8, జూన్ 2021, మంగళవారం

సమస్య - 3746

9-6-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై”
(లేదా...)
“దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్”

59 కామెంట్‌లు:

  1. వినువీధిని భాసించుచు
    ఘనమగు వేడిమి నొసగుచు కాంతిగ వెలుగన్
    పనవుచు తాళగ లేకను
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కుల కొకటై

    రిప్లయితొలగించండి
  2. మునుపొకనాఁడు దక్షుఁడు విమూఢతఁ జేయఁగ శైవనింద యా
    తని సుత సైపఁజాలక పదంపడి యాగపు టగ్నిలోఁ బడన్
    జని ఘన వీరభద్రుఁ డటఁ జండత నెల్లరఁ గొట్టుచుండఁగా
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్.

    రిప్లయితొలగించండి
  3. సమస్య :
    దినమణి యేడు గుర్రములు
    దిక్కున కొక్కటి పారె భీతితోన్

    ( మేరుగిరీంద్రునిపై క్రోధంతో అత్యున్నతంగా పెరిగి గ్రహాలకు , సూర్యమండలానికి అడ్డుపడిన సందర్భంలో భాస్కరుని రథాశ్వాల పరిస్థితి )

    చంపకమాల
    ------------

    ఘనమగు రౌద్రమే కనుల
    గ్రమ్మగ వింధ్యనగేంద్రవర్యుడే
    గనగన మండు రోషమున
    కాంతులు చిందెడి సూర్యమార్గమున్
    మనమున యోచనన్ విడచి
    మాంద్యుడు చివ్వున నడ్డువెట్టినన్
    దినమణి యేడు గుర్రములు
    దిక్కున కొక్కటి పారె భీతితోన్

    రిప్లయితొలగించండి
  4. అనయమువిస్తరభావన
    కనదుజ్జ్వలకాంతులీనుగరిమనుప్రభువున్
    చెనకనుజాలకపరుగున
    దినమణిగుఱ్ఱములుపాఱెదిక్కునకోకటై

    రిప్లయితొలగించండి
  5. అనువుగ చంద్రుని చేరిరి

    మనమున రవి చేర తలచె మానవులపుడున్

    వణకుచు భయమున తడబడి

    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తలచె' ఏకవచనం, 'మానవులు' బహువచనం... "తలచ" అనండి.

      తొలగించండి

  6. కొనితెచ్చిరేడు గుఱ్ఱము
    లను సినిమా తీయనెంచి రథముకు గట్టన్
    జనులగని భీతిలుచు నా
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కునకొకటై.

    రిప్లయితొలగించండి
  7. కె.వి.యస్. లక్ష్మి:

    కనివిని యెఱుగని రీతిని
    దినకరుడే ప్రజ్వరిల్ల దీప్తిగ నెంతన్
    ఘనమగు వేడిమి తాళక
    దినమణి గుర్రములు పాఱె దిక్కున కొకటై.

    రిప్లయితొలగించండి
  8. వనమున చెట్లు మాడె, భువి వాసులు మాడిరి మండుటెండలన్

    అనువగు చోటు కోరుచును దాగెను చంద్రుడు కాంతి చాటునన్

    కినిసిన కార్తె రోహిణట కీలలు చిమ్ముచు జ్వాల రేపగన్

    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. దనుజునిదానమంతటనుతానుగచేకోనెవామనుండటన్
    కనగనుభాసురంబుగనుకాంతులఁజిందెనువిశ్వరూపమై
    చెనకనుజాలకాపరముచెంగునదూకెనుమిత్రుడయ్యెడన్
    దినమణియేడుగుఱ్ఱములుదిక్కునకోక్కటిపాఱెభీతితోన్

    రిప్లయితొలగించండి
  10. ఘనతవహించిన రావణు
    గనుసన్నల సూర్యుడాది గణములు గూడన్
    మునుపటి పట్టే సడలగ
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై.

    రిప్లయితొలగించండి
  11. అనుదిన మాజ్ఞ మీరక మహా
    ద్భుత వేగముతోడ బోవు యా
    దినకరు ఘోటకమ్ములును దే
    జము మిక్కిలి హెచ్చుచుండగా
    గనుగొని యా రవిగ్రహణ కాం
    తులు, వేడికి తాళలేక నా
    దినమణి యేడు గుర్రములు
    దిక్కునకొక్కటి పారె భీతితోన్

    రిప్లయితొలగించండి

  12. తెనుగున గొప్పచిత్రమును తీయగ నెంచుచు సేకరించెనా
    ఘనుడగు పద్మబాంధవుని గాథను వెంటనె యొంటి చక్ర వా
    హనమును మేటియైన జవనాశ్వములన్ గొని తెచ్చినంత నా
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కునకొక్కటి పాఱె భీతితోన్.

    రిప్లయితొలగించండి
  13. కనుగొని జడిసి కరోనా
    పెను గ్రహమనుకొని, తమను గుభేలున స్వాహా
    యని,మ్రింగునా? యని తలచి
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై

    రిప్లయితొలగించండి
  14. కనిరభిమన్యుని మధ్యం
    దిన మార్తాండునిగ వెలుగు తేజస్విని వం
    చనతో శత్రువు పైబడ
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై

    రిప్లయితొలగించండి
  15. వినుపథికి దెచ్చె సామిని
    దినమణి గుఱ్ఱములు ; పాఱె దిక్కున కొకటై
    పెను తిమిరంపు తెరలు , దిన
    దినమున తప్పక జరిగెడు తీరిదె నెంచన్

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావణాసురుడు ఇంద్రజిత్తు జనన మొందు‌ సమయములో గ్రహములను మంచి‌ స్ధానములో నుంచుటకు ప్రయత్నం చేయుచు రవిని బట్ట బోవు సమయము న ఆతని భీకర రూపము గాంచి ఏడు గుర్రములు పారి‌ పోయెను అను భావన


      జననము‌నొందు పుత్రునకు చావు యెలేక శుభంబు తోడ జీ

      వనము నుకూర్చగా దలచి పట్టె గ్రహమ్ముల నన్నిటిన్ నభం

      బున దశకంఠుడున్, ఘన నభోమణినిన్ గని పట్ట బోవగా

      దినమణి యేడు గుర్రములు దిక్కున కొక్కటి పారెభీతితోన్

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చావు+ఎ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    3. రావణాసురుడు ఇంద్రజిత్తు జనన మొందు‌ సమయములో గ్రహములను మంచి‌ స్ధానములో నుంచుటకు ప్రయత్నం చేయుచు రవిని బట్ట బోవు సమయము న ఆతని భీకర రూపము గాంచి ఏడు గుర్రములు పారి‌ పోయెను అను భావన


      జననము‌నొందు పుత్రునకు చావు నులేక శుభంబు తోడ జీ

      వనము ను గూర్చగా దలచి పట్టె గ్రహమ్ముల నన్నిటిన్ నభం

      బున దశకంఠుడున్, ఘన నభోమణినిన్ గని పట్ట బోవగా

      దినమణి యేడు గుర్రములు దిక్కున కొక్కటి పారెభీతితోన్

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. ఘనవినతాసుతోడ్డయనకారణసంభవవాయుధాటిక
      వ్వననిధిరమ్యసప్తకులపర్వతముల్ భువి వీడి నింగిలో
      పెనుకొను తూలరాశులన భిన్నఫథమ్ముల బర్వు లెత్త నా
      దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్,

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  18. మునుపు ననూరు డిట్లనియె భూమిని నొక్క ప్రదేశమందునన్
    గనుమని చూపుచున్ రవికి క్రౌర్యము దాల్చిన సింహ మొక్కటా
    వనమున సంచరించ గని ప్రాణము నిల్పుకొనంగ నల్లదే
    దినమణి! యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్.

    రిప్లయితొలగించండి
  19. కనుగొని తోక వాడొకడు కాలుని మాదిరి చేరువై గబా
    లునతమ నేడు గుర్రముల లొట్టలు వేయుచు మ్రింగివే యు నా
    యని, హనుమంతుడాయినుని యాంతము మ్రింగగ రాగ బాలుడై
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...యినుని సాంతము మ్రింగగ" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు! మీ సూచన శిరోధార్యము.

      కనుగొని తోక వాడొకడు కాలుని మాదిరి చేరువై గబా
      లునతమ నేడు గుర్రముల లొట్టలు వేయుచు మ్రింగివే యు నా
      యని, హనుమంతుడాయినుని సాంతము మ్రింగగ రాగ బాలుడై
      దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్

      తొలగించండి
  20. కందం
    ఇను నడ్డిన సైంధవుడున్
    జని బయటకు వచ్చు ననుచు చక్రాయుధమున్
    బనిచెడు హరిఁ గని భయమున
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై!

    చంపకమాల
    తనయునిఁ జంపు వ్యూహమునఁ దానొక కారణమైన సైంధవున్
    దునుమఁగ నెంచు పార్థునకు తోడుగ నుండెడు గృష్ణుడున్ సుద
    ర్శన మిను నడ్డ వైచిన ప్రచండ తదాయుధ ధాటి నత్తఱిన్
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్!

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. తనతీక్ష్ణ మయూఖములకు
      ననూరుడట తాళలేకనటమటపడుచున్
      తనపట్టునుసడలించగ
      దినమణి గుఱ్ఱములు పాఱెదిక్కున కొకటై

      తొలగించండి
  22. కనుమదె తొలిమల దాటెను
    వినువీధిని సాగె రథము విభ్రాజితమై
    గన నలువంకల దానై
    దినమణి గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై

    రిప్లయితొలగించండి
  23. దినమును నిచ్చును మనకిల
    దినమణి, గుఱ్ఱములు బాఱె దిక్కునకొకటై
    యనిలో శరముల ధాటికి
    మనగం గాభయము గలిగి మలములు పారన్

    రిప్లయితొలగించండి
  24. పనిగట్టుకుకబళించగ
    కనలుచురాహువరుదెంచ గగనమునందున్
    మనమున బెదరుచు వడిగా
    దినమణి గుఱ్ఱములుపారెదిక్కులకొకటై

    రిప్లయితొలగించండి
  25. రిప్లయిలు
    1. చనిచని వేగముగ నలయ
      దిన మధ్యము సేరినంతఁ దీక్ష్ణతరముగాఁ
      గనలఁగఁ జేయఁ బ్రచండుఁడు
      దినమణి, గుఱ్ఱములు పాఱె దిక్కున కొకటై


      పనిగొని యంత మార్కొని నభస్సద ముఖ్యుల నొక్క రొక్కరిం
      దన వర వీర్య దర్పమునఁ దంపి నిమిత్తము సూర్య లోకముం
      గొనకొని రావణాసురుఁడు క్రూర మనస్కుఁడు ముట్టడింపఁగా
      దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్

      తొలగించండి
  26. పనుపగ శంకరుండవని పంచగ వెల్గుల దూర్పుదిక్కునన్
    దినమణి యేడుగుఱ్ఱములు దిక్కునకొక్కటి బారె; భీతితో
    కనుగవ మూసికొన్నవట కల్వలు తాళక నుగ్రదీప్తులన్
    చనువున విచ్చుకొన్నదట సారససంఘము మిత్రసంగతిన్

    రిప్లయితొలగించండి
  27. అనయము దౌడుతీయుచును నచ్చెరువందగ వెల్గునిచ్చుగా
    దినమణి,యేడుగుఱ్ఱములు దిక్కునకొక్కటి పాఱె భీతితోన్
    వనమున సింహమున్ గనగ బచ్చికమేయుచునొక్కసారిగా
    దనువులు జల్దరించగను దద్దరివోవుచుభీషణాకృతిన్

    రిప్లయితొలగించండి
  28. కనుగొన నాత్మ వీడగనె కాంతులు చిందుట యాగి పోవగా
    వెనుకనె మాయ సందుకొన వేగమె యైదగు నింద్రియమ్ములున్
    మనమును బుద్ధియున్ గలసి మానవ దేహము వీడెనే! అహో
    దినమణి నేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతి తోన్!

    రిప్లయితొలగించండి
  29. చం:

    చనగను పిల్ల లెల్లరును స్పర్ద యటంచని గీయ చిత్రముల్
    మనసున తోచు చిత్తరువు మన్నిక మేర రచించు మంచనన్
    నొనరిక గూర్చి రొక్కటిగ నొద్దిక సూర్యుడి బొమ్మ నివ్విధిన్
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పారె భీతితోన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  30. కొన నమృతమ్ముదేవతలు కూర్మిని రక్కసమూక దన్నుతో
    వనధిని త్రచ్చగా మలచి పామును త్రాడుగ కొండ కవ్వమున్
    గొని రయమ్మునన్ విషము కుండలి క్రక్కె మహాగ్నిగా వెసన్
    దినమణి యేడు గుఱ్ఱములు దిక్కున కొక్కటి పాఱె భీతితోన్

    రిప్లయితొలగించండి