5, నవంబర్ 2022, శనివారం

సమస్య - 4241

6-11-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను”
(లేదా...)
“అంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్”

20 కామెంట్‌లు:

  1. నిండు సభ లోన ద్రౌపదిన్ నింద జేసి
    వస్త్ర మూ డ్పి o చయత్నించె పాల సుండు
    పోరున సుయో ధనునియనిన్ గ్రూరుని గరు
    వాంధుని న్ జంపి భీముడు ఖ్యాతి గనెను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గర్వాంధుని' గరువాంధుని అనరాదు. "...గ్రూరగుణు మ।దాంధుని..." అనవచ్చు.

      తొలగించండి

  2. ఇందుముఖాంగనా! తెలుపు మెవ్వతివీవని యడ్గు చుంటి, నీ
    పొందును గోరుచుంటినిక మోదము తెల్పిన చాలు ని
    న్నందల మెత్తువాడ, విరహమ్మున కాగుచునుంటి నన్న కా
    మాంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    సంధికొప్పక స్వార్థాన సమరమెంచి
    గురులు దాతలు దమ్ములున్ గోల్పడంగ
    సరసు డాగిన రారాజు నరసి మదపు
    టంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    ఉత్పలమాల
    సంధికి నొప్పకే రణము సాదృశమౌ దెస ధార్తరాష్ట్రుఁడున్
    బంధుర బుద్ధిఁ వీడకయె భ్రాతల బాసి సరస్సునందునన్
    రంధిపడంగ దాగిన విరాగిని పౌరుషమెంచి పిల్చి గ
    ర్వాంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్

    రిప్లయితొలగించండి

  4. పడతినవమాన పరచిన పాపివౌర
    తొడలు విరిచి చంపెదనిక దొమ్మిలోన
    నిన్ననుచు ప్రతినను బూని నీచుడు గరు
    వాంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    నిండు సభలోన ద్రౌపది నిలిచియుండ
    నౌర!రారమ్మటంచు నిజోరుఁజూపి
    పిలిచిన సుయోధనాఖ్యుని ఖలుని దుర్మ
    దాంధునింజంపి భీముఁడు ఖ్యాతిఁగనెను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      అంధమహీశ సూనుఁడు మహారణరంగము వీడి మడ్గులో
      బంధుర రీతి డాగగనె పాండవులప్పుడు రెచ్చగొట్ట,క్రో
      ధాంధత వచ్చినట్టి ఖలు నాయభిమాన సుయోధనాఖ్యు,గ
      ర్వాంధునిఁజావఁగొట్టి కడు ఖ్యాతినిఁబొందెను భీముఁడొప్పుగన్.

      తొలగించండి
  6. మారు వేషము తోడను మత్స్యదేశ
    మందు నజ్ఞాతవాసమునాచరించు
    వేళ గర్వముతో విర్రవీగు మదపు
    టంధునింజంపి భీముడు ఖ్యాతి గనెను

    రిప్లయితొలగించండి
  7. పాలకుని లక్ష్యపెట్టని పంచనఖము
    మన్మథకలంబతాడితోన్మత్తుడయిన
    చిత్త చాంచల్య కీచక సింహబల మ
    దాంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    రిప్లయితొలగించండి
  8. కీచకుడు దన సోదరి కింకరియగు
    ద్రౌపది పయి మరులు గొని, తనను కలయు
    మనుచు కోరిక గోర నా యధిక బల మ
    దాంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    రిప్లయితొలగించండి
  9. బంధురమౌ సభాస్థలిని బంధువులున్ హితులున్ గనుంగొనన్
    బంధకి యంచు దూఱి సతి వస్త్రములన్ దొలగింప జేయగా
    కందిన మోముతోడుత బకాంతకుడార్తిఁ బ్రతిజ్ఞఁ జేసి గ
    ర్వాంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్

    రిప్లయితొలగించండి
  10. అడరి కుంతీ కుమార మధ్యముఁడు రాత్రి
    సమయమునఁ జేరి నర్తన శాల శత్రు
    భేది కీచకు సైరంధ్రి మీది వలపు
    టంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    సంధి వరింప కుద్ధతిని సంగరమున్ వరియించి పోరఁగా
    బంధు జనుల్ నశింపఁ గని పాఱిన దాగఁగ మడ్గు లో నహో
    యంధు సుతున్ సుయోధనుని నా తొడ లందు, నశేష రాజ్య కాం
    క్షాంధునిఁ, జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్

    రిప్లయితొలగించండి
  11. బంధువులెల్ల వద్దని సభాస్థలి పెద్దలు వేడుకొన్న యా
    క్రందనచేయుచున్న సతి ద్రౌపది చీరెలు
    విప్పినట్టి దు
    స్సంధుని దుశ్శసేను నతి జాల్ముని వీడక
    యుద్ధమందు గ
    ర్వాంధుని చావగొట్టి కడు ఖ్యాతి గడించెలను
    భీముడొప్పుగన్

    రిప్లయితొలగించండి
  12. నిండు పేరోలగంబున నీతిమాలి
    యబల వస్త్రము లూడ్చిన యన్నెకాడు
    దుష్టదుశ్శాసనుని, ఖలున్, ధూర్తుఁ, దుర్మ
    దాంధునిం జంపి భీముఁడు ఖ్యాతిఁ గనెను

    రిప్లయితొలగించండి
  13. బంధకియంచు ద్రోవదిని బట్టి కురుల్, కురువృద్ధ దేశికుల్
    బంధుజనంబు ముందుతన వస్త్రము లూడ్చిన దుర్మదాంధునిన్
    దందడియందునన్ దులువ ధర్మవిదూరుడు దుస్ససేను గ
    ర్వాంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్

    రిప్లయితొలగించండి
  14. అంధుడు నయ్యెకా మమున అజ్ఞత తోడను కోరి ద్రౌపదిన్
    సందిటరమ్మటంచనగ జార్చుచు కన్నుల నీరునిండగా
    పొందునుకోరినంతవిని భోరన యెడ్వ సహింపలే కగ
    *“ర్వాంధునిఁ జావఁగొట్టి కడు ఖ్యాతినిఁ బొందెను భీముఁ డొప్పుగన్”*

    రిప్లయితొలగించండి