14, మార్చి 2021, ఆదివారం

సమస్య - 3663

15-3-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్”
(లేదా...)
“కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా”
(తడకమళ్ళ రామచంద్ర రావు గారికి ధన్యవాదాలతో...)

76 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కావ్యంబందున మున్గి పండితుడయో కన్నీరు మున్నీరుగన్
  నవ్యంబయ్యెడి రోగమే తగులగన్ నందంపు హాస్యంబునన్
  సేవ్యంబయ్యెడి మందునున్ గనకయే చేదోడు వాదోడగున్
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

  రిప్లయితొలగించండి
 2. కందం
  సవ్యముగఫలితమున్ గని
  భవ్యమనుచు మంత్రికిడఁగ వారము లోనన్
  నవ్యపు రూపున సోకుచు
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శార్దూలవిక్రీడితము
   సవ్యమ్మౌ ఫలితమ్ములంది కడు విశ్వాసాన శాస్ర్రజ్ఞులున్
   భవ్యమ్మంచును మంత్రివర్యునకిడన్ వ్యాక్సిన్, నిరోధింపగన్
   నవ్యమ్మౌ యొక రూపమెత్తి మరలన్ నర్తించుచున్ సోకుచున్
   కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 3. రా! వ్యాహ్యాళికిపురుగును
  కోవ్యాక్సిన్జంపుననెడికోమలిపలుకున్
  సవ్యముగాదనెప్రియుడును
  కోవ్యాక్సిన్గనికరోనగోల్లుననవ్వెన్

  రిప్లయితొలగించండి
 4. నవ్యతయనుచును మరచిరి

  దివ్యములౌ మాటలు , మరి తెచ్చిన తన్నున్,

  సవ్యపు నడతను, దునిమెడు

  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. సవ్యంబేయనిశాస్త్రసంగతినితాసత్యంబుశోధింపగా
  నవ్యంబైనదిసూదిమందువోడమెన్నాకంబుజూపింపగా
  భవ్యంబైనవిశేషవేషముననేమార్చెన్వడిన్పుర్వునున్
  కోవ్యాక్సిన్గనిగోల్లుమంచునయయోకోవిడ్హసించెన్గదా

  రిప్లయితొలగించండి
 6. దివ్యమ్మగు నౌషధమని
  సవ్యంబుగ గన్గొనంగ సరసపు ధరకే ,
  నవ్యంపు వేరియంటగు
  కోవ్యాక్సిన్ గని, కరోన గొల్లున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 7. దివ్యంబగు నోషధి
  భవ్యంపు చికిత్స కిది బాగని పలుకన్
  నవ్యపు రీతిగ వచ్చు చు
  కో వ్యాక్సిన్ గని కరో న గొల్లున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 8. అవ్యక్తంబౌజాడ్యము
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్
  దివ్యౌషధమౌ జతనము
  సవ్యముగామెలగ వలయు సంయమతోడన్

  రిప్లయితొలగించండి
 9. దివ్యంబౌ యౌషధమది
  కోవ్యాక్సినటంచు జనులు కువలయ మందున్
  భవ్యంబనుచు మురియ నా
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్ .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 10. సవ్యంబౌ యగదమ్ము వచ్చెనని విశ్వంబంత తోషమ్ము తో
  భవ్యంబే యొనగూడునంచు తలచే పాళంబులో గాంచగన్
  హవ్యంబున్ శ్రువమందు వేసిన విధిన్ యక్ష్మమ్ములో పెర్గుచున్
  గోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 11. అందరికి నమస్సులు🙏

  దివ్యముగ మందిని చిదిమి
  నవ్యపు రీతులను బొంది నరకము జూపన్
  సవ్యపు సమయము కాదని
  *"కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్”*

  *వాణిశ్రీ నైనాల*

  రిప్లయితొలగించండి
 12. శా:

  దివ్యంబై వెలుగొందు జీవన గతుల్ దేభ్యమ్ముగా మార్చె నా
  నవ్యంబన్న కరోన పీడ నిక పన్నాగమ్ముతో ద్రుంచనై
  సవ్యంబంచని టీక కన్గొనగ హే సారమ్ము తగ్గింపదే
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

  దేభ్యము =పనికి మాలిన
  పన్నాగము=ఎత్తుగడ
  సారము =బలిమి

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. దివ్యౌషధమని జనులన
  కోవ్యాక్సిన్ గని, కరోన గొల్లున నవ్వెన్
  సవ్యముగా మెలగని ప్రజ
  కే వ్యాక్సిన్ యైన దప్పవిక్కట్టులనిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వ్యాక్సిన్+ఐన' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

   తొలగించండి
 14. కందము:
  దివ్యపు తరుణో పాయమి
  కవ్యా క్సీనే నటంచు గౌరవ మిడుచున్
  భవ్యము గజనులు గైకొను
  కోవ్యా క్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్

  వరగంటి నగేష్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇక వ్యాక్సిన్' అన్నపుడు 'క' గురువు కాదు. 'వ్యాక్సీనే యటంచు' అని ఉండాలి.

   తొలగించండి
 15. సమస్య :
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో
  కోవిడ్ హసించెన్ గదా

  ( ఒక నిరాశావాది - మరొక ఆశావాది )
  శార్దూలవిక్రీడితము
  ..........................

  " కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో !
  కోవిడ్ హసించెన్ గదా ! "
  " నీ వ్యాఖ్యానము దిద్దుకొమ్ము హితుడా !
  నేత్రద్వయంబున్ సదా
  భవ్యంబౌ పరిశోధనన్నిడి జగ
  ద్భద్రంబు గాంక్షించుచున్
  దివ్యంబైన మహౌషధంబులను ద
  ద్దీక్ష్ణత్వమున్ బాపరే ? "

  రిప్లయితొలగించండి
 16. అవ్యాజపు భీతినిగొనె
  కోవ్యాక్సిన్ గని కరోన ; గొల్లున నవ్వెన్
  నవ్యమయిన యా టీకా
  సవ్యముగ మెలగితినంచు సంతోషమునన్

  రిప్లయితొలగించండి
 17. నవ్యంబౌ పరిశోధనల్ సలిపి చైనావారు సృష్టించిరే,
  యవ్యాజంబగు స్ఫూర్తితో తుద కిలన్ వ్యాప్తిన్ నివారించగా
  దివ్యంబౌ పరమౌషధిన్ వడిని సాధించంగ, వింతన్ మహా
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా౹౹

  రిప్లయితొలగించండి
 18. ఆవ్యాధిగ్రసితుండు శంక మనమం దత్యంతమై నిల్వగా
  సవ్యం బియ్యది కాదుకాదను కొనెన్ సత్యంబు భీతిన్ గొనెన్
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో, కోవిడ్ హసించెన్ గదా
  యావ్యక్తిన్ యమదర్శనం బగునుపో యంచున్ విలాసంబుగన్.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ గురుభ్యోనమః

  కం.
  దివ్యౌషద మున్నదనప
  సవ్యముగా సంచరించు జనులను గనగా
  నవ్యపు రూపుల దాల్చుచు,
  కోవ్యాక్సిన్ గని, కరోన గొల్లున నవ్వెన్

  మహమ్మారి అంతమయ్యే వరకూ ప్రజలంతా బాధ్యతగా నిబంధనలు పాటించాలన్న హెచ్చరికతో..

  రిప్లయితొలగించండి


 20. భవ్యము! కీడు తొలగు! మా
  లవ్యా! వేసుకొను హితుడ! లాభమ్మే! రా
  నవ్యత దీని సొబగనన్
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. సవ్యాసవ్యములెచ్చటన్మిగిలెరా సాధారణంబయ్యెరా

  నవ్యాకర్షణ బారి చేరు విధి మిన్నాగమ్ము పాలైతివే

  దివ్యంబౌ దెస చేర్చినట్టి నను నిద్రింపంగ కన్గొంటివే

  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా”

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి


 22. భవ్యంబైనది మందు వేసుకొనుడీ ప్రాణాంతకంబైన రో
  గవ్యాప్తిన్ సరి చేయవచ్చు పిలువన్ గంభీరతన్ మోడియే,
  సవ్యంబైనది దేశమందెపుడురా జాగ్రత్తగన్ చేసిరో?
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య

  " కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నగియెన్"
  లేదా
  కోవ్యాక్సిన్గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్గదా

  నా పూరణ(కరోన కోవ్యాక్సిన్ ను చూచి తనలో తాను)

  కందము

  సేవ్యంబైనవి యసువులు
  భవ్యంబౌ నాదు ప్రతిభ ప్రకటితమయ్యెన్
  కోవ్యాక్సిన్! వచ్చితివా?
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్

  శార్దూలము

  భవ్యంబై చెలరేగితిన్ ప్రజల సంపత్తుల్ వినాశంబుగాన్
  సేవ్యంబైనవి నిండుప్రాణములు నాచేతన్ సుభోజ్యంబులై
  నవ్యాసక్త ప్రయోగముల్ జరిపి నన్నాపంగ నీశక్యమే
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్గదా

  ఆదిభట్ల సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 24. నవ్యంబౌఁబరిశోధన
  సవ్యంబుగసాగినేడుస్వఛ్చతబెంచన్
  దివ్యగుణంబులనోర్వక
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్”

  కొరుప్రోలు రాధాకృష్ణరావు

  రిప్లయితొలగించండి
 25. సవ్యేష్ఠుండయి బాధ్యతల్ గొనుచు తా సారథ్యమున్ మోడి సం
  భావ్యంబంది కరోన రోగమును బాపన్నౌషధిన్ గాంచ న
  ద్ద్రావ్యాత్ముండయి నూత్న మందు ప్రజకందన్జేసె జాప్యంబవన్
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

  రిప్లయితొలగించండి
 26. భవ్యము జనులకు‌ నొసగన్

  దివ్యంబగు నౌషదమును తేవ వెరువకన్

  నవ్యముగచెల్లి రాగా

  కోవ్యాక్సిన్ గని కరోనా గొల్లున‌నవ్వెన్

  కోవిడ్ మరల సెకండ్ వేవ్ ‌వచ్చిన సందర్భములో కోవిడ్‌ 19 చూసి నవ్విన సందర్భము

  రిప్లయితొలగించండి
 27. ఏవ్యాపారము సాగదయ్యె నిలలో నేడాది దాటెన్ గదా!
  నవ్యాకారము దాల్చివచ్చి జగతిన్ నాట్యంబునేజేయగా!
  దివ్యాస్త్రంబని సూచిమందు లిడినన్, దేహంబులే కూలగన్
  అవ్యాజంబగు నెమ్మితోడను భిషక్కాగ్రేసులే దోచగన్,
  కోవ్యాక్సిన్ గని, గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా!

  రిప్లయితొలగించండి
 28. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'భవ్యం, సవ్యం' అన్నవి వ్యావహారికాలు. "భవ్యముగా... సవ్యముగా..." అనండి.

  రిప్లయితొలగించండి
 29. సవ్యాసవ్యముగాదునాగరికశాస్త్రాధీనమాహారమున్
  దివ్యంబంచునుప్రాచ్యులాధునికులందింపంగసంస్కారమున్
  నవ్యంబంచుభజించిరోగవిభునన్నాహ్వానమున్జేసియున్
  శ్రావ్యంబయ్యెనొ వ్యాక్సి నెట్లు నను బారంద్రోలు గీడెంచ వీ
  *కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా”*

  రిప్లయితొలగించండి
 30. దివ్యంబైనదియీయది
  నవ్యతగా గానిపించె,నయమున్ జేయున్
  సవ్యమగు రీతి వాడిన
  కోవ్యాక్సిన్ గని కరోనగొల్లున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 31. ఏ వ్యాక్సిన్ నన్నాపదు
  సవ్యముగా లేని జనుల సంచారముతో
  నవ్యయమే నాయునికని
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్

  రిప్లయితొలగించండి
 32. రవ్యస్తమయ మెఱుంగని
  దివ్యప్రాణికిఁ దలంప ధృతితోఁ గాదే
  భావ్యము నరులం దూఱఁగఁ
  గోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్


  భావ్యం బౌను నవీన శబ్దముల సంభావ్యంపు నామమ్ములన్
  సవ్యంబౌ విధి నుంచఁగా నఖిల భాషావ్రాత కోశాళిలో
  నవ్యక్తం బగు నవ్వు వచ్చె మది భాషాన్యంపు శబ్దమ్మునం
  గోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

  [కోవ్యాక్సిన్ = కరోనకృమిత్రము; కర+ఊన +కృమి త్రము]

  రిప్లయితొలగించండి
 33. సవ్యమ్మౌ పథమందు మానవుల సంచారమ్ము లేకున్నచో
  నవ్యమ్మౌ విధి నే జెలంగెదను నానా రూపముల్ దాల్చుచున్
  ఏ వ్యాక్సిన్నను నేమి చేయవని తానెంతేని గర్వంబుతో
  కోవ్యాక్సిన్ గని గొల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా

  రిప్లయితొలగించండి
 34. కం//
  సవ్యాపసవ్యముగ దిన
  కవ్యము నొనరించ సుతుని కారక పితరుల్ !
  నవ్యపు చికిత్సకు జనిన
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్ !!

  రిప్లయితొలగించండి
 35. సవ్యంబైనది యౌషధంబని యికన్ సాహాయ మున్జేయగా
  కోవ్యాక్సిన్ గని గోల్లుమంచు నయయో కోవిడ్ హసించెన్ గదా
  నవ్యంబై ముఖమంతయున్ బరగగా నైరాశ్య మొందన్ వెతన్
  భవ్యుండేయికదిక్కు నాకనుచు వే ప్రార్ధించె దీనమ్ముగా

  రిప్లయితొలగించండి
 36. నవ్యపు రీతిన వచ్చిన
  కోవ్యాక్సిన్ గని కరోన గొల్లున నవ్వెన్
  సవ్యం బైనను నేనప
  సవ్యము చేసెదనటంచు చాటుగ గనుచున్

  రిప్లయితొలగించండి