నిస్పృహను శోకము సజ్జన కోటి వెన్నఁడున్
  గోడుల నాలకింపక నిగూఢ కుతంత్రము సేయు చుండినన్
  వాఁడి పదమ్ము లుగ్రముగ వాడిన ఱేఁడును గంప మందఁడే
  కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్

  రిప్లయితొలగించండి
 33. "కూడునుఁ బెట్టునా యిడున గూడును పద్యము లెన్నఁడేనియున్
  పాడు దలంపు మాను"మను వారల మాటలసత్యమెన్నడున్
  కూడ దగౌరవంబరయ గుర్వగు ధీమసమందజేయుచున్
  పోడిమి దెన్గు భాషకును భూషణమౌ గన పద్య విద్యయే
  వీడక శ్రద్ధ నేర్వవలె వీనుల విందగు పద్యమల్లుటన్
  వీడుము శంక గాన మిల పెంపగు ప్రక్రియ వేరు భాషలన్

  రిప్లయితొలగించండి
 34. సమస్య:
  కూడు బెట్టునె పద్యముల్ గూడు నిడున

  తే.గీ.
  పద్య రచనను మొదలిడి భర్త తనదు
  భార్య చెప్పిన పనులను వదలి పెట్టె
  పత్ని యాగ్రహించి పతితో పలికె నిటుల
  కూడు బెట్టునె పద్యముల్ గూడు నిడున

  తిరివీధి శ్రీమన్నారాయణ

  రిప్లయితొలగించండి
 35. కోరుకొన్న వేవియు నిల కొనక రేయి
  పగలు పుస్తకములు పట్టి వ్రాయు చున్న
  నేమిఫలమువానివలన నీకు కలుగు
  కూడు బెట్టునా పద్యముల్ గూడు నిడున

  రిప్లయితొలగించండి