18, సెప్టెంబర్ 2022, ఆదివారం

సమస్య - 4194

19-9-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్”
(లేదా...)
“కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్”

25 కామెంట్‌లు:


  1. పలు విషయమ్ముల పైనను
    పలువురు చర్చించుచున్న పాళము నందున్
    పలికెనొక పండితుడు రూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్.

    రిప్లయితొలగించండి

  2. పలువుర వంచించుచు తా
    సులభము గా ధనము పొందు సుడియలు వారె
    నలుపైననేమి కడు రూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్.

    రిప్లయితొలగించండి
  3. పొలుపున వోట్లను బొందగ
    వలయునుగదపుష్కలముగ పైకంబిలలో
    తెలివిగ నార్జించిన రూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విలువలమాటలేల యిక వేలమువెర్రిగ నార్జనంబుకై
      పలుపలు మార్గముల్ వెదకి పాపపుసొమ్మును గూడబెట్టగన్
      మెలకువతో సదామెలగు మేధనుబొందిన మానవుండు రూ
      కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్

      తొలగించండి
  4. కందము
    కులమున్ బలంబుగుణముం
    గలిగిన గుర్తింపురాదు కనకము,భవనం
    బులు, పదవులు,మిక్కిలి రూ
    కలు గల్గిన వాఁడెరాజు కలికాలములోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      చెలియరొ!యందచందములు శ్రేష్ఠగుణంబులు, విద్యలక్కటా!
      చెలిమియు,పౌరుషంబు,మృదుచిత్తముఁగల్గిన మెచ్చరెవ్వరున్
      పొలములు,సేవకాళి, ఘనభోగములొప్పగ,కోట్లకొద్ది రూ
      కలుగల వాఁడె రాజు కలికాలములోనఁదలంచి చూడగన్ .

      తొలగించండి
  5. అలవూకగ మాట్లాడుచు,
    నలుగురి దృష్టిపడకుండ, మనుషుల గొంతున్
    సులువుగ   నొక్కెడి చెడుమెలి
    కలు, గల్గినవాఁడె రాజు కలికాలమునన్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కులములు వేరైనను నిన
      కులంపు రాజంశమైన, కోమటి వారౌ
      నిలయముఁ గల్గుచుఁ బలు రూ
      కలు గల్గినవాడె రాజు కలికాలమునన్

      తొలగించండి
  6. కందం
    పిలుపున గౌరవమెగయఁగ
    నిలుపుగ నెన్నరె పదవుల నేతను జేయన్
    కలుషములగు పించక లె
    క్కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్

    చంపకమాల
    పిలుపున గౌరముల్ బెరిగి వేడ్కగ యోగ్యుఁడటంచు మెచ్చుచున్
    గలుషము లన్నవే కనక గండరగండని రీతి గొల్చుచున్
    నిలుపఁగ నెన్నరే తమకు నేతగ లోకులు, వారి దృష్టి లె
    క్కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  7. విలువలు గల్గిన వాడై
    సలుపుచు సత్కార్య ములను సజ్జన సఖు డై
    మెలగుచు గావలసిన రూ
    కలు గల్గిన వాడె రాజు కలి కాలమునన్

    రిప్లయితొలగించండి
  8. నిలయముఁగల్గి యుండియును నెవ్వగ లేవియు లేకయుండి,రూ
    కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినం
    బలువురి నోటి యందిదియె పల్కగ వింటిని భూసురోత్తమా!
    కలుఁగుట సంపదల్ భువిని గాలుని జేతనె నాయెఱుంగుమా

    రిప్లయితొలగించండి

  9. తెలియదె లోకనానుడి యదే ధనమూలమిదం జగత్తటం
    చు లలన చెప్పసాగె తన సోదరి తోడ జనాళి జ్ఞాన శూ
    న్యులయిన చోట తస్కరులగోగులవారరు హెచ్చుగాను రూ
    కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్.

    రిప్లయితొలగించండి
  10. అలుపెరుగక యెనికలలో
    పలుతానములందున దనవారికి జయమే
    కలుగగ పంచు కొ రకు రూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్

    రిప్లయితొలగించండి
  11. బలమును జాలగల్గియును
    భాహు బలుండని పేరుకెక్కినన్
    పలువురిచే బ్రశంసలును బండితు
    డై కడు బొందితేమి తా
    విలువల జీవనంబునిల పేర్మిని
    గడ్పిన లాభ మేమి రూ
    కలు గలవాఁడె రాజు కలికాలము
    లోనఁ దలంచి చూచినన్”

    రిప్లయితొలగించండి
  12. పలువురు మెచ్చెడి రీతిగ
    విలువగు సత్కార్యములను వెరవున భువిలో
    సలుపఁగ జనహితమున రూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్

    రిప్లయితొలగించండి
  13. పలువురు మెచ్చు రీతి మృదువర్తన గల్గి దయాంతరంగుడై
    కలిగిన మేర తృప్తి సహకారకచిత్త ముదారతత్త్వముల్
    చెలగ దురాశలం బడని శిష్టు డనంగ సదాపనీతశం
    కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  14. కందం
    కలవరమాయె మదిననుచు
    గలగల మాటలు నుడివెడి కైలాటుండున్
    ఖలుడును, యవినీతిన మర
    కలు గల్గిన వాడె, రాజు కలికాలమునన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  15. చం.

    కొలువున యోగ్య మంత్రి గణ కోవిద వీరులు గూఢచారులున్
    విలువలనిచ్చు వర్తకులు వేదులు మిత్రులు భాగ్యవంతులున్
    పిలువగ సుందరీమణులు ప్రీతి విలాసపు చక్కనైన చు
    *"క్కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్”*

    రిప్లయితొలగించండి
  16. కలుషము లెన్నియున్ననవి కాసులతో శమియింప జేయుచున్
    పలువురి మెప్పు పొందుటకు బాయక నుద్యతి జేయు ధూర్తులే
    విలువలగూర్చి యుద్ధతిని విచ్చలు బీరము లాడుచుంద్రు రూ
    కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  17. విలువలు సన్నగిల్లగను విశ్వమునందున, నాయకుల్ మదిన్
    తలచుచు స్వీయలాభము సదా మదిలోనను, చేయుచుంద్రు చే
    త లణుగుణమ్ము పొందగను తద్దయు సంపద, నేడు కల్లు పా
    కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  18. అలవోకగఁ జేయ ప్రతిన
    లులుకక యింటింటి కేఁగి యుచితమ్ములు నా
    వలలోఁ జిక్కిన పలు మూఁ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్

    కలిగిన నేమి చేసినను గార వరించిన నబ్బు సౌఖ్యముల్
    కలిగిన దోఁచు కొన్న మఱి కాఁగలఁ డింపుగ రాయఁ డిద్ధరం
    కలిగిన వానికే కలుగుఁ గాలిడ నెన్నిక లందు శక్తి రూ
    కలు గలవాఁడె రాజు కలికాలము లోనఁ దలంచి చూచినన్

    రిప్లయితొలగించండి
  19. చం:తలపగ ద్వాపరాన తల దాల్చ కిరీటము,దాని పైన నీ
    కలు గల వాడె రాజు, కలికాలము నందు దలంచి చూచినన్
    తలపున రాజ్యకాంక్షయును,దానిని పొందగ చేతి నిండ రూ
    కలు కలవాడె రాజు కలి కాలపు ధర్మము మారె నివ్విధిన్.

    రిప్లయితొలగించండి
  20. కం:పలు కులము లుండ నెవ్వరి
    దలచిన తప్పో ,విడచిన తప్పో దేవున్
    దలచిన నేమో యను శం
    కలు గల్గిన వాడె రాజు కలికాలమునన్

    రిప్లయితొలగించండి
  21. కొనింటి. రమేశ్


    కందము

    విలువల వలువలుతీసి స
    కల సంపదలనవలీల గైకొనువారల్‌
    పలుపురు రక్కసులనుమూ
    కలు గల్గినవాఁడె రాజు కలికాలమునన్”

    చ.మా
    కలియుగమందునంతట నుగాంతుము మూర్ఖపు దానవేంద్రులన్‌
    పలుకుచుముద్దు పల్కులనపాయముకల్గ నుపాయముల్‌ సదా
    మలిన మనస్కులై మనకు చేయగబూనెడు మిత్రబృంద మూ
    “కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినన్”

    రిప్లయితొలగించండి