9, నవంబర్ 2022, బుధవారం

సమస్య - 4245

10-11-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జాయ లిద్దరు గాంధికి జాతిపితకు”
(లేదా...)
“మామా యిద్దరు భార్యలుండిరి మహాత్మాగాంధికిన్ జిత్రమే”

31 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

అల్లుడు పరదేశస్తుడగు మామతో...

తేటగీతి
దేశ స్వాతంత్య్రమొక్కటె ధ్యేయమైన
సతిగ వెన్నంటు గస్తూరి సవతులనఁగ
వేడ్క సత్యమహింసలు ప్రేమఁగనెడు
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు

శార్దూలవిక్రీడితము
సామాన్యుండన రామభక్తిపరుఁడై సారించి యాంగ్లేయులన్
నీమంబుల్ విడకుండ పంపుకతనన్ నిర్నిద్ర స్వాతంత్య్ర స
త్కామున్ సత్యమహింస ప్రేమఁగన నా గస్తూరియే గాక సూ!
మామా! యిద్దరు భార్యలుండిరి మహాత్మాగాంధికిన్ జిత్రమే!

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...


సత్యమునతడు ప్రేమించి సమరమందు
రక్తపాతము వలదంచు శక్తిశాలి
సుగణ ధనునకహింస కస్తూరి బాయి
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు.


సామాన్యుండతడంచు నెంచకుమిలన్ కస్తూరిబాయొక్కతిన్
కామక్రోదములన్ జయించి నొక సత్కార్యమ్ము నే సాధింప న
భ్యామర్థమ్మును సేసె సత్యమునె తానర్ధాంగిగా మేల్పడన్
మామా యిద్దరు భార్యలుండిరి మహాత్మాగాంధికిన్ జిత్రమే.

Rama Murthy Duvvuri చెప్పారు...

తేటగీతి
దేశ స్వాతంత్య్రమునకునై దీక్షఁబూని
పోరు సల్పియు గెలిచిన వీరుఁడతడు
ఔర!స్వాతంత్య్రలక్ష్మి ,కస్తూరి బాయి
జాయలిద్దఱు గాంధికి జాతిపితకు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

శ్రీని వాసుకు నెంచగ చిత్రముగను
జాయ లిద్దరు : గాంధికి జాతి పిత కు
దేశ దేశాలలో గొప్ప దివ్యు డనుచు
పేరు ప్రఖ్యా తి కీర్తులు విస్తరి ల్లె

M.B.G.TILAK చెప్పారు...

దేశ మాతకు స్వాతంత్ర్య దీప్తి కొరకు
జాతిని నడిపించిన మహా నేత గాంధి
సత్యము నహింస యనునవి సతులుకాగ
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు

sitharamayya solasa చెప్పారు...

జననియగును నాడిక తనజాతికి గద
జాతిపితయన దేశమె సతియనదగు
భరతదేశము , కస్తూరిబాయి కలసి
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వృత్తంలో సవరణలకు వాట్సప్ సమూహం చూడండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దేశ స్వాతంత్ర్య' మన్నపుడు 'శ' గురువై గణభంగం. "దేశమునకు స్వేచ్ఛను గోరి దీక్ష బూని" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Rama Murthy Duvvuri చెప్పారు...

శార్దూలము
శ్రీమంతంబగు ధైర్యలక్ష్మి తనకుంజేఁదోడు వాఁదోడవన్
బ్రేమందోడుగ నిల్వ కస్తురియు ప్రేరేపించగా శాత్రవుల్
ధీమాగా నెదిరించి గెల్చె బళిరా!ధీరుండు వీరుండునై
మామా!యిద్దఱు భార్యలుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'అవన్' అన్న రూపం సాధువు కాదు. అక్కడ "వాదోడుగా" అన్నా అన్వయం కుదురుతుంది.

Rama Murthy Duvvuri చెప్పారు...

ధన్యవాదములు,నమస్సులు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

డా బల్లూరి ఉమాదేవి

తిరుమలేశునకు కలరు తీరు గాను
జాయ లిద్దరు,గాంధికి జాతిపితకు
కలవసంఖ్యాక సద్గుణ గణము లరసి
నెంచ శక్యమౌనె భువిని నేరికైన

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

సత్యమునహింసవీడక సతతమతడు
భరతమాతదాశ్యముబాపె బాపు నాడు
భార్యకస్తూరిబాయి సపత్ను లట్లు
జాయ లిద్దరు గాంధికి జాతిపితకు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఇంపొసంగు సేవా భావ మెంచి సతము
తాత నడిపింపఁ జక్కఁగఁ దలఁచి యెదలఁ
దోయజాక్షు లుందు రెలమిఁ దోడు గాను
జాయ లిద్దరు గాంధికి జాతి పితకు

[తోడుగాను + చాయ లిద్దరు = తోడుగాను జాయ లిద్దరు; చాయ = నీడ]

కా మాటోపములేదు సుంతయును నిక్కంబెంచ సత్యార్థియౌ
ధీమంతుండు మహాత్ముఁడే వలదు సందేహమ్ము కస్తూరి నా
సామాన్యాంగనయున్ ద్వితీయ సతిగా సత్యాగ్రహం బుండఁగా
మామా! యిద్దరు భార్య లుండిరి మహాత్మా! గాంధికిం జిత్రమే

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

బానిసత్వము బాపంగ పాటుపడుచు
దేశ ప్రజల కెల్ల రికిని దిశను చూపి
సాగు మహనీయున కహింస సత్యములను
జాయ లిద్దరు గాంధీకి జాతిపితకు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దాస్యము' టైపాటు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.

ఒక్క రక్తపు బొట్టైన నొలకకుండ
దేశమునకు స్వాతంత్ర్యమున్ దెచ్చి పెట్టె
నిందు తోడ్పడె సత్యమహింస లనెడు
జాయలిద్దరు గాంధికి జాతిపితకు.

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ధీమాచూపెనహింస సత్య వ్రతముల్ దీటైన యస్త్రంబులై
నీమంబుంగొని భారతావనికి వన్నెంగూర్చు స్వాతంత్ర్య సం
గ్రామంబందున గెల్వగాఁనరులపై గానంగనీ రీతిగన్
మామా యిద్దరు భార్యలుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:గాంధి యను పేర మిత్రు డొక్కండు కలడు
జాయ లిద్దరు గాంధికి, జాతి పితకు
భార్య కస్తూరి బాయియే పత్ని కాదె!
గాంధి పేరున్న వా డెల్ల గాంధి యగునె!

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

Revised poem
శా:ఏమా కాలపు దేశభక్తి ? మది లో నే శంకయున్ లేక యున్
బ్రేమన్ దమ్ముని,నన్ను వీడి భరతోర్వీస్వేచ్ఛయే కాంక్ష యై
మామా యిద్దరు భార్య లుండిరి మహాత్మా గాంధికిన్ జిత్రమే
సేమమ్ముల్ కనుగొంచు మా గృహములన్ జీవింప మే మొంటిగన్
(ఆనాటి దేశభక్తి గూర్చి ఏమి చెప్పేది మామా!నా యొక్క,నా తమ్ముని యొక్క భార్య ఇద్దరూ ఇంటిని మాకు వదిలేసి గాంధీ గారి క్షేమం చూస్తూ ఏదో ఒక సాయం చేస్తూ ఉండే వారు.)