13, ఏప్రిల్ 2022, బుధవారం

సమస్య - 4049

14-4-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ”
(లేదా...)
“కన్నులు మూడు రామునకుఁ గాంతలు నల్వురు పుత్రు లేవురున్”

19 కామెంట్‌లు:

  1. తరచి చూడ శివునకు వదనము‌ నందు

    మూడు కన్నులు కలవు, రామునకు గనగ

    నొక్క బాణము మరియు నొక్క భార్య

    గాదె యానాటి త్రేతాయు గమ్ములోన

    రిప్లయితొలగించండి
  2. రాజ్యపాలనఁజేసెడు రాజునకును
    చారచక్షువు నామంబు సార్ధకంబు
    రెండు కన్నులతోఁనది యుండెగాన
    మూడు కన్నులు గలవు రామునకుఁగనగ.

    రిప్లయితొలగించండి

  3. గంగను జడలో దాల్చిన జంగమయ్య
    పాంశు చందనుడా భూరి భానువునకు
    మూడు కన్నులు గలవు, రామునకు గనగ
    శక్తి గలిగిన చాపమ్ము శార్ఙ్గమదియె.




    జన్నపు వేటగానికట చక్షువు లెన్నియొ? గాడ్పుపట్టి తా

    పన్న యెవండకంటిని? సభర్తృక లెందరు సవ్యసాచికిన్?

    మన్నియ పాండురాజు పృథ మాద్రుల కెందరు పుత్రులంటినే

    కన్నులు మూడు, రామునకుఁ, గాంతలు నల్వురు, పుత్రులేవురున్.

    రిప్లయితొలగించండి
  4. ఎన్నగ చారచక్షువుగ నిమ్మహి పాలనఁజేసె గావు నన్
    కన్నులు మూడు రామునకు,కాంతలు నల్వురు,పుత్రులేవురున్
    అన్నువ సీతతోఁగలిసి యాభువి,కీర్తి,సిరుల్ నిజాంగనల్
    పిన్నలు నిర్వురున్ మరియు ప్రేమ,దయా,శరణమ్ము సంతగున్.

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ప్రక్క ప్రక్కన నొక్కటే ప్రాంగణమున
    నాటకాలెన్నియైనను నటులు వారె
    హరుడె రాముడుగా మారఁ బరుగువెట్ట
    మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ!

    ఉత్పలమాల
    ఎన్నియొ పాత్రలన్ మిగులనింపుగ వైచు నటుండుఁ గాఁగనన్
    బన్నె త్రయంబకుండుగను పంక్తిరథుండుగ పాండురాజుగా
    నెన్నగ 'నేడు దాశరథి!' నెల్లరు మెచ్చ గతంపుపాత్రలన్
    కన్నులు మూడు 'రామున'కుఁ గాంతలు నల్వురు పుత్రు లేవురున్

    రిప్లయితొలగించండి
  6. మరుని శరమది సోకగా వెరగు పడియు
    రుద్రు దహియింప దెలిసెను రూఢి గాగ
    మూడు కన్నులు గలవు : రామునకు గన గ
    నొక్క పత్నియు శరమది యొక్క టె గద !

    రిప్లయితొలగించండి
  7. శశిధరుండగు త్రిపురారి శంకరునకు
    మూడు కన్నులు గలవు, రామునకుఁ గనఁగ
    నొక్కటేమాట యొకబాణ మొక్కయింతి
    ధర్మనిరతికి పుడమినాదర్శమతఁడు

    రిప్లయితొలగించండి
  8. జాయకై నిరీక్షణమున కాయ కన్ను
    చెలగు పరనారి సొగసుపై శీతకన్ను
    కనిన దుర్మార్గములపైన కపిలకన్ను
    మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ

    రిప్లయితొలగించండి
  9. వశయు భ్రాతయు తోడుగ వనముకు చన
    వనములందుండు మృగముల బారి నుండి
    తమ్ము డొకకంట నగ్రజు దడవుచుండ
    మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ

    రిప్లయితొలగించండి
  10. తిన్నగ రాజ్యపాలనము దీరుగ సేయగ రామచంద్రునే,
    యెన్నగ సోదరుల్ ముగురు నెల్లను గాంచరె భూతలంబునన్
    వన్నెను గూర్చు కీర్తిలత, పార్థివి,రాజ్యము ధైర్య లక్ష్మి, రా
    మన్నకు నాంజనేయ, సరమాపతి, సూర్యజు,తమ్ములిర్వురున్,
    సన్నుత రాజభూషణుడు, సత్యుడు రాముని యెంచి చూడగా,
    కన్నులు మూడు రామునకు గాంతలు నల్వురు పుత్రులేవురున్.

    పార్థివి-సీత
    సరమాపతి-విభీషణుడు
    సూర్యజుడు-సుగ్రీవుడు
    తమ్ములిర్వురు-భరతలక్ష్మణులు

    రిప్లయితొలగించండి
  11. ఎన్నగ పార్వతీపతికినెన్నియొ చక్షువు? లేరికీ భువిన్
    పన్నుగ మారుతాత్మజుడు పావని జానకి జాడదెల్పెనో?
    క్రన్నన రాఘవానుజులకాంతలు, పాండవ పుత్రులెందరో?
    కన్నులు మూడు రామునకుఁ గాంతలు నల్వురు పుత్రు లేవురున్

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    పార్వతీ మనోహరుడైన భార్గవునికి
    మూడు కన్నులు గలవు ,రామునికి గనగ
    నొక్క సతి సీత ,వాకము నొక్క టగును
    ధర్మ పాలన మందు నాదర్శు డతడు.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  13. యోగినిర్ణిద్రశక్తినియౌవనమున
    కాంచనిగ్రహంబుగనగముక్తి
    తీక్ష్ణదృష్టినితేజంబుతేటపడగ
    మూడుకన్నులుగలవురామునకుగనగ

    రిప్లయితొలగించండి
  14. సోమశంకరు ముఖమును జూడు రమ్య!
    మూడు కన్నులు గలవు,రామునకు గనగ
    నొక్కబాణము బత్నియు నొక్కతెగద
    మానవాకార మెత్తిన మహితుడతడు

    రిప్లయితొలగించండి
  15. పన్నగభూషితాంగునకు వాసిగ త్ర్యంబక నామమేలనో
    చెన్నుగ నాత్మజన్ ముదిత సీతనిడెన్ జనకర్షి యేరికో
    యెన్న గిరీటి పత్నులటులెందరు పుత్రులు పాండురాజుకున్
    కన్నులు మూడు; రామునకుఁ; గాంతలు నల్వురు; పుత్రు లేవురున్

    రిప్లయితొలగించండి
  16. అన్నరొ యేమియీ కఠిన మైనపదంబుల భావజాలముల్
    విన్నది కన్నదెచ్చటను వేమరు పాటుననైన లేదుగా
    కన్నులు మూడు రామునకు గాంతలు నల్వురు పుత్రులేవురున్
    సన్నుతి జేయగ దగును చంద్రునిబోలెడు రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  17. ఇంతి తొందర యెక్కువ సుంత నీకుఁ
    జెంత కేఁగి వీక్షింపుమ వంత యేల
    వీఁక లే వని చెప్పిన నీకుఁ గీడు
    మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ


    తిన్నగ నేఁగి సత్వరము దిట్టతనమ్మున వీడి చింతనుం
    గ్రన్ననఁ జూపు వైద్యునకు రామ!వచించిరి యిట్లు చక్కఁగా
    నన్నుల మిన్న నీ సతికి నంచిత రీతిని నిశ్చయమ్ముగాఁ
    గన్నులు మూడు రామునకుఁ గాంతలు నల్వురు పుత్రు లేవురున్

    [మూడు = కలుగు; కాంతలు = స్త్రీలు ]

    రిప్లయితొలగించండి
  18. పరమశివునకు మోమున వాసిగాను
    *"మూడు కన్నులు గలవు రామునకుఁ గనఁగ”*
    గలవు మూడు లక్షణములు ఘనముగాను
    నొక్క భార్యయు,బాణము నొక్క మాట.

    రిప్లయితొలగించండి