7, నవంబర్ 2022, సోమవారం

సమస్య - 4243

8-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్”
(లేదా...)
“పిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్”

14 కామెంట్‌లు:

  1. ఎల్లరుగూడి యెన్నికల నేలిక పక్ష పరాభవమ్ముకై
    యెల్లలు మాని డెందములు నింగలమై తెగ మండిపోవగా,
    కల్లతనమ్ముతోడ సహకారము నిచ్చెడి గోడమీదిదౌ
    పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    కల్లయిదికాదు జంతువు
    లెల్లంగణ్వాశ్రమమున హేలగ వైరం
    బుల్లమునవీడి తిరుగును
    పిల్లినిఁగని యెలుక పిల్ల పెండ్లికిఁబిలిచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      కల్లయు కాదు కాదు ముని కణ్వుని యాశ్రమమందు లేళ్ళకున్
      తల్లియువోలె బెబ్బులులు స్తన్యము లిచ్చు,గజాళిఁగూడియున్
      మెల్లగ సింహముల్ దిరుగు నెమ్మది వీడియు జాతివైరమున్
      పిల్లినిఁగాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁబ్రేముడిన్.

      తొలగించండి

  3. చల్లనిరామచంద్రుడిక సాయము జేయునటంచు నమ్మి యా
    మల్లుని యండజూసుకుని మార్తుని ద్రుంచెద నంచు నార్కియే
    బల్లిదుడైన వాలి, దన భ్రాతను కయ్యము నాడ పిల్చెగా
    పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్.


    చల్లని రాము జెలిమితో
    బల్లిదుడగు వాలితోడ భండన మాడన్
    మల్లునివలె నార్కి పిలువ
    పిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్.

    రిప్లయితొలగించండి
  4. తల్లడ మందుచు బాఱెన్
    బిల్లిని గని యెలుక పిల్ల : పెండ్లికి పిలిచెన్
    చెల్లెలి కి కుదిరె మనువని
    యుల్లాస o బు న నన్న యూర o దరినిన్

    రిప్లయితొలగించండి
  5. చెల్లిని బిలుచుచు చక్కగ
    నెల్లరు వింతపడు వాక్యమేర్పరచు మనన్
    నల్లె నొకటి యీ రీతిగ
    “బిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్”

    రిప్లయితొలగించండి
  6. కల్లోలంబాయెనకట
    పిల్లినిఁ గని యెలుకపిల్ల; పెండ్లికిఁ బిలిచెన్
    అల్లారుముద్దుగ తనకు
    పిల్లనిడినవారివైపు పెద్దలనెల్లన్

    రిప్లయితొలగించండి
  7. అల్లరి మూషికమ్ము కడు నారడి వెట్టుచు నాతతాయియై
    పిల్లిని వెక్కిరించుచును పిమ్మట కందరమందు దూరితా
    నల్లన గిల్లికజ్జముల నాటగ దాగుడుమూత లాడుచున్
    పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల
    తల్లడఁ బెట్టు కీచకుని దండన నర్తనశాలఁ జేయఁ దా
    నల్లన వ్యూహమున్ వలలుఁ డల్లగ మాలిని యాచరించుచున్
    జల్లని రాత్రి స్వర్గమును జాటుగనిచ్చెదనంచుఁ బల్కుచున్
    బిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్

    కందం
    తల్లడఁ బెట్టెడు గీచకు
    నల్లన నాట్యంపుశాల నణచెడు వ్యూహం
    బల్ల వలలుండు, మాలిని.,
    పిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్


    రిప్లయితొలగించండి
  9. సల్లలితమ్ముగ నిటు నటు
    మెల్లగ నడయాడు చుండ మృదు మధురముగా
    నుల్ల మలర నొక్క చెవుల
    పిల్లినిఁ గని యెలుక పిల్ల పెండ్లికిఁ బిలిచెన్

    కల్లయె యోడలే యగుట క్రన్నన బండ్లు ధరాతలమ్మునం
    జల్లగ సైంధవుండు సరసమ్ముగఁ బాండు కుమారులే యనిం
    దల్లడిలంగఁ బల్కెను గదా యెదిరించి భయమ్ము లేకయే
    పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్

    రిప్లయితొలగించండి
  10. పిల్లలు వైరులుగనెపుడు
    గొల్లున నేడ్చుచు గలబడి కోపము జూపన్
    తల్లులు పేరిడ, నేడా
    “పిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్”

    రిప్లయితొలగించండి
  11. యెల్లరు జాతివై రముల నెత్తక నందరు ప్రేమ మూర్తులై
    యెల్లరు మిత్రులై బ్రతుక నిల్లుగ మారెను, జంతు జాలమున్
    చల్లగ నుండెన డవిన సాధుజనమ్ముల చెంతశాంతిగన్‌
    "పిల్లినిఁ గాంచి మూషికము పెండ్లికి రమ్మని పిల్చెఁ బ్రేముడిన్”

    రిప్లయితొలగించండి
  12. పిల్లులు శివంగులు చెవులు
    పిల్లులు ఋష్యాశ్రమమున వేడుకతోడన్
    మెల్లగ దరిచేరుచు నొక
    *“పిల్లినిఁ గని యెలుకపిల్ల పెండ్లికిఁ బిలిచెన్

    రిప్లయితొలగించండి