21, ఏప్రిల్ 2022, గురువారం

సమస్య - 4057

22-4-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్యనుఁ గనిరి ముగ్గురు గనిరి యశము”
(లేదా...)
“కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తికాములై”

34 కామెంట్‌లు:


  1. పెండ్లిచూపుల కొరకంచు వేడ్కగాను
    తల్లి దండ్రులతో తాను తరలి యచట
    కన్యనుఁ గనిరి ముగ్గురు, గనిరి యశము
    కట్నమన్నది వలదంచు కరుణ జూపి.



    కన్యకు బెండ్లిసేయుటకు కట్నము నివ్వగ లేరటంచు నా

    కన్యను కన్నవారు బరికట్టెలటంచు నెఱంగి తల్లియున్

    జన్యువు తానునేగిరచట చక్కదనమ్మున చంద్రబింబమౌ

    కన్యను ముగ్గురాదరముగా గని రిమ్ముగ గీర్తికాములై.

    రిప్లయితొలగించండి
  2. చ్యవన మహర్షి భార్య సుకన్య వృత్తాంత నేపథ్యంగా..

    తేటగీతి
    చ్యవనునకొసంగి చూపును యౌవనమ్ము
    నశ్వనీదేవతలటులె యగుపడంగ
    పతిని జగదాంబ దయ గుర్తు పట్టెనన సు
    కన్యనుఁ గనిరి ముగ్గురు గనిరి యశము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ఉత్పలమాల
      కన్యక విష్ణువర్ధనుని కాదని యాపగ రక్తపాతమున్
      బుణ్యసతీలలామవలె మున్గగ నగ్నిని దంపతాళితో
      ధన్య చరిత్రయంచనుచు దారల గూడి త్రిమూర్తులాదెసన్
      కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తికాములై

      తొలగించండి
    3. గురుదేవులకు కవిమిచ్రలందరికీ నమస్కారము.
      తేటగీతి మూడవ పాదంలో 'జగదంబ' గా చదువుకొన ప్రార్థన.

      తొలగించండి
  3. హితులు చలనచిత్రము జూసి
    యిళ్ళ కేగు
    తరుణమందు నొక స్పృహ దప్పియున్న
    కన్యనుఁ గనిరి ముగ్గురు ; గనిరి యశము
    నామె నాసుప త్రికి జేర్చ నత్తరముగ

    రిప్లయితొలగించండి
  4. విఱ్ఱ వీగు చొకడు వెకిలి చేష్ట సలుప
    కన్య గనిరి ముగ్గురు :గనిరి యశము
    వాని బారి నుండి పరి రక్షణ ను జేసి
    యామె సేమ మరయ నపుడు వారు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి, రెండవ, నాల్గవ పాదాలలో గణభంగం. మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  5. అన్యమనస్క కాక దమయంతి, నలుం మగడంచుఁ నెన్న, సౌ
    జన్యమెఱింగి పశ్చిమదిశాధిపుఁ, డగ్ని, యమాదులున్, మహో
    పన్యసితవ్యమౌనని సభాంతర మందున జాటిచెప్పుచున్,
    కన్యను ముగ్గు రాదరముగా గని రిమ్ముగ గీర్తికాములై.

    ఉపన్యసితవ్యము -ఉపన్యసింపదగినది,చెప్పుకోదగినది (ఆంధ్రభారతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'నలున్ మగడంచు' అనండి.

      తొలగించండి
  6. నన్నయ తొలుత మొదలిడె వన్నెకెక్కి
    చక్క దనమున లిఖియించె తిక్కనకవి
    యెర్రన విశిష్ట కూర్పుతో యెట్టి కావ్య
    కన్యనుఁ గనిరి ముగ్గురు గనిరి యశము

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అన్నదమ్ములు చెల్లెలు యమితమైన
    శ్రమము జేయుచు చక్కగ చదువు చుండి
    వార్షిక పరీక్షలందు సంబరమిడు జయ
    కన్యను గనిరి ముగ్గురు గనిరి యశము.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అన్యమునైన చింతనయె నాత్మను గూడక నన్నదమ్ములున్
    కన్యగ బిల్చు సోదరియు ఖ్యాతిగ నభ్యసనమ్మొనర్చియున్
    ధన్యతగూర్చు వార్షికపు ధర్మ పరీక్షను వ్రాసి వారు జే
    కన్యను ముగ్గురాదరముగా గనిరిమ్ముగ గీర్తికాములై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సవరణలు చూడండి.

      తొలగించండి
  9. అర్థరాతిరి యేకాంతమందునొక్క
    కన్యనుఁ గనిరి ముగ్గురు, గనిరి యశము
    దుండగీడుల చెఱయందు దుఃఖపడెడు
    నామె మానముఁ గాపాడినందువలన.

    రిప్లయితొలగించండి
  10. కవులకును కీర్తిఁదెచ్చును కావ్య కన్య
    నన్నపార్యుఁడు,తిక్కనెఱ్ఱన్న కవులు
    బళిర!ముద్దుగ తెన్గున భారతాఖ్య
    కన్యనుఁగనిరి, ముగ్గురు గనిరి యశము.

    రిప్లయితొలగించండి
  11. ధన్యుఁడునయ్యె నన్నయ నిదానముగా తెనిగించి ముందుగా
    మాన్యుడునయ్యె తిక్కన సమంచిత రీతిరచించి, ధీనసా
    మాన్యుఁడు నెఱ్ఱనే గద సమాప్తముఁజేసెను భారతాఖ్యమీ
    కన్యను ముగ్గురాదరముగాఁగనిరిమ్ముగ కీర్తి కాములై.

    రిప్లయితొలగించండి
  12. ఉత్పలమాల
    కన్యక విష్ణువర్ధనుని కాదని యాపగ రక్తపాతమున్
    బుణ్యసతీలలామవలె మున్గగ నగ్నిని దంపతాళితో
    ధన్య చరిత్రయంచనుచు దారల గూడి త్రిమూర్తులాదెసన్
    కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తికాములై

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    రాశి చక్ర బలము జూచి రైతు తనయ
    కన్యను గనిరి ముగ్గురు ,గనిరి యశము
    వధువును వివాహమాడిన వరుడు వారి
    దల్లి దండ్రులు మిత్రులు ధరణి నేలి.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. ధన్యుఁడు నన్నయార్యుడు నుతంబుగ భారత మాంధ్ర మందు రా
    జన్యుని ప్రోది మేకొని ప్రశస్త మహాకృతి నాంది బల్కగా
    మాన్యుడు తిక్కనార్యుడు గ్రమంబుగ నెర్రన పూరగించి, వాక్
    కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తికాములై

    రిప్లయితొలగించండి
  15. ధన్యులువారు సత్కవులు ధారుణి ధర్మము ప్రోదిచేయు సౌ
    జన్యముతోడ వ్యాసముని జ్యాయుని భారత మాంధ్రమందునన్
    మాన్యతనొప్ప వ్రాసి తలమానికమట్టుల తీర్చిదిద్దనా
    కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తికాములై

    రిప్లయితొలగించండి
  16. ముగ్గురు కవిత్వ సారము నగ్గలముగ
    నేర్చి నట్టి వారు ఘనులు నేర్పరు లయి
    డెంద మలర వర్ణించిరి సుందరంపుఁ
    గన్యనుఁ గనిరి ముగ్గురు గనిరి యశము


    మాన్యులు విప్ర వర్యులు సమస్తపు వ్యాకరణమ్ము నం దసా
    మాన్యపు లక్ష్య కావ్యము సమంచిత మానవ ధర్మ సారమున్
    ధన్యులు పండితోత్తము లుదాత్తపు టాంధ్రపు భారతమ్ము నా
    కన్యను ముగ్గు రాదరముగాఁ గని రిమ్ముగఁ గీర్తి కాములై

    రిప్లయితొలగించండి
  17. తే.గీ:చక్కగా నున్న పంచాంగ జాతకముల
    నెల్లరున్ దమ రాశుల నెంచి చూడ
    కన్యను గనిరి ముగ్గురు కనిరి యశము
    కన్యకున్ యశ మను పల్కు కల్ల కాక.

    రిప్లయితొలగించండి
  18. ఉ:అన్యఖగోళ సంఘముల యద్భుతముల్ గను తృష్ణ తో నసా
    మాన్యులు శాస్త్రవేత్త లభిమానపు రాశుల నెంచి చూడగా
    కన్యను ముగ్గు రాదరము గా గని రిమ్ముగ గీర్తి కాములై
    మాన్యత నొంది రొక్క యసమాన విశేష మెరుంగ జాలుటన్.
    (నక్షత్ర రాశుల పై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే కన్యారాశి పై పరిశోధన చేసిన వారికి కీర్తి దక్కింది.అక్కడ క్రొత్త విషయాలు తెలిశాయి.)

    రిప్లయితొలగించండి
  19. కన్యకు పెండ్లి జేతునని కన్నియ తండ్రియె
    చెప్పగ విన్నవారలా
    కన్యను జూడ బోవగను కాటుక కన్నుల
    సుందరాంగినిన్
    మాన్యత నిచ్చి వారలకు మాన్యుడు
    చూపెను గన్నకూతురున్
    కన్యను ముగ్గు రాదరముగా గనిరిమ్ముగ
    కీర్తికాములై

    రిప్లయితొలగించండి
  20. పెళ్ళి చూపులయందున తృళ్లిబడెడి
    అందచందాలకన్యలు విందునన్ సు
    కన్యనుగనిరి ముగ్గురుకనిరియశము
    గాంచినచదువులందిన గౌరినచట.

    రిప్లయితొలగించండి
  21. పెండ్లి చూపులకంచును వేడ్కతోడ
    వరుని తో తల్లిదండ్రులు వడిగనేగి
    *కన్యనుగనిరి ముగ్గురు,గనిరి యశము*
    పెండ్లి ఖర్చులన్నియును తమవేయటంచు

    రిప్లయితొలగించండి