17, మార్చి 2021, బుధవారం

సమస్య - 3666

18-3-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్”
(లేదా...)
“పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్”

56 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    వమ్మగు యత్నముల్ జరిపి వాకిట జేరిన వెంటవెంటనే
    తమ్ములు చెల్లెలున్ మరియు తండ్రియు తాతల తోడ ప్రీతిగన్
    కమ్మని మాటలాడకయె కాంతల బంధుల తిట్టికొట్టుచున్
    పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్

    రిప్లయితొలగించండి
  2. సుగతిని గోరెడు వారై
    ప్రగతిని కాంక్షించి సతము పంతము తోడన్
    తగిన విధంబున మెలగుచు
    పొగ బెట్టిన బోని వారె పో సద్బo ధుల్

    రిప్లయితొలగించండి
  3. నగరాజతనయతపసుకు
    సెగఁబెట్టగవచ్చినట్టిశేఖరుశంభుం
    డగచాట్లుపడియువదలడు
    పోగఁబెట్టినఁబోనివారెపోసద్బంధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తపసు' అన్నది సాధుశబ్దం కాదు. "నగరాట్సుత తపమునకున్" అనండి.

      తొలగించండి
    2. నగరాట్సుతతపమునకున్
      సెగబెట్టగవచ్చినట్టిశేఖరుశంభుం
      డగచాట్లుపడియువదలడు
      పోగబెట్టినపోనివారెపోసద్బంధుల్

      తొలగించండి
  4. కమ్మనికావ్యరాజమునుగానముసేయగమంచినెంచకే
    నెమ్మదిలేకబాలకుడునేరములెంచుచుగోలసేయగా
    బమ్మనుమించినట్టిగురుబ్రహ్మలుబోధలనాపరేగదా
    పోమ్మనిపెట్టినన్బోగనుణబోమనువారెగదాసుబాంధవుల్

    రిప్లయితొలగించండి
  5. అత్తమామ లింటను తిష్ఠవేయగా వాపోవు భర్తగారు

    అమ్మడు చిన్నపిల్ల పనియంతయు జేయగ నోర్వదంచు దా
    కమ్మగ నొండిపెట్టుచును కార్యములెల్లను జక్కబెట్టుచున్
    ఇమ్మగు కాపురమ్మునను నింతికి నాకును నడ్డుగోడలై
    పొమ్మని బెట్టినం బొగను బోమను వారెగదా సుబాంధవుల్

    రిప్లయితొలగించండి
  6. సమస్య :
    పొమ్మని పెట్టినం బొగను
    బోమనువారె కదా సుబాంధవుల్

    ( లాక్షాగృహదహనానంతరం పాండవ క్షేమవార్త వేగులవారి వలన విన్న ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో అంటున్నాడు)

    ఉత్పలమాల
    ...................

    రమ్మిటు చెంతకున్ గొడుక !
    రాజిలు మెప్పుడు వంశవర్ధనా !
    నమ్మిన పాండునందనుల
    నట్టుల గాల్చిన లక్కయింటిలో
    వమ్మయె నీదు యత్నములు ;
    వారలు ధర్మము జేత రక్షితుల్ ;
    బొమ్మని పెట్టినం బొగను
    బోమనువారె కదా ! సుబాంధవుల్ .

    రిప్లయితొలగించండి
  7. మొగమాటము చూపింపక
    నగచాటులవేళ సాయమందించెడి వా
    రు గడసరి తనమున మనము
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  8. కమ్మని భోజనమ్ము కొరకై దరిజేరక ప్రేమజూపుచున్
    ద్రిమ్మట యందు బాధలను తీర్చుటె బాధ్యతగా దలంచుచున్
    నిమ్మళమంచు చెప్పగల నెయ్యరి నచ్చక నేవగించుచున్
    బొమ్మని పెట్టినంబొగను బోమను వారెకదా సుబాంధవుల్. . విరించి.

    రిప్లయితొలగించండి
  9. ఉ:

    తుమ్మెద లాగ వ్రాలి బహు దూరపు చుట్ట మటంచు నేరుగా
    ఝుమ్మని యాడి పాడుచును సొక్కుచు తుళ్ళుచు నెల్లవేళలన్
    కిమ్మనకుండు సాయమన కేకలు వేయుచు చీదరించుచున్
    పొమ్మని పెట్టినంబొగను బోనను వారె కదా సుబాంధవుల్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లాగ' అనడం వ్యావహారికం. "తుమ్మెద వోలె..." అనండి.

      తొలగించండి
  10. స్వగృహపు నిర్మితి ముగియగ
    సగర్వముగ నెల్ల బంధుజనులను బిలువన్
    సుగంధ సాంబ్రాణి సురుము
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్

    రిప్లయితొలగించండి
  11. జగమంతయు మనవారే
    తగవులు కూడవు మనుజులు తాలిమి తోడన్
    వగయగ మెలగిన చాలని
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ !

    నగరమునందున జనులకు
    వగచిన దొరకవు సరైన వసతుల గృహముల్
    పగవారలవలె మెలగుచు
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ !

    రిప్లయితొలగించండి
  12. పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్ -- samasya

    తగవులు బెట్టరు నెపుడు త
    రగదెపుడును వారి ప్రేమ రాగ ధనులుగా,
    పగవారు వివాదములను
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్

    రిప్లయితొలగించండి
  13. అమ్మొరుతల్లిసిన్మ మొదలయ్యెను బాధలుజావగొట్టగా
    నమ్మకమిచ్చిచల్మిడినినమ్రతనమ్మకుబెట్టబంపిమా
    యమ్మొనరింపమాయికునినంపివధింపగజేయయమ్మయే
    కొమ్మగగాచివచ్చెదనకున్ నెలవిమ్మనె,నెంతవారలున్
    *“బొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్”*

    రిప్లయితొలగించండి
  14. ఇమ్మహి నెల్లకాలముల నింపగురీతిని బ్రేమజూపుచున్
    గమ్మని వాక్యజాలమున గష్టములందు సుఖమ్ములందు సా
    యమ్ముగ నిల్చియుండగల హర్షిత వర్తను లెవ్వరేనియున్
    పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్

    రిప్లయితొలగించండి
  15. సిగలో చంద్రుని వెలుగులు

    సగమై పార్వతి జిలుగులు సందడి సేయన్

    భగ భగ మండిన చితులే

    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  16. సొమ్ములు లేవు కంఠమును సోకులు కాళము మోయుచుంటివే

    గుమ్మల జంటలేలనయ , కూరిమి గంగను వీడుమన్చు , నె

    ర్నమ్మిక నీదు పాదములు నాల్కలు సాచిన కాటి మంటలే

    పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  17. టీవీ ధారావాహికల నేపథ్యంలో....

    కందం
    ధగధగల నింట మూగుచు
    బగఁజూపుచు వగలొలుకుచు బంధువులుండన్
    దగు ధారావాహికలన్
    బొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్!

    ఉత్పలమాల
    అమ్మను జంపి నాన్న హృదయంబున పీఠము వైచి దృష్టినిన్
    సొమ్ముల పైని నుంచి సుతుఁ జూచుచుఁ బ్రేమ, నిరంతరంబనన్
    కమ్మగ దూరదర్శనపు గాథల, టక్కరి చేర్చువారనన్
    బొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్!

    రిప్లయితొలగించండి
  18. నెమ్మిని చెంత జేరి దమ నేస్తములాపదనున్న వేళలన్
    గ్రమ్మిన చీకటుల్ దొలగ కాగల సాయమొనర్చి శత్రువుల్
    పొమ్మని పెట్టినం బొగను బోమనువారె కదా సుబాంధవుల్
    వమ్మొనరింపరాశలను పన్నుగ నిల్తురు వెన్నుదన్నుగా

    రిప్లయితొలగించండి
  19. నిన్నటి సమస్యకు నా ప్రయత్నము

    ప్రాకట ధర్మమూర్తి రఘురామునితో వనవాస దీక్షకున్
    జోకగ నేగ జానకియు సుందర గౌతమి తీరమందునన్
    లోకులు మెచ్చఁ బంచవటిలోన వసించిరి; పాండునందనుల్
    దాకొననా పవిత్రమగు స్థానము గాంచి నమస్కరించిరే

    (దాకొను = సమీపించు అనే భావంలో)

    రిప్లయితొలగించండి
  20. పగగొని చెడుభాగముగా
    బొగబెట్టిన,బోనివారె పోసద్బంధుల్
    సుగమంబగురీతిని,హిత
    మగుపలు కున్బలికిపగను నంతముగాగన్

    రిప్లయితొలగించండి
  21. పగతుర పన్నాగములకు
    వగవక తగురీతి మెలిగి పాండుకుమారుల్
    సెగ తగిలిన తట్టుకొనిరి
    పొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్

    రిప్లయితొలగించండి
  22. జగతినిఁ బరిశీలించినఁ
    దగు సాయము సేయ నెంచి తద్దయుఁ బ్రీతిన్
    రగులుచు నుండఁగఁ గలతలఁ
    బొగఁ బెట్టినఁ బోనివారె పో సద్బంధుల్


    కిమ్మన కుండ కష్టములు క్రిక్కిరియం గడు నూఱకుండియుం
    బమ్మగ సౌఖ్య సంపదలు బంధుల మంచు వచించి గోముగా
    రమ్మన కుండ వచ్చి సుకరమ్ముగ నుండుచుఁ బెద్ద కాలమే
    పొమ్మని పెట్టినం బొగను బోమను వారె కదా సు! బాంధవుల్

    [సు =సుమి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'కలతల పొగ'... 'సు! బాంధవుల్' ఎలా వస్తాయండీ మీకిలాంటి వైవిధ్యమైన ఆలోచనలు? ఒక్కొక్కసారి మీ పూరణలను చదివి అశ్చర్యచకితుడనౌతాను. నిజంగా ఈనాటి పూరణలను అందరి పూరణల కంటె ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
      మీరు అంగీకరిస్తే మిమ్మల్ని 'శంకరాభరణం' వాట్సప్ సమూహంలో చేరుస్తాను. ఔత్సాహిక కవులు అందులో ఎక్కువ. మీ పూరణలు వారికి మార్గదర్శకాలవుతాయి.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      మీయభీష్ఠము.

      తొలగించండి
  23. కమ్మని వార్తనున్ నుడువ గంపెడునాశనువచ్చువారినిన్
    పొమ్మనిపెట్టినం బొగను ,బోమనువారెకదాసుబాంధవుల్
    నిమ్ముగ వచ్చునాపగకునేరికి నష్టము గల్గకుండగా
    నమ్మరొ చక్కజేసిరిమ హాత్ములరీతిని గాదెవారలున్

    రిప్లయితొలగించండి