24, మార్చి 2021, బుధవారం

దత్తపది - 175

25-3-2021 (గురువారం)
బండి - రథము - ఓడ - విమానము
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
ఒక అదృష్టహీనుని దీనావస్థను వర్ణిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం చెప్పండి.

46 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    ఓడకు మయ్యరో! విడిచి హుందలు పెక్కువి మానముల్ కడున్
    కూడును గుడ్డలే కయిట కుందుచుఁ బండియు పాపమయ్యరో
    తాడును పేడునున్ గనక తప్పులు జేయగ శిక్షనీకిటన్
    వీడుర! థమ్ముథమ్మనెడు బింకపు గుండెను వెంటవెంటనే!

    😊

    రిప్లయితొలగించండి
  2. వయసుబండినతోడనెవగయువచ్చు
    దశరధ! మునుపటిపలుకుధర్మమెంచు
    దేవుడోడంగమనిషివైదేహమందు
    తనివిమానముగావుముతగవులేక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వయసు+పండిన' అన్నపుడు సరళాదేశం రాదు, గసడదవాదేశం వస్తుంది.

      తొలగించండి
  3. ఈనాటి దత్త పది


    ఓడ. రధము బండి విమానము


    ఒక దీనుని వేదన




    చక్కని తనయులు‌‌, సతియు, సంపదలును కూడ నేనెప్పుడు నోడ ననుచు

    తలచితి,సోకగ తనువుకు వ్యాదులు,చేర్చిరి యుద్రధము చెంత నన్ను

    గుడ్డి విమానము కున్ గడ్డి యేచాలు దాణావలదనుచు
    దయను వీడి

    కుండలో‌ గంజిని‌ కుడువ మనుచు నాకు వేళకు‌ తిండిని పెట్ట కుండ


    పలురకములుగ హింసలు‌ సలుపు చుండె

    స్వామి! కలపనబండిని‌ చక్క బరచు

    వాడివి యిలలో నీవెగా బాద తీర్చ

    మనుచు దేముని ప్రార్థించె మనిషి యొకడు



    ఉద్రధము = కుక్క

    గుడ్డి విమానము = గుడ్డి గుర్రము

    కలపనబండి = ఆపద

    రిప్లయితొలగించండి
  4. దత్తపది :
    బండి - రథము - ఓడ - విమానము అనే పదాలను అన్యార్థంలో
    ఉపయోగిస్తూ అదృష్టహీనుని
    దీనావస్థను వర్ణిస్తూ స్వేచ్ఛాఛందస్సులో పద్యం .

    ( ఒక నిర్భాగ్యుడు దైవాన్ని ప్రార్థిస్తున్నాడు )

    తేటగీతి
    --------

    దేవ ! నా మనోరథమది తీరకుండె ;
    బ్రతుకునేలను బండింపు బంటలెల్ల ;
    స్వామి ! న న్నోడ జేయక శక్తి నిడుము ;
    కరుణమూర్తివి ; మానము గావుమయ్య !

    రిప్లయితొలగించండి
  5. జీవితమున నోడకు మని
    భావిని బండి యును నీదు భాగ్యం బనుచున్
    గావగ భువి మానము నను
    చేవ యగు మనోరథము ను చెడు గయ్యెను గా !

    రిప్లయితొలగించండి

  6. ఒక రైతు ఆత్మఘోష

    ముద్దు చేనున బండిన పుచ్చపంట
    ముసరినట్టి వాతరథము ముంచివేయ
    ప్రకృతి చేష్టల నోడగ పాపమనక
    పావి, మానము దీయును బాకి యనుచు

    వాతరథము = మేఘము
    పావి = పాపి ( వడ్డీ వ్యాపారి)


    రిప్లయితొలగించండి
  7. కం//
    విరిబండిత పాపియొకడు
    దరహాసముగను మనోరథముచే హరిగో !
    పురపు విమానము గూల్చగ
    కరములుదెగి వోడడంగ గర్వము దొలగెన్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విరిబండిత'?
      'తెగి+ఓడు=తెగియోడు' అవుతుంది.

      తొలగించండి


  8. జంబం డిగనురికెను ! పీ
    తాంబరధారీ! మనోరథము కూలబడెన్!
    కెంబసువు రంగులోడగ
    మంబరపునయనపు జీవి మానము గావన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  9. ఇవ్వాళ కంది వారు సెలవన్న మాట :)


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకా సందేహం వచ్చింది?
      గమనించారా? 'దత్తపది' అనగానే "ఇవాళ నాకు సెలవు" అనే జిపియెస్ గారు ఈరోజు పూరణ పెట్టారు.

      తొలగించండి
  10. తేటగీతి
    సత్యమునఁ బండెనన హరిశ్చంద్రుని,ముని
    తన మనోరథమీడేర దానమడుగ
    బంధములవి మానముగావు పలుకు నకని
    సతిని సుతునోడఁ గాటిలో వెతలఁబడియె

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గురుభ్యోనమః

    రైతే ఈనాటి అదృష్ట హీనుడు...

    పంటలు బండించెదరే
    మంటలను మనోరథముల మలమల మాడ్చన్!
    యొంటరి యుద్ధము నోడగ
    బంటవి మానముల దీసి తొలగగ జేసెన్!?

    బంటు = సేవకుడు, రక్షకుడు అని చెప్పుకొనే నాయకుడు

    రిప్లయితొలగించండి
  12. ధరణిన్ బండితపామర
    నరులమనోరథమునోడనంతబలమిడన్
    నరహరివి మానము గావగ
    సరుగున నరుదెంచవేర సజ్జన వినుతా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  13. ఉ:

    సేద్యము చేయనెంచి పలు చేనుల *బండి* న పంట నూర్పగన్
    సద్యము మార్పు జేసిరట చట్టము *లోడ* గ రైతు క్షేమమే
    చోద్యము గల్గ చూపఱకు సూక్తి- మనో *రథమె* ట్లుదీరనన్
    మద్యమదేమొ దా నిడి *వి మానము* లేకయె పాఱునేరులై

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. బ్రదుకు బండిని నీడ్చగ శక్తిలేక
    తనమ నోరధము నునోడ గొనగజేసి
    వేడుకొనె బరమాత్ముని విపులముగను
    భక్తరక్షణ శీలివి మానముడుగ
    జేసికాపాడు మమ్ముల జేరదీసి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  15. కవి మానము గోల్పోయి వి
    రివిగ భువిం బండి నట్టి పృథులోభము చే
    త విగత మనోరథమునను
    సు విచార సమేత మోడ శోకించె నటన్

    రిప్లయితొలగించండి
  16. చూడుము బండికల్లది వసుంధరలో దిగి పోయె గాదుటే
    యోడక దప్పదంటి విజయుండు శరమ్ముల వేయ వచ్చె, కా
    పాడదు నీవి, మానము పాఱెద మిచ్చటి నుండి వేగమే
    వీడుము నీ మనోరథము విజ్ఞుడ వై చరియించు కర్ణుడా!
    ..... ...... ...... ....... ....... ....... ...........
    ఈవి =దానము... మానము= గౌరవము
    (కర్ణునితో శల్యుని మాటలు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  17. పొలమునఁ *బండి* ధాన్యములు మోదము నివ్వగ కళ్ళమందునన్
    సులభముగా మనో *రథము* చొప్పడు నంచు తలంచుచుండగా
    కలిగెను వృష్టి *యోడ* మది కల్గిన నష్టము కారణమ్ముతో
    మలమల మాడుచుండ చ *వి మానము* క్రుంగెను రైతు బిడ్డకున్

    రిప్లయితొలగించండి
  18. నిండుగా (బండి)న తరులు నేల గూల
    వ్యర్థమై పెట్టుబడియంత బ్రతుకు (నోడ)
    భగ్నమై మనో(రథము)లభాసమౌచు
    గన బడుగు జీ(వి మానము) గంగ కలిసె

    రిప్లయితొలగించండి
  19. పరమవిలువలుగలిగినఁబండితుండు
    రచనజేసెనుజయమనోరథముమీర
    రాజకీయమునేర్వకరయమునోడ
    బదవి,మానము విడలేనిఁబాత్రుడనగ

    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  20. పంట బండిన యంతనె వడిగ నెత్త
    వలెనను మనోరథ మిపుడె వ్యర్థ మయ్యె
    మనవి మానము తోవిను మనుజు లెచట
    కానరాక నోడె మదియు కలత తోడ


    రిప్లయితొలగించండి