27, మార్చి 2021, శనివారం

సమస్య - 3675

28-3-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నమయ్యె సున్నము ముదమంది తినిరి”
(లేదా...)
“అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్”

48 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    పున్నమి నాడు వేడుకను పొందుగ బీచి విశాఖనందునన్
    కన్నులు మూసియాదటను గాభర నొందక పిక్నికందుమా
    యన్నులు వండగా తనరి హాయిని గొల్పుచు నవ్వులాట లో
    నన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. లోనన్నమనగా "లోను " తీసి కొనుక్కున్న నూకలతో వండిన అన్నము :)

      తొలగించండి
    2. మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      జిలేబి గారు 'లో నారసి' చేసిన వ్యాఖ్యానం బాగున్నది.

      తొలగించండి
  2. మాత మహిమ పరీక్షింప నేత లరిగి
    సున్నమును జూపి యడిగిరి చోద్య మలర
    నన్నము గ మార్చు మని గోర నామె వలన
    నన్న మయ్యె సున్నము ముద మంది తినిరి

    రిప్లయితొలగించండి
  3. మిత్రులందఱకు నమస్సులు!

    (వేములవాడ భీమకవి బాల్యమునందలి యొక ఘట్టము ననుసంధానించుకొనునది)

    బన్నము సేయఁగాఁ దలఁచి, బంధులు భీముని విందునందఁగాఁ
    దిన్నగఁ బిల్వకున్నఁ, గని, తీవ్ర రుషన్ శపియింపఁ, బొక్కి రా

    యన్నము సున్నమైన! ముదమంది భుజించిరి బంధు లెల్లరున్
    సున్నమె యన్నమౌటఁ గని స్తోత్రములన్ శమియింప భీముఁడే!

    రిప్లయితొలగించండి
  4. రామచంద్రునికీర్తనల్ వ్రాసె నెవరు?
    పెళ్ళి మండపమువెలుగ వేసెనేమి?
    పెళ్ళి విందుకు కూర్చొని పెద్దలంత
    అన్నమయ్యె; సున్నము; ముదమంది తినిరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ క్రమాలంకార పూరణ బాగున్నది.
      'వ్రాసి రెవరు/వ్రాసె నెవడు' అనండి.

      తొలగించండి
  5. శ్రీ గురుభ్యోనమః

    క్రొత్త వంటవాని విశేష ప్రోఢతనము
    నన్నమయ్యె సున్నము, ముదమంది తినిరి
    బంధువర్గము లెగఁబడి పండ్లు మొలక
    గింజలు హిమఖండములను గింజుకొనుచు!

    ప్రోఢతనము - నేర్పు

    రిప్లయితొలగించండి


  6. మదిమది నవ్వవలదు ! నిజ
    మిది! మల్లాది కథ వినుడి! మీగడ మారిం
    దిదె! అన్నమయ్యె సున్నము
    ముదమంది తినిరి జిలేబి ముద్దారంగన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి పాదాన్ని కందంలో దించేసారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  7. రోటిబియ్యముమోద్దుగరోతఁబుట్ట
    తెల్లతండులమ్ముమెఱసెతెచ్చెజబ్బు
    నాగరీకమువింతగమార్పుఁదెచ్చె
    అన్నమయ్యెసున్నముముదమందితినిరి

    రిప్లయితొలగించండి
  8. భోజనానికి వచ్చిన పూజ్యులైన
    బంధు జనులకందగజేయ సుందరాంగి
    యన్నమయ్యె, సున్నము ముదమంది తినిరి
    యాకు వక్కల జతజేసి యతిథులంత.

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    బావ నభిమన్యుతో శశి వలపు నెఱిఁగి
    పెద్దలెంచిన లక్ష్మణు పెళ్లి చెడఁగ
    సాయపడు ఘటోత్కచుఁడాడు మాయ లీల
    నన్నమయ్యె సున్నము ముదమంది తినిరి

    ఉత్పలమాల
    వన్నెల భామయౌ శశికి భర్తగ లక్ష్మణు నెన్ని పెద్దలున్
    తిన్నగ పెళ్లవేడుకలఁ దీర్చఁగ, నయ్యభిమన్యు నచ్చ నా
    చిన్నది, పెళ్లి భగ్నమును జేయ ఘటోత్కచుఁ డాడు మాయతో
    నన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్

    రిప్లయితొలగించండి
  10. ఎన్నడు గాంచలేదుగద యింతటి చిత్రపు మాట లేలకో?
    యన్నుల మిన్న వండినది యన్నము ముద్దగ నయ్యెనంచు నా
    కన్నెను వెక్కిరింప వెటకారము లాడుచు పల్కెనంటతా
    యన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్.

    రిప్లయితొలగించండి
  11. ఉన్నతమైనరీతిని సహోదరి పెండ్లిని వేడ్కమీరగా
    వన్నెల పందిరిన్నెలమి వడ్డన సేయగ పంచభక్ష్యముల్
    సన్నని వాద్యగీతముల సందడిలోనను తన్మయంబునన్
    అన్నము, సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్!

    అన్నమును,తాంబూలములోని సున్నమును కూడ
    సంతోషంగా స్వీకరించారని భావన!

    రిప్లయితొలగించండి
  12. ఉ:

    మిన్నతి నింద్రజాలికుడు మిక్కుటమై జనరంజకత్వమున్
    కన్నుల భ్రాంతి గొల్ప తగు గారడి చేయుచు తృప్తి పర్చుచున్
    భిన్నమటంచుజేర నొక పెండిలి విందున, మాయ చేయనై
    అన్నము సున్నమయ్యె ముదమంది భుజించిరి బంధు లెల్లరున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  13. తెల్లగను మారునని విని తేట నీటి

    సున్నమును కలిపెను సతి సుందరమ్మ

    అన్నమయ్యె సున్నము ; ముదమంది తినిరి”

    నూతనపు జంట మైకమ్మునొదలి గొదను

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    ( గొద=ఆకలి)

    రిప్లయితొలగించండి
  14. దాకలోనిదంతయు తినెదమనుకొనగ
    అన్నమయ్యె సున్నము ; ముదమంది తినిరి
    కొంత తమలపాకుకు పూసుకొనుచు , సాగె
    మందియందున ముచ్చట్లు మధురముగను

    రిప్లయితొలగించండి


  15. అరకొర వడ్డించిరి ముర
    ముర అన్నము! సున్నమైన ముదమంది భుజిం
    చిరి బంధులెల్లరున్ చన
    వరి మోమును జూచి కష్టపడుచు జిలేబీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. పన్నిన మాయ కానకను పాపము దుష్టులు రక్కసాధముల్

    వన్నెల మోహనాంగిగని మత్తున సోమము వీడిరక్కటా

    చిన్నది వంపు సొంపులను చిందిన కన్నులు మూతబోవుచున్

    అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్”

    ఎన్నగ రక్కసుల్ నరులునెంచగనొక్కటె కామ బంధులే

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  17. మన్ననలేనిచోటమనమందునతృప్తినిగానకున్నచో
    నెన్నగబంచభక్ష్యములునీరసమైగనపట్టునేర్పునన్
    సన్ననిబియ్యమంచుమనసావచియించుచుహోటలందుదా
    *నన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్”*

    రిప్లయితొలగించండి
  18. మాయ శశిరేఖగా వచ్చి మంటపమున
    నున్న హైడింబి మాయతో నుత్సహింప
    నన్నమయ్యె సున్నము ముదమంది తినిరి
    కౌరవేయులు న్మత్తతన్జేరి యచట

    రిప్లయితొలగించండి
  19. పెన్నిధిరోటిబియ్యమటబేలగఁజూచెనుదిక్కులన్నిటన్
    చిన్నదివన్నెలాడినయిచిందులువేసెనుసన్నబియ్యమున్
    పన్నుగదానిసోకుగనిపంకజనాభుఁడువెంటవచ్చెనే
    అన్నముసున్నమైనముదమందిభుజించిరిబుధులెల్లరున్

    రిప్లయితొలగించండి
  20. పుడమిఁ బడెఁ గవి మాటల భోజరాజు
    కవులకుఁ బరఁగె వాక్శుద్ధి భువిని మున్ను
    సత్కవీశ్వరు పద్యపు శక్తి నంత
    నన్న మయ్యె సున్నము ముదమంది తినిరి

    [అన్నము అయ్యె సున్నము= సున్నమే యన్న మైనది యిక్కడ]


    అన్నముఁ గాంతు మాంధ్రమున నంచిత దక్షిణ రాష్ట్ర రాశినిన్
    సన్నని యన్న మన్యముల సంతత మారయ సున్నయే సుమీ
    క్రన్ననఁ బోయి తక్కినవి, కంచము వీడ్యము లందుఁ గాన కీ
    యన్నము సున్న, మైన ముదమంది భుజించిరి బంధు లెల్లరున్

    రిప్లయితొలగించండి
  21. గారడి యొకని కనికట్టు బరగు కతన
    అన్నమయ్యెసున్నము,ముదమందితినిరి
    భక్తులందఱు దృప్తిగ రక్తితోడ
    దైవనామము బలుకుచు దనివితీర

    రిప్లయితొలగించండి
  22. అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధురెల్లరున్
    భిన్నపు మాటలన్ బలుక,పేలవమౌదువు గాదెయోరవీ!
    యన్నము సున్నమెట్లగును నారసి చెప్పుమ వింతయేగదా
    యన్నముగళ్ళకున్నదిమి హాయీగ తిందురు బంధురెల్లరున్

    రిప్లయితొలగించండి
  23. మన్నన యెట్లు గల్గు పదిమందికి విందని వంట నేమఱన్
    అన్నము సున్నమైన; ముదమంది భుజించిరి బంధులెల్లరున్
    అన్నము ముద్దపప్పు పరమాన్నము గూరలు నూరగాయలున్
    అన్నియు నద్భుతంబనుచునా వలలుండతి శ్రద్ధఁ సేయగా

    రిప్లయితొలగించండి
  24. విన్నపమాలకించి దన విస్తృత టక్కుటమార విద్య సం
    పన్నత నద్భుతంబులఁ ధృవంబుగ సల్పెడు మాంత్రికుండు కా
    ర్యోన్నత జూపనెంచి తన యుక్తిని జూప వివాహమందునా
    యన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్

    రిప్లయితొలగించండి
  25. అన్నము తెల్లనైన మెతుకందము మేలగునన్తలంచి లే
    సున్నపు నీరుఁజల్ల వణి సూక్ష్మమనెంచి క్రయాన్నదారులున్
    కన్న కొమార్తె పెళ్ళయిన కైవడి మారదు గాన వంటినన్
    అన్నము సున్నమైన ముదమంది భుజించిరి బంధులెల్లరున్

    రిప్లయితొలగించండి