16, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య - 4052

17-4-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా”
(లేదా...)
“ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ”

19 కామెంట్‌లు:

  1. అజుఁడునునివ్వెరఁబోవుచు
    గజగజవణకుచుతడబడిగాంచగసృష్టిన్
    విజనునసీరియలుండగ
    ప్రజలకుపద్యములతోడఁబనిలేదుగదా

    రిప్లయితొలగించండి
  2. కందం
    సృజియించి వేమనవలెన్
    బ్రజాప్రయోజనమునెంచు భాధ్యతఁగొనఁగా
    నజరామరమౌ! కావన
    ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. చంపకమాల
      సృజనము వేమనార్యువలె చేసిన పద్యము బాగుబాగనన్
      సుజనుల నాల్కలన్ మెదలి చూపు నుదాహరణమ్ము వేడ్కగన్
      భుజములకెత్తి బాధ్యతగఁ బూని కవిత్వము రంగరింపకే
      ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ!

      తొలగించండి
  3. సృజనలక్రొత్తదారులనుచాలగఁజూపుచునుండనెట్టునున్
    భజనలనాటపాటలనుభావములందునవింతపోకడల్
    అజుడునుకానరాడుగదనాతనిమేథనుసీరియల్కథల్
    ప్రజలకుపద్యకావ్యములవల్లఁబ్రయోజనమున్నదాకవీ

    రిప్లయితొలగించండి
  4. సృజనకు మూలము లగుచున్
    సుజనుల మెప్పును బడయుచు శోభించు గదా
    నిజమది కాదందురు గా
    ప్రజలకు పద్యముల తోడ బనిలేదు గదా !?

    రిప్లయితొలగించండి

  5. సుజనుల నైనను ధనమది
    కుజనులు గను మార్చుచుండె కువలయమందున్
    నిజముగ ధనమే చాలను
    ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా!



    నిజముఁ గ్రహించి చెప్పితిని స్నేహితుడా విను వాస్తవమ్మిదే

    విజయము దాగియుండెనిల విత్తము నందె యటంచు నెంచి య

    క్కజముగ పొందుటే తెలివి కాడికి చెల్లునటంచు నమ్మెడిన్

    ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ

    రిప్లయితొలగించండి
  6. ప్రజలకు హితమును గూర్చెడి
    సుజనులు కావ్యములు వ్రాయు సుకవులు ధరలో,
    కుజనులు కనరాని తరిని
    ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా

    రిప్లయితొలగించండి
  7. నిజమగు దైవభక్తజన నెయ్యము గూర్పని ప్రాసలేలయా?
    సుజనుల నింద సేసి కడు సుందర రీతి గణంబులొప్పి, స
    ర్వజనుల గాచు పావనుని, పంకజనాభుని దల్పనట్టి యా
    ప్రజలకు, పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ?

    రిప్లయితొలగించండి
  8. విజయము నొందిన పక్షము
    ప్రజాప్రభుత్వమని మద్యపానపు కైపున్
    నిజముగ ప్రబలము సలుపగ
    ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా

    రిప్లయితొలగించండి
  9. అజుని గొలిచి ముక్తి బడయ
    భజనలు గావించు చుండి వందిం చుటకున్
    నిజము నరయ సామాన్యపు
    ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా

    రిప్లయితొలగించండి
  10. కం.
    సృజనకు దొరకని బలుకుల
    గజిబిజి ధ్వనులకు నలవడి గంతులు వేయన్
    నిజమగు విలువలు కానని
    *ప్రజలకుఁ బద్యములతోడఁ బని లేదు కదా*
    చం.మా.
    నిజమగు సంపదల్విడచి నీరస భావము తాండవించెడిన్
    సృజనల నేర్చికూర్చగను జింతన లందున మున్కవేయుచున్
    గజిబిజి రాగముల్వినుచు గంతులు వేసెడి మత్తులోబడన్
    *ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ*

    రిప్లయితొలగించండి
  11. సృజన యొనర్చవేమకవి చెన్నగుపద్యములన్ సుబోధకై
    ప్రజల రసాల వర్తిలె నవారితమౌగతి పెక్కు వర్షముల్
    కుజనుల మెప్పుకోసమయి కూర్చుచు కైతల వెల్వరించినన్
    ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ

    రిప్లయితొలగించండి
  12. నిజమే సాంకేతికతో
    ప్రజల యవసరములుఁదీరి పైకమురాగా
    సృజియింతురె? కావ్యంబులు
    ప్రజలకుఁబద్యములతోడఁబనిలేదు కదా!

    ప్రజలకు భుక్తి రక్తులను పద్యములీయగలేవు నేడు,భూ
    భుజులు గతించినారు జగమొక్కటిగానయె యంత్రజాల మ
    క్కజముగ వ్యాప్తిఁజెందెను సుఖంబుగ జీవనయాత్ర సాగగా
    ప్రజలకు పద్యకావ్యములవల్ల ప్రయోజనమున్నదా?కవీ!

    రిప్లయితొలగించండి
  13. కందం
    సుజనులకై శతకములన్
    సృజించె పలు కవులు పద్య చింతన తోడన్
    వృజినంపు భావ లోకపు
    ప్రజలకు పద్యముల తోడ బని లేదు కదా.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    వృజినము-వక్రము

    రిప్లయితొలగించండి
  14. ప్రజల హితమ్ము ధ్యేయముగ వ్రాయు కవిత్వము వన్నెగూర్చు భే
    షజముగ నిష్ప్రయోజనపు సంధి సమాసపు యార్భటంబుతో
    సుజనుల మెప్పుపొందుటకు శుష్క విచేష్టలు సల్పి వ్రాయుచో
    ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ

    రిప్లయితొలగించండి
  15. ప్రజ కేల పట్టు బట్టలు
    ప్రజ కేల విభూషణములు భవ నావలియున్
    నిజము పరికింప శూన్యమ
    ప్రజలకుఁ బద్యముల తోడఁ బని లేదు కదా


    సృజన కొసంగు దోహదము శీఘ్రముగా హరియించు డెందమున్
    నిజము వచింపఁ బద్యమున నేర్చిన పాఠము నిల్చు నిత్యమున్
    ఋజువుగ పెద్ద భావముఁ గుదింప నగున్ విను మింకఁ జెప్పుమా
    ప్రజలకుఁ బద్య కావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ

    రిప్లయితొలగించండి
  16. నిజమరయగ దెలిసెనుభూ
    ప్రజలకు పద్యములతోడ పనిలేదుకదా
    ప్రజలకు ధనమే ముఖ్యము
    నిజమును నేబల్కు చుంటి నీరజ నేత్రీ!

    రిప్లయితొలగించండి
  17. ప్రజలకు పద్యకావ్యముల వల్లఋబ్రయోజనమున్నదాకవీ!
    నిజమును జెప్పుమిత్తఱిని నీతులదెల్పెడు నట్టివేయయున్
    సృజనత బెంచుచుండియును శ్రేష్ఠులజేయును నెల్లవారలన్
    గుజనునీ సైతమున్వడిని గోవిదుజేయు నిజ్జగంబునన్

    రిప్లయితొలగించండి
  18. సుజన సమాదరంబు బరిశుద్ధ విచార మనఃప్రవృత్తియున్
    నిజ పరమార్థమీ జగతి నిర్మల వర్తనమంచు జాటకన్
    భజన పరాయణంబు నరపాలుర ప్రస్తుతి మేలు దల్చినన్
    ప్రజలకు పద్యకావ్యముల వల్లఁ బ్రయోజన మున్నదా కవీ

    రిప్లయితొలగించండి