23, మార్చి 2021, మంగళవారం

సమస్య - 3672

24-3-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోదీ నిన్ గాంచినంత మోహించునొకో”
(లేదా...)
“మోదీ నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో”

31 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి , వె లు గో డు
  --------------------------------------

  గు రు భ్యో న మః { నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన. }


  " నష్టము కల్గె నీ వలన నాలుగు వే " లని కార్మికున్ విధి

  భ్రష్టునిజేసి , సంస్థ మెడపట్టుచు గెంటును | నీచ నాయకుల్

  తుష్టిగ దేశసంపదను దున్నల మాదిరి మేతలాడ , సు

  స్పష్టముగా నిదర్శనము సాక్ష్యము లున్న c బ్రభుత్వ మెన్నడున్

  దృష్టిని పెట్ట | దంతమయె దేశ పురోగమనం బ దెప్పుడో !

  నష్టము లేదు లేదు మన నాయకు లెల్లరు నీతి మాలినన్ !

  గష్టము సేయకుండినను కాసుల బంచుచు - చేసి శుంఠలన్ ,

  బుష్టిగ విస్కి రమ్ములను పోయుచు , కోట్లను జల్లి వోట్లు కొం

  చిష్టము వచ్చినట్లు బ్రజ నేలెడు నేతల నెల్ల జేర్చి పెన్

  గాష్టములోన బేర్చి వడి గాల్చిన పాతక మంట బోదు సూ !


  [ విధిభ్రష్టుని జేయు = ఉద్యోగము నుండి తీసివేయు ;

  మేతలాడు = మేయు ; శుంఠలు = సోమరులు ;

  పుష్టిగ = సమృధ్ధిగ ]


  ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

  రిప్లయితొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  కాదేదీ కలలందసత్యముగదా కంగారు నీకేలనోయ్
  మోదంబొందుచు గుఱ్ఱమెక్కి చనుమోయ్ పొంగారు తోషమ్మునన్
  దీదీ కొల్కత వీధులందు జనుచున్ దివ్యంపు రూపంబునన్
  మోదీ! నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో!

  రిప్లయితొలగించండి
 3. మోదంబందుచుజగతియు
  చోదకునాతనివరింపజోరునగదిలెన్
  పేదయెపెన్నిధియాయెను
  మాజీ, నిన్గాంచినంతమోహించునోకో

  రిప్లయితొలగించండి
 4. శ్రీ గురుభ్యోనమః

  వాదము లందున మించిన
  మోదీ నిన్ గాంచినంత మోహించునొకో!
  లేదే పరి బీజేపీ
  దీదీ జన పరగణాల తీర్పు లెవరికో?

  పరి = సేన

  రిప్లయితొలగించండి
 5. పేదల యెడ కనికరమున
  నాదర పూర్వకపు సేవ లాచరణ ము తో
  మోదము జెందియు పొగడుచు
  మోదీ నిను గాంచి నంత మోహించు నొకో !

  రిప్లయితొలగించండి
 6. సమస్య :
  మోదీ నిన్ గని సంభ్రమమ్మున గడున్
  మోహించి చేపట్టునో

  (నెలల తరబడి ప్రాధేయపడుతున్నా కరగని కదలని ప్రధాని నుద్దేశించి ఒక రైతు పెద్ద )

  శార్దూలవిక్రీడితము
  -----------------

  తేదీలెన్నియొ మారుచున్నవి మిమున్
  దేలేక మా దారికిన్ ;
  ఖైదీలైతిమి మీకు ; మొండితనమున్
  ఖండింపగాలేమయా !
  మా దారిద్ర్యము పెచ్చుమీరిన దికన్
  మమ్మందరన్ వీడుచున్
  మోదీ ! నిన్ గని సంభ్రమమ్మున గడున్
  మోహించి చేపట్టునో !!

  ( " మా దరిద్రదేవత మమ్మల్ని విడిచి మిమ్మల్ని ఆశ్రయిస్తుందేమో ! " అని రైతు పెద్ద బాధాలాపం )

  రిప్లయితొలగించండి
 7. ఏదీ వసంత రాగమ
  దేదీ కనరాదు విభవ మేదీ పుడమిన్
  మోదపు కోకిల రాదే
  మో! దీనిన్ గాంచినంత, మోహించునొకో?!

  రిప్లయితొలగించండి
 8. సౌదీ నుండి గ్రహించితి
  కాదంబరి సీసయొకటి కమ్మని రుచితో
  సాదాసీదా గాదే
  మో! దీనిన్ గాంచినంత మోహించునొకో

  రిప్లయితొలగించండి
 9. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆదాయమ్మును జూడక
  పేదవి యీ సంస్థలనుచు పెద్దలకెల్లన్
  ప్రాదేశనమిచ్చెడి వడి
  మోదీ నిను గాంచినంత మోహించునొకో!

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. కందం
   ఆదరణ జూపు రాష్ట్ర
   మ్మేదైనను భాజపాకు నింపుగ ననుచున్
   హోదా నీయవె? 'యాంధ్రము'
   మోదీ! నిన్ గాంచినంత 'మోహించునొకో' '?

   శార్దూలవిక్రీడితము
   మాదౌనంచును రాష్ట్రమేదయిన ధీమా భాజపాకేలనో?
   యీదేశమ్మున నాదరింతురని తామిష్టానుసారమ్ముగన్
   హోదానీయక యుక్కునమ్మఁగనఁగా, నుద్రేకియౌ నాంధ్రమే
   మోదీ నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో?

   తొలగించండి
 11. కోదాడ వాసి సుందరి
  సౌదామిని వచ్చెనిటకు సచ్చరితుండౌ
  యా దర్శనుండు కనెనే
  మో దీనిన్ గాంచినంత మోహించెనొకో .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఆదాయమ్ముల తీరుతెన్నులను త్రోయన్ జేయుచున్ సంస్థలన్
  మోదమ్మొందుచు పెద్దవారి కిడుచున్ ముందుండి నీవేగుచున్
  ఖేదమ్మున్ నెలకొల్పి కార్మికులకున్ కీడెంచు నావేళలో
  మోదీ! నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో!

  రిప్లయితొలగించండి
 13. శా:

  లేదావేశము మాటలాడగను మేలెంచన్ సదా జట్టుకై
  సోదా చేయుచు వైరి కౌశలము తా జోడించు వ్యూహమ్ములన్
  నాదే భారమటంచు నెన్నికలలో నాకాశమే హద్దనన్
  మోదీ నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో

  లేదావేశము=లేదు+ఆవేశము

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. కె.వి.యస్. లక్ష్మి:

  వ్యాధుల బాపును యోగా
  బొధన జేయుచును గీత బుద్ధిని గఱపున్
  సాధించుము వీనన విన
  మోదీ! నిను గాంచినంత మోహించునొకో!

  రిప్లయితొలగించండి
 15. వేదన పడుచుండు నెపుడు
  మోదీ నిన్ గాంచినంత ; మోహించునొకో
  దీదీ నిను చూడగనే
  యేదైన నియామమున్న యెడల తెలుపుమా

  నియామము = నియమము

  రిప్లయితొలగించండి
 16. కాదనలేడజుడైనను
  లేదిలలో నీమెకు సరి లేమ సొబగునన్
  ఆ దివి సుమమో మరు శర
  మో దీనిన్ గాంచినంత మోహించునొకో

  రిప్లయితొలగించండి
 17. కం//
  మోదము గలిగెడి దానము
  సౌదామిని గన్న తండ్రి సౌఖ్యము నొసగన్ !
  హోదాకు దగిన బండి "సు
  మో", దీనిన్ గాంచినంత మోహించునొకో !!

  రిప్లయితొలగించండి
 18. కం//
  శోధించకు శివశివ, మా
  గోదావరి తీరమందు కోలాహలమున్ !
  రాధా మాధవుల ప్రణయ
  మో, దీనిన్ గాంచినంత మోహించునొకో !!

  రిప్లయితొలగించండి
 19. కం//
  శ్రీదాసుడు మాయావిర
  మోదమె నిటలాక్షుని గన, మోక్షము నొసగున్ !
  కేదార లింగ మహి మే
  మో, దీనిన్ గాంచినంత మోహించునొకో !!

  రిప్లయితొలగించండి
 20. ఆ దుష్యంతుడు వేటకై కదిలె నిత్యాసక్తుడాతండె! తా
  నాదావమ్మున పెక్కుజంతువుల సంహారమ్ము గావిం చుచున్
  బూదోటన్ దిరుగాడు రూపవతియౌ పూబోణినే కాంచె నే
  మో! దీనిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో

  రిప్లయితొలగించండి
 21. కాదొక యప్సరసామణి
  లేదు తనకు కలిమిబలిమి లేరెవ్వారల్
  యాదర్శ పురుషుడతడే
  మో! దీనిన్ గాంచినంత మోహించునొకో

  రిప్లయితొలగించండి
 22. వేదాంతులవేద్యునిగా
  వేదాంతులువేనవే‌లువేదికజేరన్,
  శ్రీదాతలుఁగర్షకులటు
  మోదీ నిన్ గాంచినంత మోహించునొకో”

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 23. నీదు ధనము యశముం గని
  యౌదలఁ దాల్చి పదములు వరానన యా శా
  తోదరి చందన చర్చా
  మోదీ! నిన్ గాంచినంత మోహించు నొకో


  వేదాంతమ్ముల నేల పల్కె దిటులన్ వేసారి దుఃఖించి నీ
  యౌదార్యమ్ము నెఱింగి తత్వ మెదలో నబ్జాక్షి శంపాంగి దా
  నాదిన్ ద్వేషము నూని పొమ్మనిన నార్యా పిమ్మటన్ నిత్య స
  మ్మోదీ! నిన్ గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో

  రిప్లయితొలగించండి
 24. ఖాదీగట్టినగాంధిదేశమునరేఖామాత్రసద్భావముల్
  సద్యస్ఫూర్తినిగోలుపోవజనముల్సీగింపచైనీయులన్
  విద్యావంతులుసంతసిల్లభళిరావేద్యుండువచ్చెన్వెసన్
  మోదీనినుగనిసంభ్రమమ్మునగడున్మోహించిచేపట్టునో

  రిప్లయితొలగించండి
 25. హోదా గలదని దలచుచు
  మోదీ! నిన్ గాంచినంత మోహించునొకో
  దాదీ పలుకుచు నాతో
  మోదముతోనుండెమిగుల మొన్నటినుండిన్

  రిప్లయితొలగించండి
 26. మోదంబందుచు మానసంబున దగన్ ముమ్మూర్తులానీవెగా
  మోదీ!నిన్గని సంభ్రమమ్మున గడున్ మోహించి చేపట్టునో
  దాదీ చెప్పిన మాతలన్ వినగనే దాదాత్మ్యమున్ బొందితిన్
  మోదీపై మనసుండి యిట్లుగను దా మోదంబుతోనుంటకున్

  రిప్లయితొలగించండి
 27. ఏదిశచూసిన నీపే
  రేదీర్ఘశృతిన వినబడు రేయీపగలున్
  యేదేశవాసియైనను
  మోదీ నిన్ గాంచినంత మోహించునొకో

  రిప్లయితొలగించండి