2, మార్చి 2022, బుధవారం

సమస్య - 4008

3-3-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు”
(లేదా...)
“గురువుల దైవమూర్తులని కొల్చినవారికి దక్కుఁ గష్టముల్”

37 కామెంట్‌లు:

  1. విలువదెలిసినవాడునైవిద్యయందు
    ఎరుకద్రోణునిగురువుగనేర్చినాడు
    దక్షిణాంగుష్ఠదానముతాల్మినిచ్చె
    గురువులనుదైవములనుచుగొలువదగదు

    రిప్లయితొలగించండి
  2. పాఠముల జెప్పకుండుట పాఠశాల
    గామిడిలకు వినతినుండి గాయుగొఱకు
    కొంతమంది విద్యార్థుల గూడబెట్టు
    గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు

    రిప్లయితొలగించండి

  3. అర్థ సాధనె లక్ష్యమై స్వార్థపరులు
    ముక్తి పథమును బోధించు పూజ్యులమను
    కపట సన్యాసు లైనట్టి గరిడిముచ్చు
    గురువులను దైవములనుచు గొలువదగదు.

    రిప్లయితొలగించండి
  4. మహిమలను జూప గలమం చు మభ్య పెట్టి
    తస్క రించగ నెంతురు ధన చయమ్ము
    జాగ రూకత తో నుండి జనులు కపట
    గురువులను దైవము లనుచు గొలువ దగదు

    రిప్లయితొలగించండి
  5. మొదట తలిదండ్రి పిదపను మ్రొక్కు బోధ
    "గురువుల, దైవములనుచుఁగొలువఁ దగదు
    బాధ గురువుల వెసనాల పాలుజేసి
    మూర్తి మత్వము మరిచేరు మూర్ఖులగుచు.

    రిప్లయితొలగించండి
  6. అరసిననర్ధకామములుహంగునుజూపుచునివ్వటిల్లగా
    గరువపువిద్యలన్నియునుకైవసమయ్యెనుగూడిగుర్వుకున్
    శరణముగోరివచ్చిననుసాగవుశిష్యునినీతినీమముల్
    గురువులదైవమూర్తులనికొల్చినవారికిదక్కుకష్టముల్

    రిప్లయితొలగించండి
  7. తిరముగ నమ్మివచ్చు గురుదేవునివద్దకు
    శిష్యకోటికిన్
    నిరతము మూఢనమ్మకపు నీతులు
    సెప్పుచు స్వార్థబుద్ధితో
    గరముగ భూములాస్తులను గైకొన
    మోసముచేయు ధూర్తలౌ
    గురువుల దైవ మూర్తులని గొల్చినవారికి
    దక్క గష్టముల్

    రిప్లయితొలగించండి
  8. విద్య నేర్పని వాడైన వేల్పుటొజ్జ
    కుటిలబుధ్ధిని చూపుచు కోరెనుగద
    ఏకలవ్యుని వ్రేలుని నెగ్గుతలచి
    గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు

    రిప్లయితొలగించండి



  9. వరముల నిచ్చువారమని పాపుల బ్రోచుచు నిశ్చయమ్ముగా

    పరమపదమ్మొసంగు ప్రతిపత్తును బోధన సేసెడిన్ జగ

    ద్గురువుల మంచు చెప్పుకొను కుంభిరు లెందరొ, కూటవృత్తులౌ

    గురువుల దైవమూర్తులని కొల్చినవారికి దక్కుఁ గష్టముల్.

    రిప్లయితొలగించండి
  10. చం.మా.
    నిరతము శిష్యబృందముల నెమ్మిని జూపుచు దీర్చిదిద్దుచున్
    చిరమగు జ్ఞానబోధనలు క్షేమము గూర్పగ నందజేయగన్,
    మరువగ నట్టిమార్గమును మాయకు జిక్కుచు సాగిబోవుచున్
    *గురువుల దైవమూర్తులని కొల్చినవారికి దక్కుఁ గష్టముల్*

    రిప్లయితొలగించండి
  11. భక్తితత్త్వము బోధించు శక్తిపరుడు
    గురువు దైవముగానెంచి కొలువదగును
    స్వార్థచింతనతో దొంగస్వాములైన
    గురువులను దైవములనుచుఁ గొలువఁ దగదు

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    పార్థుఁడన ద్రోణునకు పక్షపాతమెసఁగ
    బొమ్మ గురుఁడయ్యు నంగుటమిమ్ముగఁగొనె
    నేకలవ్యుని వైకల్యమిచ్ఛయైన
    గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు

    చంపకమాల
    గరిమను బొంద స్వార్జితముగన్ గురునేర్పడనుంచి బొమ్మగన్
    మెరయఁగ నస్త్ర విద్యలను మీరకయుండ గిరీటి, నంగులిన్
    దురమున నేకలవ్యు కడ ద్రోణుఁడు వొందెను మత్సరించెడున్
    గురువుల దైవమూర్తులని కొల్చినవారికి దక్కుఁ గష్టముల్!

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    ఆది శంకరులను తూల నాడు జనులు
    వాసి కెక్కెడి దినములు, వాడు వీడు
    ఎవడు గురువని నిందించి వెక్కి రించ
    గురువులను దైవములనుచు గొలువ దగదు

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. గురువులను దైవములనుచు గొలువ దగదు
    గురువు సాక్షాత్తు పరబ్రహ్మ నిశ్రుతి పలుకు
    వినియు గొలువ దగదనుట వెఱ్ఱి దనము
    పూజ నీయులే గురువులు పుడమి యందు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం, యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  15. గురువన నంధకారమును గూర్చు వినాశము, వెల్గు రేఖలన్
    కరుణను నింపు మానసము క్రన్నన ముక్తిపథంబు గాంచగన్
    గురుతరబాధ్యతన్మరచి గొప్పలుబల్కెడు మోసకారులౌ
    గురువుల దైవమూర్తులని కొల్చినవారికి దక్కుఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
  16. అండ దండల నీతం డొసంగు చుండు
    గండములను ఖండించు నితండ యంచు
    దండములు వెట్టు చుండి పాషండ చండ
    గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు


    పురజన సర్వ జానపద పుంగవ పామర పండి తాలినిన్
    సురుచిర వేష భాష లవి చొప్పడ మోసము సేయు చుండఁగా
    గురు తర బోధన ప్రభలఁ గ్రూర మనస్కుహ నైక చింతనా
    గురువుల దైవ మూర్తు లని కొల్చిన వారికి దక్కుఁ గష్టముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. తేటగీతి సవరణముతో

      అండ దండ లొసఁగు చుండు మండితుండు
      గండములను ఖండించు నితండ యంచు
      దండములు వెట్టు చుండి పాషండ చండ
      గురువులను దైవము లనుచుఁ గొలువఁ దగదు

      తొలగించండి
  17. నిరతము గల్గు సంపదలు నేరుగ బ్రీతిని గౌరవంబుతో
    గురువులు దైవమూర్తులని కొల్చినవారికి,దక్కు కష్టముల్
    నిరతిని బూజజేయకను నెమ్మిని మంత్రము నుచ్చరించకే
    యరకొర మానసంబునను నర్చన జేయుచు నుండు వారికిన్

    రిప్లయితొలగించండి
  18. భక్తి భావముతోడను వాసిగాను
    కొలువగావలె సత్యము కువలయమున
    *గురువులను దైవము లనుచుఁ, గొలువఁ దగదు”*
    మోసపుచ్చగ నరుదెంచు మునులనెపుడు

    రిప్లయితొలగించండి