8, మార్చి 2022, మంగళవారం

సమస్య - 4014

9-3-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్”
(లేదా...)
“కాయంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్”

45 కామెంట్‌లు:

  1. హేయముగాదెశరీరము
    ఆయువుదీరినయదియునునాహుతియగుగా
    కాయునుజన్మనుయశమను
    కాయమేసుస్థిరమునిలచుకల్పాంతమునన్

    రిప్లయితొలగించండి
  2. మాయమగు నందు రార్యులు
    కాయమె : సుస్థిరము నిలుచు కల్పాంతమునన్
    శ్రేయము గూర్చెడు పనులవి
    ధీయుతులై యొనరింప దేదీప్య ముగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. చివరి పాదంలో ధీయుతుఁ లై సల్పు నట్టి అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  3. శ్రేయంబౌనుగజన్మమీధరనుశోభిల్లసద్భావనల్
    చేయన్జూడుడుదానధర్మములునీచేతన్శుభంబందగన్

    ఆయాకాలములందునిల్చునిదియేయానంబుతోడన్యశ
    క్కాయంబేకదసుస్థిరంబునలచున్గల్పాంతకాలంబునన్
    ఆయాకాలములందునిల్చునిదియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *శోభిల్లంగ సద్భావనల్... తోడన్ యశఃకాయంబే...* అనండి.

      తొలగించండి
  4. కందం
    ఆయుర్దాయము దీరఁగ
    దోయమ్మునముంచి జగము దుర్వార మహా
    మాయ, వటపత్ర శాయి, ని
    కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్

    (నికాయము = పరమాత్మ)

    శార్దూలవిక్రీడితము
    ఆయుర్దాయము దీరెనంచన జగద్యాప్తుండు వెంటాడుచున్
    దోయమ్మందున ముంచి సర్వజగమున్ దుర్వారమౌ లీలలన్
    మాయన్ సూ! వటపత్రశాయి మెరయన్ మన్మోహనాకారిదౌ
    కాయంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్

    రిప్లయితొలగించండి
  5. మాయురె!జీవంబుండగ
    చేయగవలె సత్క్రియలు సుశీలముతోడన్
    కాయంబస్థిరము యశః
    *కాయమె సుస్థిరము నిలుచు కల్పాంతమునన్.*

    రిప్లయితొలగించండి

  6. మాయామేయ జగత్తిది
    ప్రాయమశాశ్వతముగాదె, ప్రార్థించుము శ్ర
    శ్రేయసముగోరి సామిని
    కాయమె సుస్థిరము నిలుచు గల్పాంతమునన్?

    రిప్లయితొలగించండి
  7. కాయముశాశ్వతమగునా
    మాయోపాయమున గడనమదిశాశ్వతమా
    పాయక నార్జించు యశః
    కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శ్రేయము గూర్చెడి"

      తొలగించండి
    2. కందం
      మాయామోహిత జీవుల
      కాయమ్ములను తనలోన గలుపుకొనంగన్
      శ్రేయము గూర్చెడి కాలుని
      కాయమె సుస్థిరము నిలుచు గల్పాంతమునన్.

      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      తొలగించండి
  9. గాయపడి నాశమగునది
    కాయమె ; సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్
    మాయము గాకుండు యశము
    ప్రాయము పూర్తిగ నొనర్చ పరజన హితమున్

    రిప్లయితొలగించండి
  10. శ్రేయోదాయకమగునా
    కాయము శాశ్వతమనుకొని గదురుట వలనన్
    బాయక సత్కర్మముల ని
    కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్

    రిప్లయితొలగించండి
  11. తోయంబుల్ మును రంతిదేవుఁడిడె సంతోషించఁజండాలుడున్
    కాయంబుందెగ కోసి యిచ్చె శిబియే కాదా!కపోతార్థమై
    హా!యింద్రా!యని కుండలాలు కవచంబా కర్ణుఁడిచ్చెన్ యశః
    కాయంబే కద సుస్థిరంబునిలుచున్ గల్పాంత కాలంబునన్.

    రిప్లయితొలగించండి

  12. ప్రాయంబన్నది శాశ్వతంబనుచు తాభావింటి భోగాలకై

    న్యాయాన్యాయమటంచు నెంచక సదా యర్థంబు సాధించుటే

    ధ్యేయంబై బ్రతుకీడ్చుచుండు శఠుడా హీనుండు వాచించినే

    కాయంబే కదసుస్థిరంబు నిలుచున్ గల్పాంత కాలంబునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భావించి' టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. కం.
      పాయక సేవల నిడుచును
      శ్రేయము దలచగ నరులను శ్రీహరి గనుచున్
      ధ్యేయము నొనర్చెడి యశః
      *కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్*

      తొలగించండి
    2. శార్దూలము.
      శ్రేయోదాయకమైన చింతనములన్ శ్రీపాద సంసేవలన్
      మాయాధాత్రిని జిక్కువారికిని సన్మార్గంబు బోధించుచున్
      ధ్యేయంబౌగను దీనరక్షణముచే దీరమ్ము జేర్చన్యశః
      *కాయంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్*

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ధేయంబౌ గన ... అనండి.

      తొలగించండి
  14. మాయాపూరిత మీ జగమ్ము, గలవే మాణిక్య వజ్రంబులున్
    వైయర్థ్యంబును డాంబికంబు మనికిన్ బంగారు రూప్యమ్ములున్
    యీ యావల్ కడు భార మయ్యొ తలచన్ యీశాను డర్థంబు నా
    కా యంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రూప్యమ్ములున్+ఈ, తలచన్+ఈశాను' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  15. పాయక సత్యము నెపుడును
    న్యాయముగా దనదు వృత్తి నైక్యతతోడన్
    జేయునొ నిరతము నాతనీ
    కాయమె సుస్ధిరము నిలుచు గల్పాంతమునన్

    రిప్లయితొలగించండి
  16. ప్రాయంబంతయు లోభమోహములనున్
    బాటించుకన్నిత్యమున్
    సాయంబున్నొనరించనట్టిజనులున్
    సత్యంబుతో మెల్గుచున్
    జేయంగా దగు దానధర్మములనున్
    జెన్నందుగా నాయశ:
    కాయంబే కద సుస్థిరంబు నిలుపున్
    కల్పాంత కాలంబునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాయంబున్ + ఒనరించ' ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి.

      తొలగించండి
  17. పాయక యెన్నఁడు నా నా
    రాయణు నచ్యుత మయిన నిరంతరము మహా
    మాయా లీలల వెలిఁగెడు
    కాయమె సుస్థిరము నిలుచుఁ గల్పాంతమునన్


    ఆయా లోకము లెల్ల నేక మయి బ్రహ్మాండంబు మున్గంగ నా
    తోయం బందు మహోగ్రమౌ ప్రళయమే తూర్ణంబు నేతెంచఁగాఁ
    బ్రాయంబం దరయంగ బాలుఁ డగు నా పద్మాక్షు నిత్యంబునౌ
    కాయంబే కద సుస్థిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్

    రిప్లయితొలగించండి
  18. న్యాయంబున్విడనాడ కెప్పుడును దాయాదృచ్ఛికం బందనౌ
    సాయంబెప్పుడు జేయుచుండుచును నాసాంతంబు వర్తించునా
    కాయంబేకద సుస్ధిరంబు నిలుచున్ గల్పాంతకాలంబునన్
    శ్రేయంబే యొనగూరు దప్పక యికన్ శ్రీకాంతు దాక్షిణ్యతన్

    రిప్లయితొలగించండి