31, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4236

1-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము”
(లేదా...)
“పండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై”

33 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వ్రాసి కవికుల బంధువుల్ పద్యములను
    కనులనానంద బాష్పముల్ గారుచుండ
    విభవ పుస్తకావిష్కార సభను వెలయు
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      నిండుదనంబు గూర్ప రమణీయకవిత్వము నేర్చికూర్చియున్
      పండితమోదమౌ సభను పాటిగ పొత్తము వెల్వరింప పూ
      చెండుగ పాత్రులౌ కనులు చిప్పిల, భాగము లేనివారలై
      పండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై!

      తొలగించండి
  2. తేటగీతి
    దూర దేశాలకేగిన వారలౌర!
    సొంత పల్లెను గాంచియు సంతసిలిరి
    పండుగకు వచ్చి;యేడ్చిరి బంధుగణము
    వారు మరలిపోవంగను వదల లేక.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      పండుగ నాటికిన్ సపరివారముగాను మదీయ గేహమం
      దుండగ రండు రండనగ నుత్సుకతన్ మఱి యొక్కరొక్కరే
      పండుగ నాడు బంధువులు వచ్చిరి;గొల్లున నేడ్చిరొక్కటై
      పండుగ పూర్తియై పిదప వారలు నేగగ వీడలేకయున్.

      తొలగించండి
    2. విరుపుతో మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. సంబ రమ్మున పాల్గొని సంత సమున
    కలసి మెలసియు నుండగ కదలి న దరి
    జరిగిన విషాద మును గాంచి చకితు లగుచు
    పండుగకు వచ్చి యే డ్చిరి బంధు గణము

    రిప్లయితొలగించండి
  4. తగిన గౌరవముఁ దమకుఁ దక్కకుంట
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము
    వారి కీయఁగఁ బోవుట పాడికాదు
    పుడమి నెవ్వారి కైనను బైడి తల్లి!

    రిప్లయితొలగించండి

  5. ఢాం డమాఢమ డమ్ డమా డమ్మనుచును
    దబ్బరగ టపాసులు మ్రోగ తాత యెనట
    రాణమునకు గుండె దడతో ప్రాణములను
    విడువ జామాతలు సుతలు కొడుకు దివిలి
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము

    రిప్లయితొలగించండి

  6. పండుగ వేళయందరము భ్రాతిగ నుందుము రమ్మటంచు తా
    రండిటకంచు పిల్చె జరి రమ్యపు దివ్వెల నాడు వీధిలో
    ఢాండడ ఢామ్ డఢామ్ ఢఢఢ ఢామ్మనుచుడ టపాసులెన్నియో
    దండిగ మ్రోగుచుండగ గతాయువు భీతిల గుండెయాగగా
    పండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై.

    రిప్లయితొలగించండి
  7. నిండుదనంబు నీయగను నెమ్మిని గూర్పఁగఁ బిల్ల వాండ్ర తోఁ
    బండుగనాడు బంధువులు వచ్చిరి, గొల్లున నేడ్చి రొక్కటై
    మెండగు వ్యాధితోఁ గుమిలి మేనమ ఱందియె మృత్యు కౌగిలిన్
    దండము వోలెవ్రాలఁగను దక్కడు వాడని నొక్క సారిగా

    రిప్లయితొలగించండి
  8. పాఠశాల మూయగ తన బామ్మ కడకు
    పండుగకు వచ్చి ,యేడ్చిరి బంధుగణము
    దనను జూచి, యనుకొనుచు తలచు చుండె,
    బాలకుడెరుగడానంద బాష్పములని

    రిప్లయితొలగించండి
  9. సంతసంబున పండుగ జరుపుకొనగ
    సత్వరంబున పయనమై సత్పథమున
    నాపదకు జిక్కి మృతినొందినాడతండు
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము

    రిప్లయితొలగించండి
  10. రాకరాక యేతెంచిరి రంజనముగ
    దూర తీరఁపు బందుగుల్ కోరియిటకు
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము
    విడిచి పోవఁగ వెతనొంది వెళ్ళునపుడు

    రిప్లయితొలగించండి
  11. పండుగ మాకు గేహమున బంధు జనంబులు వచ్చి చేరగన్
    దండిగ పిండివంటలునుదంచిత వేడ్కలు మిన్నునంటునా 
    పండుగనాడు, బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై
    పండుగ పూర్తికాగ నెడబాటున నిండ్లకు నేగువేళలో.

    రిప్లయితొలగించండి
  12. చక్క సల్లాపముల తోడ సంతసమునఁ
    గాల ముత్సాహ ముప్పొంగఁ గడపి తిరిగి
    వారి వారిండ్ల కేఁగచుఁ బట్ట లేక
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము

    మెండుగఁ గాల మేఁగఁగ సమీపము సేరుట కొక్క సారిగా
    నండ లభించి నట్టుల నిజాత్మలఁ దల్చుచు నొక్క రొక్కరే
    దండకు వచ్చి నంతటనె తద్దయు హర్షము పొంగి పొర్లఁగాఁ
    బండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై

    రిప్లయితొలగించండి
  13. నిండు మనంబుతో బిలువ నిర్మల భావన
    తోడ దివ్వెలా
    పండుగనాడు బంధువులు వచ్చిరి, యేడ్చిరి
    యందరొక్కటై
    దండిగ మూడురోజులును తద్దయు సంతస
    మొప్పగడ్పియున్
    వెండియు వెళ్ళిపోవు తరి వేదనలోన భ
    రించలేకయే.

    రిప్లయితొలగించండి
  14. అండగ నుండనెంచుచును నందరు నింటను మోదమందుచున్
    పండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చిరొక్కటై
    నిండు మనంబుతోడ నిటనెమ్మిని పంచెడి పెద్దదిక్కులే
    కుండగచేయుకార్యమనియుల్లమునందుతలంచివెక్కుచున్

    రిప్లయితొలగించండి
  15. మరొక పూరణ

    నాల్గు నాళ్ళుండి శాంత మనస్కులైరి
    “పండుగకు వచ్చి, యేడ్చిరి బంధుగణము”
    వీడి యికచనవలె నను వెతయు నిండ
    కనులయందున నీరది కారుచుండ

    రిప్లయితొలగించండి
  16. తే.గీ:జీత మింక రాలేదను చింత నుండ
    సరకు లే లేక యిల్లాలు సణుగు చుండ
    తేర తిండిని తినగ నీ వార మనుచు
    పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము
    (వచ్చి యేడ్చిరి= కరువు కాలం లో బంధువులు పండగ నాడు రావటం అతడికి బాధ.అందుకే వచ్చి యేడ్చిరి అని విసుగుతో అన్నాడు. ఇల్లాలు సరుకులు లేక సణుగుతోంది.ఐతే అప్పుడు ఆమె తరపు బంధువు లైనా ఒక మాదిరి కానీ నీ వాళ్లం అంటూ ఇతని తరపు వారు రావటం తో భార్య నుంచి మరీ ఇబ్బంది.)

    రిప్లయితొలగించండి
  17. ఉ:మెండుగ దీపముల్ పరచి మించిన సంతస మీయ బిడ్డకున్
    దండుగ యంచు నెంచక యథావిథి పండుగ నాచరించగా
    గండము కల్గె సోదరికి కాల్చెను దీపము దేహ మెల్ల నీ
    పండుగ నాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై.
    (ఈ దీపావళి నాడు అనగా 25-10-2022 నాడు దీపావళికి దీపాలు పెట్టగా నా సోదరికి ఒళ్లు కాలి నాగుల చవితి నాడు మరణించినది.ఈ పూరణ ఆ యథార్థసంఘటన తో చేసినదే.)

    రిప్లయితొలగించండి