12, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3661

13-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ”
(లేదా...)
“హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్”

47 కామెంట్‌లు:

  1. హరి కరుణాంతరంగుఁడు నిరంతర మీ భువి సాధురక్షణా
    పరుఁడగు, దుష్టశిక్షణకు వచ్చును తా నవతారమూర్తియై
    సుర నర మౌని వర్గమును క్షోభకుఁ దాఁ గురిసేయు శిష్టసం
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు ప్రణామములు. మీ పద్యం హరి అవతార ప్రాశస్త్యంతో సమస్యకు పూరణమై మాకు మార్గదర్శనం చేసింది. 🙏🙏🙏

      తొలగించండి

  2. సరసపు రీతి హైమవతి చక్కగ చేయగ వేలపూజలన్
    పరువులు బెట్టి చేరగను భగ్నము జేయగ ధ్యానమాదటన్
    తెరచుచు కండ్లు చూడగను తిప్పలు బెట్టెడి కామదేవునిన్
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  3. అరయగగంగనుశివుడును
    వరుడైపెట్టగశిరమునపార్వతియుండన్
    నరునికిపద్ధతితెలిసెను
    హరునిదురూహలెసుఖమిడునట్టివరములౌ

    రిప్లయితొలగించండి
  4. దురితపు వరములనిచ్చెను

    దురిమెను మోహినిగనొచ్చి దోషుల వైరిన్

    సురలకునమృతము పంచెన్

    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. నరవరు సంతసంబునకు నాయకుడైకడు యెత్తులెన్నియో
      కురువరు యెత్తులన్నిటిని కూకటి వేళ్ళుగ తృంచివేయుచున్
      పొరబడి యాదవాగ్రజుడు బూరిగ ధర్మము వైపదేలనన్
      చిరునగవే లననంగ మరి సేమముగోరిన సొంతబావకై
      హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్!

      *****యాదవాగ్రజుడు=బలరాముడు అనే అర్థంలో...

      ***సవరణతో...

      తొలగించండి
  6. వరములనిచ్చిరక్కసులపాలిటశంభుడురక్షకుండయెన్
    పరువునునిల్పవిష్ణుడునుబాయనపాయమువేషగాడయెన్
    కరమునుసంతసిల్లగనుకామితముల్నెరవేరెధారుణిన్
    హరునిదురూహలేవరములైసిరులైసుఖమిచ్చునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  7. వరముల నిచ్చిరక్కసుని బారిన జిక్కినవేళ మిత్రుడౌ
    హరి వరమోహనాకృతిని హ్లాదముపంచగ, పారవశ్యమున్
    కరమునుబట్టగా గలిగె కారణజన్ముడు ధర్మశాస్త,యా
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. వరునిగ పెండ్లివేడుకకు వచ్చెడువేళను మంగళమ్ముగా
      నరయగ నల్లుడెవ్వరని యత్తయె మేడను తొంగిచూచుచున్
      దురముగ నాదియోగివలె తోచగ వేషముమార్చు
      తాప సం
      హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

      తొలగించండి
  8. హరి మారెను మోహినిగను
    పరవశమున హరుడు పెట్టె పరుగులు, అటులన్
    హరిహర పుత్రుడు బుట్టెగ,
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి
  9. ధరణిని ధర్మము నిలుపగ
    హరియె దశరథ సుతుడయ్యె నవనిని, జూడన్
    బురుషాశి యైన ముని సం
    హరుని దురూహలె సుఖమిడు నట్టి వరములౌ .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  10. పరిణయ మాడనెంచెనని వప్రుడు పుత్రికనడ్గె నిట్టులన్
    వరుడొక దొంగకాదె మరి భర్తగఁ నేలయనంగ చెప్పెనా
    తరుణియె తండ్రితోడ కలధౌతము దండిగ దెచ్చు పశ్యతో
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్.
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  11. తిరమగు భక్తికి వశుడై
    విరివిగ వరముల నొసగును విశ్వేశ్వరు డే
    హరి వాటి మార్పు సేయఁగ
    హరుని దురూహలె సుఖమిడు నట్టి వరములౌ



    రిప్లయితొలగించండి
  12. సమస్య :
    హరుని దురూహలే వరము
    లై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    ( చిరుతొండనంబి భక్తిని పరీక్షించి సాలోక్యముక్తిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు )

    ధర జిరుతొండనంబికయి
    దాల్చెను వృద్ధుని రూపు గౌరితో ;
    చరచర దర్శనంబిడుచు
    జక్కని పుత్రుని వండిపెట్టగా
    గరుణయె లేక కోరెగద !
    కానగ భక్తపరీక్షయందు నా
    హరుని దురూహలే వరము
    లై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్ .

    ( శ్రీనాథకవిసార్వభౌముని హరవిలాస కావ్యంలోని మొట్టమొదటి హరవిలాసమే యిది . )

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. చం:

      ధరణి కరోన సోకుడులు దారుణ రీతిని వ్యాప్తి చెందగన్
      కరుణను బ్రోవు మంచు కరకంఠుని వేడగ రూపుమాపగన్
      సరియగు టీక సృష్టి యిట సాగిన సుస్థత పూర్ణమన్న యా
      హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పు డున్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  14. చిరుతతనపు చిలిపి సఖుడు
    పెరుగగ నిపుడీ దినమున పెండ్లికొమరుడై
    పరిణయమాడ దన మనో
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. వరమును గోర తారకుడు పార్వతినాథుని పుత్రు చేతిలో
      మరణము దేవులందరు నుమాపతి యంఘ్రియుగంబె దిక్కనన్
      వరలగ కామపీడ వడి భస్మము జేసెను కామునిన్నహో
      హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

      తొలగించండి
    2. తరలెను భిల్లరూపమున తాపసి నర్జును గావ, కానలో
      చెరియల మధ్య క్రోడమును చెంగున గూల్చ పరీక్ష బెట్టి తా
      వరముల నిచ్చి గాచెనట పార్వతినాథుడు భక్త ప్రీతుడౌ
      హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

      తొలగించండి
  16. మరుమల్లెల పానుపుపై
    మరుని శరాహతికి లొంగి మైమరపందున్
    సరస వినోదమున మనో
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి
  17. సరసములాడబూనుకొని,సన్నగగిల్లుచు బుగ్గమీదుగా
    పరువునుదీయబోకనుచు,భామిని జెప్పగ నూరకుండకన్
    మురియగమీదనేబడుచు,ముద్దులమాటలదించు నామనో
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  18. చంపకమాల:
    +++++++++++
    పరిణయమాడుచుంటిగద,పళ్ళికిలించుచుకొత్తభామినిన్
    తరుముకువచ్చినాడతడు,తాపముదీర్చుమటంచు చేనుకున్
    మురియుచు ముద్దులిచ్చుచును,ముచ్చటదీర్చెనురేగునామనో
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  19. శిరమున గౌరి నెత్తుకుని, శీర్షమునందున గంగ మాతతో
    సరసములాడగా శివుడు,సన్నిధిజేరిన పార్వతమ్మకై
    విరహముతోడవేగుచును,వీనులవిందుగబాడనామనో
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  20. చంపకమాల:
    +++++++++++
    సరసములాడుచున్ విభుడు సర్వమునామది
    నాక్రమించగా
    విరహముతోడవేగుచును,విందునుగోరెనుభామ తోటలో
    పరువునుదీయ వద్దనుచు,పాపమునంతట దుష్టబుద్ధి సం
    హరుని దురూహలే వరములై సిరులై ,సుఖమిచ్చు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  21. పురములు గూల్చినాడతడు పూర్ణదురాగతభావయుక్తుడై
    స్మరుని హరించె నిర్దయుడు సత్య మటంచును బల్కువాని యా
    సరణికి భక్తు డిట్లనియె శాంతిని నిల్పుట లక్ష్య మిచ్చటన్
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  22. మరులనుగొలుపుచు మదనుడు
    కరమున పూవిల్లు దాల్చి గరువము మీరన్
    శరమును సంధింప మనో
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి


  23. అరయగ జిలేబి యా భవ
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ
    నరులను మోక్షపథమ్మున
    పరుగిడ జేయు నతడి పిలుపై తూర్యంబై



    జిలేబి

    రిప్లయితొలగించండి


  24. సఖి! నుదిటిపై భళి మువ
    ఱ్ఱఖ! హరుని దురూహలే వరములై సిరులై
    సుఖమిచ్చు నెప్పుడున్ ! పో
    చు ఖుదా నెపుడువిడువక హుజూర్సాబనుచున్



    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. మరువక కామ క్రోధ మద మత్సర రాశులు మోక్షగామికిన్

    చెరుపును చేయునెప్పుడని చెప్పిన సుద్దులు వీను మోగగన్

    బెరుకును వీడి యూహలను బెట్టున దుష్టపు కోర్కె త్రుంచె సం

    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  26. సరసములాడువేళ తన సన్నిధి పెన్నిధి, కౌగిలింతలన్
    సరకము చూపు డెందమున సందడి రేపుచు సంచలించుచున్
    విరహ దవానలంబుడిపి వేసటదీర్చెడి వేళలో మనో
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్
    (సరకము=స్వర్గము)

    రిప్లయితొలగించండి
  27. కందం
    త్వరితమ్ముగ హరిజేరఁగ
    నరునిగ జనియించె రావణాఖ్యునిగ జయుం
    డరయగ మోహిగ ధరణిజ
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    చంపకమాల
    పరిణతి భక్తి గూర్చెనన వైరుల జన్మలు మూడు చాలనన్
    ద్వరితముగన్ రమారమణు వాసము జేరఁగ ద్వారపాలురై
    వరుస యనంగ రావణుడు వైరిగ దుష్కృతుడయ్యె జానకీ
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్


    రిప్లయితొలగించండి
  28. హరహర యన్న ముక్తినిడె నంబకు దేహము నర్ధ భాగమున్
    కరిముఖు షణ్ముఖున్ దశముఖాగ్ర చతుర్ముఖ చక్రిశక్రుకున్
    నరులకు కిన్నెరాప్సరస నారుల కాతడు పూజ నీయు డే
    *“హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్”*?

    రిప్లయితొలగించండి
  29. పరిపరి విధముల భక్తుల
    పరిశోధన జేసి మార్చు పరిశుద్ధులుగా
    పరిమార్చును పాపంబుల
    హరుని దురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి
  30. ధర నెంచఁగ మంచివియౌ
    కరుమము లొనరించు చుండఁ గర్మము లవియే,
    నర రానీయక, గొలువుమ
    హరుని, దురూహలె, సుఖ మిడు నట్టి వరములౌ


    నరవరు లెల్ల శంకరుని నైష్ఠ్యము నెంచక భక్తిఁ గొల్తురే
    పురహరుఁ గొల్వ నుండ వలెఁ బుణ్యము పూర్వ కృతమ్ము మిక్కిలిం
    బరమ శివుం దలంప ఘన పాప మనస్కుల కౌనె యూఱకే
    హరుని దురూహలే వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్

    [దురూహ = కష్టముతో నూహింపఁ బడునది]

    రిప్లయితొలగించండి
  31. అరయగ గనబడవుగద యా
    హరునిదురూహలె,సుఖమిడునట్టి వరములౌ
    హరుడొసగును భక్తులకిల
    హరునిన్ సేవించునెడల నాయువు సిరులన్

    రిప్లయితొలగించండి
  32. అరయుమ యెందుశోధనను నద్భుత రీతినిజేయగానవా
    హరునిదురూహలే,వరములై సిరులై సుఖమిచ్చు నెప్పుడున్
    హరుని మనంబునందుననె!ధ్యానముజేయునొ,వానికీభువిన్
    గరమును నిచ్చునాయువును గామితవాంఛలునిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  33. హరిహరమూర్తి వటంచును
    నిరతము సేవించు చున్న నీలగళుండున్
    కరుణను చూపగ నాస్మర
    హరునిదురూహలె సుఖమిడునట్టి వరములౌ

    రిప్లయితొలగించండి
  34. మనుజు మేధముందు మహిలోన నల్పము
    తళుకుమనుచు మెరయు తారలైన
    చందమామ యందు విందువినోదముల్
    ఆకసమ్ము పిడికిలంత సుమ్ము

    రిప్లయితొలగించండి