21, మార్చి 2022, సోమవారం

సమస్య - 4027

22-3-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తురకలలో భూమిసురులు దూరెదరింకన్”
(లేదా...)
“తురకలలోన బ్రాహ్మణులు దూరెద రింక విచారమేటికిన్”

17 కామెంట్‌లు:


  1. గరిమగల వింతయగు మం
    దిరమా? యందు నిదురింప దేవత లెల్లన్
    వరమీయగ వరుసగ వ
    త్తుర కలలో? భూమిసురులు దూరెదరింకన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    తిరుమల వాసుండె మతాం
    తరముగ మనువాడ బీబి నాంచారిని యా
    తరుణిని దర్శింపఁ జనెడు
    తురకలలో భూమిసురులు దూరెదరింకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      మురిపెము మీర మెచ్చెనని ముస్లిము బీబి వివాహమై మతాం
      తరముగ వేంకటేశ్వరుడు తాళిని గట్టెనటంచుఁ జూడ సుం
      దరునిఁ బరాత్పరున్ గొలువ దర్శన భాగ్యము నెంచి వచ్చెడున్
      దురకలలోన బ్రాహ్మణులు దూరెద రింక విచారమేటికిన్?

      తొలగించండి
  3. అఱకొఱబ్రదుకునబాధను
    విరియనిగంధసుమముగనువేగుచుభువిలో
    సరిగనునాథుడులేమిని
    తురకలలోభూమిసురులుదూరెదరింకన్

    రిప్లయితొలగించండి
  4. సురలను సేవించి మిగుల
    పర సేవా ద్రు క్పథ మున పరగెడు వారై
    ధరలో మసలె డు వారే
    తురకలలో భూమి సురులు దూరెద రింకన్?

    రిప్లయితొలగించండి

  5. గరిమను గల్గినట్టి యుపకారికమా యది? యెవ్వరేని రా

    తిరి సమయంబునన్ మదిని ధీవుని దల్చుచు నిద్రపోయినన్

    వరముననుగ్రహింప శివపార్వతులే కరుణించి జేర వ

    త్తుర కలలోన? బ్రాహ్మణులు దూరెదరింక విచారమేటికిన్.

    రిప్లయితొలగించండి
  6. పురము నందీదినముల
    కరోన వ్యాపించుచుండ కట్టడి జేయన్
    నెరవగు పద్ధతి నెంచగ
    తురకలలో భూమిసురులు దూరెదరింకన్

    రిప్లయితొలగించండి
  7. సరియగు ముహూర్తమందున
    సురుచిర సుందరినిగూడు శోభనమనగా
    మరి యాత్రమేల విరహా
    తుర! కలలో భూమిసురులు దూరెదరింకన్

    రిప్లయితొలగించండి
  8. తిరుమల నాథునిన్ వలచి తీరగు భక్తిని సేవ చేయుచున్
    స్థిరమగు నిచ్చతుర్క సకి చేరను, శౌరిని ధర్మ భాగినై
    వరమని యెంచి ముస్లిములు ప్రార్థన చేయగ చిత్తశుద్ధితో
    తురకలలోన బ్రాహ్మణులు దూరెద రింక విచారమేటికిన్

    రిప్లయితొలగించండి
  9. నిరతము వేదాధ్యయనము
    జరుపుచును నమశ్శివాయ జపతత్పరులై
    వరలుదురు, మాంసము భుజిం
    *తుర!కలలో భూమిసురులు?
    దూరెదరింకన్.*

    నిరతము వేదమంత్రముల నిష్ఠఁబఠించుచు శిష్యకోటికిం
    గరపుచు యజ్ఞయాగముల కామితముల్ నెరవేరజేయరే
    యరరె!యహింస మేలనరె!యామిషముందిని మద్యమారగిం
    *తుర!కలలోన బ్రాహ్మణులు?దూరెదరింక విచారమేటికిన్.*
    దూరు=నిందించు

    రిప్లయితొలగించండి
  10. కం:సరి యగు విప్రులు దూరరు
    తురకలలో, భూమిసురులు దూరెద
    రింకన్
    వర మగు విప్రత్వమ్మును,
    పరతత్త్వపు విద్య,నూత్న భావాగ్నుల చేన్.
    (నూతన భావాగ్నుల చే విప్రత్వం ఇంకటం వలన చేరతారు అని భావం.)

    రిప్లయితొలగించండి
  11. చం:తురక లనంగ మత్తులును,ధూర్తు లటంచు దలంచ న్యాయమే?
    అరి యని తానిషా ననక యక్కన,మాదన వంటి విప్రులే
    పరమహితమ్ము గూర్చిరయ పాలన యందున ధర్మ మున్నచో
    తురకలలోన బ్రాహ్మణులు దూరెదరింక విచారమేటికిన్

    రిప్లయితొలగించండి
  12. పరవశమున విరిశరముల
    దొర విసరిన బాణతతులు తొయ్యలి యెదలో
    గురిఁగొని నాటెను విరహా
    తుర కలలో భూమిసురులు దూరెదరింకన్

    రిప్లయితొలగించండి
  13. పరమాత్ము మహిమ యట్టిది
    వర కృమి విల యార్థము తెఱవక యున్న గుడిన్
    సురలఁ గొలువ గుడిలోనఁ జ
    తుర! కలలో భూమిసురులు దూఱెద రింకన్

    [తూఱు = చొచ్చు]


    తర తమ భేధముం దలఁచి తర్కము సేసిన లాభ ముండునే
    ధరఁ బ్రజ గౌరవింప నిజ ధర్మము మేలు నిరంతరమ్మునుం
    దిరుగుచు మాని పూజలను దిట్ట తనమ్మున నీవు సొచ్చినం
    దురకలలోన బ్రాహ్మణులు దూఱెద రింక విచార మేటికిన్

    [దూఱు = తిట్టు; విచారము = ఆలోచనము]

    రిప్లయితొలగించండి
  14. కందం
    పరశువు చేతనె భృగుపతి
    ధరణిన క్షత్రియ జనుల మద మడచి వేయన్
    దరదము మొదలయ్యెను పగ
    తుర, కలలో భూమిసురులు దూరెదరింకన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  15. నిరతము జీవనంబుకడు నిర్భయమొప్పగ
    సాగకుండినన్
    గరము బలాఢ్య వర్గముల క్రన్నన హింసలు
    వెట్టుచుండినన్
    తరచుగ బ్రాణహాని గని తత్యము మారుచు నుందురిద్ధరన్
    తురకలలోన బ్రాహ్మణులు దూరెదరింక
    విచారమేటికిన్

    రిప్లయితొలగించండి