12, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4189

13-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము”
(లేదా...)
“భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్”

41 కామెంట్‌లు:

seethadevi gurram చెప్పారు...

చేనుల నూరులన్ దడిపి జీవులకీయగ సంతసంబునే
వానలు జోరుగాగురియు భాద్రపదంబున మధ్య
వేళలో
నేనుగు బోలెడున్నసిత మేఘ సమూహము లావరించగా
భానుడు వెల్గుచుండ నొక వంక దమస్సులు గ్రమ్మి
వచ్చెడిన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
మౌని మంత్రమంది మానిని వల్లింప
భువికి దిగియు సుతునిఁ బొందనొసఁగె
పృధయె మ్రాన్పడంగ, వెడలుచు వినువీధి
భానుడు వెలుగంగ, వచ్చెఁ దమము

ఉత్పలమాల
మౌని మహద్వరమ్మనెడు మంత్ర జపమ్ము పఠించినంతటన్
దానుగ భూమికిన్ దిగియు తక్ష్ణమొ సంగెఁ గుమార రత్నమున్
మానిని కుంతి మానసము మ్రాన్ప్రడ, శీఘ్రమె నింగిఁ జేరుచున్
భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

మానవతంబు దప్పక సమాజము సేవ
నొనర్చు తండ్రికిన్
హీన గుణంబుగల్గినవిహీనుడు మూర్ఖుడు
పాపఖర్ముడౌ
దానవుడున్ జనించె గద తప్పడు దారి
చరించువాడు నా
భానుడు వెల్గుచుండ నొకవంక తమస్సులు గ్రమ్మివచ్చెడిన్

subbarao చెప్పారు...

దట్ట మైన మబ్బు తారాప థంబును
నావ హించ దమము వ్యాప్తి చెంది
జగముఁ జీక టయ్యె బగలు కూడయపుడు
భానుఁడు వెలుగంగ,వచ్చెఁదమము

M.B.G.TILAK చెప్పారు...

గ్రహణకాలమందు కనుగొన్న సత్యము
కాంతులీనుచున్న ఖగుడు నాడు
మసకబారుచుకను మరుగగు హదను స్వ
ర్భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జగతి మేలు కొనుచు జవ సత్వముల నొందు
భానుడు వెలుగంగ: వచ్చె దమము
మబ్బు లేర్ప డియును మరుగు జేయ రవిని
గగన మందు చాల కమ్ము కొనగ

Rama Murthy Duvvuri చెప్పారు...

ఆటవెలది
వేగుఁజుక్క పొడిచె వినువీధి యందున
కావు కావు మంచు కాకులెల్ల
*భానుఁడు వెలుగంగ వచ్చెఁ,దమము*పోయె
సరసిజంబులు పూచె సరసులందు.

subbarao చెప్పారు...

ఏనుఁగు బోలు మేఘములె యేర్పడ యాకస మందు దట్టమై
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిం
గానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె యంతటన్
భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్

Rama Murthy Duvvuri చెప్పారు...

ఉత్పలమాల
మానక భూమియుందిరుగు మాన్యుని సూర్యుని భాసురాంశువుల్
ఆనిన యట్టి దేశముల యందు నహస్సగు,కాంతులీనుచున్
*భానుఁడు వెల్గుచుండు నొక వంక;తమస్సులు గ్రమ్మి వచ్చెడిన్ *
భాను కరమ్ములుంబడని ప్రాంతములందున రేయియే యగున్.

sitharamayya solasa చెప్పారు...

వాడుకైనరీతి ప్రాగ్దిశనందున
భానుఁడు వెలుగంగ వచ్చెఁ ; దమము
చుట్టుముట్టె నేడు చుక్కల తెరవున
మబ్బులన్ని రవిని మరుగుపరచ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నీలభములు నభము నిండనలముకొని
కుండపోత వృష్టి కురియుచుండ
పట్టపగలు గూడ వసుధలో గమకించి
భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము

విరించి చెప్పారు...


భూభ్రమణము తోడ భూరిగా మార్పులు
సంభవించు మాట సత్యమేను
భరత భూమి లో, విదేశము లోజూడ
భానుడు వెలుగంగ వచ్చు దమము.


హీనుడు సైంధవుండధము డెక్కడ దాగెనొ ప్రాణ భీతితో
వానిని జంపకున్న ప్రియ బాంధవు డైన పృథాసుతుండకున్
హాని యటంచెఱంగిన మహాత్ముడు చక్రము నడ్డు వేయగా
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్

sarada చెప్పారు...

ఆటవెలది
ప్రాగ్దిశాచలంబు పైన ఘనమ్ముగ
భానుఁడు వెలుగంగ వచ్చెఁ ,దమము
చేరె ,పశ్చి మాన జిష్ణుడు క్రుంగగ
యిదియి సత్య మనుచు యెరుగు మయ్య.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.

అపర్ణ గాడేపల్లి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అపర్ణ గాడేపల్లి చెప్పారు...

ఉ.మా.
హీనము సేసి లోకముల నెంతయొ కోవిడు బానపొట్టతో
ద్రేనిచి వీడుకోలునిడ, దీరుగ నుండని నాడులేకమై
కానగ గాలుదువ్వుచును కయ్యము లాడనుపక్రమించగన్
*భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

మానిని కౌశికున్ మనుపు మాన్యత నొందె, సులోచనా సతీ
మౌని యపేక్ష సత్యవతి మర్మము వ్యాసమునీంద్ర జన్మమున్
గానక నెవ్వరున్ భువినిఁ గావ్యు జయంతి, దశాబ్ది కేళిలో
*భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వానర యోధులెల్లరును వారధిఁగట్టఁగ నంబురాశిపై
భానుని తాపమున్నుడుప వాతుడు చేకొని యంబుదమ్ములన్
తానట నాతపత్రముగ తర్షునిఁగప్పఁగ నంబరమ్మునన్
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కదియఁగఁ గబలించు కాలము వీక్షించి
చండ కిరణ పంక్తి సంతరింప
జీవ రాశి కొసఁగఁ జేవ బ్రతుకు నందు
భానుఁడు వెలుఁగంగ వచ్చెఁ దమము
[తమము = రాహువు]

మానవ జాతి లోకము సమస్తము భీతిలి చూచు చుండ ద్వే
షానల తప్త మానస సు ధాశన వక్త్రుఁడు నిర్మలాభ్ర దే
శానఁ గరాళ దంష్ట్ర విల సద్ఘన గాత్రుఁడు భాను మ్రింగు స్వ
ర్భానుఁడు వెల్గు చుండ నొక వంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...యేర్పడ నాకసమందు... భీకరమయ్యె నంతటన్..." అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

Sistla Sharma చెప్పారు...


ఆనతి నీయ నా ప్రభువు
యాత్రికునిన్వలె వచ్చినాడ నీ
యానమునందు గాన్పడు మ
హాద్భుతమై గమియించు జీవికన్
గానగనోపు చిత్రమగు
కాంక్షల లక్ష్యము నెంచు త్రోవలన్
భానుడు వెల్గుచుండ నొక
వంక దమస్సులు గ్రమ్మివచ్చెడిన్!

దుర్గం వేంకట సుబ్బయ్య శాస్త్రి చెప్పారు...

కలత లెరుగ నట్టి కాపుర మందున
కారుమబ్బు లిట్టె క్రమ్ము కొనగ
బుద్ధి మంద గింప నొద్దిక కరవాయె
భానుడు వెలుగంగ వచ్చె దమము.

భమిడిపాటి కాళిదాసు చెప్పారు...

భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.

పట్టపగలు మింట పద్మబాంధవువెంట
కారు మబ్బుల గుమి క్రమ్ము కొనగ,
ధరణి వెలుగు లొందు ధర్మంబు దప్పెను
భానుడు వెలుగంగ వచ్చె దమము!!

భమిడిపాటి కాళిదాసు చెప్పారు...

భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.

దీనుల జీవనంబులను దీప్తిని నింపగ నెమ్మనంబునన్,
తానొక యాత్మ బంధువుగ ధర్మము దప్పని పాలనంబునన్,
పూని వెలుంగులన్ తెలుగు భూమికి నిత్యము పంచునట్టి యా
భానుఁడు వెల్గుచుండ, నొక వంక దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్!!

subbarao చెప్పారు...

ఏనుఁగు బోలు మేఘములె యేర్పడ నాకస మందు దట్టమై
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిం
గానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె నంతటన్
భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏