14, నవంబర్ 2022, సోమవారం

దత్తపది - 187

15-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
"మాత - పిత - తాత - దుహిత"
ఈ పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
నీతిని బోధిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

21 కామెంట్‌లు:


  1. ఏల కుపితత్వమంటి సయిపు వహించు
    మానుమా తలబిరుసగు మాటలనిక
    నల్వురోప్పు నీదగు తాతనమ్ము లేని
    నాడు నీకుకాదు హితము నమ్ము మిదియె.

    రిప్లయితొలగించండి
  2. విభీషణుఁడు రావణునికి నీతిని బోధిస్తూ
    తేటగీతి
    శ్రీల'తాత'న్వి సుకుమారి సీత తోడ
    ప్రల్లదములా'పి,త'ప్పని రామమూర్తి
    కప్పగించు'మా,త'రుణిని యఘము దొలగు
    నా'దు,హితవాక్యములు విని సోదరుండ!

    రిప్లయితొలగించండి
  3. కం.

    ధనమా ? తపమా ? లపితము,
    జనతా తపమందు హితము జయమును భువిలో
    వినయముఁ జూపక మనుజులు
    మనమునఁ దలచుచు వరములు మండాడుదురే !

    రిప్లయితొలగించండి
  4. వినుము జామాత సమయము వింగడించు
    కుపిత మతులెల్ల తప్పక కుములు చుంద్రు
    చక్కని సమతా తత్వము నెక్కిరించి
    వాదు లాడుట నీకిక కాదు హితము

    రిప్లయితొలగించండి
  5. ఉత్పలమాల:
    కూడకు *మాత*తాయిలను కోరకుమన్యుల విత్త మెన్నడున్
    వీడకుదీ*పిత*మ్మయిన పిత్సలమెన్నడు జీవితమ్మునన్
    నీడగతోడుకమ్మెపుడు నీ*దుహిత*మ్మును కోరువారికిన్
    వేడకు *తాత*నమ్మెపుడు వీడి సహాయము పల్లటమ్ములన్

    రిప్లయితొలగించండి
  6. ఎంతయు జరుల తాతన మెరిగి పలుక
    నగును , కనుమా తమము విడి యాత్మ యందు
    విజ్ఞతను జూపి తరములందు భేద మెరుగ,
    నెవరయిన గోరెదరు నీదు హితము నెపుడు

    రిప్లయితొలగించండి
  7. (కాపురమునకు వెళ్ళు కూతురుతో తల్లి)
    అమ్మ ! జా *మాత* నయ మార్గమందు చనును
    కు *పిత* వై జగడము బెట్టు కొనకు మెపుడు
    ప్రియ సు *తా! త* గ్గని లలితో ప్రియవచనము
    లాడు, నీ *దు హిత* ముఁ గోరి వేడు చుంటి

    రిప్లయితొలగించండి
  8. వినుమా తత్త్వపు బోధలు
    తనువుననలజడు ల నాపి తమమును విడుమా
    మనవలె తా తపసి కరణి
    ఘనతను బొందుఁ హిత కరిగగ్రాలెడు వేళన్

    రిప్లయితొలగించండి
  9. మాత-పిత-తాత-దుహిత
    ఉ:"లే దిపు డింత నీతి" యని లేచిన దాదిగ "మా తరమ్మునన్
    మేదిని ధర్మభూమి" యని మిక్కిలి గొప్పగ జెప్పి తయ్య యీ
    వాదము లేల నయ్య గురువా!కవితాతప మిట్లె యాపినన్
    రాదు హితమ్ము భావి కొక రమ్యమహద్దిశ జూపు మింతటన్.

    రిప్లయితొలగించండి

  10. వినుమా తరుణీ హంస గ
    మన ఘన కుపి తాత తానుమానము వలనం
    గన రాదు హితము సుంతయు
    మనుజులకున్ బ్రతుకు లందు మనము కృశించున్

    రిప్లయితొలగించండి
  11. విదుర నీతి

    కందం
    మినుమా! తమరికితరులే
    మొనరింపఁగను విలపిత, మనుచితమ్మో మీ
    రొనరింపకుండ మను తా
    తనమునఁ బెంపొందు హితము ధర్మజ! నయమై

    రిప్లయితొలగించండి
  12. మాత ! మాతల రాతలు మారు నెపుడు ?
    కుపిత మనుజుల మధ్యలో కుమ్ములాట !
    తాత వేల్పెట్లు వ్రాసెనా తలను వ్రాత !
    నిలువనుదుహితాత్ముల మధ్య నిలువలేను?

    రిప్లయితొలగించండి
  13. విను*మా త*లచిన పనులను
    తను మనముల తోడ కం*పిత*మతియుగాకన్
    అనయమువిన మా*దుహిత*వ
    చనమ్మ దియు*తాత*మమది జవముగ నణచున్

    మరొక పూరణ

    చేయనెంచకు"మాత"ప్పు చిత్తమందు
    చేయకు"పిత"లాటకమును చెరుపునదియు
    పరహి"తాత" తత్పరడౌట వాసి యౌను
    నా"దుహిత"మునాలించుము నయముగాను

    రిప్లయితొలగించండి
  14. తరుచుగ గ్రూకర్మలను దానవు రీతిగ జేయు టాపియున్
    నిరతము గొప్ప కార్యములు నీవొనరించుచు
    సంఘమందునన్
    మరవక సాదు సజ్జనుల మాన్యులచేత
    సదా ప్రియత్వమున్
    బరువును బెంచుకొమ్ము కడు భాగ్యము
    లబ్బును నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి