2, నవంబర్ 2022, బుధవారం

సమస్య - 4238

3-11-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ”
(లేదా...)
“భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ”

18 కామెంట్‌లు:

  1. కందం
    మేలుల్ గూర్పెడు వాడని
    కాలాత్ముని భక్తిఁ గొల్వఁ గరుణించు సదా
    కూలన్దోయఁగ నన్యుల
    భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

    శార్దూలవిక్రీడితము
    కాలాతీతుని స్తోత్రపర్వముగ భక్త్యాత్మమ్ముగన్ వేడగన్
    మేలుల్గూర్చును లోకులెల్లరకు సంప్రీతిన్, గుతంత్రమ్మునన్
    గూలన్జేయుమటంచు నన్యులనహో! కోరంగ స్వార్థమ్మునన్
    భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు

      తొలగించండి
    2. కందం
      మేలొనరించిన మారుని
      గూలన్ నిర్దయను బూది కుప్పన్ జేసెవ్
      ఫాలజ్వాలల హరుఁడా
      భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ!

      శార్దూలవిక్రీడితము
      పూలన్ జల్లగ మన్మథుండు, హరుడున్ మూలంబు తానెంచకే
      ఫాలాక్షంబున రువ్విమంటలనహో భస్మమ్ము జేసెన్గదా
      మేలున్జేసెడు వాని గూల్చు కతనన్ మృత్యుంజయుండంచు నా
      భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ!

      తొలగించండి
  2. శ్రీలను విరివిగ నిచ్చును
    భోళాశంకరునిఁ గొలువ, మూఢత్వంబౌ
    గాలాత్ముని నిందించుట
    పాలసులుగ జనన మొంది పాపిగ మారున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    వేళాకోళములాడకు
    బోళాశంకరునిఁగొల్వ మూఢత్వంబౌ
    నా?లీలన్ హాలహలముఁ
    గేలంగొని మ్రింగె నతఁడు కీర్తింప సురల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలము
      బోళాశంకరుఁడేదొయిచ్చుననుచున్
      బూజింప మూఢత్వమౌ
      నీలాగున్ వచియింపఁబాడియగునా?యీశున్,ద్రిశూలిన్,శివున్
      హేలన్ మ్రింగియు కాలకూటమును రక్షించెంగదా లోకముల్
      కాలుండే దిగివచ్చి పోరినను మార్కండేయుబ్రోచెంగదా!

      తొలగించండి
  4. కాలాతీతుని యాఙ్ఞమేరకు భువిన్ గాలమ్ము సాగంగ గా
    మేళంబాడుట న్యాయమే చెపుమ
    యీమేరన్ వి కారంబుగా
    భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ
    భోళా శంకరుఁడిచ్చుఁ దప్పక సిరుల్ బూర్ణాహుతింజేయగా.

    రిప్లయితొలగించండి
  5. వేళ గడచి దేవళముకు
    తాళము వైచిన తదుపరి దర్శనమొందన్
    తాళంబును విరిచి పిదప
    భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ


    క్ష్వేళీభుక్చిలలింగమున్గని సదాసేవింత్రు రేయింబవల్
    వేళాపాళలులేక భక్తిపరులై వీరాసనాభంగిమన్
    భోళాశంకరుడే దయాళువు గదా మోక్షంబుతో బాటు నా
    భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ

    రిప్లయితొలగించండి
  6. తాళము వేయుచు పాడుము
    భోళా శంకరుని గొలువ : మూఢ త్వం బౌ
    వేళా కోళ ము సేయుచు
    శూలా యుధు దూషణంబు చోద్యం బగుచున్

    రిప్లయితొలగించండి

  7. వేళన్ దప్పక కొలిచిన
    వ్యాళాలంకృతుడు వాడు వరములనిచ్చున్
    కూళుడు స్వార్థము తోడన్
    భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ.


    వేళాకోళము కాదు వాస్తవమిదే విస్రంభమున్ గల్గి యా
    వ్యాళాలంకృతుడంకాంతకుని నిస్వార్థంబుతో నిత్యమున్
    వేళన్ దప్పక గొల్వక సత్ఫలమె యౌ, పెచ్చారి స్వార్థమ్ము తో
    భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ.

    రిప్లయితొలగించండి
  8. వేళము రండిక నాతో
    భోళాశంకరునిఁ గొలువ;మూఢత్వంబౌ
    కాళీయ మర్దను గొలువ,
    పాళము దగనిదగునుగద బాహులమందున్

    రిప్లయితొలగించండి
  9. నీలగ్రీవుడు భక్తుల
    పాలిట దయగల విభుండు పరమాత్ముండే
    బాళిగ నైహికములకై
    భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

    రిప్లయితొలగించండి
  10. నీలగ్రీవుడు భక్త వత్సలుడు తా నిర్వ్యాజ సౌహార్దతన్
    బాళిన్జూపుచు కోరినట్టి వరముల్ భక్తాళికిచ్చున్ సదా
    యీలీలన్గడు తుచ్ఛ సౌఖ్యములకై హీనంపు గార్ధ్యమ్ముతో
    భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ

    రిప్లయితొలగించండి
  11. కందం
    వేళాకోళంబునకున్
    బోళాశంకరుని గొలువ మూఢత్వం బౌ
    కూళుల మాటలివి యగున్.
    నీలగళుని పూజజేయ నృపసింహుడగున్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. కేళీ లీలల నయినను
      ఫాలాభీలాక్షుని పయిఁ బలుకకు మిట్లున్
      వేళాకోళములు వలదు
      భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

      కాళిందీజల వర్ణు నాత్మసఖుఁడే కాళీ సతీ భర్తయే
      తాళం జాలరు దేవతా మునులు దైత్యవ్రాత గంధర్వులుం
      దాళధ్వాన సమేత నర్తకు నిటుల్ ధర్షింప నిర్భీతినిన్
      భోళాశంకరుఁ డేదొ యిచ్చు ననుచుం బూజింప మూఢత్వమౌ

      24/10/2022 నాటి నా పూరణములు:

      కేళీ లీలను గొల్చిన
      ఫాలాభీలాంబకుండు వరము లొసంగుం
      జాలుం జా లీ పల్కులు
      భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ

      వేళాకోళపు టా కళాసమును సంప్రీతిన్ ధరించెం గదా
      తాళం జాలక త్రాగుఁడీ విస మనన్ ధైర్యమ్మునం ద్రాగఁడే
      తాళధ్వాన సమేత నర్తకు నహో ధర్మంబె వా రిట్లనన్
      భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ

      తొలగించండి