5-3-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే”(లేదా...)“శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:పంతము బట్టి మిత్రులకు బాగుగ నేర్పుచు మల్లయుద్ధమున్పొంతము వీడుచున్ కడకు పోకిరి మూకల మట్టుబెట్టుచున్భ్రాంతులు మానుచున్ త్వరగ బాధలు పెట్టగ శత్రుజాతులన్శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
రాతిని నాతిగ జేసినసీతా పతి నడిచినట్టి సీమల లోనన్జాతుల వైరము ప్రబలెన్జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములండీ
నీతిని జాయితి తోడుత భీతిని విడనాడి జనుల ప్రీతి కొఱకు నై రాతల మార్చంగ కుజన జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే
క్రొవ్విడి వెంకట రాజారావు: ప్రీతియె క్షయమై నడగును జాతివివక్షగల నేల; శాంతి నిలయమే రీతిగ జాతుల కలుపుచు ద్యోతించెడి భరతభూమి యుర్వర లోనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు."క్షయమై యడగును" అనండి.
ఖాతరుచేయుచుపుట్టుకచేతలమాటలజనములచెరచుటపనిగావాతలబెట్టంగనెదిరిజాతివివక్షగలనేలశాంతికినిలయమే?
శాంతికపోతమీవనుచు,భ్రాంతులమేమిటుమున్ గిపోతిమేప్రాంతపుభేదముల్విడిచి,ప్రాభవమందగమేలుసోదరా!చింతలువంతలై బ్రతుకు, చిందరవందరజేయకిత్తరిన్ శాంతికి బుట్టినిల్లుగద జాతివివక్షను జూపుదేశమే
Dhanyavaadaalu guruvaryaa
ఉత్పలమాల:++++++++=++భ్రాంతులవీడమేలుగద,భ్రాతవునీవిటుజేయధర్మమా!ప్రాంతమువేరుగానిమన, ప్రాపకమన్నది హద్దు మీరుచోకాంతులుజిమ్మునాయుధము,కాదనకుండనుగూల్చుమిమ్ములన్శాంతికి బుట్టినిల్లుగద, జాతివివక్షను జూపుదేశమే
క్రొవ్విడి వెంకట రాజారావు: రీతిని గూడని విధమున భాతియె జూపని బ్రతుకున పరగుచు నెపుడున్ ప్రీతిని నడచుచు పౌరుల జాతివివక్షగలనేలశాంతికినిలయమే?
ఉత్పలమాల:++++++++=++కాంతులుజిమ్ముభారతము,కాళపురాత్రిగ జేయ నేలరా?సుంతయుబుద్ధిలేదనిన,శూన్యపుదృక్కుల కర్ధమేమిరా?పొంతనలేనిపొత్తులకు, పోలికనీవనిదెల్సినంతనే శాంతికి బుట్టినిల్లుగద, జాతివివక్షను జూపుదేశమే
నౌతలమే కాదె కనగ జాతివివక్ష గలనేల, శాంతి నిలయమే ప్రీతిగ జనులెల్లరు సౌ భ్రాతృత్వముతో మెలఁగు వసుధయె సుమ్మీ . . . . విరించి.
ప్రాంతముదేశమంచునెదపాయనిగాఢపుప్రేమజూపుచున్స్వంతమునైనచేష్టలనుసాంత్వనబోందుచుదేశభక్తితోకాంతకుకన్ననేలకునుగాయముసేయడురాముడెప్పుడున్శాంతికిపుట్టినిల్లుగదజాతివివక్షనుజూపుదేశమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు."రాము డెవ్విధిన్... దేశమే?" అంటే అన్వయం కుదురుతుందేమో?
అవునండి, శిరసావహిస్తాను
కాంతులు చిమ్ము రాజ్యమును కాంతను పోయెను సొమ్ము పోయెనేసొంతమునయ్యె కాడునకు సొంపుగనందరు చేరు భూమియేశాంతికిఁ బుట్టినిల్లు గద ; జాతి వివక్షను జూపు దేశమేభ్రాంతిన చెడ్డ ప్రాంతమను భావన ద్రోలెను యూరి కావలన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'భ్రాంతిని' అనండి. 'త్రోలెను+ఊరి' అన్నపుడు యడాగమం రాదు. "..ద్రోలెనె యూరికావలన్" అందామా?
ధన్యవాదములండీమీ సవరణలను పాటిస్తానండీ
దాతలు గలిగిన పృథవిననీతిమయంబగు మనుజులు నిలచుచు నుండిఖ్యాతిని పొందియు,నుండనిజాతి వివక్ష గల నేల, శాంతి నిలయమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'పృథివిని' అనండి. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.
సమస్య: 05.03.2021శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే.ఉ.అంత విభిన్న సంస్కృతుల యైక్యపు వేదిక నాదు దేశమేశాంతికిఁ బుట్టినిల్లు గద; జాతి వివక్షను జూపు దేశమేక్రాంతి పథమ్ము గానక విఘాతము నొందదె యెల్లవేళలన్ధ్వాంతము నందు మున్గుచును పాకులు గానరు వృద్ధినెన్నడున్.విఘాతము-నాశనముధ్వాంతము-చీకటి🙏🏻మేరా భారత్ మహాన్🙏🏻
సంస్స్కృతుల కైక్యపు వేదిక
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు: వింతగు జాతి భేదముల విచ్ఛుతిజేసి జనాళి కెంతయున్ పంతగు సాత్వికత్వమును పంచెడి భారతదేశమే యిలన్ శాంతికి బుట్టినిల్లుగద; జాతి వివక్షను జూపు దేశమే సుంతయు శాంతి సౌఖ్యములు జూపగ లేనిది పౌరులందునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'విచ్ఛుతు' ?
సమస్య :శాంతికి బుట్టినిల్లు గద జాతివివక్షను జూపు దేశమే (మనభారతం మహోజ్వలభారతం )ఉత్పలమాల .....................దాంతికి బుట్టినిల్లు గద ధన్యుడు బుద్ధుని వాసదేశమే !కాంతికి బుట్టినిల్లు గద కారుణికత్వపు గాంధిదేశమే !క్రాంతికి బుట్టినిల్లు గద గణ్యుడు అల్లురి జన్మదేశమే !శాంతికి బుట్టినిల్లు గద !జాతివివక్షను జూపు దేశమే వంతల పాలగున్ జగతి బంగరుభావిని గోలుపోయెడిన్ .( దాంతి - ఇంద్రియనిగ్రహము ; క్రాంతి - విప్లవము )
భూత తతులన్ని దేవ విభూతులుగా నెంచినపుడు ముప్పిరిగొనునేచేతనమందు ప్రశాంతత!జాతి వివక్షగల నేల శాంతి నిలయమే?అశాంతికి నిలయమైన శాంతినివాసం 😀😀వంతను గ్రక్కి పాత్రలను ధ్వంసము జేయుచు వంటయింటిలోకాంతుని తిట్టిపోయుచును కాంక్షల పట్టిక ముందునుంచుచున్భ్రాంతిని వీడగా పతికి బండెడు చాకిరి నంటగట్టునాశాంతికి పుట్టినిల్లుగద జాతి వివక్షత జూపుదేశమే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
ఉ: చెంతకు చేరనీరు నను చింతన చేయుదురంటరారనిన్పొంతన లేని మాటలుగ పోనిడ కుండరె దేవళమ్మునన్వింతగు పోకడల్ గలుగ వేగిరమై జత గూడి సాగగన్శాంతికి బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమేవై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
ధన్యవాదములు: అనిన్ కు బదులుగా *అంటరారనన్* అని మారుస్తాను
నేతలు ఖలులై జనములకోతులవలె దీర్చినారు కులముల తోడన్ఘాతుక రీతుల దుర్జనజాతి వివక్ష గల నేల శాంతి నిలయమే
పొంతన లేని పల్కులివి బోల్చగ రాదుగ భారతావనిన్ అంతరముల్ విరోధముల నల్లలలాడెడి శత్రు సీమతో;శాంతికిఁ బుట్టినిల్లు గద; జాతి వివక్షను జూపు దేశమేవంతల పాలగున్ పరమ పాతకమౌ రవిలింప ద్వేషముల్
నీతిగ మసలిన, మన నరజాతి పురోగతికి మేలు,శాంతిని కూర్చున్జాతివిభిన్నత. కయ్యము,జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
ఖాతరు చేయకనెవరినిజాతి వివక్ష గల నేత శాంతి నిలయమే ?మూతి బిగింపులు చూపెడుజాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు."చేయక యెవరిని" అనండి.
అనుకూలత గల దేశముగన శాంతికిఁ బుట్టినిల్లు గద! జాతి వివక్షను జూపు దేశమే గతిపెనుపును గాంచును వివక్షు వీవు తెలుపుమా!జిలేబి
సంతస మెల్లరీతులను సర్వజనాళికి గూర్చుచుండి యేప్రాంతమునందునైన బహుభంగుల ధర్మము నిల్పుచుండి యావంతయు భేద మెంచవల దంచును నేర్పెడి భారతం బిలన్శాంతికిఁ బుట్టినిల్లు గద, జాతి వివక్షను జూపు దేశమే?
మైలవరపు వారి పూరణ ఆంతరపాలనమ్ము విడనాడి దురాత్ములు ప్రక్కదేశపుంబ్రాంతము గోరుచో తిరుగుబాటు జనించును స్వీయదేశమం., దంతముజేయనెంచి., జగమంతయు చెప్పినదంచు మారుచోశాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
సాంతముదేశమొక్కటినవిశాలప్రదేశముబాసయాసలున్ప్రాంతమువర్ణముల్మతములన్నియునున్ననుభారతాంబయే*శాంతికిఁ బుట్టినిల్లు గద: జాతి వివక్షను జూపు దేశమే”*వింతగపాకుదేశమదివేరుగమారెనుమిల్ట్రిపాలనన్శాంతినికోలుపోయెకొనసాగెమతంబునునుగ్రవాదమున్
వింతలకెల్లవింతతలపింతయలేకయనంతచింతనన్దాంతినికాంతిశాంతిసముదంచితయోగవిధానభారతీయాంతరికాత్మవైభవమునంతటసాంతమునించెమెచ్చగా*శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే”*
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సంతతవర్గభేదములు సంఘవిభిన్నకులాధికారదుర్మంతనరాజకీయములు మౌఢ్యమతోన్మదదుష్ప్రవర్తనల్ధ్వాంతనిమగ్ననేతృపరిపాలనసంభవమైన దుస్తరాశాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే.కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
రాతి యుగపు టాలోచనజాతివివక్షతనుజూపు జాడ్యము భువి నేరీతిగ ననదగు నీవిధిజాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.మొదటి పూరణ కూడ బాగున్నది. కాకుంటే పద్యప్రారంభంలోని పదం అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కదా!
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. నెత్తుట: నెత్తు రందు. అశ్లీల మెక్కడో నా కవగతము కాలేదండి.
పద్య ప్రారంభ పదం... 'చూతుమె' అన్నదాని గురించి...
వీతము భేదము నెత్తుటఁజూతుమె భేదము భవములఁ జోద్యపు మృతులం జూతుమె యంగ విభేదము జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే? అంతము నందు నైన మఱి యాదిని నైనను గాంచ లేని యీ పంతము లేల మర్త్యులకు వంశము లందు వచింప నిట్టులన్ వింత రవంత కాంతురె సువృద్ధి వినాశక ఘోర దుర్భ రాశాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే [దుర్భర + అశాంతి = దుర్భ రాశాంతి; సువృద్ధి = మంచి వృద్ధి, మార ణాయుధముల వృద్ధి కాదు.]
సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కాతరము జెందు ననిశముజాతి వివక్షగల నేల ,శాంతినిలయమేనేతల ప్రజోపయోగపుజేతలు,మాటలునుమేలు సేయుటవలనన్
కందంజాతుల మధ్యన భేదముచేతనతో బాపు నేత 'స్థిరనిశ్చయుడౌభూతమె' ,పాఱఁద్రోలన్జాతివివక్ష, 'గల' నేల శాంతి నిలయమే! ఉత్పలమాలసాంతము దోచ భారతము స్వైరవిహారమనంగ వారిలోనింతకు ముందు లేనివన నేర్పడఁ గూర్చుచు భేదభావముల్వంతలు పాలుఁ జేయఁగ వివక్ష యశాంతికిఁ, బెన్విఘాతమైశాంతికిఁ, బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే
సుంతయుభేదభావములు సొప్పడ నీయని భారతంబునేశాంతికి బుట్టినిల్లుగద ,జాతివివక్షను జూపుదేశమే శాంతిభద్రతల్ గనని జక్కిగ బేరును బొందునీ భువిన్ శాంతియు సౌఖ్యముల్ గలుగ జక్కటి జీవన మందవచ్చుగా
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
పంతము బట్టి మిత్రులకు బాగుగ నేర్పుచు మల్లయుద్ధమున్
పొంతము వీడుచున్ కడకు పోకిరి మూకల మట్టుబెట్టుచున్
భ్రాంతులు మానుచున్ త్వరగ బాధలు పెట్టగ శత్రుజాతులన్
శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే :)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిరాతిని నాతిగ జేసిన
రిప్లయితొలగించండిసీతా పతి నడిచినట్టి సీమల లోనన్
జాతుల వైరము ప్రబలెన్
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండినీతిని జాయితి తోడుత
రిప్లయితొలగించండిభీతిని విడనాడి జనుల ప్రీతి కొఱకు నై
రాతల మార్చంగ కుజన
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిప్రీతియె క్షయమై నడగును
జాతివివక్షగల నేల; శాంతి నిలయమే
రీతిగ జాతుల కలుపుచు
ద్యోతించెడి భరతభూమి యుర్వర లోనన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"క్షయమై యడగును" అనండి.
ఖాతరుచేయుచుపుట్టుక
రిప్లయితొలగించండిచేతలమాటలజనములచెరచుటపనిగా
వాతలబెట్టంగనెదిరి
జాతివివక్షగలనేలశాంతికినిలయమే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశాంతికపోతమీవనుచు,భ్రాంతులమేమిటు
రిప్లయితొలగించండిమున్ గిపోతిమే
ప్రాంతపుభేదముల్విడిచి,ప్రాభవమందగమేలుసోదరా!
చింతలువంతలై బ్రతుకు, చిందరవందరజేయకిత్తరిన్
శాంతికి బుట్టినిల్లుగద జాతివివక్షను జూపుదేశమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిDhanyavaadaalu guruvaryaa
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++=++
భ్రాంతులవీడమేలుగద,భ్రాతవునీవిటుజేయధర్మమా!
ప్రాంతమువేరుగానిమన, ప్రాపకమన్నది హద్దు మీరుచో
కాంతులుజిమ్మునాయుధము,కాదనకుండనుగూల్చుమిమ్ములన్
శాంతికి బుట్టినిల్లుగద, జాతివివక్షను జూపుదేశమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిరీతిని గూడని విధమున
భాతియె జూపని బ్రతుకున పరగుచు నెపుడున్
ప్రీతిని నడచుచు పౌరుల
జాతివివక్షగలనేలశాంతికినిలయమే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండి++++++++=++
కాంతులుజిమ్ముభారతము,కాళపురాత్రిగ జేయ నేలరా?
సుంతయుబుద్ధిలేదనిన,శూన్యపుదృక్కుల కర్ధమేమిరా?
పొంతనలేనిపొత్తులకు, పోలికనీవనిదెల్సినంతనే
శాంతికి బుట్టినిల్లుగద, జాతివివక్షను జూపుదేశమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిDhanyavaadaalu guruvaryaa
తొలగించండినౌతలమే కాదె కనగ
రిప్లయితొలగించండిజాతివివక్ష గలనేల, శాంతి నిలయమే
ప్రీతిగ జనులెల్లరు సౌ
భ్రాతృత్వముతో మెలఁగు వసుధయె సుమ్మీ .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రాంతముదేశమంచునెదపాయనిగాఢపుప్రేమజూపుచున్
రిప్లయితొలగించండిస్వంతమునైనచేష్టలనుసాంత్వనబోందుచుదేశభక్తితో
కాంతకుకన్ననేలకునుగాయముసేయడురాముడెప్పుడున్
శాంతికిపుట్టినిల్లుగదజాతివివక్షనుజూపుదేశమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"రాము డెవ్విధిన్... దేశమే?" అంటే అన్వయం కుదురుతుందేమో?
అవునండి, శిరసావహిస్తాను
తొలగించండికాంతులు చిమ్ము రాజ్యమును కాంతను పోయెను సొమ్ము పోయెనే
రిప్లయితొలగించండిసొంతమునయ్యె కాడునకు సొంపుగనందరు చేరు భూమియే
శాంతికిఁ బుట్టినిల్లు గద ; జాతి వివక్షను జూపు దేశమే
భ్రాంతిన చెడ్డ ప్రాంతమను భావన ద్రోలెను యూరి కావలన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భ్రాంతిని' అనండి. 'త్రోలెను+ఊరి' అన్నపుడు యడాగమం రాదు. "..ద్రోలెనె యూరికావలన్" అందామా?
ధన్యవాదములండీ
తొలగించండిమీ సవరణలను పాటిస్తానండీ
దాతలు గలిగిన పృథవిన
రిప్లయితొలగించండినీతిమయంబగు మనుజులు నిలచుచు నుండి
ఖ్యాతిని పొందియు,నుండని
జాతి వివక్ష గల నేల, శాంతి నిలయమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పృథివిని' అనండి. రెండవ పాదం చివర తప్పక గురువుండాలి.
సమస్య: 05.03.2021
రిప్లయితొలగించండిశాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే.
ఉ.
అంత విభిన్న సంస్కృతుల యైక్యపు వేదిక నాదు దేశమే
శాంతికిఁ బుట్టినిల్లు గద; జాతి వివక్షను జూపు దేశమే
క్రాంతి పథమ్ము గానక విఘాతము నొందదె యెల్లవేళలన్
ధ్వాంతము నందు మున్గుచును పాకులు గానరు వృద్ధినెన్నడున్.
విఘాతము-నాశనము
ధ్వాంతము-చీకటి
🙏🏻మేరా భారత్ మహాన్🙏🏻
సంస్స్కృతుల కైక్యపు వేదిక
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివింతగు జాతి భేదముల విచ్ఛుతిజేసి జనాళి కెంతయున్
పంతగు సాత్వికత్వమును పంచెడి భారతదేశమే యిలన్
శాంతికి బుట్టినిల్లుగద; జాతి వివక్షను జూపు దేశమే
సుంతయు శాంతి సౌఖ్యములు జూపగ లేనిది పౌరులందునన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'విచ్ఛుతు' ?
సమస్య :
రిప్లయితొలగించండిశాంతికి బుట్టినిల్లు గద
జాతివివక్షను జూపు దేశమే
(మనభారతం మహోజ్వలభారతం )
ఉత్పలమాల
.....................
దాంతికి బుట్టినిల్లు గద
ధన్యుడు బుద్ధుని వాసదేశమే !
కాంతికి బుట్టినిల్లు గద
కారుణికత్వపు గాంధిదేశమే !
క్రాంతికి బుట్టినిల్లు గద
గణ్యుడు అల్లురి జన్మదేశమే !
శాంతికి బుట్టినిల్లు గద !
జాతివివక్షను జూపు దేశమే
వంతల పాలగున్ జగతి
బంగరుభావిని గోలుపోయెడిన్ .
( దాంతి - ఇంద్రియనిగ్రహము ; క్రాంతి - విప్లవము )
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిభూత తతులన్ని దేవ వి
రిప్లయితొలగించండిభూతులుగా నెంచినపుడు ముప్పిరిగొనునే
చేతనమందు ప్రశాంతత!
జాతి వివక్షగల నేల శాంతి నిలయమే?
అశాంతికి నిలయమైన శాంతినివాసం 😀😀
వంతను గ్రక్కి పాత్రలను ధ్వంసము జేయుచు
వంటయింటిలో
కాంతుని తిట్టిపోయుచును కాంక్షల పట్టిక ముందునుంచుచున్
భ్రాంతిని వీడగా పతికి బండెడు చాకిరి నంటగట్టు
నా
శాంతికి పుట్టినిల్లుగద జాతి వివక్షత జూపుదేశమే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిఉ:
రిప్లయితొలగించండిచెంతకు చేరనీరు నను చింతన చేయుదురంటరారనిన్
పొంతన లేని మాటలుగ పోనిడ కుండరె దేవళమ్మునన్
వింతగు పోకడల్ గలుగ వేగిరమై జత గూడి సాగగన్
శాంతికి బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అనిన్' అన్న ప్రయోగం సాధువు కాదు.
ధన్యవాదములు: అనిన్ కు బదులుగా *అంటరారనన్* అని మారుస్తాను
తొలగించండినేతలు ఖలులై జనముల
రిప్లయితొలగించండికోతులవలె దీర్చినారు కులముల తోడన్
ఘాతుక రీతుల దుర్జన
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొంతన లేని పల్కులివి బోల్చగ రాదుగ భారతావనిన్
రిప్లయితొలగించండిఅంతరముల్ విరోధముల నల్లలలాడెడి శత్రు సీమతో;
శాంతికిఁ బుట్టినిల్లు గద; జాతి వివక్షను జూపు దేశమే
వంతల పాలగున్ పరమ పాతకమౌ రవిలింప ద్వేషముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీతిగ మసలిన, మన నర
రిప్లయితొలగించండిజాతి పురోగతికి మేలు,శాంతిని కూర్చున్
జాతివిభిన్నత. కయ్యము,
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఖాతరు చేయకనెవరిని
జాతి వివక్ష గల నేత శాంతి నిలయమే ?
మూతి బిగింపులు చూపెడు
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"చేయక యెవరిని" అనండి.
రిప్లయితొలగించండిఅనుకూలత గల దేశము
గన శాంతికిఁ బుట్టినిల్లు గద! జాతి వివ
క్షను జూపు దేశమే గతి
పెనుపును గాంచును వివక్షు వీవు తెలుపుమా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంతస మెల్లరీతులను సర్వజనాళికి గూర్చుచుండి యే
రిప్లయితొలగించండిప్రాంతమునందునైన బహుభంగుల ధర్మము నిల్పుచుండి యా
వంతయు భేద మెంచవల దంచును నేర్పెడి భారతం బిలన్
శాంతికిఁ బుట్టినిల్లు గద, జాతి వివక్షను జూపు దేశమే?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఆంతరపాలనమ్ము విడనాడి దురాత్ములు ప్రక్కదేశపుం
బ్రాంతము గోరుచో తిరుగుబాటు జనించును స్వీయదేశమం.,
దంతముజేయనెంచి., జగమంతయు చెప్పినదంచు మారుచో
శాంతికిఁ బుట్టినిల్లు గద
జాతి వివక్షను జూపు దేశమే!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది.
తొలగించండిసాంతముదేశమొక్కటినవిశాలప్రదేశముబాసయాసలున్
రిప్లయితొలగించండిప్రాంతమువర్ణముల్మతములన్నియునున్ననుభారతాంబయే
*శాంతికిఁ బుట్టినిల్లు గద: జాతి వివక్షను జూపు దేశమే”*
వింతగపాకుదేశమదివేరుగమారెనుమిల్ట్రిపాలనన్
శాంతినికోలుపోయెకొనసాగెమతంబునునుగ్రవాదమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివింతలకెల్లవింతతలపింతయలేకయనంతచింతనన్
రిప్లయితొలగించండిదాంతినికాంతిశాంతిసముదంచితయోగవిధానభారతీ
యాంతరికాత్మవైభవమునంతటసాంతమునించెమెచ్చగా
*శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే”*
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసంతతవర్గభేదములు సంఘవిభిన్నకులాధికారదు
రిప్లయితొలగించండిర్మంతనరాజకీయములు మౌఢ్యమతోన్మదదుష్ప్రవర్తనల్
ధ్వాంతనిమగ్ననేతృపరిపాలనసంభవమైన దుస్తరా
శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే.
కంజర్ల రామాచార్య.
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాతి యుగపు టాలోచన
రిప్లయితొలగించండిజాతివివక్షతనుజూపు జాడ్యము భువి నే
రీతిగ ననదగు నీవిధి
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమొదటి పూరణ కూడ బాగున్నది. కాకుంటే పద్యప్రారంభంలోని పదం అశ్లీలార్థాన్ని సూచిస్తుంది కదా!
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండినెత్తుట: నెత్తు రందు. అశ్లీల మెక్కడో నా కవగతము కాలేదండి.
పద్య ప్రారంభ పదం... 'చూతుమె' అన్నదాని గురించి...
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండివీతము భేదము నెత్తుటఁ
తొలగించండిజూతుమె భేదము భవములఁ జోద్యపు మృతులం
జూతుమె యంగ విభేదము
జాతి వివక్ష గల నేల శాంతి నిలయమే?
అంతము నందు నైన మఱి యాదిని నైనను గాంచ లేని యీ
పంతము లేల మర్త్యులకు వంశము లందు వచింప నిట్టులన్
వింత రవంత కాంతురె సువృద్ధి వినాశక ఘోర దుర్భ రా
శాంతికిఁ బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే
[దుర్భర + అశాంతి = దుర్భ రాశాంతి; సువృద్ధి = మంచి వృద్ధి, మార ణాయుధముల వృద్ధి కాదు.]
సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికాతరము జెందు ననిశము
రిప్లయితొలగించండిజాతి వివక్షగల నేల ,శాంతినిలయమే
నేతల ప్రజోపయోగపు
జేతలు,మాటలునుమేలు సేయుటవలనన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిజాతుల మధ్యన భేదము
చేతనతో బాపు నేత 'స్థిరనిశ్చయుడౌ
భూతమె' ,పాఱఁద్రోలన్
జాతివివక్ష, 'గల' నేల శాంతి నిలయమే!
ఉత్పలమాల
సాంతము దోచ భారతము స్వైరవిహారమనంగ వారిలో
నింతకు ముందు లేనివన నేర్పడఁ గూర్చుచు భేదభావముల్
వంతలు పాలుఁ జేయఁగ వివక్ష యశాంతికిఁ, బెన్విఘాతమై
శాంతికిఁ, బుట్టినిల్లు గద జాతి వివక్షను జూపు దేశమే
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసుంతయుభేదభావములు సొప్పడ నీయని భారతంబునే
రిప్లయితొలగించండిశాంతికి బుట్టినిల్లుగద ,జాతివివక్షను జూపుదేశమే
శాంతిభద్రతల్ గనని జక్కిగ బేరును బొందునీ భువిన్
శాంతియు సౌఖ్యముల్ గలుగ జక్కటి జీవన మందవచ్చుగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి