8, మార్చి 2021, సోమవారం

సమస్య - 3657

9-3-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు”
(లేదా...)
“కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ”

81 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    గారము పెంచగా చనుచు కాంతలు చేరగ పుట్టినింటినిన్
    కూరిమి మీరగా పతులు కొద్దిగ నాగక వచ్చి చేరుచున్
    దూరము నందునున్ గలుగు దుఃఖము నీయక వెంబడించుచున్
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి
  2. పరుల కుపకార మొనరింత్రు ప్రాజ్ఞు లిలను
    కోరనిదె మేలొనర్తురు : క్రూరు లెపుడు
    కీడొ నర్చగ జూతురు కించ పరచి
    దుష్ట చిత్తము తోడుత దురితు లగుచు

    రిప్లయితొలగించండి
  3. కొత్తగ పరిశ్రమలు రావు కూడి చూడ

    ధనము సంపాదనమ్ముకు దారి లేదు

    ఉచిత ఉప్పు పథకమును తెచ్చిరయ్య

    కోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఉచిత ఉప్పు' వైరి సమాసం. ఆ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  4. మనము చేసిన పాపము, మనకు కీడు
    చేయు జనులకు మరలును చెరపు గాను
    కీడు మనపాప హరణము కేను, ఇటుల
    కోరనిదె, మేలొనర్తురు క్రూరు లెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. inko version..

      మనము చేసిన పాపము, మనకు కీడు
      చేయు జనులకు మరలును చెరపు గాను
      పాపహరణమగుమనకు.వారు మనకు
      కోరనిదె. మేలొనర్తురు క్రూరు లెపుడు
      తెలియక యసలు సత్యము, తెలివి లేక

      తొలగించండి
  5. తేరగవచ్చువాని నిట ధీటుగనిత్తుము ఓటువేయుడీ
    మారుగ గెల్చిమే మిటుల మార్చెద మంచును జీవితాలనే
    నేరుగ నోటరున్ కలిసి నీతుల జెప్పును మాయమాటలన్
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దీటుగ నిచ్చెద మోటు వేయుడీ/ ... నిత్తుము వోటు వేయుడీ" అనండి.

      తొలగించండి
    2. తేరగవచ్చువాని నిట ధీటుగనిచ్చెద మోటువేయుడీ
      మారుగ గెల్చిమే మిటుల మార్చెద మంచును జీవితాలనే
      నేరుగ నోటరున్ కలిసి నీతుల జెప్పును మాయమాటలన్
      కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ!!

      ***సవరణతో....

      తొలగించండి
  6. నివురుగప్పినయట్టులనిజముదాచి
    కుటిలబుద్ధినిదరిఁజేరిగుట్టుదెలియ
    మంచిచాటునవంచెనపాదుగోలిపి
    కోరనిదెమేలోనర్తురుక్రూరులెపుడు

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    నేరము స్వీయవృత్తి., యవినీతి చరించు మనఃప్రవృత్తి., వా..
    గ్ధార మహాసిధార యనగా రుధిరమ్మును గోరు బుద్ధితో
    ధారుణి ధర్మసత్పథవిదారకుడైన ఖలోగ్రవాదికిన్
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. మానవత్వమ్ము వీడని మానవుండ్రె
    సద్గుణాంబుధి శీలురు సతము వారు
    కోరనిదె మేలొనర్తురు, క్రూరు లెపుడు
    పొరుగు వారిని హింసించి మురియు చుంద్రు .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    నేరములు నిందలస్థాయి మీరకుండ
    నేర్పు మీరగ నేతలై నిల్చి గెల్చి
    పరుల వంచించి సిరి వారి తరములెల్ల
    కోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు

    ఉత్పలమాల
    నేరములెన్నియో సలిపి నిందల రూపము దాటకుండగన్
    నేరుపు మీరగా నునిచి నేతలు నౌచును గెల్చి యెన్నికన్
    బౌరుల సేమమున్ విడచి భాగ్యము వారి తరమ్ములెన్నియో
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి
  10. నేరుపుమీరగాపలుకునేవళమెమచుచుమాటుగానటన్
    వారమువారమున్వలపువంకనుకాంతలవెంటనాడుచున్
    చేరుచుదీనభావమునచేటునుచేయగనిచ్చగింతురే
    కోరకమున్నెమేలునోనగూర్చెఞువారలెక్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి
  11. భూరిగ మానవత్వమది భూషణమై వెలుగొందునెవ్వడో?
    ధారుణమందు పేదల విధానము గాంచిన జాలు జాలితో
    కోరక మున్నె మేలునొన గూర్చెడు వారలె, క్రూర చిత్తులౌ
    వారు పరాయివారి దురవస్థల గాంచిన సంతసింతురే .
    . . . విరించి.

    రిప్లయితొలగించండి
  12. మారెను రాజకీ యములు మంచి యదెక్కడొ గానరాదయెన్
    భారిగ మాటలిచ్చుచును పాటవ మొప్పగఁ నోట్ల కోసమై
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ,
    భారము గారె భూమికిని భారత దేశపు నాయకోత్తముల్.

    రిప్లయితొలగించండి
  13. సమస్యా పూరణం

    కోరక మున్నెమేలు నొనగూర్చెడు వారలె క్రౄరచిత్తులౌ

    నా పూరణ

    ఉత్పలమాల

    భారము కాదులే యనుచు వస్తువు లెన్నియొ యిచ్చువారలున్
    సారములేనిమైత్రియును చక్కని మాటల మభ్యబెట్టుచున్
    కోర్కెలఁ దీర్చుకోదలచి కోమలిఁ జేరగ మోసకారులే
    కోరక మున్నెమేలు నొనగూర్చెడు వారలె కౄరచిత్తులౌ!

    ఆదిభట్ల సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  14. ఉ:

    తీరము దాటి మాన్యులట తీర్చగ కష్టములెల్ల రొక్కమున్
    తేరగ గూర్తురెల్లరకు దీనుల పాలిటి కల్పవృక్షమై
    మారుగ బల్మి చేయుదురు మారు మతమ్మని మాయ మాటలన్
    కోరకమున్నె మేలు నొన గూర్చెడు వారలె క్రూర చిత్తులౌ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. సారెకు ఫోనుచేసి తమసంఖ్యకు వచ్చెను లాటరీయనున్
    చేరగ మీయకౌంటుకును చెల్లును చేయుడు కొంత
    మొత్తమన్
    పారగ నెత్తు సొమ్ములను భారిగ చేరిచి పారిపోవుచున్
    కోరకమున్నె మేలునొన గూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి
  16. సత్య ధర్మంబు, నిత్యము శాంతిగాను
    భక్తి కలిగున్న చాలును, పరమశివుడు
    కోరనిదె మేలొనర్తురు; క్రూరు లెపుడు
    కలుషములతోటి నెపుడును యలమటించు!

    రిప్లయితొలగించండి
  17. ప్రేరణ నిత్తులెల్లరకు ప్రేమను బంచుచు శాంతచిత్తులై
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె; క్రూరచిత్తులౌ
    వారలధర్మ మార్గమున బాధలు వెట్టెద రైనవారినే
    దారుణమంచు నెంచ రిల దంభగుణోల్బణులై చరింతురే

    రిప్లయితొలగించండి
  18. నిన్నటి సమస్యకు నా ప్రయత్నము:

    సాటియె లేరు నాకనుచు సత్కవులందరి నీసడించుచున్
    మాటలు మీరునా కుకవి మల్లరమున్ చెలరేగ నత్తరిన్;
    దీటుగ పద్య విద్య నతిధీమసమున్ తన ఉక్కడంచగా
    నోటమితో; వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్

    రిప్లయితొలగించండి
  19. చీరలు సారెలిచ్చి యివి చేతులు కావిక కాళ్ళు, మాకికన్
    మీరలె దైవమన్చు తమ మేలుకు నీ శ్రమ నిక్కమన్చు వే
    మారులు మ్రొక్కి రొక్కమిడి మాయల మాటలు చెప్పి యోట్లకై
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి


  20. సమస్య :
    కోరక మున్నె మేలు నొన
    గూర్చెడువారలె క్రూరచిత్తులౌ

    ( కామెర్ల రోగికి అంతా పచ్చగా కనపడుతుందని సామెత )

    కోరక మున్నె మేలు నొన
    గూర్చెడువారలె- క్రూరచిత్తులౌ
    వారల కెవ్విధిన్ గనిన
    బారలు జాపుచు దేశసంపదన్
    జోరుగ రేగి కొల్లగొన
    జొంగల గార్చెడు వారలౌదురే !
    జారులు సోమరుల్ బదవి
    చాలనివారుగ గానిపింతురే !!

    రిప్లయితొలగించండి
  21. కష్టముల మునిగిన వాని గాంచినపుడు
    సత్పురుషు లవసరమగు సాయమిడుచు
    గోరనిదె మేలొనర్తురు ; క్రూరు లెపుడు
    దానియందు వెదుకు లబ్ధి దాపురించ

    రిప్లయితొలగించండి
  22. నేరము నైజమట్లుగ వినిందితవృత్తులు చీనిపాలకుల్
    పోరగ లేక కట్టెదుట పోడిమి తగ్గిన పాకువారలా
    భారతదేశశత్రులకు, వైరికి శత్రువు మిత్రరీతిలో
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె, క్రూరచిత్తులౌ.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  23. అంబుదమువోలె నుత్తము లవనియందు
    కోరనిదె మేలొనర్తురు, క్రూరు లెపుడు
    కారణంబేమి లేకుండ కలహ పడుచు
    చేటొనర్పగ జూతురు కాటు వేసి

    రిప్లయితొలగించండి
  24. నిన్నటి పూరణ.

    పోటరికాండ్రు పృచ్ఛకులు బొల్పున ముచ్చెమటల్ జనించఁ దా
    జేటొనరించ, సత్కవనశూరవధాని భ్రమించ,డాదటన్
    ధీటుగ వారిఁ దార్కొనె సుధీమణు లందరు మెచ్చిరట్లుగా
    నోటమితో వధానికి మహోన్నత సత్కృతి దక్కె సత్సభన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  25. ఊరక సాధుజీవులఁ గటూక్తుల నాడుచు, దుష్ట సంగ సం
    చారముచేత భ్రష్టుఁడయి చౌర్యరతుండగువాని దృష్టిలో
    సార వివేక వాక్యములఁ జక్క నొనర్చు ప్రయత్నశీలురై
    కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి
  26. పరుల కుపకార మొనరించు భాగ్యమతులు
    కోరనిదె మేలొనర్తురు; క్రూరులెపుడు
    పరుల ధనమును దోచుచు పాపకార్య
    మగ్నులై నేర చరితులై మసలుచుండు.

    రిప్లయితొలగించండి
  27. తగవు లాడెననుచు నాడు పగర పంచ

    చేరెగా, నగ్రజుని వీడి పోరు లోన

    సాయ మిడె రామునకు విభీషణుడు నాడు

    తరచి చూడ నిజముగాదె ధరణి లోన

    కోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు

    పగర. = పగవాడు

    రిప్లయితొలగించండి
  28. వారల సౌఖ్యవృద్ధికయి భాగ్యములన్నియు పంచియున్న
    నన్
    వారలు దూరుచుండి రొకవైరిని గాంచిన రీతి నీయిలన్
    గోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తు లౌ
    రౌర! యటంచు నొక్కనరు డాత్మను గుందుచునుండె బేలయై.

    రిప్లయితొలగించండి
  29. నేరుచు నెల్లవేళల పు
    నీతపు కర్మఫలానురక్తితో
    కోరకమున్నె మేలు నొన
    గూర్చెడు వారలె క్రూరచిత్తులౌ
    కోరికలన్ జయించ నెఱి
    గూడక మూర్ఖత ప్రజ్వలించ నా
    భారపువహ్నిలో బ్రతుకు
    వైనమెరుంగని వేదనాటవిన్!

    నెఱి=క్రమత

    రిప్లయితొలగించండి
  30. కారులు కూయలేరు నరకార్ణవ మందున ద్రోయలేరు ధి
    క్కారము సైపలేరు సరుకారుకు బద్ధవిరోధు లీరలే
    ధీరులు వీరులీ బ్రిటిషు తీరు సహింపరు సొంతవారికిన్
    **కోరకమున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తులౌ”*

    బ్రిటిష్ వారు భారతస్వాతంత్ర్య యోధుల గురించి

    రిప్లయితొలగించండి
  31. మంచివారితరులకు ప్రేమను నిరతము
    గోరనిదె మేలొనర్తురు,క్రూరులెపుడు
    జేయుచుందురు దుష్కృతి చేతలందు
    నికను మానసి కంబుగ నిడుము లిడగ
    సంశయించరు పుడమిని శర్మ! యెపుడు

    రిప్లయితొలగించండి
  32. పుణ్య జీవులు సతతము పుడమి యందు
    కోరనిదె మేలొనర్తురు, క్రూరులెపుడు
    హాని గూర్చగ నెంచెద రన్యజనుల
    కనుచు హితము తెలిపి రార్యు లరయు డయ్య.

    రిప్లయితొలగించండి
  33. మున్ను హింసింపఁ బరదేశ మూర్ఖ జనులు
    సెలఁగి పీడింప భారతీయుల ననిశము
    దేశ సద్భక్తి చెలరేఁగె నీశ మాకుఁ
    గోరనిదె మేలొనర్తురు క్రూరు లెపుడు


    ధారుణిఁ గందు మత్యధిక ధర్మ విహీనుల నిందు నందునున్
    వారిని నిర్దయం జెలఁగి వారక బద్ధులఁ జేయ నొప్పగున్
    ఘోరపు భంగి సంతతము కోరిన నైనను దుర్జనాలికిం
    గోరక మున్నె మేలు నొనగూర్చెడు వారలె క్రూరచిత్తు లౌ

    రిప్లయితొలగించండి
  34. ఆరయ మంచివారుగను నందఱిచేతను మెప్పునొందురే
    కోరకమున్నె మేలునొనగూర్చెడివారలె,క్రూరచిత్తులౌ
    నేరము జేయకుండీనను నేరము మోపుచు హింసజేయునౌ
    వారిని దవ్వుగానునుపు బాధ్యత యందరి మీదయున్నదే

    రిప్లయితొలగించండి
  35. దారిని తప్పినట్టి వనితామణి జాడను దెల్సి నీకు నా
    ధారము నౌదునంచు నమితాదరమున్ గొనిపోయి
    యింటికిన్
    వారము దిర్గకుండ కడు పంకిలవృత్తిని ద్రోయనెంచగా
    కోరకమున్నె మేలునొన గూర్చెడు వారలె క్రూరచిత్తులౌ

    రిప్లయితొలగించండి