19-3-2021 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు”(లేదా...)“వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్”
"శ్రీ రాముని దయ చేతను..." సరదా పూరణ:వినకే తండ్రివి మాటలన్ చదువుకై బింకమ్మునున్ వీడుచున్చనుచున్ వంగపు దేశమున్ యువకుడే జంబమ్మునన్ కన్నెనున్కనగన్ వేగమె ప్రేమ జూపగనయో కంగారునున్ గానకే వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
పంతపు ముని వరమునిచ్చె సంతసమ్మునిక్కమా కాదయని రవిని పిలిచెనలవరమునగనె కర్ణుని కౌరవాగ్ర సుతునిఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు”... భారతీనాథ్ చెన్నంశెట్టి..
ధన్యవాదములండీ
చక్క నైనట్టి రూపంపు చాన యగుచు వయసు తగినది కల్గిన వనిత యగును ఇంతి తన పెండ్లి నాడు : బాలెంత రాలు వత్సరము పిదప యగును పడతి తాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "పిదప నగును" అనండి.
కనగతల్లియుతండ్రియుకన్యకపుడుమాఘమందునముడివేయనయముమీరితరుణియోడినిండెమలిమాఘతరుణమందుఇంతితనపెండ్లినాడుబాలింతరాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తరుణి యొడి' టైపాటు.
యామి రాలేదు నీ వివాహమున కేలయని యడిగిన భరణ్యువు కాతడపుడు వినయ మందున చెప్పె నావేళ నట్టి యింతి తనపెండ్లి నాడు బాలెంతరాలు . . . . విరించి.
ఘనమౌ రాముని భక్తుడొక్కడు యనెన్ గారంపు యొప్పందమున్మనసారంగను చేసెదయ్య మురిపమ్మౌ నీదు కళ్యాణమున్జననంబయ్యెను బిడ్డ పాపలును యిఛ్ఛన్దీరెనవ్వారికిన్వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
3 వ పాదములో సవరణ “జననంబయ్యెను” స్థానములో “ జనియించెన్ మరి” గా చదువుకోవలసినదిగా విన్నపము
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఒక్కడు+అనెన్' అన్నపుడు యడాగమం రాదు. "భక్తుడొక్క డనియెన్" అనండి. 'గారంపు+ఒప్పందమున్=గారంపు టొప్పందమున్' అవుతుంది.
ధన్యవాదములండీ మీ సవరణలను పాటిస్తానండీ
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య" వనితా రత్నము పెండ్లినాడు గనగా బాలింతరా లొప్పుగన్" నా పూరణమత్తేభముజననీ రత్నము దండ్రియున్మురిసి సచ్చారిత్ర యాత్మానుజన్ఘనమౌరీతిగ పెండ్లిజేయతగు లగ్నంబందు మోదంబుగన్తనియన్ ప్రేమగ కాపురంబునను సత్సంవత్స రాంతంబునన్" వనితా రత్నము పెండ్లినాడు గనగా బాలింతరాలొప్పుగన్" ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ఆత్మానుజ అంటే సొంత చెల్లెలు, కూతురు కాదు. "సచ్చారిత్ర నాత్మోద్భవన్" అనండి.
కనలేకుంటిని నీదుచెల్లెలిని నీ కళ్యాణ మందేలరా?యనిప్రశ్నించిన తోడుతో తెలిపె సత్యంబాతడీరీతిగన్వినయంబెంతయొ చూపుచున్ విరివిగా బ్రేమించు నా చెల్లెలా వనితారత్నము పెండ్లినాడు గనఁగా బాలింతరాలొప్పగన్. ....... . ........ విరించి.
తేటగీతిమగువ మనువాడి మనసైన మగని తోడవత్సరమ్ము గాకమునుపె వలపు పండిజన్మనీయగ పండంటి చందురునకుఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలుమత్తేభవిక్రీడితముమనువై నచ్చిన వానితో తరుణికిన్ మాంగల్యబంధంబునన్జనువై బండెను ప్రేమపంట నొకటౌ సంవత్సరాంతంబునందనురాగాంబుధి నోలలాడ చెలులున్ హాస్యాన నిట్లాడిరే!"వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్! "
సవరించిన చివరిపాదంతో.... తేటగీతి మగువ మనువాడి మనసైన మగని తోడవత్సరమ్ము గాకమునుపె వలపు పండిజన్మనీయగ పండంటి చందురునకునింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మ: మనువాడంగను మాఘ మాస మనుచున్ మాహాత్మ్య మై యెప్పదే ఘనమౌ రీతిని పూజలున్ సలుప నా కామాక్షి మన్నింపగన్వనమున్ భాగ్యమదేమొగాని కడుపే పండంగ, విడ్డూరమైవనితా రత్నము పెండ్లినాడు గనగా బాలెంతరాలొప్పుగన్వనము=ఇల్లుపెండ్లినాడు=వివాహ వార్షికోత్సవ రోజువై. చంద్రశేఖర్
ధన్యవాదములు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సమస్య :వనితారత్నము పెండ్లినాడు గనగా బాలెంతరా లొప్పుగన్ ( ఏడాది క్రితం వధూమణి ; ఇప్పుడు మాతృమణి )మత్తేభవిక్రీడితము ...........................కనగా జీవితమెంత మోదకరమో!కంజాస్య యేడాదికే జనకున్ జేసె సుభాషిణీరమణియే ; సంస్నిగ్ధముగ్ధాంగి యౌ వనితారత్నము పెండ్లినాడు ; గనగా బాలెంతరా లొప్పుగన్ ఘనమౌ బాధ్యత జేతబట్టె నిపుడీ కారుణ్యవాత్సల్యయై .
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తమ సుతుడు ననువంచించి తరలె, నమితశ్రమమున మిము జేరితినన శ్వశురుడతనిబిలిచి యొప్పించి వారికి బెండ్లిజేయనింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
దంపతులు గాను నిండెను దశవసంతములుగ నేడు, నోముల పంట ముద్దులబిడపుట్టె నునిదేదినమ్మున, పురిటినింటఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
ఇంతి తన పెండ్లినాఁడు, బాలెంతరాలు స్నేహ యనబడు మిత్రురాలిని బిలుచుచుమగనికి పరిచయముచేయ, మగువ వారిని తన గేహమునకు రమ్మనెను ముదమున!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
లేఖ యనబడు.... అని మారిస్తే సరిపోతుందాండీ కంది వారూ ?వ్యాక్సీను తరువాయి మీ నీరసమ్ము తగ్గినదా ?కుశలమని ఆశిస్తాను.జిలేబి
తనదు పెండ్లికి తప్పక తరలివత్తునన్న శ్రీవల్లి రాకుండె నరయ కతముకలికి దమయంతి చెలియతో దెలిపె నిట్టులింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
తనువే సన్నని తీగెయై దనరెనే తారుణ్యశిల్పంబుగావనితారత్నము పెండ్లినాడు ;గనగా బాలెంతరాలొప్పుగన్ మనువైనంతనె గర్భమే గలుగగా మాతృత్వపున్శోభతోతనువే నిండుగ పూచినట్టి తరువై దర్పమ్ము సంతృప్తిమై
చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమోనమః!🙏🙏🙏
కె.వి.యస్. లక్ష్మి: సిగ్గు సిరులొలకంగ తా శిరము వంచె ఇంతి తన పెండ్లి నాడు; బాలెంతరాలు గ మరి మరుయేట మిసిమితో కాంతి జెంది మైమరచి జూచె మురియుచు మగని వంక.
తనతో తప్పక వత్తునంచు దెలిపెన్ తానేల రాకుండెనోతనయుద్వాహమునాడు నెచ్చెలి సుజాతంచున్ విచారించగాతనయన్నప్పుడు కారణంబుతెలిపెన్ తానారయన్ దెల్సెనావనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరా లొప్పుగన్
ఇంతి తనపెండ్లినాడు బాలెంతరాలుజరుగు చున్నవి యీనాడు శంకవలదుజరుగునింకను వింతలు జగమునందుచూచు చుండుట మనపని సుజనులార!
మనువాడెన్గదరావిచెట్టునటనామాతలిలివేపన్భువిన్కనగామోదముసంపదల్గలిగెనాకల్యాణమీక్షింపగన్వినగన్వేపయుపూతకాయలకుతావిచ్చెన్వసంతంబునన్వనితారత్నముపెండ్లినాడుగనగాబాలింతరాలోప్పుగన్
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.టైపాట్లున్నవి.
సరిదిద్దుకుంటానండి
తన కన్యాయము జేసినాడనుచు నాధారంబులన్ జూపగావిని న్యాయాధిపుడామె గోర్కె నతనిన్ పెండ్లాడ శాసింప నాతనికిన్ నాతికి నిశ్చయించిరి ముహూర్తంబంతటన్ మేలుగావనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్కన పాశ్చాత్యపు పద్ధతుల్ మిగుల దుష్కర్మంబులై దోచునేతనకున్ నచ్చిన వానితో గడుపగా తప్పేమి కాదందురేవినుమీ సంగతి వేడ్కగా బిలిచిరా విడ్డూరమౌ బెండ్లికిన్వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఘనుడాధర్ముడుసద్గుణాంబుధినమస్కారార్హుడౌవిప్రుడామునిరాట్సత్యవిశారదుండనఘుడాపుణ్యాత్ముడాధ్వర్యమైవనితన్బెండిలియాడెప్రీతికరమైవర్షంబుదాటంగనే*వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మన్ననల నందె మిన్నఁగఁ గన్నెగాను దల్లి యయ్యెను నా చిట్టి తల్లి నేఁడు గిఱ్ఱునఁ గడచె నేఁడాది యెఱ్ఱ రంగు టింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు మినుకుల్ సత్యము లయ్యె సత్వరము సుమ్మీ వింతగా ధాత్రిలోనెన లేనట్టి తనుండు పుత్రుఁ గని యయ్యెం బుత్రి నేఁ డింపుగా, దనయం గాంచి యొసంగ దీవనను బుత్రప్రాప్తి రస్తం చటన్ వనితారత్నము పెండ్లినాఁడు, గనఁగా బాలెంతరా లొప్పుగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
కన రత్నప్రభవోలె నందమున సింగారించి సందీప్తమైమన మొప్పార వరించ నా వరుని రమ్యంబంద కేలూనె నావనితారత్నము పెండ్లినాఁడు గనఁగా, బాలెంతరా లొప్పుగన్గన నీ వేళను, జూడ ప్రేమఫల సాకారమ్ము గా నొప్పగన్!
శోకమందెను మదిలోన , రాకపోవ కూర్మితో తనకు పతిని కూర్చినట్టి ఇంతి తన పెండ్లి నాడు! బాలెంతరాలు గాన వీలు కలుగ నట్టి కాంత కుమిలె!
కనసొంపై యలరారెగా కమల! యాకంజాస్య క్రీగంటి యావనితారత్నము పెండ్లినాడు కనగా ,బాలెంతరాలొప్పుగన్ వినయంబొందుచు చూచువారలకు దేవేరిన్ గనంగాయెడిన్ గనుడీలోకము పోకడన్ ,గనుచునేకాంతంబుబాటించుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కనంగాయెడిన్' ?
చెంతకొచ్చిన పురుషుని చేవజూసినంత, సహజీవనముజేసె,నాతి యొకతిహద్దుదాటిన తదుపరి అంతిమమునఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు!!
అత్త మామలామెకు క్రొత్త వారు సుతులుతల్లిదండ్రులు సతతము తనయులేగమరిది యూడుబిడ్డలకైన మాత గాదె!ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలుచిరు ప్రయత్నము, దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన
రిప్లయితొలగించండి"శ్రీ రాముని దయ చేతను..."
సరదా పూరణ:
వినకే తండ్రివి మాటలన్ చదువుకై బింకమ్మునున్ వీడుచున్
చనుచున్ వంగపు దేశమున్ యువకుడే జంబమ్మునన్ కన్నెనున్
కనగన్ వేగమె ప్రేమ జూపగనయో కంగారునున్ గానకే
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏
తొలగించండిపంతపు ముని వరమునిచ్చె సంతసమ్ము
రిప్లయితొలగించండినిక్కమా కాదయని రవిని పిలిచెనల
వరమునగనె కర్ణుని కౌరవాగ్ర సుతుని
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు”
... భారతీనాథ్ చెన్నంశెట్టి..
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిచక్క నైనట్టి రూపంపు చాన యగుచు
రిప్లయితొలగించండివయసు తగినది కల్గిన వనిత యగును
ఇంతి తన పెండ్లి నాడు : బాలెంత రాలు
వత్సరము పిదప యగును పడతి తాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పిదప నగును" అనండి.
కనగతల్లియుతండ్రియుకన్యకపుడు
రిప్లయితొలగించండిమాఘమందునముడివేయనయముమీరి
తరుణియోడినిండెమలిమాఘతరుణమందు
ఇంతితనపెండ్లినాడుబాలింతరాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తరుణి యొడి' టైపాటు.
యామి రాలేదు నీ వివాహమున కేల
రిప్లయితొలగించండియని యడిగిన భరణ్యువు కాతడపుడు
వినయ మందున చెప్పె నావేళ నట్టి
యింతి తనపెండ్లి నాడు బాలెంతరాలు .
. . . విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘనమౌ రాముని భక్తుడొక్కడు యనెన్ గారంపు యొప్పందమున్
రిప్లయితొలగించండిమనసారంగను చేసెదయ్య మురిపమ్మౌ నీదు కళ్యాణమున్
జననంబయ్యెను బిడ్డ పాపలును యిఛ్ఛన్దీరెనవ్వారికిన్
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
3 వ పాదములో సవరణ
తొలగించండి“జననంబయ్యెను” స్థానములో “ జనియించెన్ మరి” గా చదువుకోవలసినదిగా విన్నపము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఒక్కడు+అనెన్' అన్నపుడు యడాగమం రాదు. "భక్తుడొక్క డనియెన్" అనండి. 'గారంపు+ఒప్పందమున్=గారంపు టొప్పందమున్' అవుతుంది.
ధన్యవాదములండీ
తొలగించండిమీ సవరణలను పాటిస్తానండీ
నేడు శంకరాభరణం వారిచ్చిన సమస్య
రిప్లయితొలగించండి" వనితా రత్నము పెండ్లినాడు గనగా బాలింతరా లొప్పుగన్"
నా పూరణ
మత్తేభము
జననీ రత్నము దండ్రియున్మురిసి సచ్చారిత్ర యాత్మానుజన్
ఘనమౌరీతిగ పెండ్లిజేయతగు లగ్నంబందు మోదంబుగన్
తనియన్ ప్రేమగ కాపురంబునను సత్సంవత్స రాంతంబునన్
" వనితా రత్నము పెండ్లినాడు గనగా బాలింతరాలొప్పుగన్"
ఆదిభట్ల సత్యనారాయణ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆత్మానుజ అంటే సొంత చెల్లెలు, కూతురు కాదు. "సచ్చారిత్ర నాత్మోద్భవన్" అనండి.
కనలేకుంటిని నీదుచెల్లెలిని నీ కళ్యాణ మందేలరా?
రిప్లయితొలగించండియనిప్రశ్నించిన తోడుతో తెలిపె సత్యంబాతడీరీతిగన్
వినయంబెంతయొ చూపుచున్ విరివిగా బ్రేమించు నా చెల్లెలా
వనితారత్నము పెండ్లినాడు గనఁగా బాలింతరాలొప్పగన్. ....... . ........ విరించి.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిమగువ మనువాడి మనసైన మగని తోడ
వత్సరమ్ము గాకమునుపె వలపు పండి
జన్మనీయగ పండంటి చందురునకు
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మత్తేభవిక్రీడితము
మనువై నచ్చిన వానితో తరుణికిన్ మాంగల్యబంధంబునన్
జనువై బండెను ప్రేమపంట నొకటౌ సంవత్సరాంతంబునం
దనురాగాంబుధి నోలలాడ చెలులున్ హాస్యాన నిట్లాడిరే!
"వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్! "
సవరించిన చివరిపాదంతో....
తొలగించండితేటగీతి
మగువ మనువాడి మనసైన మగని తోడ
వత్సరమ్ము గాకమునుపె వలపు పండి
జన్మనీయగ పండంటి చందురునకు
నింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమ:
రిప్లయితొలగించండిమనువాడంగను మాఘ మాస మనుచున్ మాహాత్మ్య మై యెప్పదే
ఘనమౌ రీతిని పూజలున్ సలుప నా కామాక్షి మన్నింపగన్
వనమున్ భాగ్యమదేమొగాని కడుపే పండంగ, విడ్డూరమై
వనితా రత్నము పెండ్లినాడు గనగా బాలెంతరాలొప్పుగన్
వనము=ఇల్లు
పెండ్లినాడు=వివాహ వార్షికోత్సవ రోజు
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య :
రిప్లయితొలగించండివనితారత్నము పెండ్లినాడు గనగా
బాలెంతరా లొప్పుగన్
( ఏడాది క్రితం వధూమణి ; ఇప్పుడు
మాతృమణి )
మత్తేభవిక్రీడితము
...........................
కనగా జీవితమెంత మోదకరమో!
కంజాస్య యేడాదికే
జనకున్ జేసె సుభాషిణీరమణియే ;
సంస్నిగ్ధముగ్ధాంగి యౌ
వనితారత్నము పెండ్లినాడు ; గనగా
బాలెంతరా లొప్పుగన్
ఘనమౌ బాధ్యత జేతబట్టె నిపుడీ
కారుణ్యవాత్సల్యయై .
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితమ సుతుడు ననువంచించి తరలె, నమిత
రిప్లయితొలగించండిశ్రమమున మిము జేరితినన శ్వశురుడతని
బిలిచి యొప్పించి వారికి బెండ్లిజేయ
నింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదంపతులు గాను నిండెను దశవసంత
రిప్లయితొలగించండిములుగ నేడు, నోముల పంట ముద్దులబిడ
పుట్టె నునిదేదినమ్మున, పురిటినింట
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఇంతి తన పెండ్లినాఁడు, బాలెంతరాలు
స్నేహ యనబడు మిత్రురాలిని బిలుచుచు
మగనికి పరిచయముచేయ, మగువ వారి
ని తన గేహమునకు రమ్మనెను ముదమున!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
తొలగించండిలేఖ యనబడు....
అని మారిస్తే సరిపోతుందాండీ కంది వారూ ?
వ్యాక్సీను తరువాయి మీ నీరసమ్ము తగ్గినదా ?
కుశలమని ఆశిస్తాను.
జిలేబి
తనదు పెండ్లికి తప్పక తరలివత్తు
రిప్లయితొలగించండినన్న శ్రీవల్లి రాకుండె నరయ కతము
కలికి దమయంతి చెలియతో దెలిపె నిట్టు
లింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితనువే సన్నని తీగెయై దనరెనే తారుణ్యశిల్పంబుగా
రిప్లయితొలగించండివనితారత్నము పెండ్లినాడు ;గనగా బాలెంతరాలొప్పుగన్
మనువైనంతనె గర్భమే గలుగగా మాతృత్వపున్
శోభతో
తనువే నిండుగ పూచినట్టి తరువై దర్పమ్ము సంతృప్తిమై
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమోనమః!🙏🙏🙏
తొలగించండికె.వి.యస్. లక్ష్మి:
రిప్లయితొలగించండిసిగ్గు సిరులొలకంగ తా శిరము వంచె
ఇంతి తన పెండ్లి నాడు; బాలెంతరాలు
గ మరి మరుయేట మిసిమితో కాంతి జెంది
మైమరచి జూచె మురియుచు మగని వంక.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితనతో తప్పక వత్తునంచు దెలిపెన్ తానేల రాకుండెనో
రిప్లయితొలగించండితనయుద్వాహమునాడు నెచ్చెలి సుజాతంచున్ విచారించగా
తనయన్నప్పుడు కారణంబుతెలిపెన్ తానారయన్ దెల్సెనా
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరా లొప్పుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఇంతి తనపెండ్లినాడు బాలెంతరాలు
రిప్లయితొలగించండిజరుగు చున్నవి యీనాడు శంకవలదు
జరుగునింకను వింతలు జగమునందు
చూచు చుండుట మనపని సుజనులార!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమనువాడెన్గదరావిచెట్టునటనామాతలిలివేపన్భువిన్
రిప్లయితొలగించండికనగామోదముసంపదల్గలిగెనాకల్యాణమీక్షింపగన్
వినగన్వేపయుపూతకాయలకుతావిచ్చెన్వసంతంబునన్
వనితారత్నముపెండ్లినాడుగనగాబాలింతరాలోప్పుగన్
మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిటైపాట్లున్నవి.
సరిదిద్దుకుంటానండి
తొలగించండితన కన్యాయము జేసినాడనుచు నాధారంబులన్ జూపగా
రిప్లయితొలగించండివిని న్యాయాధిపుడామె గోర్కె నతనిన్ పెండ్లాడ శాసింప నా
తనికిన్ నాతికి నిశ్చయించిరి ముహూర్తంబంతటన్ మేలుగా
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
కన పాశ్చాత్యపు పద్ధతుల్ మిగుల దుష్కర్మంబులై దోచునే
తనకున్ నచ్చిన వానితో గడుపగా తప్పేమి కాదందురే
వినుమీ సంగతి వేడ్కగా బిలిచిరా విడ్డూరమౌ బెండ్లికిన్
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఘనుడాధర్ముడుసద్గుణాంబుధినమస్కారార్హుడౌవిప్రుడా
రిప్లయితొలగించండిమునిరాట్సత్యవిశారదుండనఘుడాపుణ్యాత్ముడాధ్వర్యమై
వనితన్బెండిలియాడెప్రీతికరమైవర్షంబుదాటంగనే
*వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా బాలెంతరాలొప్పుగన్*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమన్ననల నందె మిన్నఁగఁ గన్నెగాను
రిప్లయితొలగించండిదల్లి యయ్యెను నా చిట్టి తల్లి నేఁడు
గిఱ్ఱునఁ గడచె నేఁడాది యెఱ్ఱ రంగు
టింతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
మినుకుల్ సత్యము లయ్యె సత్వరము సుమ్మీ వింతగా ధాత్రిలో
నెన లేనట్టి తనుండు పుత్రుఁ గని యయ్యెం బుత్రి నేఁ డింపుగా,
దనయం గాంచి యొసంగ దీవనను బుత్రప్రాప్తి రస్తం చటన్
వనితారత్నము పెండ్లినాఁడు, గనఁగా బాలెంతరా లొప్పుగన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండికన రత్నప్రభవోలె నందమున సిం
గారించి సందీప్తమై
మన మొప్పార వరించ నా వరుని ర
మ్యంబంద కేలూనె నా
వనితారత్నము పెండ్లినాఁడు గనఁగా, బాలెంతరా లొప్పుగన్
గన నీ వేళను, జూడ ప్రేమఫల సా
కారమ్ము గా నొప్పగన్!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశోకమందెను మదిలోన , రాకపోవ
రిప్లయితొలగించండికూర్మితో తనకు పతిని కూర్చినట్టి
ఇంతి తన పెండ్లి నాడు! బాలెంతరాలు
గాన వీలు కలుగ నట్టి కాంత కుమిలె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనసొంపై యలరారెగా కమల! యాకంజాస్య క్రీగంటి యా
రిప్లయితొలగించండివనితారత్నము పెండ్లినాడు కనగా ,బాలెంతరాలొప్పుగన్
వినయంబొందుచు చూచువారలకు దేవేరిన్ గనంగాయెడిన్
గనుడీలోకము పోకడన్ ,గనుచునేకాంతంబుబాటించుమా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కనంగాయెడిన్' ?
చెంతకొచ్చిన పురుషుని చేవజూసి
రిప్లయితొలగించండినంత, సహజీవనముజేసె,నాతి యొకతి
హద్దుదాటిన తదుపరి అంతిమమున
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు!!
అత్త మామలామెకు క్రొత్త వారు సుతులు
రిప్లయితొలగించండితల్లిదండ్రులు సతతము తనయులేగ
మరిది యూడుబిడ్డలకైన మాత గాదె!
ఇంతి తన పెండ్లినాఁడు బాలెంతరాలు
చిరు ప్రయత్నము, దోషములున్న మన్నించి తెలుప ప్రార్థన