30, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3678

31-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె”
(లేదా...)
“వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్”
(ఈ సమస్యను పంపిన ఉపాధ్యాయుల గౌరీశంకర రావు గారికి ధన్యవాదాలు)

71 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పరువులు పెట్టగా మనము పండుగ పూటను టీవి గాంచుచున్
    దరువుల పాటలన్ వినుచు దప్పిక తీరగ శయ్యనందునన్
    తిరుగుచు రెండు ప్రక్కలను తీవ్రపు తీరున బీరు త్రాగుచున్
    వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్

    రిప్లయితొలగించండి
  2. క్రమాలంకారంలో ----
    పెళ్లి కూతురు దండను వేసె నెచట?
    వధువు గళమున గట్టెను వరుడ దేది?
    కంకణంబును వరునికి గట్టె నెవరు?
    వరుని మెడలోన :తాళిని :వధువు గట్టె

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    స్థిరతరమైన ప్రేమ వెలసెన్ వరు చిత్తము పెండ్లికూఁతుపైఁ;
    జెఱఁగనియట్టి ప్రేమఁ గని, సిగ్గుల మొగ్గగ నయ్యె నామె; య
    త్తఱి వరుఁడుండ స్వప్నమునఁ, దాళిని కట్టుమటంచు కోరఁగా

    వరుని, గళంబునన్ వధువు వైభవమొప్పగఁ, గట్టెఁ దాళినిన్!

    రిప్లయితొలగించండి
  4. సూటుబూటులరాణియుసోకుమీర
    రంగుపూవులషర్టునరాజుమెఱసె
    కుడియునెడమైననెప్పుడుకుందరాదు
    వరునిమెడలోనతాళినివధువుఁగట్టె

    రిప్లయితొలగించండి
  5. చంపకమాల
    పరిమళ పుష్ప పత్రముల పందిరి శోభలు వెల్గులీనఁగన్
    వరుసలు దీరి బంధువులు పంచగ దీవనలెన్నొ వేడుకన్
    దొరలెడు సిగ్గుదొంతరల తోషము నిండఁగ దండవైచినన్
    వరుని గళంబునన్ వధువు, వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      ఆకుపసరులు ద్రాగిన నప్పురాన
      జంబలకిడిపంబ యనఁగ సరళి మారె
      వలచి సిగ్గులమొగ్గయై తలను వంచ
      వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. కరమరుదైనజాతియిదికాంతలపాలిటకామధేనువే
    విరియగముగ్ధమోముననువింతగవెల్గులరేఖలోప్పగా
    పురమునపెండ్లికూతురునుపుత్తడిబోమ్మగసిగ్గులోల్కుచున్
    వరునిగళంబునన్వధువువైభవమోప్పగఁగట్టెతాళినిన్

    రిప్లయితొలగించండి

  7. సాంప్రదాయమెరుగనట్టి చవట యొకడు
    సంగడీలతో గలిసి తా సార గ్రోలు
    పాళమందున మత్తుతో పలికె నిటుల
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె


    పొరతెరమందు వ్రాసెనట పోకిరి బాలకుడొజ్జ చెప్పగా
    వరుడను చోటులో వధువు వ్రాయుచు నావధువన్న ప్రాపులో
    వరుడని వ్రాసెనంట, యిది పాఠకు లెల్ల పఠించిరిట్టులన్
    వరుని గళంబునన్ వధువు వైభవ మొప్పగ గట్టెఁ దాళినిన్

    రిప్లయితొలగించండి


  8. వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె
    నా! యిదేమి విచిత్రము! నమ్మ శక్య
    ముగ కవీశ లేదుగద! ప్రముఖము గాను
    పత్రికలలోను రాలేదు ! వాస్తవమకొ?


    దాంతో తలీ ఉంగలీ దబాయి
    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. జగడాలమ్మీ! భళి యరు
    దుగ వరుని గళంబునన్ వధువు వైభవమొ
    ప్పగఁ గట్టెఁ దాళినిన్ చె
    ప్పగ వింటి నలుగురి నోట వాస్తవ మేనా?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    వరుని గళంబునన్ వధువు
    వైభవమొప్పగ గట్టె దాళినిన్

    (వరమాలికను తనమెడలో వేసిన వధూమణి కంఠసీమను తాళిబొట్టుతో అలంకరించాడు అనురాగంతో వరుడు )

    చంపకమాల
    ...................

    తరళపు గన్నుదోయి బెను
    దళ్కులు నిండ గులాబిదండనే
    మరువకసౌరభంబులవి
    మత్తును గొల్ప నలంకరించెనే
    వరుని గళంబునన్ వధువు ;
    వైభవమొప్పగ గట్టె దాళినిన్
    వరుడును జిత్తమందెగయు
    బట్టగరాని మహానురక్తితో .

    రిప్లయితొలగించండి
  11. కరమున పూలదండ సరిగాగొని నూత్న వివాహ వేడుకన్
    సరసములాడుచున్ వరుడు సల్పిన ప్రేమకథాస్రవంతులన్
    తిరముగ విప్పిజెప్పిన మదిన్ నునుసిగ్గుల బొమ్మ కోరె నా
    వరుని, గళంబునన్ వధువు వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వింత తంతులు నడపుచు వెల్లిగొనెడి
    గిరిజన వివాహ మాచార కేళి విధిని
    పెద్దలందరి యిచ్ఛతో వైభవముగ
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మురిపెము తోడ హస్తముల పూవులు గూడిన దండ నొక్కటిన్
      పరపుగపట్టి వైచెనట భర్తగ నయ్యెడు సుందరుండునౌ
      వరుని గళంబునన్ వధువు వైభవ మొప్పగ; గట్టె తాళినిన్
      వరుడు నవోఢ కంఠమున పద్ధతి గూడుచు నందరెంచగన్.

      (నవోఢ= కొత్తపెండ్లికూతురు)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. పెండ్లిజూడగ వచ్చిరి పెక్కుమంది
    ఆరగింపు జరిగినంత నతిథియొకడు
    విందుపయి నాశువుగ కైత విసరగ గవి
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె

    తాళి = పతకము

    రిప్లయితొలగించండి
  14. చం:

    ధరణిగ వింత గొల్పు పలు తప్పుడు రీతులు వ్యాప్తి చెందగన్
    కరుణను మందలింతురట ఖండన చేయగ నట్టి కార్యముల్
    సరియగు తర్కమెంచకయె సంస్కృతినోడగ బెండ్లి యాడనై
    వరుని గళంబునన్ వధువు వైభవ మొప్పగ గట్టె దాళినిన్

    వై.చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. నిరుపమ ధర్మవిగ్రహుడు నీలఘనాంగుడు రామచంద్రుడే
    హరుని శరాసనంబు నప్రయత్నముగా దునుమాడగా
    స్వయం
    వరమున సిగ్గుమోమునను వైచెసుగంధపు బూల
    మాల నా
    వరుని గళంబునన్ వధువు; వైభవమొప్పగ గట్టె దాళినిన్
    తరుణి శిరోధరంబునను తండ్రియనుఙ్ఞ వివాహవేదికన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో

      నిరుపమ ధర్మవిగ్రహుడు నీలఘనాంగుడు రామచంద్రుడే
      హరుని శరాసనంబును సభాంగణమందున ద్రుంచగా
      స్వయం
      వరమున సిగ్గుమోమునను వైచెసుగంధపు బూల
      మాల నా
      వరుని గళంబునన్ వధువు; వైభవమొప్పగ గట్టె దాళినిన్
      తరుణి శిరోధరంబునను తండ్రియనుఙ్ఞ వివాహవేదికన్

      తొలగించండి
  16. అది యొక అటవీ ప్రాంతము అందులోన
    తికమక యను జాతి కలదు తెలిసెనిపుడె
    వికటమౌ వారి పెళ్లిళ్లు వింత గొల్ప
    వరుని మెడలోన దాళిని వధువు గట్టె

    రిప్లయితొలగించండి
  17. వరుసగ మట్టి బొమ్మలను బాలలు కూర్చిరి పేరటమ్మునన్
    మురిపెము మీర వేడుకగ మూసిక తెచ్చిరి బొమ్మ పెండ్లికై
    సరసన చిట్టిపాపలట సందడి సేయగ నవ్వులాటకున్
    వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టె దాళినిన్

    మూసిక = తాళిబొట్టు

    రిప్లయితొలగించండి
  18. తరళ విదేహవంశ వసుధాసుత గాంచి సుఖాంతరంగుడై
    హరుని శరాసనంబు దరహాస ముఖంబున ద్రుంచి రాముడే
    ధరణిజులెల్ల మెచ్చగ లతాంగికి వేదము సాగుచుండ న
    ధ్వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ధరణిజులు'?

      తొలగించండి
    2. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      ధరణిజులు అంటే మనుష్యులందరూ అనే ఉద్దేశ్యంతో వ్రాశాను గురువుగారూ. జనులందరూ ధరణిలో పుట్టిన వారే కదా అని నా భావన.

      తొలగించండి
  19. నీరుద్రావినమహిమతోనారినరుని
    లక్షణంబులుబొందెలలనగమారె
    నరుడుజంబలకిడిపంబనందురెచ్చి
    వరుని మెడలోనఁదాళిని వధువు గట్టె

    రిప్లయితొలగించండి
  20. ఆధునికమగునైపుణ్యసాధనమున
    ఛాయచిత్రాలుచిత్రాలజాలమగుచు,
    నొకరికొకరనుభావననుడువునట్లు
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె

    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  21. విరిసిన మల్లి జాజులును వీడని సిగ్గులు వైచె మాలగన్

    వరుని గళంబునన్ వధువు:; వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్

    సిరులకునొజ్జయౌ పసిడి సిగ్గుల శ్రీ సతి కంఠ సీమనన్

    మురహరి, బ్రహ్మ యున్ మురిసె మోదపు కాంతులు కంట నిండగన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  22. వధువు పూదండ వలచి‌ యెవరికి‌ వేసె,

    వరుడు యేమి కట్టె నపుడు వధువు మెడన,

    యెలమి నిడు తలం బ్రాల్ చీర యెవరు కట్టె,

    వరుని మెడలోన, తాళిని, వధువు కట్టె

    రిప్లయితొలగించండి
  23. శాస్త్రవిజ్ఞాన విభవ సంశ్రవము వలన
    వరుడు వధువుగ వధువుతా వరునివోలె
    లింగమార్పిడినొందగ చెంగలించి
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె

    రిప్లయితొలగించండి
  24. పసి తనమువీడని పసిడి బాలలకును

    పెండ్లి చేయుట తగదని ప్రెభువు చెప్పె

    మాటునను వివాహమ్మున మరి తడబడి

    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  25. విరుల నలంకరింప గనువిందుగ దోచెడి వేదికన్ వధూ
    వరులను వేడ్క దెచ్చిరిక వైళమె వైచెను పూలదండనా
    వరుని గళంబునన్ వధువు; వైభవమొప్పగఁ గట్టెఁ దాళినిన్
    వరుడు ముదంబు మీర హిత బంధు జనాళి సమక్షమందునన్

    రిప్లయితొలగించండి
  26. నాకు నీ వివ్విధిం జెప్పిన యది యింకఁ
    జాలు వింతల పుట్ట యీ జగతి యయ్యె
    నిట్టి యాచారము లెఱుఁగఁ బుట్టి నేను
    వరుని మెడలోనఁ దాళిని వధువు గట్టె


    ఇరువురు నంద చందముల నింపుగఁ బోలుచు నొక్కరొక్కరిం
    గర మనురక్తి నొండొరులఁ గన్నుల వెల్గఁగ విస్మయమ్ముగన్
    మరునినిఁ బోలు నా వరుఁడు మంగళ సూత్రము కట్టఁ బ్రీతితో
    వరుని గళంబునన్ వధువు వైభవ మొప్పగఁ గట్టెఁ దాళినిన్

    [తాళి = పతకము]

    రిప్లయితొలగించండి
  27. కలియుగపు మహిమవలన కామినేని!
    వధుని మెడలోన దాళిని వరుడు గట్టె
    నెవరు కట్టిన సరియెనౌ నింక వారు
    చిలుక గోరింక వోలెను మెలగు టొప్పు

    రిప్లయితొలగించండి
  28. పరిణయ వేదిపైన నిజ బంధు
    సమూహము చూచు చుండగా
    మురిపముతోడ వేసినది ము
    చ్చట గూర్చెడు పూలదండ నా
    వరుని గళంబునన్ వధువు,
    వైభవ మొప్పగ గట్టె తాళియున్
    వరుడతి సుందరంబయిన
    వారిజ నేత్రి వధూ శిరోధిలో.

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. వరుని గళంబునన్ వధువు వైభవమొప్పగ గట్టెదాళినిన్
    వరుడును గట్టెదాళినిక వైభవమొప్పగ దాళినామెకున్
    నరయగ మంగళంపునును హారము పచ్చటి పావడంబునున్
    నిరువురు నొక్కసారిగను నింపొనరించగగట్టిరయ్యెడన్

    రిప్లయితొలగించండి
  31. లింగ భేదమువలదుకలియుగమందు
    చాటిచెప్పనాటకమాడమేటినటులు
    శిరసు వంచగ ఖర్మము స్త్రీలకేల
    వరుని మెడలో దాళిని వధువుకట్టె

    ఆత్రేయ🙏🙏

    రిప్లయితొలగించండి
  32. లింగ భేదమువలదుకలియుగమందు
    చాటిచెప్పనాటకమాడమేటినటులు
    శిరసు వంచెడి ఖర్మము స్త్రీలకేల
    వరుని మెడలో దాళిని వధువుకట్టె

    ఆత్రేయ🙏🙏

    రిప్లయితొలగించండి
  33. జాతికి వన్నె తెచ్చు వనజాక్షుల పొంతన చెడ్డమాట యున్
    జ్ఞాతిని రాజు చేయుచెడు జ్ఞానపు కైకకు ముందునన్ సదా
    పాతక వర్తనంబు మరి పాడియు కాదు కదా సభాస్థలిన్
    బూతగు,రామచంద్రయనబోకు,సృహుజ్జనులున్న తావులన్

    రిప్లయితొలగించండి