19, మార్చి 2021, శుక్రవారం

సమస్య - 3668

20-3-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్”
(లేదా...)
“ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్”

35 కామెంట్‌లు:

 1. అదనునఁ గొంటి నొక్క గడియారము, దాని స్వరూపముం గనన్
  ముదమిడుఁ గేకి వోలెఁ గడు ముచ్చట గొల్పునుగా, యలారమో
  పదపడి కోడి కూతయె, నివాసగృహమ్మున నుంచఁగా నహా!
  యుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. "(సవరణతో...)
   అదనునఁ గొంటి నొక్క గడియారము, దాని స్వరూపముం గనన్
   ముదమిడుఁ గేకి వోలెఁ గడు ముచ్చట గొల్పును, *లేపు గంటయో*
   పదపడి కోడి కూతయె, నివాసగృహమ్మున నుంచఁగా నహా!
   యుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్."

   తొలగించండి

 2. "శ్రీ రాముని దయ చేతను..."

  సరదా పూరణ:

  బెదరుచు నత్తగారికట బిత్తర బోవుచు కాపురమ్మునున్
  వదలగ కాంత వేగముగ భర్తయె క్రోలుచు మద్య మాంసముల్
  కదలుచు ప్రక్కమీద కడు గాభర నొందగ స్వప్నమందు తా
  నుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్

  రిప్లయితొలగించండి
 3. గు రు మూ ర్తి ఆచారి , వెలుగోడు
  --------------------------------

  గురుభ్యో నమః దయచేసి మొన్నటి పూరణ స్వీకరింప మనవి
  ............................ .....................................................................

  " కరకుగ హెచ్చరించినను , గాటపు శిక్షల పాలుజేసినన్ ,
  మరువక - పట్టువీడ కనుమాత్రము , మత్ప్రముఖారి యైన యా
  హరిని నుతించు ; సంతతము నాతని నామమునే జపించు | నీ
  సురరిపువంశగౌరవము స్రుక్కగజేయ జనించె | చక్కగా
  విరిసిన పద్మమందు కడువింతగ బుట్టెను కాలసర్పమే !
  చెరుపగబుట్టె హ్లాదు డిటు జీడగ గర్భము నం " దటంచు పిం
  జరకశిపుండు కుందె | తన జాతి మహోత్తమ మంచు నెంచున్ ,
  దురభిమతంబుతో దిరుగు దుర్జను డాత్మ విమర్శ సేయ , కీ
  శ్వరుని గ్రహింపకన్ దుదకు ప్రక్షయమొందు చరిత్రహీనుడై

  ( మత్ + ప్రముఖ + అరి = మత్ప్రముఖారి ; స్రుక్కజేయు =

  నశింపజేయు ; హ్లాదుడు = ప్రహ్లాదుడు ;

  పింజరకశిపుండు = హిరణ్యకశిపుడు ; చీడ = చీడపురుగు ;

  ప్రక్షయము = వినాశనము ; )

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
  రిప్లయితొలగించండి
 4. నదరము బలిసిన కోళ్ళను

  సదరమ్ముగ పెంచి నరులు చక్కగ తినగన్

  బెదురున్ దాగెను పుంజులు

  ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్?

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 5. గు రు మూ ర్తి ఆ చారి , వెలుగోడు
  --------------------------------
  గురుభ్యోనమః నిన్నటిపూరణ స్వీకరింప మనవి


  ఘననూత్నోత్సవప్రభలలో ' కామేశ్వ ' రాఖ్యుండు ' ఛా

  య ' ను పెండ్లాడెను , బంధువుల్ నెనరుతో నాశీర్వదించన్ > గతిం

  చిన వర్షమ్మున | నేటి వత్సరమునన్ జిన్నారి పొన్నారి పా

  పను గాంచెన్ సరిగా వివాహదినమే | వైచిత్ర్యమౌ రీతిగా

  వనితారత్నము పెండ్లినాడు గనగా బాలెంతరాలొప్పుగన్ !

  ( ప్రభ = కాంతి ; ఆఖ్యుడు = పేరు గలవాడు ; నెనరు = ప్రేమ ; )

  ..................................................................................

  రిప్లయితొలగించండి
 6. కుదురుగబ్రాహ్మీగడియల
  నిదురనుఁబోరాదనగనునీమమువలనన్
  కదలెనుకంఠంబామెది
  ఉదయముకోక్కోరోకోయనిమయూరములేపున్

  రిప్లయితొలగించండి
 7. పదుగురు మెచ్చె డి రీతిగ
  మది మెచ్చె డి రూపు కేకి మర గడియారం
  బది కోడి కూత తోడన్
  ఉదయము కొక్కొరొ కొ యని మ యూరము లేపున్

  రిప్లయితొలగించండి
 8. రధమును తోలి కృష్ణుడును డస్సి పరుండెను శేష సాయిగన్

  కదలుచు నాట్య భంగిమను గారము కోరుచు వేణు నాదమున్

  ఉదయమె నిద్ర లేపును మయూరము ; కొక్కొరొకో యటంచుఁ దాన్”

  బెదురున ఆలసమ్మునను పెద్దగ కూసెను కుక్కుటమ్మటన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. మిమిక్రీ కళాకారుడి తడబాటు గా ఈ నా ప్రయత్నము:

   చం:

   వదలక హాస్యమాడుచును బాలురు బాలికలెల్ల గాంచనై
   యదునుగ నెంచి బొమ్మలను యచ్చము కూయుచు నందు సామ్యమై
   పదటున కేకి పట్టి యట బల్కెను దిగ్భ్రమ మొందు రీతినిన్
   ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచు దాన్

   పదటు=తడబాటు

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 10. సదనమునున్న ప్రేక్షకులు సమ్మదమొందగ పక్షిజాతులన్
  ముదముగ జేర్చి దండమును ముందుకు వెన్కకు
  తిప్పిచూపుచున్
  పదునగు నింద్రజాలమున ప్రఙ్ఞను జూపుచు మార్చగొంతుకల్
  ఉదయము నిద్రలేపును మయూరము కొక్కొరకో యటంచుదాన్

  రిప్లయితొలగించండి
 11. సమస్య :
  ఉదయమె నిద్రలేపును మ
  యూరము కొక్కొరొకో యటంచు దాన్

  (నెమలి రూపం , కోడిపుంజు కంఠం నాకిష్టం . ఆ రెండు లక్షణాలు గల టేబుల్ క్లాక్ కొనుక్కు న్నాను . )

  చంపకమాల
  ..................
  చెదరని మోజు నాకు పలు
  చిన్నెల వన్నెల నెమ్మి యన్నచో ;
  వదలని ప్రీతి రెక్కలవి
  పైకిడి యార్చెడి కోడిపుంజనన్ ;
  ముదమున రెండు చేకురిన
  ముద్దగు నా గడియారమల్లదే ;
  యుదయమె నిద్రలేపును మ
  యూరము కొక్కొరొకో యటంచు దాన్ .

  రిప్లయితొలగించండి
 12. నిదుర దొలగించు కుక్కుట
  ఉదయమె కొక్కొరొకొ యని : మయూరము లేపున్
  మది మగతను బురివిప్పుచు
  మృదువుగ పోగొ ట్టెడివవి మనుజుని మత్తున్

  రిప్లయితొలగించండి
 13. పదునుగ పెంచిన పుంజును
  ముదముగ దలతును మయూరముగ ననిశంబున్
  పదటువడక శ్రావ్యముగా
  నుదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

  రిప్లయితొలగించండి
 14. హృదయజుడు కోరెనని జ
  న్మదుడాండ్రైడిచ్చె నందు మండల మెగిరెన్
  సదనువు తృణమును మేయగ
  నుదయము కొక్కొరకొ యని మయూరము లేపున్ .
  . . . విరించి.

  రిప్లయితొలగించండి
 15. వదలక నేడ్చుచుండెనని పట్టణమేగిన భాగ్యశాలి జ
  న్మదుడు ముదమ్మునాండ్రయిడు నాకుని కివ్వగ దెచ్చె నందులో
  సదనువు గడ్డిమేయుచు ప్రజాళికి నీతిని బోధసేయగా
  నుదయమె నిద్రలేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్. ....... . ........ విరించి.

  రిప్లయితొలగించండి


 16. పద! లే యను భాషమ్మదె
  యుదయమె కొక్కొరొకొ యని,మయూరము లేపున్
  మదియుర్రూతలనాట్య
  మ్మదె చేయుచు! ప్రకృతి యేను మనపెన్నిధియౌ!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 17. “ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్”

  వదరకు డీవిధంబున
  నవాక్క యి యుంటిని మీవచస్సుకున్

  కుదురుగ నాలకించు మిము
  కూయుమనంగనె కూయు వేరుగా

  మృదువుగ జెప్పగన్ వినుడు మీకిది యొప్పదు గాక యొప్ప దే

  రిప్లయితొలగించండి


 18. పురివిప్పుచు నాట్యంబు గ
  నుర ఉదయమె నిద్ర లేపును మయూరము! కొ
  క్కొరొకో యటంచుఁ దాన్ పు
  చ్చి రయ్యన నటునిటు తిరుగు సేవా రీతిన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 19. కదలవు కాలున్సేయిన్

  మెదలవు వినకను చెవులును మెదడున్సచ్చెన్

  పొదు పొద్దున వచ్చు సముడు

  ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 20. నిదురను విడుమను కుక్కుట
  ముదయమె కొక్కొరొకొ యని; మయూరము లేపున్
  ఎద పులకింపగ పింఛము
  ముదమున దన జత మయూరి ముంగల నిలువన్

  రిప్లయితొలగించండి
 21. ముదమునగొంటినద్భుతముప్రొద్దునముద్దుగనిద్రలేపగన్
  సదమలకుక్కుటంబదిప్రశస్తగళంబుసువర్ణరంజితం
  బుదకముద్రావియూలలిడునుప్మదినంగనెగొంతుమార్చిదా
  *నుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్”*

  రిప్లయితొలగించండి
 22. శ్రీ గురుభ్యోనమః

  సమస్య: ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

  కం.
  చెదరుచునవి కుక్కుటములు
  నుదయమె కొక్కొరొకొ యని, మయూరము లేపున్
  ముదముగ క్రేంకారమ్ముల
  సదమల ప్రకృతిన ప్రశాంత సంసారమ్మున్

  రిప్లయితొలగించండి
 23. మదనాల! లేపు కోడియె
  యుదయమె కొక్కొరొకొ యని,మయూరములేపున్
  హృదయము సంతో షించగ
  విదలించుచు నొక్కసారి పింఛము వడిగాన్

  రిప్లయితొలగించండి
 24. క్లోనింగ్ తో సంకరమైన జీవులు.....

  కందం
  అదియె సమరూప జీవుల
  ముదమున సృజియించు క్రియ నపూర్వమనన్ గా
  డిద మొరుగు, వచ్చు తరముల,
  నుదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

  చంపకమాల
  అదె సమ రూప జీవ సృజనాత్మకమద్భుతమౌచు సర్వులున్
  ముదమున నొప్ప లోకము నపూర్వమనంగ భవిష్యమందు గా
  డిద మొరుగున్ విచిత్రముగ డేగలు కోయిల రీతి కూయుగా
  నుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్

  రిప్లయితొలగించండి
 25. ఉదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకోయటంచు దాన్
  నుదయము లేచునంతనెనయోమయ వార్తను దెల్పిరేగదే
  సదయను జూడుమమ్ములను శంకర! యేమని వ్రాయగల్లుదున్
  నుదయము లేపు గోడియ మయూరముగాదుగ జింతజేయగన్

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. నదుల సమీపమ్మునఁ దాఁ
   బదిలమ్ముగ సంచరించి వారక సతమున్
   వదరుచు కోడి వనమ్మున
   నుదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

   [మయూరము (న్) లేపున్]


   చదలున మేఘముం గనక చాలదు కేకియె నాట్యమాడగం
   గదలుచుఁ గూయు సంతతము కాహళ మందఱి కీయ మోదమున్
   సదమల దేహి కుక్కుటము సక్కటి గ్రామ మయూరమే కదా
   యుదయమె నిద్ర లేపును మయూరము కొక్కొరొకో యటంచుఁ దాన్

   తొలగించండి
 27. కదనముఁజేయగావలెనుకామమునన్నిటవీడుచున్మదిన్
  సదమలభక్తిభావమునసాగుచువెంకనగోల్వగావలెన్
  సదనముమానసంబునకుశాంతినిఁగూర్పగచిత్తకేకిగా
  ఉదయమెనిద్రలేపునుమయూరముకోక్కోరోకోయటంచుఁదాన్

  రిప్లయితొలగించండి
 28. అదిగో కుందుని తేరులు
  విధులన్ జేయుచు మురియుచు విభునిన్ గొల్వన్
  ముదమున నిదరోయిన శిఖి
  ఉదయమె కొక్కొరొకొ యని మయూరము లేపున్

  రిప్లయితొలగించండి