10, సెప్టెంబర్ 2022, శనివారం

సమస్య - 4187

11-9-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాలములన్నింటను గలికాలము మేలౌ”
(లేదా...)
“కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్”

36 కామెంట్‌లు:

  1. చాలవు కోట్లెన్నైనను
    కీలకమౌపదవినొంది కేనము తోడన్
    పాలనముసేయవలెనన
    కాలము లన్నింటను గలి కాలము మేలౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలదు సంపదెంతయిన చాటుగ మోసము సేయగావలెన్
      మేలుగ కన్నుగప్పియిక మీసము దిప్పుచు నుండగావలెన్
      లీలగ నిత్తరిన్ ధనము లెక్కకు మిక్కుటమై తరింపగన్
      కాలము లందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. వేళా కోళము గాదిది
    కాలము లన్నింటను గలికాలము మేలౌ
    సాలును సాలును గణపతి
    నీరమునం గంగ యొడికి నేరుగ నరుగున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    కాలుని సైతము మఱిపెడు
    వాలకమున్ గలుగు వారి వంచనలెగయన్
    లీలలు గోకొల్లలె! యే
    కాలములన్నింటను గలికాలము మేలౌ?

    ఉత్పలమాల
    కాలుని సైతమున్ దెగువగా మఱిపించెడు దిట్టలౌచు న
    వ్వాలకమున్ రచించు ప్రజ వంచనలందున జిక్కుచుండఁ బె
    న్లీలలు గొల్లలై బ్రతుకు రీతులు నిత్యము మారు చుండ నే
    కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్?

    రిప్లయితొలగించండి

  4. మాలిన్యంబది హెచ్చగ
    పాలసులకు, వివరిణులకు, స్వార్థపరులు, దు
    శ్శీలురులకు నీచులకున్
    గాలములన్నింటను గలికాలము మేలౌ.

    రిప్లయితొలగించండి
  5. కాలము లెన్నియుం డినను గాసుల నార్జన యక్ర మంబుగాఁ
    బాలన మూలముం బ్రభులు పాల్పడు చుండుట కారణంబు నౌ
    కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్
    బాలనఁ జేయువా రకట పాలసు లాయన నుండ చోద్యమే

    రిప్లయితొలగించండి
  6. వీలును జూచి యు మోసము
    లీలగ నొనరింప బూని లేశము గరుణ న్
    జాలిని జూపని వారికి
    కాలము లన్నింటను గలి కాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  7. కందము
    *కాలము లన్నింటను కలి
    కాలము మేలౌ*నె?యొంటి కాలున ధర్మం
    బాలంబన లేకుండును
    హేలగఁదిరుగుదురు జనులు హింసారతులై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మేలుఁదలంపకెవ్వరికి మిక్కిలి మోసముఁజేసి ద్రవ్యమున్
      చాల గడించి, నిత్యము నసత్యములాడుచు,పెద్దవారలన్
      హేళన జేయుచున్ పరమ హింసలొనర్చెడు దుర్జనాళికిన్
      *కాలములందు మేటి కలికాలమెయంచు వచింత్రు పండితుల్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  8. చాలినయంత దోచుకొన జక్కని సందిది
    నాయకాళికిన్
    వీలు లభించు దుష్టులకు భీరువులంజెడ
    గొట్ట మాయతో
    కూలల పొట్టగొట్టి సిరి కుప్పలుబెంచగ
    వచ్చునందుకే
    కాలములందుమేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  9. నేలన జనులను రాక్షసు
    బోలునటుల కష్టబెట్ట పూనుచు సరియౌ
    పాలన జేయట కొరకయి
    కాలములన్నింటను గలికాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  10. మేలును చేసెడి వారిని
    కూలగచేయుచునుసొమ్ము కూర్చుఖలులకున్
    శీలరహితులకు చూడగ
    కాలములన్నింటనుకలికాలముమేలౌ

    రిప్లయితొలగించండి
  11. పాలకు లందునీతి యభిపాతము చెందగ మత్తుమందులో
    తూలుచు మంది సొమ్ములను దొంగిలు చుండగ, నట్టివారి హే
    రాళముగా స్తుతించుచును ద్రవ్యములన్ గొను ధూర్తులైనచో
    కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  12. వేలకువేలవాక్యములు విజ్ఞుడు బ్రహ్మము తెల్పెనంచు నీ
    వేళను జెప్పుచుండెదరు విస్తృతరీతిని కొంద రందులో
    నోలలితాత్ములార! యిదియొక్కటియై వినిపించుచుండె "నీ
    కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్".

    రిప్లయితొలగించండి
  13. కందం
    కాలాతీతుని దేవుని
    వాలెము నామస్మరణము పాటించినచో
    తేలిక విముక్తి దొరకెడి
    కాలములన్నింటను కలికాలము మేలౌ.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి

  14. శుభోదయం
    చాలా రోజుల నుంచి నేను శంకరాభరణం blog ను, అనుసరిస్తున్నాను,
    నాకు తెలుగు భాష మీద అంత అవగాహన లేకపోయినా,,
    మీలాంటి కవులను చూసి,
    తెలుగు భాష అందాన్ని, అవసరాన్ని, గొప్పతనాన్ని తెలుసుకున్నావు
    ఈ వేదికను స్థాపించిన పెద్దలుకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻

    నా ప్రస్తుత చదువు వైద్యరంగానిది( MBBS) అయినా,
    తెలుగు భాషపై కృషి చేయాలన్న, ఆలోచనను
    నాలో కలిగించిన మీ అందరికి ధన్యవాదములు 🙏🏻

    రిప్లయితొలగించండి
  15. ౘాలగ మోక్షము నందన్
    ౙాలగ నా దేవదేవు స్మరణయె‌ ౘాలున్
    లీలగ నడిచెడి యుగముల
    కాలము లన్నింటను గలి కాలము మేలౌ!

    రిప్లయితొలగించండి
  16. మేలాముదమ్ము పాదప
    జాలము లేని జగ మందుఁ జందం బొప్పం
    జాలించుమ యీ సుద్దులు
    కాలము లన్నింటను గలి కాలము మేలౌ

    కాలము లందు మూటి నర కాయము గాంచిన జాడ లేదె యా
    కాలముఁ జూచినట్టి ఘన కాయుఁ డొకండును నేఁడు లేఁడుగా
    మేలుగఁ గాంచి చక్షువుల మేదిని నేఁడు విశంక నిక్కముం
    గాలము లందు మేటి కలి కాలమె యంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి
  17. కాలము నందు గర్వమున కానక చేసిన సర్వపాపముల్!
    కాలుని గర్వమున్ కడకు కంటి వెలుంగుల జేర్చినట్టి యా
    కాలనియంత నుగ్రు ఘను కాశి నివాసుని గాంచ నేదుఁ నే
    కాలము లందుమేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్!!

    రిప్లయితొలగించండి
  18. వీలగు దైవంబును కలి
    కాలంబున దలచినంత గలుగగ మోక్షం
    బీలీల మానవాళికి
    కాలములన్నింటను గలికాలము మేలౌ

    రిప్లయితొలగించండి
  19. లీలగ
    మాయల బల్కుల
    మేలొన రింపగ దలచని ముచ్చట లనగన్
    పాలన జేయు మనుజులకు
    కాలములన్నింటను గలికాలము మేలౌ!!
    .
    లీలగ మాయమాటలను లెక్కకు మించుడసత్యభాషణల్
    హేలగ జేయుచున్ తిరిగి హీనపు జేష్టల నొప్పువారికిన్
    పాలన జేతికందగను పాపము జేయుచు సంచరింపగా
    కాలములందు మేటి కాలము కలికాలమె యంచు వచింత్రు పండితుల్!!

    రిప్లయితొలగించండి
  20. గాలము వైచి మీనమును గ్రన్నన బట్టెడు రీతి వాంఛలే
    గాలములై నిరంతరము గాసిలఁ జేయగ మానసంబునన్
    లాలసలన్ త్యజించి మది రంజిల జేయగ నీ ధరిత్రిపై
    కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్

    రిప్లయితొలగించండి