18, జూన్ 2022, శనివారం

నిషిద్ధాక్షరి - 50

19-6-2022 (ఆదివారం)
కాకాసుర వృత్తాంతాన్ని  ప్రస్తావిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
నిషిద్ధాక్షరాలు - కవర్గాక్షరాలు (క, ఖ, గ, ఘ, ఙ)

22 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
సీతఱొమ్ము ముట్టి జిందింప రుధిరమ్ము
మంత్రసంధితమున మారి పోచ
రామచంద్రుడంప బ్రహ్మాస్త్రమైనంత
వాయసాసురుండు వాసె చూపు

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

కంది శంకరయ్య చెప్పారు...

చక్కని పూరణ. అభినందనలు.

BMahalakshmi చెప్పారు...

వాయసంబునుమదమునవాయితోడ
పుండుజేసెనుసీతనుపూతచరిత
రాముడంపినపోచనారాచమయ్యె
అసురుప్రాణంబుదీసెనుహానిపోయె

sarada చెప్పారు...

తేటగీతి
వాయసంబు, రాముని రొమ్ముపై విరామ
మొందు సీతను వేధించ ముదిత బడలె
రామచంద్రుడు బ్రహ్మాస్త్ర నామ వాజి
నంప బామమొంది వెడలెనంత పర్వి.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సీత బాధ నొంద శీఘ్రమె రాముండు
పోచ పంపి నంత పొడిచి చంప
వాయ సమ్ము టు సురు పాసె ను నయ్యెడ
తొలగి పోయె ననుచు తోష పడిరి

విరించి చెప్పారు...


అలసిపోయినరాము డపరాహ్ణ మందున
. సీతమ్మ యొడిలోన సేద తీరు

పాళమందునజేరె వాయసమ్మదియేను
. పొలతి స్తనముపైన పొడుచు చుండ

నదిచూచి రాముడే యంచలమందుచు
. యవసము బట్ట బ్రహ్మాస్త్ర మవగ

ప్రాణముల్ దీసెడు రామబాణమనుచు
. భీతితో పరువిడె పిశునమపుడు


పుణ్యపురుషుడైన పురుషోత్తముని తోడ
వైరమేల యనుచు పారిరెల్ల
చివర పాహియనుచు శ్రీరాముఁ దాజేర
నేత్రహీన యౌచు సూత్రి మిగిలె

Rama Murthy Duvvuri చెప్పారు...

చంపకమాల
అలసటఁజెంది సీతయొడి యందున నిద్దుర వోవ రాముడున్
వలచియురోజ మాంసమును వాయసముందమిఁజీర,నెత్తురున్
ఇల స్రవియించ మైథిలి,నిజేశుని లేప నతండు బ్రహ్మనే
తలచి తృణంబు దూయ నది దైత్యుని నేత్ర విహీనుఁజేయదే!

sitharamayya solasa చెప్పారు...

చిన్ని పిట్టపై రాముడు చిట్టనొంద
వేసె బ్రహ్మాస్త్రమునట , నా విధముజూడ
ప్రియతములనట్లు బాధింప పెను పెలుచన
పుట్టునని బోధపడ సరిపోవు నిదియె

Raja Rao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Raja Rao చెప్పారు...

క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

తే.గీ.
వాయసాసురు డులిపియై వనము నందు
సీత ఱొమ్మును నాటుజేసి బడలించ
బమ్మయమ్మునే పోచలో బవిరిదీర్చి
రాముడట నేత్రమునుదీసె ప్రాంజలించ.

M.B.G.TILAK చెప్పారు...

శ్రీరామ చంద్రుడు సీతామహాసాథ్వి
వనవాస నియమము బట్టియుండ
సంభవించెనిటుల సంభ్రమాశ్చర్యాల
వాయస చరితమై వాసినొంద
మార్తాండ భాసాన మాంసపు తునియల
నెండబెట్టుచునున్న నేలపట్టి
యొరుగుల మనుపున చిరజీవి నదిలింప
పాడుమహానేమి దాడిజేసె

రుధిరమునుజూచి రాముడు రుద్రుడాయె
నడపె వాయసాసురుపైన నలువ తూపు
పిదప శరణన్న వానిపైన దయ జూప
నయన మర్పించి తరియించెను యమ దూత

subbarao చెప్పారు...

సీత యొడిలోన రామయ్య సేద దీర
పుండు జేయు వా యస మును జూచి పోచ
పంప రాముడు ,పొడుచుచు జంపె నపుడు
సూత్రి రూపాన నున్నట్టి యాతివునిల

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి

రామచంద్రుడలసి రమణి సీతయొడిని
పవ్వళించినతరి వాసిగాను
వాయసమ్మవచ్చి వక్షము గ్రుచ్చంగ
వేసెనయనమునకు వేగ తృణము

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

మరొక పూరణ

సీత యెదను గ్రుచ్చ చిందెరుధిరమట
నాగ్రహమ్ముతోడ నామె విభుడు
విసరగరికపోచ వేగ బ్రహ్మాస్త్రమై
చక్షువుతొలగించె క్షణములోన

Rama Murthy Duvvuri చెప్పారు...

సవరణ:రెండవ పాదములో దమిఁజీర"నస్రమే యిల'"

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వింత మో రను మల చెంతను వనవాస మందు సీత యొడిని నంద నిద్ర
రాముఁడు సీత నారట పెట్ట బలిభోజనుండు స్తనము చీల్చి తిండి నెంచి
తల్లడిల్లుచు నుండఁ దరుణి శోణితము స్రవింప భృశము వాయసంపుఁ జేష్ట
నరసి లేచి పతి సురాధిపు సూనుని రోసి బ్రహ్మాస్త్రము వేసె నంత

మూడు భువనముల శరణము వడయమిని
వేఁడ రాముని నేత్రము నూడఁ దీసి
యొండు ప్రాణము తను వందు నునిచి నిలిపె
దాశరథి వాయసమ్మును దయ వహించి

[వింత మోరు = చిత్రకూటము]

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

రామునొడియందు శయనింప రమణిసీత
వాయసాసురుడాయమ వక్షముపయి
పొడువ రోసించి  రాముఁడు పోచఁ విడిచె
వాయసము తన నేత్రమున్ బాసెనంత

A.Satyanarayana Reddy చెప్పారు...

సీతయెడిలోన రాముడు సేదదీఱ
వాలి వాయసాసురు డాలి వత్సమందు
వ్యధము సలిపిన చూచిన యచ్చలమున
ననిపె మంత్రించి దర్భ బ్రహ్మాస్త్రమటుల
శరణు వేడినన్ మదిలోన శాంతినొంది
నేత్రమొండిడు మనిచెప్పి ధాత్రివిభుడు
ప్రాణమును నిల్పి దయతోడ దీనునరచి
శరణ మన్న త్రాతయగుచు దరణి వెల్గె