25, మార్చి 2021, గురువారం

సమస్య - 3673

26-3-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగవానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”
(లేదా...)
“పగవానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మేలగున్"

66 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పగలున్ రేయిని వెంటవెంటబడుచున్ బంజారు హిల్సందునన్
    తగులం బెట్టుచు రాజకీయముననున్ తంటాలనున్ జేయగన్
    సగమౌ తీరున త్రుంచి శత్రువునహో సంతోషమున్ గొల్పి, చం
    పగ, వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మేలగున్

    రిప్లయితొలగించండి
  2. సిగలోపూవుగతలచుచు
    తగవిదిమనకునుననుచునుతానునుమదిలో
    వగలేకతప్పుతెలియగ
    పగవానికిసేవఁజేయవలెమేల్గలుగున్

    రిప్లయితొలగించండి
  3. దిగ మింగుచు పలు బాధల
    పొ గలుచు నను దినము దాను భోరున నే డ్వ న్
    దెగువ దనంబు కరుణ దో
    పగ వానికి సేవ జేయ వలె మేల్గ లుగున్

    రిప్లయితొలగించండి


  4. భగవంతుడు వీడనుకొని
    పగవానికి సేవఁ జేయవలె! మేల్గలుఁగున్
    జగడమ్ములు తగ్గు జిలే
    బి!గడబిడవలదు! సుగతుని విరివిగ నరయన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. అగజాతను గైకొని మఱి
    సగదేహము నిచ్చినట్టి శంకరుడు సదా
    జగమును దాఁ సంరక్షిం
    పగ, వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్.

    రిప్లయితొలగించండి


  6. జగడాలమ్మి! భయపడకు
    పగవానికి! సేవఁ జేయవలె మేల్గలుఁగున్
    జగనన్నకు ! పచ్చదన
    మ్ముగదా మన సింబలు పద! ముందుకు పోవే!


    జై జగన్ జై గ్రీన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. జగదాధారుఁడువిష్ణుతాతనయుతేజంబందుఁజూడంగనా
    పగవాడాయెగరక్కసుండునటనాప్రహ్లాదుతండ్రిన్వలెన్
    వగఁజూపండుగవారిజాక్షుమదిలోవారింపకేతల్చెగా
    పగవానిన్మనచిత్తమందునిచిసేవల్జేసినన్మేలగున్

    రిప్లయితొలగించండి
  8. భగవానుని మహదేవుని
    నిగమాగమ సారభూత నిర్గుణుడగు నా
    నగజాతాపతి మారుని
    పగవానికి సేవజేయవలె మేల్గలుగున్

    గోపికల సంభాషణ

    నగవుల్ జిందెడు మోముతోడ నయనానందమ్ముగా దిర్గుచున్
    తగవుల్ బెట్టుచు నత్తకోడలికి దుత్తల్ద్రుంచి దొంగాటలన్
    వగపున్ బొందెడు మానినీగణపు నవ్యాజంపు తాపంబు బా
    పగ, వానిన్ మన చిత్తమందునిచి సేవల్జేసినన్ మేలగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'మహాదేవుని'... 'మహదేవుని' అనరాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! పరమాత్మను అంటాను!🙏🙏🙏

      తొలగించండి
  9. సగభాగమ్మున పార్వతి
    సిగలో నమృత కిరణుండు శిఖివాహము, ప
    న్నగమే నగ శిరమున నా
    పగ, వానికి సేవజేయవలె మేల్గలుగున్.

    భగుడా భీషణుడంతకాంతకుడు పాషాణమ్ము కంఠంబునున్
    సిగలో నుత్పల బాంధవుండు మెడలో శీవమ్ము కాయంబులో
    సగభాగమ్మున పాటలావతియు మస్తమ్మందునన్ గాంచ నా
    పగ, వానిని మన చిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్.

    రిప్లయితొలగించండి
  10. సమస్య :
    పగవానిన్ మన చిత్తమందునిచి సే
    వల్ జేసినన్ మేలగున్

    ( పాండవసహాయార్థం వస్తున్న వారి మేనమామ శల్యుని తమవైపు త్రిప్పుకో వాలని సుయోధనునికి బోధిస్తున్న శకుని)

    వగపున్ వీడుచు నాదు బోధలను నీ
    వాసాంతమున్ విన్ము ; నా
    మొగమోటంబుల ముద్దుటల్లుడ ! మహా
    మోదస్తుతిప్రీతు డీ
    వగకానిన్ , మధుమత్తచిత్తు, బహుధా
    వారాంగనామోహితున్ ,
    బగవానిన్ , మన చిత్తమం దునిచి సే
    వల్ జేసినన్ మేలగున్ .

    రిప్లయితొలగించండి
  11. మ:

    అగచాట్లన్ బడుచుండ దుఃఖమున నా యగ్రాహ్యుడిన్ దెప్పుచున్
    తెగ దూషింపరె నోరిచేటు నట సాధింపంగ నారీతినిన్
    వగలన్ జూపగ బాహ్యమందు నకటా ప్రార్థిన్ప న్నిక్కట్లు బా
    పగ, వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్మేలగున్

    అగ్రాహ్యుడు= పరమాత్మ
    నోరిచేటు=వాగాడంబరము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  12. తెగదెంపు సలుప యుక్తము
    పగవానికి ; సేవఁ జేయవలె మేల్గలుఁగున్
    మిగుల యవిధి గల వానికి
    దిగులు విడివడగ హృదయము తేలిక బడుగా

    రిప్లయితొలగించండి
  13. తగని పనుల నొనరించుచు
    తగవుల గొని దెచ్చుకొనక ధర్మపరుండై
    పగల సెగలు రగులక నా
    పగ వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్

    రిప్లయితొలగించండి
  14. నగధారిన్ దెలిదమ్మికంటిని శతానందాఖ్యుదిత్యాళికిన్
    *“బగవానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మేలగున్"*
    సుగతిన్ గోరుచు నారదాది ముని శ్రేష్ఠుండ్రచ్యుతున్శ్రేష్ఠునిన్
    బగలున్ ఱేయియు భక్తిభావమునవిష్వక్సేను నర్చింపరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపాట్లున్నవి. 'దైత్యాళికిన్.. శ్రేష్ఠుం డచ్యుతున్ శ్రీహరిన్' అనండి. (శ్రేష్ఠ పద్యం పునర్తుక్తమయింది)

      తొలగించండి
  15. ఖగ పతి నెక్కెడు వానిని

    పొగరున తిట్టెడి ఖలునకు మురిపపు సతికిన్

    సొగసుల మూర్ఖపు పతికిన్

    పగవానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  16. కందం
    సిగలో జాబిలి సాక్షిగ
    సగమౌ సతి గోర విషము సరగున గ్రోలెన్
    జగతి శివుఁడు సంరక్షిం
    పగ, వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్

    మత్తేభవిక్రీడితము
    సిగలో జాబిలి వెన్నెలల్ గురియగా సింగారముల్ జిందుచున్
    సగమౌ శైలజ కాలకూటవిషమున్ సైయంచు గైకొమ్మనన్
    జగమున్ గాచెడు వాడు సాంబుఁడన సత్సంకల్పమై స్వీకరిం
    పగ, వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మేలగున్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురుభ్యోనమః

    భగవానుడు మహిలో వెల
    యగ దాల్చెను గురువుగ యవతారములన్
    జగమున చను దారిని జూ
    పగ, వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు

      సవరణతో

      భగవానుడు మహిలో వెల
      యగ దాల్చెనుగా గురువుగ నవతారములన్
      జగమున చను దారిని జూ
      పగ, వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్

      తొలగించండి
  18. సిగలన్బట్టగఁబోరగ
    సెగలన్రగిలించినారుఁజేటుగనిచటన్,
    తొగలన్బంచుచుపగనా
    పగ వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  19. సిగలన్బట్టగఁబోరగ
    సెగలన్రగిలించినారుఁజేటుగనిచటన్,
    తొగలన్బంచిఁజల్లా
    ర్పగ వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. సిగలన్బట్టగఁబోరగ
      సెగలన్రగిలించినారుఁజేటుగనిచటన్,
      తొగలన్బంచుచుఁజల్లా
      ర్పగ వానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్”

      కొరుప్రోలు రాధాకృష్ణరావు

      తొలగించండి
  20. నిగమాంతరగోచరుడును
    నగరాజసుతార్ధదేహు నభవుని హరునిన్
    మృగధరు శంకరు నతనుని
    పగవానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్

    రిప్లయితొలగించండి
  21. ఈ నాటి శంకరా భరణము వారి సమస్య

    పగ వానికి‌ సేవ చేయవలె మేల్గల్గున్

    ఇచ్చిన పాదము కందము


    నా ,పూరణము సీసములో

    బలి చక్రవర్తి వాకిట శ్రీ హరి ద్వార పాలకుడిగా ఉంటూ బలిబంధనుడు అవుతాడు అప్పుడు లక్ష్మి వచ్చి అతనిని‌ చూచి బాధపడుతుంది . సిరిని చూసి హరి ఓదార్చి పగవానికి సేవ చేసిన మేలు కలుగును బాధను పడక నీవు కూడా బలికి పరిచర్యలు చేయమని చెబుతాడు. లక్ష్మి మొదట తిరస్కరించినా హరి ఆంతర్యము గ్రహింవి బలికి సేవ చేస్తు ఉంటుంది రక్షా బంధనము రోజున బలికి రక్ష కట్ట అతను ఒక వరమును కోరు కొమ్మంటాడు అప్పుడు తాను శ్రీ హరి భార్య నని తన భర్తను‌ బంధ విముక్తి చేయమని అడగుతుంది బలి సరేనని హరిని విడచి బెడతాడు




    పాల కడలి సుతా! బాధ పడగ రాదు ,భక్తులు‌ కొలిచిన వారి చెంత

    సతతము‌ నిలబడి సంతస మొందెద,బలిచక్ర వర్తియు పట్టుబట్ట

    నతని వాకిలి నేను సతతము కాచుచుంటిని గ ఘనత తోడ,వినగ వలయు

    సిరి,పగవానికి‌ సేవ చేయవలె మేల్గల్గున్,భయము వలదని



    హరి తెలుపగ వెతనువీడి,
    మరుని‌ యంబ

    తన నెలవు విడిచి బలియం
    తఃపురమున

    దాసిగా వెడలి బలి బంథనము నుంచి

    హరిని‌ తప్పించి‌ వైకుంఠ పురము జేరె

    రిప్లయితొలగించండి
  22. కె.వి.యస్. లక్ష్మి:

    సగ మేనిని నగపుత్రిని
    సిగనందున హరి తనయను స్థిరముగ గొనుచున్
    నగజాపతి జగతిని నడ
    పగ, వానికి సేవజేయవలె మేల్గల్గున్.

    రిప్లయితొలగించండి
  23. పగవాడేతర వానికి
    బగవానికి సేవజేయ వలెమేల్గలుగున్
    జగమున గలదొక సామెత
    తగువిధపుంమనుజ సేవ తార్ష్యుని సేవౌ

    రిప్లయితొలగించండి
  24. గగనం బైన గెలుపు కా
    నఁగ బలవంతునిఁ దలంచి నాథునిగ నెదన్
    మగదనపుం బగవానికిఁ
    బగవానికి సేవఁ జేయవలె మే ల్గలుఁగున్


    సెగ చల్లారి మనమ్ము నందు వరమై సిద్ధించు మిత్త్రత్వమే
    పగ నెల్లం దగఁ ద్రుంచి స్నేహమరయన్ వాటిల్లు నానందమే
    విగత ద్వేష విరాజమాన మయి సంవేష్టించి సద్వాక్కులం
    బగవానిన్ మన చిత్తమం దునిచి సేవల్ జేసినన్ మే లగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సుహృన్మిత్రులు పోచిరాజువారికి నమస్సులు!

      మీ మొదటి పూరణలో...మగతనపుం బగవానికి...అని యుండవలెను గదా...

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      కవిపుంగవులు మధుసూదన్ గారికి నమస్సులు. అవునండి పొరపాటు. సవరించెదను. ధన్యవాదములు.

      తొలగించండి
    4. గగనం బైన గెలుపు కా
      నఁగ బలవంతునిఁ దలంచి నాథునిగ నెదన్
      మగతనపుం బగవానికిఁ
      బగవానికి సేవఁ జేయవలె మే ల్గలుఁగున్

      తొలగించండి
  25. పగవానిన్ మనచిత్తమందునిచి సేవల్ జేసినన్ మేలగున్
    పగవానికిన్ సరి,కానివానినిల నాప్యాయంబుగా జూచుచున్
    బగలేకుండగ నుండుచో నెపుడు పాపంబబ్బదే వేళయున్
    జగదాధారుడు నెల్లవేళలను దాసంరక్షణంబున్ గొనున్

    రిప్లయితొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    భృగువే చూడఁగ, నా బలిం దనదు త్ర్యంఘ్రిన్మోపి, వేగమ్మె జి
    హ్మగసద్మమ్మున కొత్తినట్టి హరి పాదాంబ్జమ్ములన్ బ్రహ్మయే
    తగ నీరమ్మున క్షాళనమ్మొనరుపం, దన్నీరమయ్యె న్స్వరా

    పగ! వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ సేసినన్ మేలగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో...

      భృగువే చూడఁగ, నా బలిం దనదు త్ర్యంఘ్రిన్మోపి, వేగమ్మె జి
      హ్మగసద్మమ్మున కొత్తె! వాని ఘన పాదాంబ్జమ్ములన్ బ్రహ్మయే
      తగ నీరమ్మున క్షాళనమ్మొనరుపం, దన్నీరమయ్యె న్స్వరా

      పగ! వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ సేసినన్ మేలగున్!

      తొలగించండి
    2. మఱొక చిన్నసవరణతో...(పోచిరాజువారికి ధన్యవాదములతో...)

      భృగువే చూడఁగ, నా బలిం దనదు తార్తీయాంఘ్రినిన్మోపి, జి
      హ్మగసద్మమ్మున కొత్తె! వాని ఘన పాదాబ్జమ్ములన్ బ్రహ్మయే
      తగ నీరమ్మున క్షాళన మ్మొనరుపం, దన్నీరమయ్యె న్స్వరా

      పగ! వానిన్ మన చిత్తమం దునిచి సేవల్ సేసినన్ మేలగున్!

      (తార్తీయాంఘ్రి = మూఁడవ యడుగు)

      తొలగించండి
  27. కం//
    భగవంతుని ప్రతిరూపమె
    పగబూనిన వగచవలదు పగ రగిలించున్ !
    నగధరునిని పూజించుచు
    పగవానికి సేవఁ జేయవలె మేల్గలుఁగున్ !!

    రిప్లయితొలగించండి
  28. పగతుర కైన విడక చే
    యగవలయునునాపదొడమ ననురాగముతో
    నిగమములుతెలుపు నిదియే
    పగవానికి సేవ జేయవలె మేల్గలుగున్


    సగముతనువుసతికిచ్చుచు
    నగగా శశినేధరించి నగనందినితో
    నగుమోమున సతము మరుని
    పగవానికిసేవచేయవలె మేల్గలుగున్

    రిప్లయితొలగించండి