16, మార్చి 2022, బుధవారం

సమస్య - 4022

17-3-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా”
(లేదా...)
“అరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్”

15 కామెంట్‌లు:

  1. కందం
    పరులై మనలోఁ జెలఁగుచు
    దురితులుగా మార్చి వగయఁ దోషము వాపున్
    దొరకొని వీడగ నెంచఁగ
    నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      పరులై మానసమందునన్ జెలఁగి నిర్భాగ్యమ్మునందించుచున్
      దురితమ్ముల్వొనరించి మించి మన సంతోషమ్ములన్ బాపెడున్
      గురణమ్మందున దైవభక్తిఁ గొనుచున్ గోల్పోవగా వీడ న
      య్యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్

      తొలగించండి
  2. అరయంగ పతన కారణ
    మరిషడ్వర్గమ్ము; మోక్ష మందించుఁ గదా
    సరియగు ధర్మపు నడవడి
    పరిపూర్ణముగా వహించి పాటింపంగన్

    రిప్లయితొలగించండి
  3. తఱిగనిసాధనమందున
    పొరిపొరిబాధలవలననుపొందగసుఖమున్
    నరుడునుజేయుడుగాగా
    అరిషడ్వర్గమ్ముమోక్షమందించుగదా

    రిప్లయితొలగించండి
  4. అరికట్ట వలెను గద మనుజు
    డరిషడ్వర్గమ్ము ; మోక్ష మందించుఁ గదా
    పరమముపయి నమ్మకమున
    బరులకు సేవ సలుపుటయె భాజనమనుటన్

    రిప్లయితొలగించండి
  5. నరులకు పతనము గదరా
    యరి షడ్వర్గమ్ము : మోక్ష మందించు గదా
    నిరత ము దైవ పు చింతన
    పర సేవా గుణము గలిగి పరగుట వలనన్

    రిప్లయితొలగించండి
  6. హరినామస్మరణమ్మున
    హరియించును పాతకమ్ము లతి శీఘ్రముగా
    హరియన్నఁ జాలును దొలఁగు
    నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా

    రిప్లయితొలగించండి

  7. నిరతము విడువక చేసెడు
    హరినామస్మరణ మరియు నసహాయజనో
    ద్ధరణము తోడను వీడిన
    నరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా.


    కరుణన్ జూపెడు భావకుని నిష్కామంబుతో గొల్చి దె

    ప్పరమున్ జిక్కినపేదవారికిల యాపద్బంధువై సాయమున్

    నిరతమ్మందగ జేయుచున్ వసుధలో నిస్వార్థుడై వీడి య

    య్యరిషడ్వర్గము, మోక్షసాధనము నందించు సాహాయ్యమున్.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మరులు గొనక నహమించక
    మురినులిమి కసివిడి లోభమోహ మడచుచున్
    హరి నామము జపియించగ
    అరిషడ్వర్గమ్ము మోక్షమందించుఁ గదా.

    విరలిన్ తక్కువజేయుచున్ పగటునావేశాది గర్వోన్నతిన్
    వరుసన్ మానుచు మోహలోభములు సంప్రస్థానమున్ పొందకున్
    హరిపై చిత్తము నిల్పుచున్ గొలువ మాయాదేహ చింతల్ జనున్
    అరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్

    రిప్లయితొలగించండి
  9. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    దురితావేశము లన్నిటిన్ దునుమగా దూరంబునౌ శోకముల్
    పరిహారంబొనరించగా వలయు లోభామోహ మాత్సర్యముల్
    పరితాపంబున మంచి సల్పగను నీబాహ్యంపు దేహమ్ముతో
    అరిషడ్వర్గము మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్.

    రిప్లయితొలగించండి
  10. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    దురితావేశములన్నిటి
    పరిహరణ మొనర్చి సతము పరిణితి తోడన్
    పరితాపమొంది మనగను
    అరిషడ్వర్గమ్ము మోక్షమందించు గదా!

    రిప్లయితొలగించండి
  11. కరమౌభక్తిని శౌరి పూజనములన్ గావించుచున్ నిత్యమున్
    స్థిర సంకల్పముతోడ పేద జనులన్ సేవించుచున్ బ్రోచుచున్
    వరమౌనంచును సత్యమార్గమును సంభావించుచున్ వీడగా
    నరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్

    రిప్లయితొలగించండి
  12. ధరలో మిక్కిలి కష్టము
    చరియింపఁగ సంయమమున సాధువు వోలెన్
    నరునకు నిష్ఠ జయించిన
    నరిషడ్వర్గమ్ము మోక్ష మందించుఁ గదా


    మరలన్ నేరవు లోభ మోహ మద కామక్రోధ మాత్సర్యముల్
    నర లోకమ్మున సంతతం బొసఁగు సంతాపమ్ము మర్త్యాలికిం
    గర మాసక్తినిఁ జేయ నా పనియె యే కార్యమ్ము ఖండించు నా
    యరిషడ్వర్గము మోక్షసాధనమునం దందించు సాహాయ్యమున్

    రిప్లయితొలగించండి
  13. కందం
    అరయ నరుని చెడగొట్టును
    అరిషడ్వర్గమ్ము ,మోక్ష మందించు గదా
    హరిని దలచి మదిన నిలిపి
    నిరంతరము తప మొనర్చి నియతిగ మనినన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. హరియే దైవము జీవులెల్లరకు తాహర్షంబుజేకూర్చు శ్రీ
    హరి నామస్మరణంబునన్దొలఁగునాహాయిత్యముల్ నిచ్చలున్
    హరి దైన్యంబున సొక్కువారలయెడన్నాపన్నుడై, బాపగా
    నరిషడ్వర్గము, మోక్షసాధనమునందందించు సాహాయ్యమున్

    రిప్లయితొలగించండి