4-3-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్”(లేదా...)“కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:బలుపౌ తీరున కాళిఘాటుకడనున్ భద్రమ్ముగా జేరుచున్కలలన్ గానని రీతినిన్ జరుపుచున్ గాఢంపు కృత్యమ్ములన్ తలలన్ జేరగ మత్తు వేడుకలలన్ తాదాత్మ్యమున్ బొందగన్కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు."వేడ్క లలరన్" అంటే బాగుంటుంది.
🙏
ఎలమిన బుట్టిన వారలుకలిమిన బెరుగుచు మరువని కారణమేమోపలువురు నవ్వగ నేమీకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలుబాధలుమరుగునఁబడువిలవిలలాడగకరోనవెంటనురాదేకులుకుచునుందురుపలుకులకలుఁద్రావెడివారికబ్బుగదభాగ్యమ్ముల్
కలల రధముకున్దగునిల కలుఁ ; ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్అల వైకుంఠ పురమునాజల రాశులనున్న వాని జపముల భక్తిన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...( కలు = బండి చక్రము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కలు శబ్దాన్ని ప్రథమగా భావించారు. సమస్యలో అది ద్వితీయలో ఉన్నది.
ధన్యవాదములండీపొరపాటును గమనించానండీ
సమస్య :కలుసారాయిల ద్రావువారలకె భా గ్యప్రాప్తియౌ నిచ్చలున్ ( లలితకు , శాంతకు అన్నయ్య ప్రసాద్ ప్రశ్నలు - వారి చక్కని జవాబులు )మత్తేభవిక్రీడితము -----------------" లలితా ! దుర్భరకష్టనష్టదురితా లశ్రాంత మెవ్వారి కీ యిలపై గల్గును?" "శాంత! తెల్పగలవా !యేమబ్బు సచ్ఛీలతన్ ? "" కలుసారాయిల ద్రావువారలకె " ; "భా గ్యప్రాప్తియౌ నిచ్చలున్ గలతల్ బెట్టక తల్లిదండ్రులను సం స్కారాన వర్తించినన్ ."
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
విలసిత రీతిగ రుద్రుని తలపున మరువక నిరతము ధర్మ పరుండైచెలగుచు భక్తి రసమ్మను కలు ద్రావెడి వారి కబ్బు గద భాగ్యమ్ముల్
చక్కని పూరణ. అభినందనలు.
కందంఅలమేటి విలువిఱచి కుజనలివేణిగ పొందినట్టి నచ్యుతు నామమ్ములు కోట్లుగ నమృతపు చుక్కలుఁ! ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్మత్తేభవిక్రీడితమువిలువల్ ముఖ్యమటంచునన్నిటను తప్పింపంగ వ్యాపారముల్కలుముల్ వొందుట మృగ్యమై బ్రతుకగున్ గష్టాల సంద్రంబు! పిల్లల బాగోగులు వట్టవే మగడ! యే లౌక్యాల సాగింతురోకలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్!!
మత్తేభ సమస్యపాదం సారాయి ద్రాగుట వలన భక్తి మార్గము తప్పింది. లౌక్యము నెంచింది.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మలినంబుల దొలగించెడునల గంగానది జలముల హ్లాదముమీరన్విలువ నెరుంగుచు పలు గుటకలు ద్రావెడువారి కబ్బుగద భాగ్యమ్ముల్
చెలరేగున్ మదమత్సరంబులు ప్రవిచ్ఛిన్నంబగున్ బుద్ధియేకలు సారాయిలు ద్రాగువారలకె ; భాగ్యప్రాప్తియౌనిచ్చలున్ అలసత్వంబును జేరనీయక సదభ్యాసంబులన్శ్రీహరిన్బలిమిన్ గొల్వగ నిత్యకృత్యముగ నవ్యాజంబగున్భక్తిమై
ధన్యాస్మి గురదేవా! నమోనమః!🙏🙏🙏
గురుదేవా!🙏🙏🙏
చలిమల చూలిని కుంభిల పొలిమెరలో నిలిచి యుండు పోలేరుగ నా మలయమ్మ కర్పితమ్మగు కలుఁద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ . . . . విరించి.
కలికాలంబిది కల్లలాడి గృహమున్ కల్లోలముల్ పెంచుచున్లలనాపీడన సేయుచున్ నిరత ప్రేలాపంబులున్ బల్కుచున్విలువల్ తల్వక పెద్దపిన్నలని భావింపంగలేరీ జనుల్కలు సారాయిల ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
కులమందందరు దేవిగొల్చి తమదౌ కోర్కెల్ నెరింగించి వ్యాకులముల్ తీర్పగ వేడి మ్రొక్కులకై కుంభంబులన్ మ్రోయుచున్కలకాలంబిదె గావుమన్చు ప్రియ పాకంబుల్ నివేదించి మేకలు సారాయిల ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.రెండవ పూరణలో 'కోర్కెల్+ఎరింగించి' అన్నపుడు నుగాగమం రాదు. 'మ్రొక్కులకునై' టైపాటు.
కె.వి.యస్. లక్ష్మి: కలయిది కాదిల నిజముగ అల యుజ్జయినిని వెలసిన నా భైరవుకున్ కలు నైవేద్యమగును యా కలు ద్రావెడి వారికబ్బు గద భాగ్యమ్ముల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'భైరవునకున్' అనడం సాధువు. 'అగును+ఆ' అన్నపుడు యడాగమం రాదు.
గురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సరిజేసాను. పరిశీలించగలరు. కలయిది కాదిల నిజముగఅల యుజ్జయినిని వెలసిన యా కాలునకున్కలు నైవేద్యమ్మగు నా కలు ద్రావెడి వారికబ్బు గద భాగ్యమ్ముల్!
కలుషంబాయెను రాజకీయమిట దుష్కార్యంబులే యోగ్యతైఖలులే నాయకులై చెలంగ నకటా కందెన్ ప్రజాస్వామ్యమే కలగా మారె పురోభివృద్ధి దురహంకారంబునన్ దేలుచున్కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'యోగ్యత+ఐ' అన్నపుడు సంధి లేదు. "దుష్కార్యంబులే యోగ్యతల్" అనవచ్చు.
కులదైవపు సన్నిధియన్దలికాక్షుని భక్తిగూడి యభిషేకించన్నెలదారి తీర్థమగునాకలుద్రావెడివారి కబ్బు గద భాగ్యమ్ముల్ఆత్రేయ
ధన్యవాదాలండి గురువుగారు
పిలచిన పలుకని ప్రభుతకుకులము మతమ్ములవి చాలు కోరిక దీర్చన్మలినంబౌ తలపుల మునకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్అల కాశీపుర ప్రభువాకలి దీరగ గ్రోలు నట్టి కడు పావనమౌకలుసారాలే, దక్కినకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పలు రోగము లలుపుడుగగకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద ; భాగ్యమ్ముల్గలుగును తప్పక , గ్రుక్కెడుజలము గుడిచి యలుపు దీర్చసాగిన యెడలన్
వెలసిన యినకుల తిలకునికొలువున పానకము, చాల కూరిమి గానున్కలిపిరి మిరియమ్ముల తునకలుఁ , ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
మంచి పూరణ. అభినందనలు."కూరిమితోడన్" అనండి.
మలినాంగులుమలినాత్ములుకలిపురుషునిపాల్పడంగగమలినహృదులైయిలవేల్పులవీడియనరె“కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్”పలురోగంబులు నర్ధనాశనము పాపమ్మాయువల్పంబగున్“కలు సారాయిలఁ ద్రావు వారలకె ;భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”అలసత్వంబునువీడిమాధవునిజ్ఞేయంబంచుగీర్తించుచున్ బలురూపంబులభక్తిసల్పుచునువిశ్వాకారుదర్శించినన్
కలు కవ్వంబుగ శేషు రజ్జువుగనాకాశమ్ము సాక్ష్యమ్ముగాజల రాశిన్ మధనంబు చేయగను రచ్చల్జేయు దైత్యాళికిన్నల దక్కంగను లేక పోయె సుర , జన్మాంతమ్ము లభ్యంబునౌకలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మొదటి పాదములో కలు = రాయి, మంధర పర్వతము
ధన్యవాదములండీ
కం//పలువురు మధించు సంద్రమువెలుపల హాలాహలమ్ము వేడుక నణచన్ !మెలుకువతో భవునికొసగకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ !!
చలిపోయినవేసవిలోపలువురును బిలచి తనయ వివాహపు వేళన్జలమును బదులుగ బంతినకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
లలితముగా జీవనమును మలచుచు వెంట నడయాడు మగనాలు ధృతిన్ తలపున వలపు జిలుక నా కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
భాగ్యప్రాప్తిని వ్యంగ్యము గా భావించి, ప్రయత్నము: మ:కలికా రాధన కూడదన్న వినకన్ కష్టాల పాలెంచనైపలుకే చాలు నటంచు వెంట బడగన్ ప్రత్యక్షమై నాథుడే బలుపే దింపెను దేహశుద్ధి పరపన్ భావింప నీరీతిగన్కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్వై. చంద్రశేఖర్
మైలవరపు వారి పూరణ విలువల్ తుంగను ద్రొక్కి స్వార్థరతులై విత్తార్జనాసక్తితోజలగల్ రీతిని పీల్చి రక్తమును సంసారమ్ములన్ గూల్చుచున్బలహీనమ్మును సొమ్ము చేసుకొనగా భావించువారమ్మగాకలు సారాయిలు ద్రాగువారలకె ; భాగ్యప్రాప్తియౌనిచ్చలున్ !! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఇలవెలయు వేంకటేశునిగలలోనన్ దలచుచుండి గనుగవ యొప్పన్ విలసిత భక్తిరసంబనుగలు ద్రావెడువానికబ్బు గద భాగ్యమ్ముల్
అలనాడే వచియించెఁ బ్రహ్మమట విద్యావంతులంబేదులైఖలులే రాజ్యము నేలువారలయి దుష్కార్యార్థులే పూజ్యులైయిలలో మన్నన పొందువారలనుచున్ హీనుండ్రె ముప్పొద్దులన్ గలు సారాయిల ద్రావువారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ . . . . విరించి.
ఖలులం గూడిన నిట్టి గిరలను వినఁగ నబ్బురంబె రాద్ధాంతమ్ముల్ పలుకుదురు పాయు లిట్లుం గలుఁ ద్రావెడి వారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ తలఁపం గా దిది మూఢనమ్మకము తధ్యంబై ధరం జెల్లునే బలభద్రాదులు నిల్చి రిచ్చటను విశ్వత్రాత తో నింపుగాఁ జెలువంబై సతతమ్ము నీ రచట నిక్షిప్తమ్ము, నేఁ జెప్ప నీ కలుసా రా యిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ [నీకు + అలుసా; రా + ఇల = రాయిల]
ఇలలో వచ్చును రోగముల్ విమల! యీయేయా ల నుయ్యీగుటల్ గలుసారాయి ద్రాగువారలకె,భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ దలిదండ్రుల్ దమ సూనులన్ జదువులన్ దాదాత్మ్యమున్ గూర్చుచోనలవోకన్ ధనమార్జనంబుపయి నేయాకర్షి తుండౌచుటన్
సమస్య*కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.*ప్రయత్నము:మ.విలువల్ మంటను గల్సిపోయెనుగదా విశ్వంబు నందంతటన్విలువల్ నేర్పెడి పాత్రికేయులిటు దాఁ వేర్వేరు పక్షంబులన్గలువన్నేర్చి, తిలోదకమ్ముల నిడంగా దోచె చోద్యంబుగాన్కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.
కం.ఖలు లిల సౌభాగ్యమ్ములకులుకుచు నున్నట్టివారు కుదురుగ తినరే!కలుషము లే కంబటిపరకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్!
పలు కష్టంబులు గల్గునెల్లపుడుదుర్భాగ్యంబు సిద్ధించు నీకలు సారాయిలు ద్రాగు వారలకె,భాగ్యప్రాప్తియౌ నిచ్ఛలున్కలలో దుర్వ్యసనంబులేవి మదిలో గాక్షించకన్ ప్రీతితోనలుపుంజెందక యోగ్య కర్మముల నత్యంతేష్టితోజేసిన్.
వలచెను రాముడు సీతనుకొలిచిన పురజనులనెల్ల కోసలపతి గాధలమధురిమ మీగడ తరకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
సులువుగ శ్రీశుని మదిలోకొలుచుచు క్షణమైనవిడక కూరిమి తోడన్తలచుచు సతతము భక్త్య నుకలు ద్రావెడు వారికబ్బు గద భాగ్యమ్ముల్
చిలకల పలుకుల సతి తో కలకలమని మనుగడ నడ కామితములతోవలపుల తలమునకలు పులకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
నిలువక తూలుచు నీల్గుచుకలు ద్రావిన మైకమందు కలవరపడుచున్పలికెనొకడు పరవశమునకలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
బలుపౌ తీరున కాళిఘాటుకడనున్ భద్రమ్ముగా జేరుచున్
కలలన్ గానని రీతినిన్ జరుపుచున్ గాఢంపు కృత్యమ్ములన్
తలలన్ జేరగ మత్తు వేడుకలలన్ తాదాత్మ్యమున్ బొందగన్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్...
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వేడ్క లలరన్" అంటే బాగుంటుంది.
🙏
తొలగించండిఎలమిన బుట్టిన వారలు
రిప్లయితొలగించండికలిమిన బెరుగుచు మరువని కారణమేమో
పలువురు నవ్వగ నేమీ
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిపలుబాధలుమరుగునఁబడు
రిప్లయితొలగించండివిలవిలలాడగకరోనవెంటనురాదే
కులుకుచునుందురుపలుకుల
కలుఁద్రావెడివారికబ్బుగదభాగ్యమ్ముల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలల రధముకున్దగునిల
రిప్లయితొలగించండికలుఁ ; ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
అల వైకుంఠ పురమునా
జల రాశులనున్న వాని జపముల భక్తిన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
( కలు = బండి చక్రము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలు శబ్దాన్ని ప్రథమగా భావించారు. సమస్యలో అది ద్వితీయలో ఉన్నది.
ధన్యవాదములండీ
తొలగించండిపొరపాటును గమనించానండీ
సమస్య :
రిప్లయితొలగించండికలుసారాయిల ద్రావువారలకె భా
గ్యప్రాప్తియౌ నిచ్చలున్
( లలితకు , శాంతకు అన్నయ్య ప్రసాద్ ప్రశ్నలు - వారి చక్కని జవాబులు )
మత్తేభవిక్రీడితము
-----------------
" లలితా ! దుర్భరకష్టనష్టదురితా
లశ్రాంత మెవ్వారి కీ
యిలపై గల్గును?" "శాంత! తెల్పగలవా !
యేమబ్బు సచ్ఛీలతన్ ? "
" కలుసారాయిల ద్రావువారలకె " ; "భా
గ్యప్రాప్తియౌ నిచ్చలున్
గలతల్ బెట్టక తల్లిదండ్రులను సం
స్కారాన వర్తించినన్ ."
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిలసిత రీతిగ రుద్రుని
రిప్లయితొలగించండితలపున మరువక నిరతము ధర్మ పరుండై
చెలగుచు భక్తి రసమ్మను
కలు ద్రావెడి వారి కబ్బు గద భాగ్యమ్ముల్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఅలమేటి విలువిఱచి కుజ
నలివేణిగ పొందినట్టి నచ్యుతు నామ
మ్ములు కోట్లుగ నమృతపు చు
క్కలుఁ! ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
మత్తేభవిక్రీడితము
విలువల్ ముఖ్యమటంచునన్నిటను తప్పింపంగ వ్యాపారముల్
కలుముల్ వొందుట మృగ్యమై బ్రతుకగున్ గష్టాల సంద్రంబు! పి
ల్లల బాగోగులు వట్టవే మగడ! యే లౌక్యాల సాగింతురో
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్!!
మత్తేభ సమస్యపాదం సారాయి ద్రాగుట వలన భక్తి మార్గము తప్పింది. లౌక్యము నెంచింది.
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమలినంబుల దొలగించెడు
రిప్లయితొలగించండినల గంగానది జలముల హ్లాదముమీరన్
విలువ నెరుంగుచు పలు గుట
కలు ద్రావెడువారి కబ్బుగద భాగ్యమ్ముల్
చెలరేగున్ మదమత్సరంబులు ప్రవిచ్ఛిన్నంబగున్
తొలగించండిబుద్ధియే
కలు సారాయిలు ద్రాగువారలకె ; భాగ్యప్రాప్తియౌ
నిచ్చలున్
అలసత్వంబును జేరనీయక సదభ్యాసంబులన్
శ్రీహరిన్
బలిమిన్ గొల్వగ నిత్యకృత్యముగ నవ్యాజంబగున్
భక్తిమై
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యాస్మి గురదేవా! నమోనమః!🙏🙏🙏
తొలగించండిగురుదేవా!🙏🙏🙏
తొలగించండిచలిమల చూలిని కుంభిల
రిప్లయితొలగించండిపొలిమెరలో నిలిచి యుండు పోలేరుగ నా
మలయమ్మ కర్పితమ్మగు
కలుఁద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికలికాలంబిది కల్లలాడి గృహమున్ కల్లోలముల్ పెంచుచున్
రిప్లయితొలగించండిలలనాపీడన సేయుచున్ నిరత ప్రేలాపంబులున్ బల్కుచున్
విలువల్ తల్వక పెద్దపిన్నలని భావింపంగలేరీ జనుల్
కలు సారాయిల ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
కులమందందరు దేవిగొల్చి తమదౌ కోర్కెల్ నెరింగించి వ్యా
తొలగించండికులముల్ తీర్పగ వేడి మ్రొక్కులకై కుంభంబులన్ మ్రోయుచున్
కలకాలంబిదె గావుమన్చు ప్రియ పాకంబుల్ నివేదించి మే
కలు సారాయిల ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిరెండవ పూరణలో 'కోర్కెల్+ఎరింగించి' అన్నపుడు నుగాగమం రాదు. 'మ్రొక్కులకునై' టైపాటు.
కె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండికలయిది కాదిల నిజముగ
అల యుజ్జయినిని వెలసిన నా భైరవుకున్
కలు నైవేద్యమగును యా
కలు ద్రావెడి వారికబ్బు గద భాగ్యమ్ముల్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'భైరవునకున్' అనడం సాధువు. 'అగును+ఆ' అన్నపుడు యడాగమం రాదు.
గురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సరిజేసాను. పరిశీలించగలరు.
తొలగించండికలయిది కాదిల నిజముగ
అల యుజ్జయినిని వెలసిన యా కాలునకున్
కలు నైవేద్యమ్మగు నా
కలు ద్రావెడి వారికబ్బు గద భాగ్యమ్ముల్!
కలుషంబాయెను రాజకీయమిట దుష్కార్యంబులే యోగ్యతై
రిప్లయితొలగించండిఖలులే నాయకులై చెలంగ నకటా కందెన్ ప్రజాస్వామ్యమే
కలగా మారె పురోభివృద్ధి దురహంకారంబునన్ దేలుచున్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'యోగ్యత+ఐ' అన్నపుడు సంధి లేదు. "దుష్కార్యంబులే యోగ్యతల్" అనవచ్చు.
కులదైవపు సన్నిధియన్
రిప్లయితొలగించండిదలికాక్షుని భక్తిగూడి యభిషేకించన్
నెలదారి తీర్థమగునా
కలుద్రావెడివారి కబ్బు గద భాగ్యమ్ముల్
ఆత్రేయ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండి గురువుగారు
తొలగించండిపిలచిన పలుకని ప్రభుతకు
రిప్లయితొలగించండికులము మతమ్ములవి చాలు కోరిక దీర్చన్
మలినంబౌ తలపుల మున
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
అల కాశీపుర ప్రభువా
కలి దీరగ గ్రోలు నట్టి కడు పావనమౌ
కలుసారాలే, దక్కిన
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపలు రోగము లలుపుడుగగ
రిప్లయితొలగించండికలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద ; భాగ్యమ్ముల్
గలుగును తప్పక , గ్రుక్కెడు
జలము గుడిచి యలుపు దీర్చసాగిన యెడలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివెలసిన యినకుల తిలకుని
రిప్లయితొలగించండికొలువున పానకము, చాల కూరిమి గానున్
కలిపిరి మిరియమ్ముల తున
కలుఁ , ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి"కూరిమితోడన్" అనండి.
మలినాంగులుమలినాత్ములు
రిప్లయితొలగించండికలిపురుషునిపాల్పడంగగమలినహృదులై
యిలవేల్పులవీడియనరె
“కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్”
పలురోగంబులు నర్ధనాశనము పాపమ్మాయువల్పంబగున్
“కలు సారాయిలఁ ద్రావు వారలకె ;భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”
అలసత్వంబునువీడిమాధవునిజ్ఞేయంబంచుగీర్తించుచున్
బలురూపంబులభక్తిసల్పుచునువిశ్వాకారుదర్శించినన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికలు కవ్వంబుగ శేషు రజ్జువుగనాకాశమ్ము సాక్ష్యమ్ముగా
రిప్లయితొలగించండిజల రాశిన్ మధనంబు చేయగను రచ్చల్జేయు దైత్యాళికి
న్నల దక్కంగను లేక పోయె సుర , జన్మాంతమ్ము లభ్యంబునౌ
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మొదటి పాదములో
తొలగించండికలు = రాయి, మంధర పర్వతము
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండికం//
రిప్లయితొలగించండిపలువురు మధించు సంద్రము
వెలుపల హాలాహలమ్ము వేడుక నణచన్ !
మెలుకువతో భవునికొసగ
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ !!
చలిపోయినవేసవిలో
రిప్లయితొలగించండిపలువురును బిలచి తనయ వివాహపు వేళన్
జలమును బదులుగ బంతిన
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
లలితముగా జీవనమును
రిప్లయితొలగించండిమలచుచు వెంట నడయాడు మగనాలు ధృతిన్
తలపున వలపు జిలుక నా
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
భాగ్యప్రాప్తిని వ్యంగ్యము గా భావించి, ప్రయత్నము:
రిప్లయితొలగించండిమ:
కలికా రాధన కూడదన్న వినకన్ కష్టాల పాలెంచనై
పలుకే చాలు నటంచు వెంట బడగన్ ప్రత్యక్షమై నాథుడే
బలుపే దింపెను దేహశుద్ధి పరపన్ భావింప నీరీతిగన్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
వై. చంద్రశేఖర్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండివిలువల్ తుంగను ద్రొక్కి స్వార్థరతులై విత్తార్జనాసక్తితో
జలగల్ రీతిని పీల్చి రక్తమును సంసారమ్ములన్ గూల్చుచున్
బలహీనమ్మును సొమ్ము చేసుకొనగా భావించువారమ్మగా
కలు సారాయిలు ద్రాగువారలకె ; భాగ్యప్రాప్తియౌ
నిచ్చలున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఇలవెలయు వేంకటేశుని
రిప్లయితొలగించండిగలలోనన్ దలచుచుండి గనుగవ యొప్పన్
విలసిత భక్తిరసంబను
గలు ద్రావెడువానికబ్బు గద భాగ్యమ్ముల్
అలనాడే వచియించెఁ బ్రహ్మమట విద్యావంతులంబేదులై
రిప్లయితొలగించండిఖలులే రాజ్యము నేలువారలయి దుష్కార్యార్థులే పూజ్యులై
యిలలో మన్నన పొందువారలనుచున్ హీనుండ్రె ముప్పొద్దులన్
గలు సారాయిల ద్రావువారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ .
. . . విరించి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఖలులం గూడిన నిట్టి గి
తొలగించండిరలను వినఁగ నబ్బురంబె రాద్ధాంతమ్ముల్
పలుకుదురు పాయు లిట్లుం
గలుఁ ద్రావెడి వారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
తలఁపం గా దిది మూఢనమ్మకము తధ్యంబై ధరం జెల్లునే
బలభద్రాదులు నిల్చి రిచ్చటను విశ్వత్రాత తో నింపుగాఁ
జెలువంబై సతతమ్ము నీ రచట నిక్షిప్తమ్ము, నేఁ జెప్ప నీ
కలుసా రా యిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
[నీకు + అలుసా; రా + ఇల = రాయిల]
ఇలలో వచ్చును రోగముల్ విమల! యీయేయా ల నుయ్యీగుటల్
రిప్లయితొలగించండిగలుసారాయి ద్రాగువారలకె,భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
దలిదండ్రుల్ దమ సూనులన్ జదువులన్ దాదాత్మ్యమున్ గూర్చుచో
నలవోకన్ ధనమార్జనంబుపయి నేయాకర్షి తుండౌచుటన్
సమస్య
రిప్లయితొలగించండి*కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.*
ప్రయత్నము:
మ.
విలువల్ మంటను గల్సిపోయెనుగదా విశ్వంబు నందంతటన్
విలువల్ నేర్పెడి పాత్రికేయులిటు దాఁ వేర్వేరు పక్షంబులన్
గలువన్నేర్చి, తిలోదకమ్ముల నిడంగా దోచె చోద్యంబుగాన్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.
కం.
తొలగించండిఖలు లిల సౌభాగ్యమ్ముల
కులుకుచు నున్నట్టివారు కుదురుగ తినరే!
కలుషము లే కంబటిపర
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్!
పలు కష్టంబులు గల్గునెల్లపుడు
రిప్లయితొలగించండిదుర్భాగ్యంబు సిద్ధించు నీ
కలు సారాయిలు ద్రాగు వారలకె,
భాగ్యప్రాప్తియౌ నిచ్ఛలున్
కలలో దుర్వ్యసనంబులే
వి మదిలో గాక్షించకన్ ప్రీతితో
నలుపుంజెందక యోగ్య కర్మ
ముల నత్యంతేష్టితోజేసిన్.
వలచెను రాముడు సీతను
రిప్లయితొలగించండికొలిచిన పురజనులనెల్ల కోసలపతి గా
ధలమధురిమ మీగడ తర
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
సులువుగ శ్రీశుని మదిలో
రిప్లయితొలగించండికొలుచుచు క్షణమైనవిడక కూరిమి తోడన్
తలచుచు సతతము భక్త్య ను
కలు ద్రావెడు వారికబ్బు గద భాగ్యమ్ముల్
చిలకల పలుకుల సతి తో
రిప్లయితొలగించండికలకలమని మనుగడ నడ కామితములతో
వలపుల తలమునకలు పుల
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
నిలువక తూలుచు నీల్గుచు
రిప్లయితొలగించండికలు ద్రావిన మైకమందు కలవరపడుచున్
పలికెనొకడు పరవశమున
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్