19, మార్చి 2022, శనివారం

సమస్య - 4025

20-3-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేదమ్మును రూప మాపవే యశమందన్”
(లేదా...)
“వేదము రూపు మాపవలె విస్తృతకీర్తి గడింపఁ గోరినన్”

17 కామెంట్‌లు:


  1. ఆదరువు లేదటంచును
    వేదన చెందంగనేల విజ్ఞత తోడన్
    సాధింపగవచ్చునిక ని
    ర్వేదమ్మును రూపుమాపవే యశమందన్.

    రిప్లయితొలగించండి
  2. వాదముపదునైనది ప్రతి
    వాదంబయ్యె పటుతరము పరికింపంగా
    వాదంబులు తెమలుచు సం
    వేదమ్మును రూపు మాపవే యశమందన్

    రిప్లయితొలగించండి
  3. జోదుగమార్పునుచూపగ
    వాదమ్మునువనితజేసెబాధనుజూపెన్
    వేదనప్రగతినిగనెనుగ
    వేమ్మునురూపుమాపవేయశమందున్

    రిప్లయితొలగించండి
  4. రాదు గతించు కాలమిక
    ప్రాయము నిల్వగబోదు నేస్తమా!
    నీదియు నాదియన్న దిట
    నిత్యముగాదు సుమీ! గణింపగన్!
    బ్రోది గొనంగ కాలము వి
    లోకన మందుచు సాగ నెప్డు ని
    ర్వేదము రూపు మాపవలె
    విస్తృతకీర్తి గడింపఁ గోరినన్!

    రిప్లయితొలగించండి

  5. భేదము చూపిరే జనులు పేదనటంచు సమాజమందునన్

    ఖేదమె ప్రాప్తమయ్యెనని క్లేశము నందుట మానుమంటినే

    సాధన తోడసత్ఫలము జక్కొను నన్నది సత్యమేను ని

    ర్వేదము రూపుమాపవలె విస్తృత కీర్తి గడింపగోరినన్.

    రిప్లయితొలగించండి
  6. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో....

    కందం
    కాదని సంధికి మిము దా
    యాదులు యుద్ధమ్మునెంచ నాప్తులటంచున్
    రోదింపక మోహిగ ని
    ర్వేదమ్మును రూప మాపవే యశమందన్!

    ఉత్పలమాల
    కాదని సంధికిన్ దమను కర్కష బుద్ధిని ధిక్కరించి దా
    యాదులు యుద్ధమెంచ మది నాప్తులటంచును మోహమందితే?
    రోదన మేల ఫల్గుణ! విరోధుల జాలినిఁజూచు నీదు ని
    ర్వేదము రూపు మాపవలె విస్తృతకీర్తి గడింపఁ గోరినన్!

    రిప్లయితొలగించండి
  7. వాదనలెన్నిజేసిననుభావనకందడునిర్వికారుడై
    మేధకుజిక్కడేగదరమేటిగనుండునువిశ్వమంతటన్
    వేదనతోడనాతనినివేడుటయొక్కటెమార్గమెంచగన్
    వేదమురూపుమాపవలెవిస్త్తృతకీర్తిగడింపగోరినన్

    రిప్లయితొలగించండి
  8. లేదని బాధను గుంద క
    మోదము తో రామ నామ మురిపము గాగన్
    పాదుగ జపి యించుచు ని
    ర్వే దమ్మును రూపు మాప వే యశ మందున్

    రిప్లయితొలగించండి
  9. మోదీ పరిపాలన యా
    వేదన బూర్తిగ నెరుంగవే ! స్వచ్ఛత పై ;
    మోదముగ నింటిని దుడువ
    వే ! దమ్మును రూప మాపవే యశమందన్

    రిప్లయితొలగించండి
  10. మోదమునందగ హృదయము
    ఖేదముదరిచేరనీక కృపణత్వముతో
    భేదమ్ములనెంచక ని
    ర్వేదమ్మును రూపు మాపవే యశమందన్

    రిప్లయితొలగించండి
  11. భేదములెంచనేల నిరుపేద ధనాఢ్యుల మధ్య నీవిధిన్
    పేదలుకూడ మానవులు పీడితులైరి సమాజమందునన్
    మోదముగూర్చి వార లనుమోదము నొందెడు రీతి వారి ని
    ర్వేదము రూపు మాపవలెవిస్తృతకీర్తి గడింపఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  12. కం.
    వాదన లందున మునుగుచు
    చేదుగ మార్చక బ్రతుకును,జింతన తోడన్
    పాదుగ హరి సేవలఁ ని
    ర్వేదమ్మును రూప మాపవే యశమందన్

    ఉ.మా.
    చేదుగ మారనీయకుమ!చిన్నది జీవిత మెంచిచూడనా
    వాదనలందు కాలమును వ్యర్థము సేయక,
    శ్రేష్ఠమౌ గతిన్
    పాదుగ వేంకటేశ్వరుని భక్తిగ గొల్చెడి బాటపట్టి, ని
    ర్వేదము రూపు మాపవలె విస్తృతకీర్తి గడింపఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  13. ఆదరమున్ ఘటించి కడు నల్పుల తన్పుచు సేవనమ్ములన్
    వేదన మాన్పుచున్, సతము విష్ణు భజించుచు చిత్తశుద్ధితో
    సోదర భావమున్ బరుల చూచుచు నీమదిలోన గల్గు ని
    ర్వేదము రూపు మాపవలె విస్తృతకీర్తి గడింపఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  14. ఒక్క గమనిక:
    కంద సమస్యా పాదములో రూప మాపవే (రూపము+ ఆపవే ) అని యున్నది, వృత్త సమస్యా పాదమునకు భిన్నముగా.
    దీని కనుగుణముగాఁ జేసిన పూరణము. ముద్రా దోష మారోపింపకుండ.

    వా దోప వాదముల నీ
    వాదరమున నాపి యింక నానందముగా
    నీ దౌష్ట్యపు, మన్నించుచు
    వేదమ్మును, రూప మాపవే యశ మందన్


    కాదన కెన్నఁడే నఖిల కార్య పరంపర లందు నీతినిన్
    సాదర ధర్మ రీతి ననయమ్మును నిల్పుచు నుండ మే లగున్
    నీ దగు భార తావనిని నిత్య మనీతిని భారతీయ సం
    వేదము రూపు మాపవలె విస్తృత కీర్తి గడింపఁ గోరినన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    ఖేదము బొందక వైరుల
    సూదనమొనరించగ తగు సూచన బొందెన్
    కాదనక ఫల్గునుడు ని
    ర్వేదమ్మును రూపు మాప వే యశమందన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  16. నీ దరి దాపు రానివకు నేస్తమ మోసమ
    సత్య చింతనల్
    సాదరమొప్ప నందరిని సన్మతితోడను
    గౌరవించుమీ
    బాదలు లేక్కజేయకుము భారములెల్ల
    సహించుమయ్య ని
    ర్వేదము రూపుమాపవలె విశ్రుత కీర్తి
    గడించ గోరినన్

    రిప్లయితొలగించండి