19, సెప్టెంబర్ 2022, సోమవారం

సమస్య - 4195

20-9-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”
(లేదా...)
“వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్”

26 కామెంట్‌లు:

విరించి చెప్పారు...


లలనల నవమానింపకు
మిలవేల్పులు వారుగాదె యిల్లాలిగ నిన్
కొలిచెడి యామె మనసు కో
వెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నిలయమునఁ బతికి షట్క
ర్మలఁ దోడుగ సంతుఁ బడసి ప్రమిదయనంగన్
వెలయఁగ మహినిల్లే కో
వెల! యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్


మత్తేభవిక్రీడితము
నిలయమ్మందున దీపమై వెలిగి సంధింపంగ షట్కర్మలన్
వలపుల్ గాంచుచు భర్తకున్ మధురభావంబౌచు నిల్లాలిగన్
వెలయన్ సంతుకు మాతృదేవతగఁ దా పెంపార నిల్లన్న కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్!

subbarao చెప్పారు...

కలుషము గలిగెడు బలుకుల
నలవోకఁగ మాటలాడ న్యాయమె యిచటన్
లలనల మనసులు గనఁ గో
వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్

Rama Murthy Duvvuri చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చులకన గచూడ బోకుము
తలయెత్తకపనులుచేయుతరుణిని యెపుడున్
నిలునాకముచేసెడు కో
*"వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*


Rama Murthy Duvvuri చెప్పారు...

కందము
కళకళలాడుచు ,నింటన్
గలగల నడయాడుచుండి కలివిడి తోడన్
తళతళమను నవ్వుల ది
వ్వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁగనఁగన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

వలపునుపంచుచునుండిన
వెలకోరకపనులుచేయు విసుగొందకతా
నిలునొనరించును తాకో
*"వెల,యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్”*


రవి కిరణ్ చెప్పారు...

కలిలో, గురువుకు, శిష్యుకు,
బలహీనుకు,భలుడుకు, గుణవంతులకు, సదా
ఖలుడుకు,  శ్రీహరిమదికో
వెలయాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వలపులు జూపెడు సతియై
కలలకు సాకా ర మిచ్చు కాంతా మణియై
మెలగెడు నామెయె యొక కో
వెల ' యాలే దిక్కు వంశ వృద్ధికి గనగన్

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...



తలలో నాలుకయై చరించు కదరా తన్వంగులీ ధాత్రిలో
చెలియై భర్తయె సర్వమంచు నతనిన్ సేవించు సచ్ఛీలురౌ
లలితాంగుల్ గన వేల్పులే భువిని, యిల్లాలున్న ధామమ్మె కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.

M.B.G.TILAK చెప్పారు...

వెలయాలివలకు చిక్కిన
విలపించక తప్పదుగద, విజ్ఞతతోడన్
మెలగిన బ్రతుకగునా వెల
వెల, యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్

Rama Murthy Duvvuri చెప్పారు...

మత్తేభము
కలుముల్ వోవగ, గౌరవంబుఁజెడ,చుల్కంగా జనుల్ నవ్వ నా
వెలయాల్మూలము;వంశవృద్ధికిరవౌ ప్రేమన్ ప్రసాదింపగన్
బళిరా!కష్టసుఖాలతోడగుచు నాప్యాయంబుతో నెప్పుడున్
జెలిమింజూపెడి భార్యయే తగును సుశ్రీలింట దైవారగన్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

వెలగలదే వస్తువునకు,
నిలలో వెలగట్టవచ్చు నేపనికైనన్,
కులసతి సేవలకెయ్యది
వెల? యాలే దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్

sitharamayya solasa చెప్పారు...

వలపును తీర్చి శిశునిడదు
వెలయాలే ; దిక్కు వంశవృద్ధికిఁ గనఁగన్
నలుగురి కాహ్వానమొసగి
జ్వలనము సాక్షిగ పరిణయ మాడిన సతియే

subbarao చెప్పారు...

వలపుల్ రేపుచు వంశనా శనము నాపాదించు కార్యంబు కున్
వెలయాల్మూలము, వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్
వలపే ముఖ్యము చింతజే యగను నావాసంబు శుభ్రంబు నై
వెలయన్ వంశముఁ దప్పకుం డగను దావృద్ధిన్ సదాపొందుగా

A.Satyanarayana Reddy చెప్పారు...

చెలువంమొప్పగయిక్కలోన మనుచున్ చిప్పిల్లు బ్రేమమ్ముతో
విలువన్ బెంచుచు సంఘమందునను, నిర్వేదమ్ము పోనాడి సే
వలతో మించుచు నత్తమామలను సంభావించి దీపించు కో
వెల, యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్

sarada చెప్పారు...

కందం
కిలకిల నవ్వుచు గృహమున
గిలిగిలి పెట్టి పతిదేవు గిరికొని సేవన్
చెలువము మీర సలుపు ది
వ్వెల, యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:లలనను బెండ్లాడుట కై
వెలయా !లే ! దిక్కు వంశవృద్ధికి గనగన్
లలనలె తనువును,మనమును
వలపుల నొసగంగ నింత స్వార్థ మ్మేలా!
(లలనను బెండ్లాడుట కై వెల=కట్నం.)

seethadevi gurram చెప్పారు...

కలకంఠిని బాధించుచు
చులకన జేయకుము మగడ! శూరుడననుచున్
కులకీర్తియె బోవును వెల
వెల,యాలే దిక్కు వంశవృద్ధికి గనగన్!

తలపుల్ దోషములేనివై మగని గోత్రమ్మున్
తలందాల్చుచున్
సలుపన్ సేవల నత్తమామల సదాచారంబు
బాటించుచున్
చెలిమిన్ బంచుచు నాడుబిడ్డలకు దాసింగారియై భర్తకున్
దలలో నాల్కగ నెల్లవారికిని బంధాలన్
ప్రవర్ధించు కో
వెల, యాల్మూలము వంశవృద్ధికిరవౌ ప్రేమన్ బ్రసాదింపగన్

Subbarao Ayyalasomayajula చెప్పారు...

మ.

పిలువన్ శక్రుడు దేవవేశ్యలను కౌపీనమ్ము వర్జించుటన్
సలిగన్ మేనక జేరగా మెదలె విశ్వామిత్ర శృంగారమే
నలి శాకుంతలమై భువిన్ భరత జన్మమ్మున్ మహారాజుగా
*వెలయాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్.*

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వెలయాండ్రే యచ్చరలు ము
నుల కయినన్ సత్యము లగును జుమీ యీ మా
టలు నిశ్చయముగ ధరలో
వెలయాలే దిక్కు వంశ వృద్ధికిఁ గనఁగన్

కలలో నైనను ద్వేష మూనదు మదిం గల్యాణమే కోరుఁగా
లలనా రత్నముఁ గాచుటే పతికిఁ గర్తవ్యంబు త్యాగంబుతోఁ
జలుపంగన్ నిజ దార సేవలకు దుస్సాద్యమ్ము లెక్కింపఁగా
వెల యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమం బ్రసాదింపఁగన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఇలలో నీసరిబోలు వారెవరు నిన్నేరీతి కీర్తింతునో
నెలతా! నీగృహమేలు రాజ్ఞివగుచున్ నిత్యంబు నీ వారికిన్
తలలో నాలుకగా మెలంగుచు, నమందానంద మందించు కో
వెల! యాల్మూలము వంశవృద్ధి కిరవౌ ప్రేమన్ బ్రసాదింపఁగన్

Koninty Ramesh చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Koninty Ramesh చెప్పారు...

కందము
పలువత్సరముల నుండియు
కలుగును పిల్లలనిచూడ కలయే మిగిలెన్
తలపునకువచ్చె తనకిల
*వెలయాలే దిక్కు వంశవృద్ధికి గనగన్*


మత్తేభము

విలువైనట్టిదిజీవితంబనుచతా పెండ్లాడెముద్దుగుమ్మ నా
చెలివంచున్నొకసుందరాంగనను సుశ్రీశోభితమ్మొప్పగా
తొలిసంసారముజేయబూనగను దాత్రోసెన్‌కాననేర్పగా
*వెలయాల్మూలమువంశవృద్ధికిరవౌ ప్రేమన్‌ బ్రసాదింపగన్*