11, మార్చి 2021, గురువారం

సమస్య - 3660

12-3-2021 (శుక్రవారం)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ద్రుపదతనయకు మ్రొక్కె దుర్యోధనుండు”
(లేదా...)
“కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్”

71 కామెంట్‌లు:


 1. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  తీరిక లేకయే చనుచు తిన్నగ పర్వులు పెట్టి తొందరన్
  వీరుడు మర్చిపోవగను వెంటను కూర్చగ నాటకంబునన్
  వారిజ నేత్ర నాయకిని భంగును తెమ్మని ముత్తుకూరునన్
  కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్

  రిప్లయితొలగించండి
 2. రాజ సూయమునకు వచ్చి రాజులపుడు

  పాండవ కులాగ్రజునకును , పట్ట మహిషి

  ద్రుపదతనయకు మ్రొక్కె :; దుర్యోధనుండు

  కక్షన ములిగె కర్ణుడె సాక్షియచట

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 3. నేటిపాంచాలినెదింపనెవరితరము?
  నిర్భయంబుగచట్టంబునిలువరింప
  భయమువెన్నంటెకురురాజుభావమందు
  ద్రుపదతనయకుమ్రోక్కెదుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
 4. భర్త లైదుగు రెవరికో భరణి లోన,

  చక్రి నిగని యే మొనరించె సవ్య సాచి,

  కర్ణునికి రాజ్య మిచ్చిన ఘనుడెవరొకొ

  దృపద తనయకు‌, మ్రొక్కె, దుర్యో ధనుండు

  రిప్లయితొలగించండి
 5. ద్వారము కానిదచ్చటను ద్వారము కాంచెను భ్రాంతి కన్నులన్

  నీరము లేని చోటునను నీరపు భ్రాంతుల మోత మోగగన్

  కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను , యాజ్ఞసేనికిన్

  కూరిమినట్టి మేడలను కూర్చిన , ఆ మయ బ్రహ్మ నేర్పుకున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 6. వీరులు కౌరవాగ్రజులు వీగిరి పోరున విర్రవీగ గా
  మారణహోమమందుననె మాడిరణమ్మున మందభాగ్యులై
  వేరుగ జెప్పగా వలెన వీడగ నందరు ఒంటరవ్వగా
  కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అవ్వగా' అన్నది సాధుప్రయోగం కాదు.

   తొలగించండి
 7. వారణసేయలేరుమగవారునుకాంతలునిర్భయల్గదా
  వేరుగభావనన్మిగులవేదనక్రుంగకనోడకన్మదిన్
  నారిగరౌద్రియైనెదిరినాగమతంత్రముగెల్చునంచునున్
  కోరిసుయోధనుండుగడకుబ్రణమిల్లెనుయాజ్ఞసేనికిన్

  రిప్లయితొలగించండి
 8. క్రమాలంకారం లో, -----
  పంచ పాండవు లెవరికి భర్త లైరి?
  కృష్ణుని గని యే మొనరించె క్రీడి యపుడు?
  మయ సభను జూచి యవమాన మందె నెవడు?
  ద్రుపద తనయకు : మ్రొక్కె : దుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
 9. తేటగీతి
  వల్వలూడ్చఁగ నొప్పక నిల్వరింప
  నడ్డుఁ జెప్ప భీష్మద్రోణులసహనమున
  చాలు మీరల బాసటలేలననుచు
  ద్రుపదతనయకు, మ్రొక్కె దుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   వీరవరేణ్యుడై వలలు వ్రేటుకుఁ గూలుచు స్వర్గమంది తా
   నేరిచి సంప్రదాయముల నిర్మల చిత్తము తోడ పాండవుల్
   దీరుచు నాయువుల్ దివికిఁ దేలుచుఁ జేరఁగ మ్రొక్కి యావలన్
   కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. పారి హ్రదంబుదాగె పరివారము వీడగ, సంగరమ్మునే
  కోరి సుయోధనుండు; గడకున్ ప్రణమిల్లెను యాఙ్ఞసేనికిన్
  దారుణ రీతి జంపినను తమ్ముని,సంతు నధర్మమార్గమున్
  మారుగ కక్షబూనకను మన్నన సేయగ ద్రోణపుత్రుడే!

  రిప్లయితొలగించండి
 11. అర్జునుడు నభిమన్యుని యుధ్ధ భూమి
  పంప, ధైర్యసాహసముతో బయలుదేరి
  ద్రుపదతనయకు మ్రొక్కె;దుర్యోధనుండు
  భోరుమనెనె, పద్మవ్యూహ పోరుజూచి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. 'పద్మవ్యూహ పోరు' వైరి సమాసం. సవరించండి.

   తొలగించండి
 12. భారత యుద్ధము ముగియగానే ద్రౌపతి కురు సభలో చేసిన శపథము నెరవేర్చు కొనుటలో సఫలము నొందినది. అహో ఆమె పంతము ఎంతకు దారి తీసినదో కదా అను బాధ ను తెలిపే ఈ నా ప్రయత్నము :

  ఉ:

  పోరున గెల్వ పాండవులు పూనిక లెల్లను పూరడించగన్
  కోరుట పెంపు చేసెనట కొండగు ధైర్యము గూడి నేటికిన్
  పారగ జేయ వేదనము, పంతము నెంతకుదెచ్చెరా యనన్
  కోరి సుయోధనుండు గడకున్ ప్రణమిల్లెను యాజ్ఞసేనికిన్

  పూనిక=శపథము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 13. కోరి సుయోధనుండు గడ
  కున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్

  ( భీష్మాచార్యుడు ద్రోణాచార్యునితో
  కురుక్షేత్రసంగ్రామం ప్రారంభం కాబోయే రెండురోజుల ముందు తనకు వచ్చిన స్వప్నాన్ని గురించి పలుకుతున్నాడు .ఇది నా భావన .)

  ఉత్పలమాల
  ..................

  ఆరని మంటలట్లు పెను
  పారుట తప్పద ద్వేషరోషముల్ ?
  మారద వీని మానసము ?
  మాకొక స్వప్నము వచ్చె రాతిరిన్ ;
  బోరిది తప్పిపోయెనట !
  పోకిరిచేష్టల మాని క్షేమమున్
  గోరి సుయోధనుండు గడ
  కున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్ .

  రిప్లయితొలగించండి
 14. పరిభవింపగ పాండవ పత్నినపుడు
  గాంచినవికర్ణు డంత దూకలిని పొంది
  ద్రుపద తనయకు మ్రొక్కె, దుర్యోధనుడు
  కుత్సనము జేసె తమ్ముని కోపమందు.
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 15. ఆ రమణీ లలామ కుటహారిక మాకని పల్కుచున్ దురా
  చారిగ నిల్చిపోయె గద చల్వము విప్పు మటంచు నప్పుడున్
  గోరి సుయోధనుండు గడకున్, బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్
  వీరవికర్ణుడా సభను వేదన జెందుచు ధర్మబద్ధుడై
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 16. యాగము ముగిసిన పిదప నందరివలె
  భానుమతియు విలాతికి బయనమగుచు
  ద్రుపదతనయకు మ్రొక్కె ; దుర్యోధనుండు
  మయసభను గాంచ వెడల మానుకొనెను

  రిప్లయితొలగించండి
 17. చిత్రసేనుడు, గంధర్వు చిత్తు జేయ
  కౌరవులను కరుణమీర గనిరిపాండు
  పుత్రులపుడు, గాచిరి ప్రాణములను యనుచు
  వందనమిడిపాండవులకు, భయము తోడ
  ద్రుపద తనయకు మ్రొక్కె, దుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాణములను+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "ప్రాణముల నటంచు" అనండి.

   తొలగించండి


 18. యాజ్ఞసేనినట పరిణయమున పొందె
  రావణుడు! పల్కెను శకారు డౌర చట్టు
  ద్రుపదతనయకు మ్రొక్కె దుర్యోధనుండు
  కీచకుడు ప్రణమిల్లెను కేలుమోడ్చి!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. రిప్లయిలు
  1. మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి

  2. కౌరవపాండవాదిగుణగణ్యులు నెల్ల త్రివిష్టపమ్మునుం
   జేరి గతమ్ము దల్చి రట చీత్కృతదౌష్ట్యవిచారచిత్తుడై
   నేరమునున్ క్షమించు మని నెవ్వగఁ జెందుచు నా దివమ్ములో
   కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను యాజ్ఞసేనికిన్.

   కంజర్ల రామాచార్య.

   తొలగించండి
 20. నేరము లెల్ల సేసితిని నేరను నాడు ముకుందు డాడె ద
  ర్బారున దూలనాడితిని భండనమందున గూలి ద్రౌణికిన్
  *కోరి సుయోధనుండు గడకున్ బ్రణమిల్లెను; యాజ్ఞసేనికిన్”*
  పారుడు బందియయ్యె శిశువంతము గోరియు బాణ మేసియున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "నేరము లెల్ల జేసితిని" అనండి.

   తొలగించండి
 21. రాజసూయమ్ము జూచిన రాజులపుడు
  కానుకలను సమర్పించి కరముమోడ్చి
  ద్రుపదతనయకు మ్రొక్కె,దుర్యోధనుండు
  మౌనముద్రను వహియించె మౌనివోలె

  రిప్లయితొలగించండి
 22. హ్రదమునందున దలచెనుహృదయమందు
  కొరివి గొనియేల తలనునేగోకుకొంటి
  కౌరవంబెల్ల సమసెనుకదనమందు
  సగము చచ్చితి విడుమికచాలుననుచు
  ద్రుపదతనయకు మ్రొక్కె దుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
 23. మారణహోమమందు కులమంతయు నాశమొనర్చె ధూర్తుడై
  కోరి సుయోధనుండు గడకున్; బ్రణమిల్లెను యాజ్ఞసేని కి
  న్కారగ రాజరాజు పతనంబును గాంచి మురారికిన్ మదిన్
  తీరగ నామె వేదన ప్రతిక్రియ సేయగ భీముడయ్యెడన్

  రిప్లయితొలగించండి
 24. దురభిమానుండు రారాజు దుష్టుఁ డేల
  మ్రొక్కుఁ బగవారి భార్యకు మోస పోకు
  వినుమ నిక్కముగా ద్రుహిణునకె, కాదు
  ద్రుపదతనయకు, మ్రొక్కె దుర్యోధనుండు


  వారని రక్తితో మయసభా విభవమ్మును జూచుచుండఁగా
  నారుల గూడి యుండనట నవ్వులు సిందఁగఁ, మోహ చిత్తపుం
  బ్రేరణ మంది యంత శివలింగమ యియ్యది యంచుఁ బ్రీతినిం
  గోరి సుయోధనుండు గడకుం బ్రణమిల్లెను, యాజ్ఞసేనికిన్

  [గడ = కంబము, కఱ్ఱ]

  రిప్లయితొలగించండి
 25. శూరులునైన రాజులట జోరుగ గానుక లెన్నియో ,యికన్
  హారములింపుగొల్పెడు నయాభరణంబుల నీయగా
  వారల రాజసూయపు ప్రాభవమంతయు జూసి యంతటన్
  గోరిసుయోధనుండు,గడకున్ బ్రణమిల్లెను యాఙ్ఞసేనికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి


 26. మత్స్య యంత్రమున్ కొట్టెను మఘవు పుత్రు
  డైన పంచపాండవులును నైరి పతులు
  ద్రుపద తనయకు,మ్రొక్కె దుర్యోధనుండు
  కురుపితామహు,ద్రోణులకు వినయ మున.

  కోక లెవరికొసగె శౌరి కూర్మితోడ
  పార్థుడొనరించుచు తపము పశుపతి కట
  మయసభసొబగు గాంచుచు మ్రాన్పడియెను
  ద్రుపద తనయకు,మ్రొక్కె దుర్యోధనుండు

  రిప్లయితొలగించండి
 27. తేట.
  ద్రుపద కన్యకు జేయగ ద్రోహములను,

  మానినిన్ గాంచి ,విదురుడు, మానసమున ,

  ద్రుపద కన్యకు మ్రొక్కె.దుర్యోధనుండు,

  తలనెగుర,వేసెతానును ,తల బిరుసున.


  ✍️వరలక్ష్మి శంకర్ శర్మ

  రిప్లయితొలగించండి