3, ఏప్రిల్ 2022, ఆదివారం

సమస్య - 4040

4-4-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రావణమ్మున వచ్చు వసంతఋతువు”
(లేదా...)
“శ్రావణ మాసమందున వసంతము వచ్చును సంతసమ్మునన్”

15 కామెంట్‌లు:

  1. పుష్కలావర్తకంబులపుష్కలముగ
    కురియువానలుపుడమినికుండనిండ
    శ్రావణమ్మున;వచ్చువసంతఋతువు
    కోకిలమ్మలుపాడగకొండకోన

    రిప్లయితొలగించండి
  2. కొత్తగా వివాహంబైన కోడె జంట
    మదన సామ్రాజ్య సీమలో మలగుచుండ
    నడ్డు నిలచిన యాషాడ మంతమొందె
    శ్రావణమ్మున వచ్చు వసంతఋతువు

    రిప్లయితొలగించండి
  3. జ్యేష్ఠమున వచ్చు గ్రీష్మంబు చెలియ!పిదప
    కర్షకులు మెచ్చుకొనునట్లు వర్ష ఋతువు
    *శ్రావణమ్మునవచ్చు; వసంత ఋతువు
    చైత్ర వైశాఖ మాసాల శ్రీలనిడును.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    నెలలు నిండఁగ పుత్రిక కలలుపండె
    మావిపిందెల వాసంతమావహించి
    రాగమలరెడు గైవడి మాగృహమున
    శ్రావణమ్మున వచ్చు వసంతఋతువు!

    ఉత్పలమాల
    దేవర మావిపిందెలను దీర్పగ సృష్టి వసంత శోభలన్
    పావనమై తరింపదె! వివాహము సేకొని పుత్రి గర్భమై
    జీవన మాధురిన్ గనఁగఁ జేకురు భాగ్యము! మాగృహమ్మునన్
    శ్రావణ మాసమందున వసంతము వచ్చును సంతసమ్మునన్!

    రిప్లయితొలగించండి

  5. అనుజ! తెలుపుము కృష్ణాష్టమదియె వచ్చు
    మాస మేదంటి? నెపు డలిమకము కూయు
    తాను మధురముగా నన సమాధానమిచ్చె
    శ్రావణమ్మున వచ్చును, వసంత ఋతువు.



    పావనమైన జంద్యమును పారులు దాల్చెడు మాసమెద్దియో?

    కోవెల గాత్రమందు కడు కోమల రాగము పల్కు నెప్పుడో?

    పూవుల నెట్లుజేరు బమిపుర్వది పుప్పొడి గ్రోలనెంచుచున్?

    శ్రావణమాసమందున, వసంతము, వచ్చును సంతసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  6. వర్షము కురిసి రైతుకు హర్షమొసగు
    శ్రావణ మ్మున:వచ్చు వసంత ఋతువు
    చైత్ర మందున ప్రతి యేట చక్కనైన
    హాయి నొసగును జనులకు హ్లాద ముగను

    రిప్లయితొలగించండి
  7. శ్రీవిలసిల్లగా వెడల గ్రీష్మము;వచ్చును వానకారు,శో
    భావహమౌను నింగి బకపంక్తులతో జలదమ్ములొప్పగా
    *శ్రావణమాసమందున;వసంతము వచ్చును సంతసంబునన్*
    పూవిలుకాడు తోడవ ప్రమోదముతో గళమెత్త కోకిలల్.

    రిప్లయితొలగించండి

  8. దేవకి గర్భవాసమున ధృత్వుడె పుత్రుడు గా జనించు నత్తరిన్

    తావులనీను పూవులవి దండిగ, ధారుణి రాలు ప్రేమతో

    నా వనధీశునిన్ గనుచు నభ్రగముల్ ముదమందు గాదుటే

    శ్రావణ మాసమందున వసంతము వచ్చును సంతసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  9. వానలు కురియ మొదలిడు పగలు ఱేయి
శ్రావణమ్మున : వచ్చు వసంతఋతువు
    చైత్రమున , చెట్లు చిగురించి చక్కనుండు
    పృథివి. పచ్చదనముతోడ వెల్లివిరియు

    రిప్లయితొలగించండి
  10. విరహవేదన జలదమై వితతమంది
    యశ్రుధారలై కురిసెనా యతివ కనులు
    చెలుని రాకతో ముదమొంది చెలియగాంచె
    శ్రావణమ్మున వచ్చు వసంతఋతువు

    బావనెడబాసి మల్లితాఁ బ్రతుకజాల
    ననుచు కన్నుల నీరిడినంతలోనె
    బావరాకతో మనసాయెఁ బరవశించి
    శ్రావణమ్మున వచ్చు వసంతఋతువు

    రిప్లయితొలగించండి
  11. శ్రావణ శుక్రవారమున సంతసమిచ్చుచు నింటబుట్టెఁ శ్రీ
    దేవియె కూతురై, శివుని దీవెనలే ఫలియించె, నాడె నా
    జీవితమందెనే మధుర చేతనలన్, ప్రతి వత్సరంబునన్
    శ్రావణ మాసమందున వసంతము వచ్చును సంతసమ్మునన్||

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    వర్ష ఋతువు యనదగును వసుధ నందు
    శ్రావణమ్మున ,వచ్చు వసంత ఋతువు
    చైత్ర వైశాఖ మాసాల సరసన ,కడు
    రమ్య మది చెట్లు చిగురించి రంగు నిలుచు.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  13. కుండపోతగ వర్షముల్ గురియుగాదె
    శ్రావణమ్మున, వచ్చు వసంతఋతువు
    చైత్ర వైశాఖములయందు, సంతసమును
    గొల్పు చుండును లేతచి గురులతోడ

    రిప్లయితొలగించండి
  14. ప్రియము వాసంతికి వసంత ఋతువు కరము
    ప్రీతియౌ వసంతకు వర్ష ఋతువు భృశము
    చైత్రమునఁ గనిపింప వాసంతి ఋతువు
    శ్రావణమ్మున వచ్చు వసంత ఋతువు


    ఈ వనితా మతల్లి స్వర మేమని చెప్పుదుఁ గోకిలస్వరం
    బే వినిపింపు మంచడుగ నింపుగఁ దాఁ దన కెట్టి రాగముల్
    రా వని చెప్పి శ్రావ్యముగ రాగము నొక్కటి నాలపింపఁగా
    శ్రావణ మాస మందున వసంతము వచ్చును సంతసమ్మునన్

    [వసంతము = వసంతరాగము]

    రిప్లయితొలగించండి
  15. ఆవరలక్ష్శి దేవికిల నాదర మొప్పగ బూజ జేతురే
    శ్రావణమాసమందున ,వసంతము వచ్చును సంతసమ్మునన్
    బావన చైత్ర మాసమున బండుగ వోలెను వాసికెక్కుచున్
    నీవన భూమికిన్సుధల నీయగ వత్సరవత్సరంబునన్

    రిప్లయితొలగించండి